రికార్డు స్థాయిలో పరీక్షలు

Andhra Pradesh set new records by conducting 17695 Corona tests in a single day - Sakshi

ఒకే రోజు 17,695 మందికి కరోనా టెస్టులు 

59 మంది డిశ్చార్జితో 2,660కి చేరిన కోలుకున్న వారి సంఖ్య

సాక్షి, అమరావతి: ఒకే రోజు 17,695 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు పరీక్షలు చేసిన వారి సంఖ్య 4,54,030కు చేరగా, పది లక్షల జనాభాకు సగటున 8,502 మందికి పరీక్షలు చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. శనివారం ఉ.9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 199 మందికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇందులో 130 మంది మన రాష్ట్రానికి చెందిన వారు కాగా 69 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,659కి చేరింది.

ఇందులో 810 కేసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారివి కాగా, 131 విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 59 మంది డిశ్చార్జి కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,660కు చేరింది. కొత్తగా డిశ్చార్జి అయిన వారిలో 30 మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 28, విదేశాల నుంచి వచ్చిన వారు ఒకరు ఉన్నారు. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మరణాల సంఖ్య 75కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,924. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top