చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు: జగన్‌

AP Is Not Safe In Chandrababu Government, YS Jagan Tweeted - Sakshi

సాక్షి, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా) : రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలను ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. ‘చిత్తూరులో బాలికపై అత్యాచార ఘటన ఆగ్రహం కలిగిస్తోంది. చంద్రబాబు మీ అసమర్థ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు. గడిచిన నెలలు నాలుగు అత్యాచార ఘటనలు జరిగాయి. మీ చేతుల్లో ఆంధ్రప్రదేశ్‌ భద్రంగా లేదన్నది సుస్పష్టం.’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో11 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్లు మూడు నెలలపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు.  అయితే నిందితులు మైనర్లు కావడంతో కేసు నమోదు చేసి తిరుపతిలోని జువైనల్‌ హోమ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా సభ్య సమాజం ఏ మాత్రం జీర్ణించుకోలేని ఇలాంటి ఘటనలు ఇటీవల రాష్ట్రంలో ఎక్కువవుతున్నాయి. అందులోనూ చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించడంలో ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించడంలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top