వేతన వేదన!

Chandrababu Naidu Dealyed PRCs - Sakshi

చంద్రబాబు హయాంలోనే మూడు పీఆర్సీల నష్టం

15వ పీఆర్సీలో ఉండగా   11వ పీఆర్సీ కోసం పోరాటం

ఐదు డీఏలను గతంలో  కోల్పోయిన పెన్షనర్లు

ఐఆర్‌ కోసం చర్చించని చంద్రబాబు

సీపీఎస్‌పై ఒక్కో చోట ఒక్కో ప్రకటన 

శ్రీకాకుళం: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గతంలో ఉన్నప్పుడు పీఆర్సీ కమిటీలను నియమించడంలోనూ, ఇతర కారణాలతోనూ జాప్యం చేయడం వల్ల ఉ ద్యోగ, ఉపాధ్యాయులు మూడు పీఆర్సీలు కోల్పోవాల్సి వ చ్చింది. ప్రస్తుతం వారు 15వ పీఆర్సీ కోసం పోరాటం చే యాల్సి ఉండగా, 11వ పీఆర్సీ అమలు చేయాలని పోరా టం చేస్తున్నారు. 7వ పీఆర్సీలో 23 నెలలు, 8వ పీఆర్సీలో 21 నెలలు, 9వ పీఆర్సీలో 19 నెలలు జాప్యం జరిగింది. ఇవన్నీ చంద్రబాబు హయాంలో కమిషన్ల నియామకం జరి గినవే. అయితే 9వ పీఆర్సీ కమిషన్‌ చంద్రబాబు హయాం లో జరిగినా నివేదిక మాత్రం డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో వచ్చింది. వైఎస్సార్‌ 2004లో అధికారంలోకి రాగానే నివేదిక కోసం చూడకుండా 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారు. ప్రస్తుతం 11వ పీఆర్సీ కోసం పోరాటం చేస్తున్నా కమిషన్‌ ఏర్పాటు పేరుతో కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం ని యమించిన కమిషన్‌ నివేదిక సమర్పించాల్సిన గడువు మరొక మూడు నెలలు మాత్రమే ఉంది.

కమిషన్‌ ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి నివేదికలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా నాయకులు జిల్లా సంఘ నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకొనే తుది నివేదికను కమిషన్‌కు అందించారు. అయినా కమిషన్‌ మళ్లీ జిల్లాలకు వచ్చి సంఘాల నుంచి అభిప్రాయసేకరణ జరపడంపై సర్వత్రా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. ఇలా రెండు అభిప్రాయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర స్థాయి అభిప్రాయాలకు, జిల్లా అభిప్రాయాలకు తేడాలున్నాయంటూ మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చే యాలని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. ఇలా కాలయాపన చేస్తే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే పరిస్థితి ఉం టుంది. కమిషన్‌ నియమించిన వెంటనే ఐఆర్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాల్సి ఉంటుంది. ఈ దిశగా ఒక్క అడుగు కూడా ప్రభుత్వం వేయలేదు. దీనిపై కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.

ఐదు డీఎలను కోల్పోయిన పెన్షనర్లు
ఇదివరలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఐదు విడతల డీఏలు బకాయిపడ్డారు. అప్పట్లో దీనికోసం అన్ని ఉద్యోగ సంఘాలు పోరాట సమితులను ఏర్పాటు చేసుకొని ఆందోళన చేపట్టారు. దీం తో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదు విడతల డీఏలను ఇ చ్చినా పెన్షనర్లకు ఐదు డీఏలను రద్దు చేశారు. ఇప్పుడు రెం డు డీఏలు బకాయిలు ఉండగా, డిసెంబరు 31 తర్వాత ఆ సంఖ్య 3కు చేరుకుంటుంది. మళ్లీ గతంలోలా డీఏలు రద్దు చేస్తారేమోనని పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సీపీఎస్‌పై అయోమయం
సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చేస్తుండగా, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని చంద్రబాబు రాష్ట్రంలో ఒక కమిటీని ని యమించారు.తెలంగాణ ఎన్నికల ప్రచార సభలు, మేనిఫెస్టోల్లో మాత్రం తెలంగాణలో అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. 14 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ ఎలాగూ అధికారంలోకి రాదని, భావించే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, తెలంగాణలో రద్దు సా«ధ్యమైనప్పుడు ఆంధ్రాలో రద్దు ఎందుకు సాధ్యం కావడం లేదని సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు.

