సపరివార సమేతంగా..

AP Cm Family Visit Thirumala - Sakshi

శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు

సీఎంకు అభివృద్ధికార్యక్రమాలు

వివరించిన టీటీడీ ఈఓ, జేఈఓ

పాదరక్షలతో తూర్పుమాడ వీధిలోకి భద్రతా సిబ్బంది

సాక్షి, తిరుమల: సీఎం చంద్రబాబు బుధవారం కుటుంబ సభ్యులతో కలసి తిరుమల ఆలయంలో ఆనందంగా గడిపారు. తమ మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా అందరూ శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నప్రసాద కేంద్రం లో అన్నప్రసాద వితరణ చేశారు. టీటీ డీ నిబంధనల ప్రకారం శ్రీవారి సేవకులుగా స్కార్ప్‌లు ధరించి, భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. భక్తులతో కూర్చుని అల్పాహారం స్వీకరించారు.

సీఎంకు అభివృద్ధి పనులు వివరించిన టీటీడీ ఈఓ, జేఈఓ
ధార్మిక సంస్థలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆలయంలో ఇటీవల నిర్మించిన కదిలే పైకప్పును స్వయంగా సీఎంకు చూపించారు. పనితీరుపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాకారాల శుద్ధి పనులు, సర్వదర్శనం టైంస్లాట్‌ విధానంతో పాటు పరిపాలనా సంబంధిత విషయాలు వివరించారు.

పాదరక్షలతో మాడ వీదిలోకి సీఎం భద్రతా సిబ్బంది
తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం ఆలయ నాలుగు మాడ వీధుల్లో పాదరక్షలు నిషేధం. సీఎం చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉంది. ఆ సిబ్బంది బుధవారం ఆలయ తూర్పు మాడవీధిలోకి వచ్చారు. టీటీడీ సిబ్బంది చెబుతున్నా ఏమాత్రమూ పట్టించుకోకుండా వైభవోత్సవ మండపం సమీపంలోని గేట్‌ దాటి పాదరక్షలతో సంచరించారు. ఈ విషయం తెలుసుకుని భక్తులు సైతం ఒకింత అసహనానికి గురైనట్లు కనిపిం చింది. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్య త నాయకులపైనా ఉందని చర్చించుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top