టీడీపీ కౌన్సిలర్‌కు అరెస్ట్ వారెంట్
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ షేక్ ఖాదర్‌బాషాపై అరెస్ట్ వారెంటు జారీ అయింది. ఖాదర్‌బాషా తనకు సమీప మిత్రుడు అయిన హుమాయున్ వద్ద గతంలో నగదు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తుండడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఖాదర్‌బాషా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆత్మకూరు కోర్టు అరెస్ట్ వారెంట్ శుక్రవారం జారీ చేసింది. ఈ విషయమై ఆత్మకూరు ఎస్సై పీ నరేష్యాదవ్ను సంప్రదించగా వారెంట్ వచ్చిన విషయం వాస్తవమేనన్నారు.