ఆన్‌లైన్‌లో 52,190 ఆర్జిత సేవాటికెట్లు

52,190 arjithaseva tickets in online - Sakshi

10,080 టికెట్లు లక్కీడిప్‌ ద్వారా..

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా 2018 ఫిబ్రవరికి సంబంధించి మొత్తం  52,190 టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీటిలో 10,080 టికెట్లను లక్కీడిప్‌ ద్వారా కేటాయించనున్నారు. వీటిలో సుప్రభాతం 7,300, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 240,  నిజపాద దర్శనం 2300 ఉన్నాయి. ఈ టికెట్ల దరఖాస్తుకు వారం గడువు ఉంటుంది.

చివరిరోజు కంప్యూటర్‌ లక్కీడిప్‌ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. 3 రోజుల్లోగా నగదు చెల్లించని టికెట్లను లక్కీడిప్‌ ద్వారా ఇతరులకు కేటాయిస్తారు. మిగిలిన 42,110  సేవాటికెట్లలో కల్యాణోత్సవం 10,500, ఊంజల్‌సేవ 2800, ఆర్జిత బ్రహ్మోత్సవం 5590, వసం తోత్సవం 10,320, సహస్ర దీపాలంకార సేవకు 11,400, విశేషపూజ 1500 టికెట్లు పాతపద్ధతిలోనే కేటాయిస్తారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top