భూచోళ్లు బాబోయ్..

భూచోళ్లు బాబోయ్.. - Sakshi


డోన్ టౌన్:

 నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు బరితెగించారు. ఖాళీ స్థలం కనబడితే చాలు కన్నెస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూమి అనే తేడా లేకుండా ఆక్రమించుకుంటున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే ‘అన్న’ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో దాడులకు ఒడిగట్టడంతో బాధితులు తమ గోడు ఎవరికి చొప్పుకోవాలో అర్థంకాక ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం పేరాంటాలమ్మ గుడి వద్ద  నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసిన ఐదు ఎకరాలలోని ప్లాట్లను తెలుగుదేశం పార్టీకి చెందిన 300 మంది ఆక్రమించుకున్నారు.



సర్వే నంబరు.. 394లోని సుమారు 5 ఎకరాల భూమిలో  18ఏళ్ల క్రితం 200 మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తూ రెవెన్యూ అధికారులు ఉత్వర్హులు జారీ చేశారు. ప్రస్తుతం ఆ భూమికి విపరీతమైన డిమాండ్ పెరగడంతో అధికార పార్టీకి చెందిన భూచోళ్ల కన్నుపడింది. ఇంకేముందు వందలాది మంది జనం పోగేసుకొని ఆ ప్లాట్లను అన్యాక్రాంతం చేసేందుకు యత్నించారు.



సమాచారం తెలుసుకున్న ఆయా ప్లాట్ల యజమానులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమార్కులను అడ్డుకోబోగా పలుగు, పారలతో దాడికి దిగారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో బాధితులు స్థానిక పోలీసుస్టేషన్, రెవెన్యూ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలకు సర్ధిచెప్పడంతో శాంతించారు.  



 వైఎస్ నగర్‌లో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం:

 స్థానిక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నగర్ సమీపంలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ బేస్‌మెంట్‌లు, గుడారాలు, బంకులను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కోట్లాది రూపాయలు వ్యయంతో నిర్మించిన గాజులదిన్నె ప్రాజెక్టు పైప్‌లైన్‌ను సైతం కప్పేసి భూములనున స్వాధీనం చేసుకున్నారంటే  ఆక్రమార్కులు ఏ మేరకు బరితెగించారో అర్థమవుతోంది.

 

 అడ్డుకోపోతే దాడికి పాల్పడ్డారు:  బాధితులు: ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వేరే వ్యక్తులు ఆక్రమించుకోవడంతో విషయం తెలుసుకొని అడ్డుకోబోయాం. తమపైనే పలుగు, పారలతో అక్రమార్కులు దాడికి పాల్పడ్డారు. స్థలాలు మావీ.. మీకెవ్వరిచ్చారని ప్రశ్నిస్తే అధికార పార్టీ నాయకులే తమకు ఈ స్థలాలను ఇచ్చారని బెదిరిస్తున్నారని బాధితులు రాములు, తెలుగు లక్ష్మిదేవి, రాములమ్మ, తిమ్మక్క, ఆంజనేయులు, రత్నమ్మ, శేషమ్మ, మంగమ్మ, సుంకన్న, రమాదేవి తదితరులు  నివ్వెరపోయి ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top