విశాఖ డెయిరీ అక్రమాలపై చర్యలు చేపట్టాలి

Actions should be taken Visakha Dairy illegals  - Sakshi

విశాఖ డెయిరీలో సంస్థ చైర్మన్‌ ఆడారి తులసీరావు అవినీతి అంతా ఇంతా కాదు. ఇదే విషయాన్ని జగన్‌కు వివరించాం. డెయిరీ సహకార రంగంలో ఉన్నప్పటి నుంచి ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. 2014 ఎన్నికల తరువాత ప్రభుత్వం ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు 60 ఏళ్లు పెట్టి అమలు చేశారు. ఈ నిబంధన డెయిరీకి కూడా వర్తించనున్నప్పటికీ చైర్మన్‌ పట్టించుకోకుండా మమ్మల్ని 58 ఏళ్లకే బలవంతంగా ఉద్యోగ విరమణ చేయిం చారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా అనేక మంది పనిచేస్తున్నప్పటికి వారందరికీ రోజువారి కూలీ మాత్రమే ఇచ్చి అనేక సౌకర్యాలు లేకుండా చేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు పాలను కొనుగోలు చేసి భారీ అవినీతి చేస్తూ తన కుటంబసభ్యులు మాత్రమే పదవులు పొందుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జననేత జగన్‌కు విజ్ఞప్తి చేశాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top