‘మాఫీ’ మాయ!

‘మాఫీ’ మాయ! - Sakshi


రుణమాఫీలో రైతులను నిండా ముంచిన సీఎం చంద్రబాబు!

హామీ అమల్లో జాప్యంతో రూ.939 కోట్ల వడ్డీ భారం

తొలి దశలో రూ.470 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ

ఆర్నెలల్లో పడిన వడ్డీ కూడా మాఫీ కాకపోవడంపై రైతుల ఆగ్రహం


 

డిసెంబర్ 31, 2013 నాటికి జిల్లాలో 8,70,231 మంది రైతులు రూ.11,180.25 కోట్లను వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకులకు బకాయిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు ఒక్క సంతకంతో రూ.11,180.25 కోట్లను మాఫీ చేసి.. 8,70,231 మంది రైతులను రుణ విముక్తులను చేయాలి. ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారమూ చేశారు. రుణ మాఫీ విధి విధానాల రూపకల్పనకు కమిటీని వేస్తూ తొలి సంతకం చేశారు.. ఆర్నెల్లు ఇట్టే గడిచిపోయాయి.



మరి జరిగిందేమంటే.. రుణమాఫీ అమల్లో జాప్యంతో ఆర్నెలల్లో జిల్లా రైతులపై రూ.939.14 కోట్ల అపరాధ వడ్డీ భారం పడింది. ఇప్పుడు తొలి విడతగా రైతులకు రూ.470 కోట్లను మాత్రమే రుణ మాఫీ చేస్తున్నట్లు బ్యాంకర్లకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అయితే అపరాధ వడ్డీ మేర కూడా రుణాలు మాఫీ కాకపోవడంతో రైతన్నలు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు.

 రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు పబ్లిగ్గా పచ్చి మోసం చేస్తుండడంపై ‘సాక్షి’ ఫోకస్.

 

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను నమ్మించి నట్టేట ముంచారు. ఎన్నికల సమయంలో ఒక్క సంతకంతో బేషరతుగా వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఊరూవాడ ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక పూటకో తిరకాసు.. రోజుకో విధానంతో ఆ హామీని నీరుగార్చారు. ఆర్నెళ్లపాటూ హామీ అమల్లో జాప్యంతో రైతులపై రూ.939.12 కోట్ల అపరాధ వడ్డీ పడింది. కనీసం ఆ మేరకు కూడా రుణ మాఫీ చేయలేదు. జిల్లాలో తొలి విడతగా 1.98 లక్షల మంది రైతులకు 470.12 కోట్ల మేర మాఫీ అయినట్లు బ్యాంకర్లకు ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను ఆదివారం అందజేసింది. తమ రుణాలు ఏ మేరకు మాఫీ అయ్యాయో అని ఆరా తీసిన రైతులు.. అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. అపరాధ వడ్డీ మేర కూడా రుణాలు మాఫీ కాలేదని.. ప్రభుత్వం నిండా ముం చిందని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సంతకంతో రుణ మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఒక్క హామీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీకి అధికారం దక్కడానికి దారితీసిందని ఆపార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇప్పుడు అధికారాన్ని కట్టబెట్టిన హామీనే టీడీపీ ప్రభుత్వం నీరుగార్చి రైతులను నట్టేట ముంచింది. జిల్లాలో డిసెంబర్ 31, 2013 నాటికి 8,70,321 మంది రైతులు రూ.11,180.25 కోట్లను బ్యాంకులకు వ్యవసాయ రుణాల రూపంలో బకాయిపడ్డారు. ఆ మేరకు రుణాలను మాఫీ చేయాల్సిన చంద్రబాబు.. కోటయ్య కమిటీ నివేదిక పేరుతో ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.5 లక్షలే(రూ.లక్ష పంట రుణం, రూ.50 వేలు బంగారు రుణం) మాఫీ చేస్తామటూ సవా‘లక్షన్నర’ తిరకాసులు పెట్టారు.



