పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన 

CM YS Jagan Mohan Reddy Visiting East Godavari District Today - Sakshi

సాక్షి, కాకినాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఇప్పటికే జిల్లా మంత్రులు ముమ్మిడివరం చేరుకుని పర్యటన విజయవంతానికి అవసరమైన సలహాలు సూచనలిచ్చారు. అధికారులు, మంత్రులు సంయుక్తంగా ఏర్పట్లను పర్యవేక్షించారు.
పర్యటన వివరాలు...
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం ఉదయం 9.45 గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామానికి చేరుకుంటారు.  ఉదయం 9.50 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామంలో పశువులంక నుంచి వలసలతిప్ప హై లెవెల్‌ బ్రిడ్జి (వైఎస్సార్‌ వారధి)ని ప్రారంభిస్తారు.
⇔ 10.20: ముమ్మిడివరం మండలం కొమ్మనాపల్లి గ్రామంలోని సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ గదులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సభా స్థలికి చేరుకుంటారు. దివంగత ముఖ్యమంతి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పస్తారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి, వందేమాతరం గేయాన్ని ఆలపిస్తారు. 
⇔ 10.40 నుంచి 11.00: మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగిస్తారు. 
⇔ 11.00 నుంచి 11.45: మత్య్సకార భరోసా, జీఎస్‌పీసీ సంస్థ బకాయి ఉన్న రూ.78.22 కోట్ల నిధులను అందజేస్తారు. 
⇔ 11.45: సభా ప్రాంగణం నుంచి గాడిలంక హెలిప్యాడ్‌ ప్రాంతానికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళతారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో 12 గంటలకు యానాం చేరుకుంటారు.
⇔ 12.25: గంటలకు పుదిచ్చేరి రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి నివాసానికి చేరుకుంటారు. స్వర్గీయ మల్లాడి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటించి 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు  హెలీకాప్టర్‌ ద్వారా బయలుదేరి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరి వెళతారు. 1.55కు సీఎం నివాసానికి చేరుకుంటారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top