ఏపీలో 6 లక్షల మందికి పింఛను కట్!

ఏపీలో 6 లక్షల మందికి పింఛను కట్!


అక్టోబర్ 2న వీరికి లేనట్టే..

మొత్తం 43,12,533 పింఛనుదారుల్లో 38,66,592 మందినే అర్హులుగా తేల్చిన ప్రభుత్వం

అర్హుల్లోనూ అధార్ లేని 1,63,656 మందికీ ప్రస్తుతానికి పింఛను రాదు

ఆధార్ వివరాలిచ్చిన వెంటనే పింఛను ఇస్తామంటున్న అధికారులు

కొత్త పింఛన్ల కోసం 7,74,137 దరఖాస్తులు

 


 

హైదరాబాద్: రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా పింఛన్లు తీసుకుంటున్న వారిలో 6 లక్షల మందికి పైగా వచ్చే అక్టోబర్ 2వ తేదీన పింఛను అందే పరిస్థితి లేదు. ఇప్పటివరకు పింఛన్లు తీసుకుంటున్న మొత్తం 43,12,533 మంది లబ్దిదారుల్లో 38,66,592 మందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా తేల్చింది. అర్హుల్లో కూడా 1,63,656 మందికి ఆధార్ లేదనే కారణంతో పింఛన్లు తాత్కాలికంగా నిలిపివేయూలని నిర్ణరుుంచింది. పింఛనుదారుల్లో అనర్హుల్ని గుర్తించే పేరిట కొత్తగా కొన్ని నిబంధనలు విధించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. అలా గుర్తించే ప్రక్రియ కోసం ఇటీవల గ్రామ, మున్సిపల్ వార్డు కమిటీలను నియమించింది. కమిటీల్లో తెలుగుదేశం సానుభూతిపరులకు పెద్ద పీట వేసిందనే విమర్శలు వ్యక్తమయ్యూరుు. తద్వారా ఆ పార్టీకి చెందిన వారికే పింఛన్లు లభించేలా ఎత్తుగడ వేసిందనే ఆరోపణలూ వచ్చారుు. ఈ నెల 19వ తేదీన కమిటీలు పాత పింఛనుదారుల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడంతోపాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారుు. పాత పింఛనుదారుల్లో దాదాపు లక్ష మంది తమ పరిశీలన సమయంలో అందుబాటులోకి రాలేదని ఆయూ కమిటీలు నిర్ధారించారుు. గ్రామానికి సుదీర్ఘ కాలం దూరంగా ఉండేవారు, మరణించినప్పటికీ పింఛను జాబితాలో కొనసాగుతున్న వారు, ఒకరే రెండు పింఛన్లు పొందుతున్న వారు ఈ లక్ష మంది జాబితాలో ఉండొచ్చునని అధికారులు చెబుతున్నారు. వీరితో పాటు కమిటీ పరిశీలించిన మిగిలిన మొత్తం పింఛనుదారుల్లో 3,34,569 మందిని అనర్హులుగా తేల్చారు. కమిటీలు అర్హులుగా తేల్చిన 38.66 లక్షల మందిలో 1.63 లక్షల మందికి అధార్ లేదని తేల్చారు.



ఈ నెల 20వ తేదీ నాటికి ఆధార్ లేని వారు 2,66,942 మందిగా అధికారులు లెక్కలు తేల్చగా.. ఈ పది రోజుల వ్యవధిలో దాదాపు లక్ష మంది పింఛనుదారులకు కొత్తగా ఆధార్ కార్డులు ఇప్పించారు. ప్రభుత్వ పరిశీలనలో అనర్హులుగా తేలిన వారిని పూర్తిగా పింఛను జాబితాల నుంచే తొలగించగా.. అర్హులుగా గుర్తించినప్పటికీ అధార్ లేని 1.63 లక్షల మందికీ వారు ఆధార్ కార్డులు తీసుకునే వరకు పింఛన్లు అందజేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వీరు ఆధార్ వివరాలు సమర్పించిన వెంటనే పింఛను చెల్లింపులు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, తాజా కసరత్తులో గ్రామ, మండల కమిటీలకు 5.13 లక్షల మంది పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి తోడు గత రచ్చబండ కార్యక్రమం సందర్భంగా కొత్త పింఛన్ల కోసం దాదాపు 15 లక్షల దరఖాస్తులు అందగా, వారిలో 13 జిల్లాలకు సంబంధించి 2.61 లక్షల మందిని అర్హులుగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అన్నీ కలిపి మొత్తంగా 7,74,137 మంది కొత్త పింఛను దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.



 అర్హులందరికీ పింఛన్లు: మంత్రి మృణాళిని



 కొత్త పింఛన్లు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులుగా తేలిన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని చెప్పారు. జన్మభూమి, పింఛన్ల పథకం, మహిళా సంఘాలకు ఇసుక తవ్వకాలు అప్పగింత అంశాలపై  సోమవారం మంత్రి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛను కోసం అర్హులుగా గుర్తించిన వారికి అక్టోబర్ నుంచే అందజేస్తామని చెప్పారు. అక్టోబర్ 2న పెంచిన పింఛన్ల చెల్లింపు ప్రక్రియ మొదలైనప్పటికీ.. జన్మభూమి జరిగినంత కాలం, ఆ తర్వాత అర్హులుగా గుర్తించిన వారికి అక్టోబర్ నెల పింఛను కూడా కలిపి చెల్లిస్తామన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top