భార్యాభర్తలిద్దరం అంధులమే..

Blind Couples Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం: ‘భార్యాభర్తలిద్దరం అంధులమే. మాకు ఓ కొడుకు ఉన్నాడు. వాడికి పక్షవాతం. పింఛన్‌ వస్తోంది. దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం బాబూ.. ఏదైన సాయం చేయి నాయనా’ అంటూ ప్రజా సంకల్పయాత్రలో హరిపాలేనికి చెందిన మారిశెట్టి అప్పారావు, పరదేశమ్మ దంపతులు జననేత జగన్‌ను కలసి మొరపెట్టుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు అవిటివాడైపోయాడు. మా కష్టాలు ఎలా గట్టెక్కుతాయో తెలియడం లేదు. ఆపరేషన్‌ చేయించుకుంటే చూపు వస్తాదంట. మా దగ్గర డబ్బుల్లేవు. ఏం చేయాలో తోచడం లేదు. నువ్వు ఇలా నడిచి వస్తున్నావని ఎవరో చెబితే.. బాబు దగ్గరికి తీసుకెళ్లి మా కష్టం చెప్పుకోనీయండని ప్రాధేయపడ్డాం అంటూ వాపోయారు. వారిని ఆప్యాయంగా పలకరించిన జగన్‌.. వైద్యం కోసం సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే పింఛన్‌ను రెట్టింపు చేస్తానని భరోసా కల్పించారు. నన్ను మీ బిడ్డలా ఆశీర్వదించాలని జగన్‌ కోరడంతో.. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాయనా, తప్పకుండా నువ్వు గెలుస్తావు అంటూ వారు దీవించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top