6వ రోజు పాదయాత్ర డైరీ

6th day padayatra dairy - Sakshi

12–11–2017, ఆదివారం
దువ్వూరు, వైఎస్సార్‌ జిల్లా

నేతన్నల తలరాత మార్చాల్సిందే
ప్రొద్దుటూరు నుంచి ఆరో రోజు యాత్రను ఉదయం 8.30కి ప్రారంభించాను. బయల్దేరడానికి ముందు గుర్తుకొచ్చింది. ఇక్కడికి సమీపంలోనే కలమల అనే గ్రామం ఉంది. యర్రగుంట్ల మండల పరిధిలోకి వస్తుంది. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఇక్కడే ఉంది. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనం లభించింది ఈ గ్రామంలోనే. ఆరోశతాబ్ద కాలం నాటిది. తెలుగు భాష  ప్రాచీనతకు తిరుగులేని సాక్ష్యంగా నిలబడిందీ శాసనం. తెలుగుభాషా యశస్సును నలుదిక్కులా చాటి చెప్పేలా, మాతృభాషాభిమానులకు మనోరంజకమయ్యేలా అక్కడొక మెమోరియల్‌ను ఏర్పాటు చేయాలని ఉంది. రాయలసీమలో ఒక ముఖ్య వాణిజ్య పట్టణం ప్రొద్దుటూరు. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధివైపు వడివడిగా అడుగులు వేసింది. ఆ తర్వాత పూర్తిగా పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యింది. ఆ నిర్లక్ష్యం తాలూక ముద్రలు పట్టణంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలి. ప్రొద్దుటూరును అభివృద్ధి పట్టాల మీదకు ఎక్కించాలి. 

నడక మొదలైన తర్వాత పెద్దలు ఎమ్వీ రమణారెడ్డి గారు వచ్చి అభినందించి వెళ్లారు. వారికి ధన్యవాదాలు. ప్రజా స్పందన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదనిపిస్తోంది. అదే వెల్లువ కొనసాగింది. గ్రామాల వెంట ఒక్కరోజు కాలినడకన తిరిగొచ్చినా చాలు, ఈ ప్రభుత్వం ఎంత ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందో తెలుసుకోవచ్చు. ప్రొద్దుటూరు పరిసరాల్లో చేనేతన్నలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నాన్నగారు వారి కోసం అభివృద్ధి చేసిన కాలనీకి ఈ రోజు వెళ్ళాను. వారి స్థితిగతులు తెలుసుకున్నాను. వారిలో చాలామందికి పింఛన్లు రావడం లేదు. మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర రోజంతా కష్టపడ్డా రెండొందలు కూడా రావట్లేదన్నారు. పిల్లల చదువులు కూడా సాగడం లేదన్నారు. నాకు చాలా బాధ కలిగింది. మనసు బరువెక్కింది. పనిలో నైపుణ్యం లేక కాదు వీళ్లకీ పరిస్థితి. ఆసరా లేక, అండ లేక, ఇప్పుడున్న పాలకులకు చిత్తశుద్ధి లేక. నేతన్నల తలరాత మార్చి రాయాల్సిందే. ఒక్క ప్రొద్దుటూరే కాదు, చాలా ప్రాంతాల్లో చేనేత కార్మికులు సంక్షోభ స్థితిలో చిక్కుకున్నారు.

ఆంధ్ర చేనేతకు చాలా చరిత్ర ఉంది. వెయ్యేళ్లకు పూర్వమే మన దగ్గర తయారైన వస్త్రం ఓడల ద్వారా ఖండాతరాలకు ఎగుమతయ్యింది. ఇప్పుడు కూడా పనితనంలో మన చేనేత కళాకారులు ఎవరికీ తీసిపోరు. అవకాశాలు వరించి వస్తే ఆకాశాన్ని ముద్దాడగల ప్రతిభావంతులు మన నేతన్నలు. వైఎస్‌గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో హ్యాండ్లూమ్‌ పార్క్‌ ఏర్పాటుకు 76 ఎకరాల స్థలం కేటాయించారు. అనుబంధ పరిశ్రమలతో కూడిన ఒక చేనేత క్లస్టర్‌ని అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నించారు. ఆయన దూరమైన తరువాత ఆ ప్రయత్నమూ దూరమైంది. ఎన్నికలకు ముందు ఇప్పటి ముఖ్యమంత్రి వీరికి చాలా వాగ్దానాలు చేశారు. ఆ తర్వాత వాటన్నిటికీ నీళ్లొదిలారు. 

ప్రొద్దుటూరు శివారు దాటేసరికి మధ్యాహ్నమైంది. భోజనానంతరం మైదుకూరు నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించి సాయంత్రం 6 గంటలకు దువ్వూరు మండల కేంద్రానికి చేరుకున్నాము. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల అక్రమ ఇసుక వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగిపోతోంది. వారు తవ్విన గుంతల్లో పడి ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కూడా వైఎస్సార్‌ హయాంలో జరిగిందే.  ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రెండు పంటలకు నీరిచ్చేవారు. ఆగస్టులో రావాల్సిన నీరు ఇప్పుడు నవంబర్‌లో వస్తోంది. గత రెండేళ్లుగా అది కూడా లేదు. కుందూ నదిపై రాజోలి రిజర్వాయర్‌ నిర్మించడానికి వైఎస్‌ ప్రభుత్వం 2008లోనే అనుమతులు సాధించింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ జరిగి రెండు పంటలూ హాయిగా పండేవి. పంటలు పండినా గిట్టుబాటు కాని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. ఖర్చులు కూడా రాక రైతులు విలవిల్లాడుతున్నారు. రుణమాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు వాళ్లు రుణాల కోసం బ్యాంకుల గడప కూడా తొక్కలేని పరిస్థితి. 

