చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు

భద్రతా మార్గదర్శకాల కంటే ఎక్కువ సిబ్బందినే ఇచ్చాం
రాష్ట్ర ప్రభుత్వం వాదన సమర్థించిన ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: తనకు భద్రత పెంచాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చుక్కెదురు అయింది. చంద్రబాబు భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ప్రస్తుతం ఉన్న భద్రతనే కొనసాగించాలని ఏపీ హైకోర్టు బుధవారం ప్రభుత్వానికి సూచించింది. కాగా 147మంది భద్రతా సిబ్బంది కావాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
అయితే జాతీయ భద్రత మార్గదర్శకాలు నిర్దేశిస్తున్న సంఖ్య కంటే ఎక్కువగానే ఆయనకు భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ తమ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 54 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉండగా, తాము 97 మంది సిబ్బందిని కొనసాగిస్తున్నామని వివరించారు. దీంతో ప్రభుత్వ వాదనను న్యాయస్థానం సమర్థించింది. మరోవైపు తనకు సీఎస్వోగా భద్రయ్యను నియమించాలంటూ చంద్రబాబు విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. సీఎస్వో ఎవరుండాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి