‘రైతులకు, నిరుద్యోగులకు చేయూత కల్పించాలి’

AP Chief Vip LV Subramanyam Attended State Level Bankers Meeting At Vijayawada - Sakshi

సాక్షి, కృష్ణా : రైతులకు, నిరుద్యోగులకు చేయూత కల్పించి వారిని ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌ వీ సుబ్రహ్మణ్యం సూచించారు. పదమూడు జిల్లాల బ్యాంకు ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం గురువారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2022 నాటికి బ్యాంకింగ్ వ్యవస్దలో సమూల మార్పులు తీసుకు రావడానికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఎకానమీని పెంచడానికి బ్యాంకర్లందరు ఒక ప్రణాళిక రూపోందిస్తున్నారని తెలిపారు.

ఇప్పుడున్న పరిస్థితులకన్నా బ్యాంకింగ్‌ వ్యవస్థను మెరుగు పరచడానికి కొత్త పద్దతులను రూపొందించాలని పేర్కొన్నారు. ఆర్దికంగా ఎదుగుతున్నప్పుడు నష్టపోకపండా ఏవిధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై బ్యాంకర్లు దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుల రుణాల విషయంలో ఏవిధంగా సహాయం చేయగలుగుతామో బ్యాంకర్లకు వివరించినట్లు వెల్లడించారు. . రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లకు ఇచ్చే రాయితీల గురించి ఆయన చర్చించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top