జనాలు నిన్ను చితక్కొడుతుంటే కాపాడింది పోలీసులే: శ్రీనివాసరావు

AP Police Officers Sangham President Srinivasa Rao Fires MLA Atchannaidu - Sakshi

సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు, ఎస్పీ విక్రాంత్ పటేల్‌పై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా పని చేసిన అచ్చెన్నాయుడికి 144 సెక్షన్‌ గురించి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. గత ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడినప్పుడు ప్రజలు అచ్చెన్నాయుడిని చితక్కొడుతుంటూ కాపాడింది పోలీసులే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పోలీసుల పట్ల మరొకసారి అమర్యాదగా ప్రవర్తిస్తే.. సరైన బుద్ధి చెబుతామన్నారు. సీఐగా పని చేసిన ఓ వ్యక్తి ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు.. అచ్చెన్నాయుడు మీరు సీఐ కాగలరా.. మీకా అర్హత ఉందా అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిపై డీజీపీకి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తగిన బుద్ధి చెబుతామన్నారు.

‘చలో ఆత్మకూరు’ నేపథ్యంలో అచ్చెన్నాయుడు చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ 144 సెక్షన్‌ అమల్లో ఉండటంతో.. ఎస్సీ విక్రాంత్‌, అచ్చెన్నాయుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు.. ‘ఏయ్‌ ఎగస్ట్రా చేయొద్దు. నన్ను ఆపే హక్కు నీకు ఎవడిచ్చాడు’ అంటూ పోలీసులపై ఒంటి కాలిపై లేచారు. ఎస్పీ విక్రాంత్ పటేల్‌ను ‘యుజ్‌లెస్ ఫెలో’ అని తిట్టారు. పోలీసులు ఆపుతున్నా వినకుండా తోసుకుంటూ ముందుకు సాగిపోయిన సంగతి తెలిసిందే.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top