గ్రామీణ ప్రాంత ఉద్యోగులను మోసగించిన కేంద్ర ప్రభుత్వం

Central government On Rural employees Cheated  - Sakshi

అన్నా... 2.70 లక్షల గ్రామీణ ప్రాంత తపాల ఉద్యోగులకు అందాల్సిన కమలేష్‌ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా కేవలం ఒకటిరెండు అంశాలను మాత్రమే అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆ సంఘ జిల్లా కార్యదర్శి ఆర్‌.హేమలత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం బొబ్బిలి మండలం రంగరాయపురం వద్ద పాదయాత్రలో ఆమె జగన్‌మోహన్‌ రెడ్డిని కలసి వినతిపత్రం ఇచ్చారు. తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కమలేష్‌ కమిటీ ఇచ్చిన 18 అంశాల్లో కేవలం రెండు మూడు అంశాలను మాత్రమే పరిష్కరించి వదిలేశారన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మా డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top