ఏపీలో మరో ఏడాదిపాటు 'ఐదు రోజుల పని'

ఏపీలో మరో ఏడాదిపాటు 'ఐదు రోజుల పని'


- సచివాలయం, రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో 'ఐదురోజుల పనిదినాలు'

అమరావతి:
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు ఊరట కలిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ఫైలుపై సంతకం చేశారు. ప్రస్తుతం అమలులోఉన్న 'ఐదురోజుల పనిదినాలు'ను మరో ఏడాదికి పొడగిస్తు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలు ఉడాలన్న సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సచివాలయం, రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో ఉద్యోగులు వచ్చే ఏడాది జూన్ 27 వరకూ వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నారు.

Back to Top