లబ్ధిదారుల జాబితాలోనే భారీ కోత



చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టాక నిర్వహించిన తొలి సమీక్ష సమావేశానికి జిలా ్లలో 8.7 లక్షల మంది రైతులు రూ.11,180.25 కోట్ల మేర వ్యవసాయ రుణాలు బకాయి పడినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ రుణాలన్నీ మాఫీ చేయాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. కానీ.. కోట య్య కమిటీ మార్గదర్శకాలు జారీచేసిన తర్వాత లబ్ధిదారుల జాబితాలో రోజుకో తిరకాసు పెట్టి కోత వేస్తూ వచ్చారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల మేరకు  5.62 లక్షల కుటుంబాలకు చెందిన రూ.1,865 కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ.. ఆ నివేదికలోనూ ప్రభుత్వం కోత వేసింది. తొలి విడతగా 1.98 లక్షల మంది రైతు కుటుంబాలను రుణ మాఫీకి లబ్ధిదారులుగా ఎంపి చేసింది. ఆ రైతు కుటుంబాలకు చెందిన రూ.470.12 కోట్లను మాఫీ చేస్తున్నట్లు బ్యాంకర్లకు సమాచారం అందించింది.ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ఈనెల 10 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమా చేస్తామని పేర్కొంది.

 

రైతన్నలపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అస్త్రం



బేషరతుగా రుణ మాఫీ చేస్తానన్న సీఎం చంద్రబాబు చేతల్లోకి వచ్చేసరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్(ఏ పంటకు ఎకరానికి ఎంత రుణం ఇవ్వాలన్నది రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం తీర్మానం)ను వర్తింపజేశారు. 2010 వరకూ వేరుశనగ పంటకు ఎకరానికి రూ.పది వేలు, మొక్కజొన్నకు ఎకరానికి రూ.ఎనిమిది వేలు, పొద్దుతిరుగుడుకు ఎకరానికి రూ.ఎనిమిది వేలు, చెరకుకు ఎకరానికి రూ.40 వేలు, వరికి ఎకరానికి రూ.17 వేలు ఉండేది. దీన్ని 2012లో వేరుశనగకు రూ.12 వేలు, చెరకుకు రూ.50 వేలు, వరికి రూ.22 వేలకు పెంచారు. అంతకు మించి రుణం ఇస్తే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనను వక్రీకరించినట్లు లెక్క. ఒక రైతు తన భూమికి సంబంధించిన పాసు పుస్తకాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద బ్యాంకరు రుణం మంజూరు చేస్తారు. అదే రైతు అదే పాసు పుస్తకాన్ని చూపి బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను బ్యాంకర్లు పట్టించుకోరు. ఇది ప్రభుత్వానికి.. బ్యాంకర్లకు తెలియంది కాదు. కానీ.. ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేసి రుణ మాఫీ లబ్ధిదారులను ఎంపిక చేయడం గమనార్హం. రూ.50 వేల లోపు రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయమని ప్రగ్భాలు పలికిన సీఎం చంద్రబాబు.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి మాట మార్చారు. ఆ రైతులకూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో కోత వేశారు. ఆర్నెళ్లలో పడిన అపరాధ వడ్డీ మేర కూడా రుణమాఫీ కాకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే నట్టేట ముంచారని శాపనార్థాలు పెడుతున్నారు.

 

గందరగోళంగా రుణమాఫీ జాబితా



 పెనుమూరు మండలం కావూరివారిపల్లెకు చెందిన పి.గుణశేఖర్‌నాయుడుకు నాలుగెకరాల పొలం ఉంది. పెనుమూరు కార్పొరేషన్ బ్యాంకులో 2012లో రూ.90 వేలు రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిపి ప్రస్తుతం లక్షా ఆరు వేలు అయింది. సీయం కాగానే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో కష్టాలు తీరుతాయని భావించాడు. రుణమాఫీ ఆలస్యమైనా ఎంతో ఆశగా ఎదురు చూశాడు. సోమవారం రుణమాఫీ అర్హుల జాబితా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిసి వెళ్లి చూశాడు. ఆయన పేరు అర్హుల జాబితాలో లేదు. బ్యాంకులో పట్టాదారు పాసుపుస్తకంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు సమర్పించానని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాంకు అధికారుల వద్దకు వెళితే రెండో జాబితాలో వస్తుందని చెప్పారు. గందరగోళంగా రుణమాఫీ చేస్తే రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.- పి.గుణశేఖర్‌నాయుడు, కావూరివారిపల్లె, పెనుమూరు మండలం

 

రూ.లక్షకు 35 వేలు మాఫీ



 రొంపిచెర్ల: రొంపిచెర్ల మండలం పాతకురవపల్లెకు చెందిన బీ.వెంకటరమణ పంటల సాగుకోసం పీలేరు భారతీయ స్టేట్ బ్యాంక్‌లో రూ.20 వేలు, భార్య పేరుతో సప్తగిరి గ్రామీణ బ్యాంకులో రూ.50వేలు, కుమారుని పేరుతో రొంపిచెర్ల భారతీయ స్టేట్ బ్యాంక్‌లో రూ.35వేలు రుణం తీసుకున్నారు. రూ.1.5లక్షలు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అంతా మాఫీ అవుతుందని భావించారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో కేవలం అతని కుమారుడి పేరు మీద ఉన్న రూ.35 వేలు మాత్రమే మాఫీ చేశారు. మిగిలిన రెండు రుణాలు మాఫీ చేయలేదు. సీఎం చంద్రబాబు నిలువునా ముంచేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   రైతు బి.వెంకటరమణ, పాతకురవపల్లె, రొంపిచెర్ల మండలం

