ప్రభుత్వ పనితీరుపై 41% మంది అసంతృప్తి

ప్రభుత్వ పనితీరుపై 41% మంది అసంతృప్తి

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం

 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరుపై 41 శాతం మంది అసంతృప్తితో ఉన్నారని, వీటిని 20 శాతానికి తగ్గించాలని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం సీఎం అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల, కాకినాడలో పెరిగిన ఆధిక్యతను బెంచ్‌ మార్క్‌గా తీసుకోవాలన్నారు.ప్రభుత్వ పథకాలపై ప్రతికుటుంబం అభిప్రాయం, ప్రతి గ్రామంలో ప్రజాస్పందన తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇంటింటికి తిరిగేటప్పుడు ఆయా వర్గాల ప్రజల అవసరాలను తెలుసుకొని, వారి అభ్యర్థనలు విని వినతులు కూడా స్వీకరించాలని సూచించారు. వారం వారం ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం పురోగతిపై ప్రోగ్రెస్‌ షీట్‌ విడుదల చేయాలన్నారు. 
Back to Top