వైరల్‌.. రియల్‌ 

Constable Photo Viral at Police Station - Sakshi

ఎస్కేయూ: ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ సుధాకర్‌ డ్యూటీలో అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సుధాకర్‌ మూడు రోజులుగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నాడు. అయినా డ్యూటీకి వచ్చాడు. స్టేషన్‌లోనే ఉన్న మరుగుదొడ్డికి వెళ్లినపుడు ఏఎస్‌ఐ పిలుపు వినిపించింది. అంతే సుధాకర్‌ కంగారులో ప్యాంటు వేసుకోకుండా ఏఎస్‌ఐ చాంబర్‌కు చేరుకున్నాడు. ఏదో కేసుకు సంబంధించిన సమాచారం అడగడంతో అక్కడే టేబుల్‌పై కూర్చుని చెప్పసాగాడు. అర్ధనగ్నంగా ఉన్న కానిస్టేబుల్‌ను ఎవరో ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరల్‌ అయ్యింది. డ్యూటీలో అర్ధనగ్నంగా ఉండటమేంటని విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను ఏ తప్పూ చేయలేదని, కంగారులో ప్యాంటు వేసుకోకుండా అలానే బయటకు వచ్చానని తెలిపాడు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top