 

 తగ్గిన రుణ అర్హత



బి.కొత్తకోటకు చెందిన డి.రామాంజినేయులు 2012 సెప్టెంబర్ 12న ఇండియన్ బ్యాంకులో ఖాతా నంబర్ 6065194666 ద్వారా 4.60 ఎకరాల్లో వేరుశెనగ సాగు చేసేందుకు పట్టాదారు పాసుపుస్తకంపై రూ.67వేల రుణం పొందాడు. వడ్డీతో కలుపుకుని రూ.74,847 అయ్యింది. ఈ మొత్తం మాఫీ కావాలి. మాఫీకి మెలికపెట్టారు. నిబంధనల మేరకు ఎకరాకు రూ.9వేలు చొప్పున రూ.41,400 మాత్రమే రుణం ఇవ్వాలి. దీనికి అదనంగా రూ.25,600 పొందాడని రుణ అర్హతను తగ్గించారు. 4.60 ఎకరాలకు రూ.41,400ను లెక్కించి దానికి రూ.4,848 వడ్డీ కలిపారు. ఈ మొత్తం రూ.46,248ని రుణ అర్హతని తేల్చారు. ఈ మొత్తంలో 20శాతం రూ.9,250ని ఈ ఆర్థిక సంవత్సరంలో జమ చేస్తున్నట్టు జాబితాలో పేర్కొన్నారు. అర్హతకంటే ఎక్కువ రుణం తీసుకున్నట్టు నిర్దారించిన రూ.25,600ను తిరిగి చెల్లించాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు.  డి.రామాంజినేయులు

 

వడ్డీకి కూడా సరిపోదు..



నగరి: మండలంలోని వేలావడికి చెందిన కె.శ్రీనివాసులుకు ఐదెకరాల పొలం ఉంది. 2012లో చెరకు సాగు చేయడానికి సప్తగిరి గ్రామీణ బ్యాంకులో రూ.1.5 లక్షలు రుణం తీసుకున్నాడు. చెరకు పండించి చిత్తూరు ఎస్వీ షుగర్స్‌కు తరలించాడు. పంట అమ్మకంతో వచ్చే డబ్బుతో బ్యాంకు రుణం తీర్చేసి మిగిలిన డబ్బులు కుటుంబ పోషణకు వాడుకుందామనుకుంటే ఇప్పటివరకు బిల్లులు రాలేదు. ఓ వైపు బ్యాంకు బాకీ వడ్డీతో రూ.2 లక్షలు దాటింది. కుటుంబ పోషణకు అదనంగా అప్పులు చేయూల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం లక్షా యాభై వేల రూపాయల్లో ప్రస్తుతం ఇచ్చే 20 శాతం రూ.30 వేలు వడ్డీకే సరిపోదు. - శ్రీనివాసులు, వేలావడి, నగరి మండలం

 

మోసపూరితంగా రుణమాఫీ

 

పెనుమూరు మండలం చార్వాకానిపల్లెకు చెందిన బి.రుక్మాంగదరరెడ్డికి రెండెరాల 95 సెంట్ల భూమి ఉంది. 2013 నవంబర్ 11న వ్యవసాయం కోసం పెనుమూరు స్టేట్ బ్యాంకులో బంగారు నగలు తాకట్టు పెట్టి లక్షా 60 వేల 500 రుణం తీసుకున్నాడు. వడ్డీతో సహా ఇప్పుడు లక్షా 70 వేలు అయింది. రైతులు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో చెబితే ఆయనకే ఓటు కూడా వే శాడు. ఆరు నెలల తర్వాత రుణమాఫీ అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఆశగా వెళ్లి అర్హుల జాబితా చూస్తే రుక్మాంగదరరెడ్డి పేరు ఆన్‌లైన్‌లో ఉంది. ఎంతో సంబర పడ్డాడు.ఆయనకు రూ.83,407 మాత్రమే రుణమాఫీ అవుతుందని ఈ లెక్కన 2014-15 సంవత్సరానికి రూ.16,682 ఇస్తున్నట్లు ఉంది. రుణమాఫీలో రైతులకు ఇంత మోసమా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

