కానిస్టేబుల్‌ రాతపరీక్ష ‘కీ’ వెల్లడి


సాక్షి, అమరావతి: పోలీస్‌ కానిస్టేబుల్స్‌ మెకానిక్స్, డ్రైవర్‌ పోస్టులకు ఆదివారం నిర్వహించిన తుది రాత పరీక్ష ‘కీ’ని ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం విడుదల చేసింది. పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు ఈ నెల 22న సాయంత్రం 5 గంటలలోగా తమ అభ్యంతరాలు తెలపాలని కోరింది.విజయవాడ, విశాఖ కేంద్రాలుగా ‘నీట్‌’

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)–2017ను ఏపీలో విజయవాడ, విశాఖ కేంద్రాలుగా నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ తెలిపారు. జేఈఈ మెయిన్స్‌–2017ను తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే జేఈఈ అడ్వాన్స్‌–2017ను అనంతపురం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎంపీ మురళీమోహన్‌ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక జవాబిచ్చారు.  

Back to Top