చిటారు ‘చూపులు’


 నాగర్‌కర్నూల్‌రూరల్, న్యూస్‌లైన్:  మండలంలోని తూడుకుర్తిలో బుధవారం బండలాగుడు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అనంతపురం, కర్నూలు, కృష్ణా, కడప, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 12జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. కర్నూలు జిల్లా పుచ్చకాయలపల్లికి చెందిన రైతు మద్దన్న, పెద్ద పుల్లారెడ్డి ఎద్దుల జత 2255 ఫీట్ల దూరం బండను లాగి రూ.50వేల నగదు బహుమతిని అందుకున్నాయి. అదేజిల్లా పీఆర్ పల్లికి చెందిన ఎం.నాగయ్య ఎద్దుల జత 2043 ఫీట్ల దూరం లాగి రెండో బహుమతిగా రూ.40వేలను దక్కించుకున్నాయి. జిల్లాలోని ఎల్మూరుకు చెందిన నీల కృష్ణ ఎద్దులజత 2008 ఫీట్ల దూరంలాగి మూడో బహుమతి రూ.30వేల నగదును కైవసం చేసుకున్నాయి.

 

 నాలుగో బహుమతి కింద రూ.20వేల నగదును గన్నవరానికి చెంది న కసరనేని రాజ ఎద్దులు దక్కించుకున్నాయి.  పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి జనం భారీగా తరలొచ్చారు.  జెడ్పీ మాజీ చైర్మన్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మాజీ సర్పం చ్ నర్సింహారెడ్డి, సర్పంచ్ అలివేలమ్మ తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కొట్ర బలరాం, మాజీ ఎంపీపీ కోటయ్య, వైఎస్‌ఆర్‌సీపీ నేత మల్లెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top