అరాచకాలు చేస్తున్నారు
‘నాయనా.. టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. నా భూమిపై కన్నేశారు’ అని టెక్కలి నియోజకవర్గం తిలారుకు చెం దిన సింహాద్రి రమణారావు జగన్‌తో చెప్పారు. గ్రామానికి ఆనుకుని ఉన్న తన ఆరు సెంట్ల స్థలంపై కోటబొమ్మాళి ఎంపీపీ తర్ర రామకృష్ణ తగాదాలు పెడుతున్నారని మొరపెట్టుకున్నారు. తన అనుభవంలో ఉన్న భూమి వేరొకరిదని వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.  

దా‘రుణాలు’
‘అన్నా.. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులమని వివక్షతో రుణాలు మంజూరు చేయడం లేదు’ అంటూ లావేరు మండలం బుడతవలస గ్రామానికి చెందిన రౌతు భానుకుమారి జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఆంధ్రా బ్యాంకు ద్వారా యాభై మంది కుట్టుమిషన్ల శిక్షణ పొందారని వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు.  

ప్రోత్సాహం లేదు
‘ప్రస్తుతం కుటీర పరిశ్రమలకు ప్రో త్సాహం లేదు. విద్యుత్‌ సరఫరాలో జాప్యం జరుగుతోంది. విద్యుత్‌ వ్యాపారాత్మకంగా అందజేస్తున్నారు’ అని రణస్థలానికి చెందిన భారతి జగన్‌కు తెలిపారు. వ్యాపారాలు సజావుగా సాగడం లేదని, కుటీర పరిశ్రమలకు రాయితీ రుణాలు, విద్యుత్‌ వంటివి అందజేస్తే వ్యాపారం సాగుతుందని చెప్పారు.  

ఉద్యోగ భద్రత కల్పించండి
‘సార్‌.. సర్వ శిక్ష అభియాన్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న మాకు ఉద్యోగ భద్రత లేదు.’ అని శ్రీకాకుళంలోని ఆదివారంపేటకు చెందిన బి.యుగంధర్‌ జగన్‌కు తెలిపారు. పదేళ్లుగా సమస్యలతో సతమతమవుతున్నామని, తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని కోరారు.

భర్తలకు పింఛన్‌ వర్తించాలి
‘ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న భర్తలు మృతి చెందితే భార్యలకు ప్రభుత్వం ఫ్యామిలీ పింఛన్‌ వర్తింప జేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులైన భార్యలు మృతి చెందితే భర్తలకు సైతం ప్రభుత్వం ఫ్యామిలీ పిం ఛన్‌ వర్తింప జేయాలి’ అని శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకు చెందిన రమేష్‌ బాబు జగన్‌ను కోరారు. ఇలా చేస్తే వృద్ధాప్యంలో భర్తలకు ఆర్థిక భరోసా ఉంటుందని తెలిపారు.

కమిటీ సిఫార్సులు అమలు చేయాలి
‘పోస్టల్‌ శాఖలో గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న సిబ్బందిని ఆదుకోవాలి. కనీస వేతనం లేక కు టుంబాలతో ఇబ్బందులు పడుతున్నాం.’ అని తెలంగాణ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘ కోశాధికారి పి.కోటేశ్వరరావు జగన్‌కు తెలిపారు. 2016లో కమలేష్‌ చంద్ర కమిటీ వేశారని,  ఆ సిఫార్సులు అమలయ్యేలా చూడాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top