పోస్టులకు అర్హత కల్పించాలి

BSC Students Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం: ఒడిశాలోని పర్లాకిమిడి సెంచూరియన్‌ యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చేశాను. ఈ యూనివర్సిటీ డిగ్రీ ఆధారంగా ఏపీలో అగ్రికల్చర్‌ ఆఫీసర్‌(ఏవో), ఏడీవో పోస్టులకు అర్హత ఇవ్వడం లేదు. ఏఈవో (వ్యవసాయ విస్తరణాధికారి) పోస్టులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఇదే తరహాలో ఏవో పోస్టులకు కూడా అర్హత కల్పించాలి. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు న్యాయం చేయాలన్నా..
– పొట్నూరు మనీష, పార్వతీపురం, విజయనగరం జిల్లా.

 ఆరోగ్యశ్రీ వర్తించలేదు..
మేము వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులమని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా రేషన్‌కార్డు తొలగించారు. ఏడాది క్రితం నేను గుండె ఆపరేషన్‌ చేయించుకున్నాను. నా కుమార్తె కష్టపడి రూ.5లక్షలు వెచ్చించి నా ప్రాణం కాపాడింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు న్యాయం చేయండి.   – శిల్లా వజ్రం, వృద్ధురాలు, కేశవరావుపేట, ఎచ్చెర్ల మండలం.

భూములు లాక్కున్నారు
మాకు ఉన్న డీ పట్టా భూములు టీడీపీ నాయకులు అడ్డుగోలుగా లాక్కున్నారు. గార మండలం పాత్రునివలసలో 630,631 సర్వే నెంబర్లలో రెండు ఎకరాల 90సెంట్ల భూమిని టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆక్రమించుకున్నారు.– బలగ రామారావు, పాత్రునివలస, గార మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top