ఈ సాయంత్రం దువ్వూరులో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ రోజు మొత్తం 15.8 కిలోమీటర్లు నడిచాము. బసకు చేరుకోగానే హృదయవిదారకమైన వార్త తెలిసింది. విజయవాడలో జరిగిన బోటు ప్రమాదంలో 17 మంది చనిపోయి, మరో ఏడుగురు గల్లంతయ్యారని అంటున్నారు. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్ళి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని పార్టీ సీనియర్‌ నాయకులకు చెప్పాను.  
- వైఎస్‌ జగన్‌ 

More news

18-11-2017
Nov 18, 2017, 08:38 IST
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి 11వ ప్రజాసంకల్పయాత్ర  ప్రారంభమైంది. ఆయన ఈ రోజు...
18-11-2017
Nov 18, 2017, 08:20 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ :  ప్రభుత్వ ఉద్యోగమంటేనే భద్రత. పింఛన్‌ వారికొక భరోసా. కానీ 2004 నుంచి అమలవుతున్న కంట్రిబ్యూటరీ...
18-11-2017
Nov 18, 2017, 05:36 IST
కోవెలకుంట్ల: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను బనగానపల్లె నియోజకవర్గంలో విజయవంతం చేయాలని...
17-11-2017
Nov 17, 2017, 17:10 IST
సాక్షి, హైదరాబాద్‌ : వైస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు...
17-11-2017
Nov 17, 2017, 09:22 IST
కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం రామచంద్రాపురం క్రాస్‌రోడ్డు వద్ద కేసీ కెనాల్‌ సాధన సమితి...
17-11-2017
Nov 17, 2017, 09:18 IST
ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:  మా గోడు వింటే మహాభారతం, రాస్తే రామాయణం అవుతుందని పత్తి విత్తనాలను...
17-11-2017
Nov 17, 2017, 09:12 IST
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బైపాస్‌ రోడ్డు వద్ద గురువారం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌...
17-11-2017
Nov 17, 2017, 09:06 IST
ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘జగనన్నా... మా కుమారుడు సందీప్‌ వయస్సు ఆరేళ్లు. ఇప్పటికీ మాట్లాడడం రాదు....
17-11-2017
Nov 17, 2017, 08:58 IST
నంద్యాల టౌన్‌:  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆళ్లగడ్డ నుంచి తమ గ్రామం పెద్ద చింతకుంటకు వస్తున్నారని తెలుసుకుని  వ్యవసాయ...
17-11-2017
Nov 17, 2017, 07:00 IST
పత్తికొండ రూరల్‌:  వర్షమొస్తే పాఠశాల ప్రాంగణంలో నీరు నిలుస్తోందని, పైకప్పు ఉరుస్తుండటంతో తరగతి గదులు తడిచిపోతున్నాయని ఆళ్లగడ్డ మండలం పెద్దచింతకుంటలోని...
17-11-2017
Nov 17, 2017, 06:46 IST
కోవెలకుంట్ల: స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలసదన్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్‌జగన్‌కు విన్నవించుకున్నారు. గురువారం ప్రజాసంకల్ప యాత్ర...
17-11-2017
Nov 17, 2017, 06:40 IST
కోవెలకుంట్ల: అన్ని అర్హతలున్నా తమకు పింఛన్లు ఇవ్వడం లేదంటూ పెద్దచింతకుంటకు చెందిన పలువురు వైఎస్‌ జగన్‌ ముందు వాపోయారు. గ్రామానికి...
17-11-2017
Nov 17, 2017, 06:33 IST
కోవెలకుంట్ల: ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 4 శాతం రిజర్వేషన్‌ కల్పించారని, ఆ శాతాన్ని...
17-11-2017
Nov 17, 2017, 06:29 IST
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘అయ్యా నాపేరు శిలువక్క. నా కుమారుడి పేరు బాలేష్‌. మేము చింతకుంటలోని 7వ వార్డులో నివాసం ఉంటాం....
17-11-2017
Nov 17, 2017, 06:21 IST
 ఆత్మకూరు: ఏమ్మా.. బడికి వెళ్లలేదా ? అని ఆశ అనే బాలికను వైఎస్‌ జగన్‌ అడగ్గా ‘అమ్మ వద్దంది.. అందుకే...
17-11-2017
Nov 17, 2017, 06:12 IST
పోషణ భారం కావడంతో ముగ్గురు కుమార్తెలను అనాథఆశ్రమంలో వదిలేశానని చింతకుంటకు చెందిన లీలావతి..తన కుమారుడికి వైద్యం చేయించలేకపోతున్నానని శిలువక్క..ఇల్లు లేక...
17-11-2017
Nov 17, 2017, 02:40 IST
న్యూఢిల్లీ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష...
17-11-2017
Nov 17, 2017, 02:28 IST
16–11–2017, గురువారం  దొర్నిపాడు, కర్నూలు జిల్లా   ప్రజల కన్నీళ్లకు శక్తి ఎక్కువ ఈ రోజు పాదయాత్ర ఆళ్లగడ్డ శివారు నుంచి ఉదయం 8.30కి...
17-11-2017
Nov 17, 2017, 02:09 IST
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అయ్యా.. నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్నాం.. ఏ సంక్షేమ పథకాన్నీ మా దరిదాపులకు...
Back to Top