బోటు నిర్వాహకులపై క్రిమినల్‌ కేసు

A criminal case for negligence was booked against the boat company - Sakshi

సాక్షి, విజయవాడ: పవిత్ర సంగమం వద్ద ప్రమాదానికి కారణమైన బోటు యాజమాన్యం.. రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌ పార్టనర్స్‌ సంస్థపై విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా బోటును నదిలోకి తీసుకురావడం, పర్యాటకులను జల విహారానికి తీసుకెళ్లడం నేరంగా పేర్కొన్నారు.

సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం ప్రధాన తప్పిదమేనని, లైఫ్‌ జాకెట్లు వంటి రక్షణాత్మక సామాగ్రి పరిమితంగా ఉండటం, సామర్థ్యానికి మించి పర్యాటకులను పడవలోకి ఎక్కించడం వంటి అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. సంస్థ నిర్వాహకులు శేషం మోదకొండలరావు, నీలం శేషగిరిరావు, గేదెల శ్రీను, వింజమూరి విజయసారథి, చిట్టిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top