సర్పంచ్ కుమారుడిపై హత్యాయత్నం


దోమ,న్యూస్‌లైన్: సర్పంచ్ కుమారుడిపై కొందరు హత్యాయత్నం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. దోమ సర్పంచ్ రాధాబాయి కుమారుడు విక్టర్  కొన్నేళ్ల క్రితం మండల పరిధిలోని దోర్నాల్‌పల్లి సర్వేనంబర్: 45 భూమిలో ఓ వ్యక్తి వద్ద 10 ఎకరాల స్థలం కొన్నాడు. ఇందుకు సంబంధించి గతంలో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయించాడు. అయితే ఇదే సర్వే నంబర్ భూమిలో హైదరాబాద్‌కు చెందిన నీలి విఠల్‌రెడ్డి అనే వ్యక్తి కొంత కాలం క్రితం మరో పది ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమి సర్వే చేయించేం దుకు విఠల్‌రెడ్డి పట్టణం నుంచి ఓ సర్వేయర్, భార్య  అంజలీరెడ్డి, 10 మందికి పైగా అనుచరులతో మంగళవారం దోర్నాల్‌పల్లికి వచ్చారు. భూమి సర్వే చేస్తున్న విషయం తెలిసి తన భూమి కూడా అదే సర్వే నంబర్‌లో ఉన్న కారణంగా విక్టర్  అక్కడికి వెళ్లాడు. భూమి సర్వే చేసే సమయంలో చుట్టుపక్కల భూమి ఉన్న రైతులను పిలిపించి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటు ందని, ఏకపక్షంగా సర్వే ఎలా చేస్తారని  విఠల్‌రెడ్డితో పాటు అతడి అనుచరులను విక్టర్ ప్రశ్నించారు.

 

 దీంతో ఆగ్రహానికి గురైన విఠల్‌రెడ్డి తన అనుచరులతో కలిసి విక్టర్ పై కర్రలతో దాడి చేసి హత్యాయత్నం చేశా రు. ఈ దాడిలో విక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు విషయం తెలియడంతో దోమ ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డితో పాటు పలువురు సిబ్బం ది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విఠల్‌రెడ్డి అతడి అనుచరుల నుంచి విక్టర్‌ను తప్పించి తీసుకువచ్చారు. దోర్నాల్‌పల్లి, దోమ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజ లు సంఘటన స్థలానికి  చేరుకున్నారు. దీంతో పోలీసులు విఠల్‌రెడ్డి అ తడి అనుచరులను బందోబస్తు మధ్య పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విక్టర్  ఫిర్యాదు మేరకు విఠల్‌రెడ్డి, అతడి భార్య అంజలీరెడ్డి, పది మంది అతని అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

 

 కౌంటర్ కేసు నమోదు

 భూమి సర్వే చేయకుండా అడ్డుతగిలాడని విఠల్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు విజయరావ్‌పై  కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top