స్కూటర్‌ను, కారును ఢీ కొట్టిన కారు

Car Hit Vehicles In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో కారు భీభత్సం సృష్టించింది. అత్యంత వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి వాహనాలను ఢీ కొట్టిన ఘటన సోమవారం విజయవాడలో జరిగింది. నగరంలోని స్వాతి థియేటర్‌ వద్ద రోడ్డుపై అతివేగంతో వెళుతున్న ఓ కారు స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తిని వెనక నుంచి ఢీ కొట్టింది. అనంతరం అక్కడే ఆగివున్న మరో కారుపైకి దూసుకువెళ్లి.. చివరగా అపార్ట్‌మెంట్‌ గోడను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలవగా వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో రోడ్డు నిర్మానుష్యంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. (నగరంలో ఠారెత్తిస్తున్న కార్లు: ఒకేరోజు నాలుగు కారు ప్రమాదాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top