 - బి.రుక్మాంగదరెడ్డి, రైతు, చార్వాకానిపల్లె, పెనుమూరు మండలం

 

 జాబితాలో పేరే తీసేశారు



 మదనపల్లె రూరల్ మండలం చీకలబైలు గ్రామం బండకాడపల్లెకు చెందిన ఎస్.రంగప్ప 2012 జూన్ 25వ తేదీన ఆంధ్రాబ్యాంకులో రూ.80 వేలు పంట రుణం తీసుకున్నారు. రుణమాఫీ అర్హుల జాబితాలో  పేరు చూసుకోవడానికి సోమవారం ఉదయం ఆంధ్రాబ్యాంకుకు వచ్చారు.  జాబితాలో పేరు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. చంద్రబాబు మాట నమ్మి అప్పు కట్టనందుకు వడ్డీతో కలిపి రూ.లక్ష దాటడంతో లబోదిబోమంటున్నాడు.

 - రంగప్ప, చీకలబైలు, మదనపల్లె రూరల్ మండలం

 

 వడ్డీ అంత కూడా దక్కలేదు..

 

 పలమనేరు మండలం టీఎస్ అగ్రహారానికి చెందిన రెడ్డెప్ప (రుణ ఖాతా నెంబర్ 6109565035)కు రెండున్నర ఎకరాల పొలముంది. 2013 మార్చి 6న పలమనేరులోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.1.22 లక్షలను బంగారంపై రుణంగా తీసుకున్నారు. 2014 నవంబర్ 22 నాటికి ఇతని అసలు, వడ్డీ కలిపి రూ.1,43,756గా ఉంది. బ్యాంకు రుణగ్రహీతకు ఆఖరి నోటీస్ జారీ చేసింది. ప్రైవేటు వారి వద్ద అప్పు చేసి మొత్తం డబ్బును బ్యాంకుకు చెల్లించేశాడు. ప్రస్తుతం రుణమాఫీ జాబితాలో ఇతని పేరు ఉంది. రూ.25 వేలను అతనికి మాఫీ చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారు. తాను చెల్లించిన వడ్డీ అంత కూడా మాఫీ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

  రెడ్డెప్ప, టిఎస్ అగ్రహారం, పలమనేరు మండలం

 

 నమ్మి నిండా మునిగాను..

 

 గుర్రంకొండ మండలం ఎగువబురుజుపల్లెకు చెందిన రైతు కే.నారాయణరెడ్డి పంట సాగుకోసం 2013 డిసెంబర్‌లో తరిగొండ గ్రామీణ బ్యాంకులో రూ.50వేలు రుణం తీసుకున్నారు. టీడీపీ ఎన్నికల హామీని దృష్టిలో ఉంచుకుని అప్పు తిరిగి చెల్లించలేదు. అది వడ్డీతో కలిపి ఇప్పుడు రూ.58,940 అయింది. ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీలో మొత్తం పోతుందని ఆశపడ్డారు. సోమవారం ఉదయం ఆశగా బ్యాంకు వద్దకు వెళ్లాడు. ఆన్‌లైన్‌లో పెట్టిన రుణమాఫీ జాబితాలో అతని పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. టీడీపీ నాయకుల మాటలు నమ్మి నిండా మునిగిపోయానని లబోదిబోమన్నాడు. బ్యాంకుకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని అయోమయంలో పడిపోయాడు.

     - నారాయుణరెడ్డి , ఎగువబురుజుపల్లె, గుర్రంకొండ మండలం

 

 పచ్చిదగా..

 

 కుప్పం వుండలం వెండుగంపల్లి పంచాయుతీ వెంకటేశ్వరకొటాలు గ్రావూనికి చెందిన వుునెప్ప 4.36 ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను 2013లో బ్యాంకులో తాకట్టు పెట్టి లక్షా 40 వేల రూపాయుల రుణం పొందాడు. ఆంధ్రాబ్యాంకులో తీసుకున్న ఈ రుణానికి గత వూర్చి నాటికి 12,360 రూపాయుల వడ్డీ అరుు్యంది. రుణవూఫీలో ఈ మొత్తం తోసేస్తారని  ఆశగా ఎదురుచూశాడు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో వచ్చిన మొత్తం వడ్డీకి కూడా సరిపోకపోవడంతో లబోదిబోమంటున్నాడు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం పచ్చి దగా చేసిందని వాపోతున్నాడు.

     - వుునెప్ప,

  వెండుగంపల్లి, కుప్పం వుండలం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top