242వ రోజు పాదయాత్ర డైరీ

242rd day padayatra diary - Sakshi

21–08–2018, మంగళవారం
దార్లపూడి శివారు, విశాఖపట్నం జిల్లా

మీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని అక్కచెల్లెమ్మలు ప్రశ్నిస్తున్నారు బాబూ..
కొండ కోనల్లో.. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా అందని పల్లెల్లో ఈరోజు పాదయాత్ర సాగింది. ఉదయం శిబిరం వద్ద ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు కలిశారు. అందరూ ఉన్నత విద్యావంతులే. నాన్నగారంటే వాళ్లకెంత ప్రాణమో చెప్పారు. అదే ప్రేమ, వాత్సల్యం నా మీదా ఉందన్నారు. వాళ్లంతా కలిసి నా మీద 55 గీతాలు రాశారు. వాటిని వారే పాడి యూట్యూబ్‌ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. నిండైన ఆ అభిమానానికి మనసారా కృతజ్ఞతలు చెప్పాను. అదేబాటలో మరో చెల్లెమ్మ.. గూడుపులోవకు చెందిన లక్ష్మి. రాఖీ పండుగకు ఇంకా ఐదు రోజులు ఉన్నప్పటికీ ‘అన్నా ఈ రోజే నాకు నిజమైన రాఖీ పండుగ’ అంటూ ఎంతో ఆప్యాయతతో రాఖీ కట్టి మిఠాయి తినిపించింది. ఆ సోదరి ప్రేమకు బందీ అయ్యాను. 

ఇసుకాసురుల చెరలో నలిగిపోతున్న చిరుద్యోగుల కథ విన్నప్పుడు నిజంగా బాధేసింది. వాళ్లంతా రక్షిత మంచినీటి పథకంలో ఆపరేటర్లుగా, వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు. 14 ఏళ్లుగా పనిచేస్తున్నా వారికిచ్చేది ఇప్పటికీ రూ.7 వేలేనట. ఇదిలా ఉంటే.. టీడీపీ అధికారంలోకి వచ్చాక లెక్కలేనన్ని కష్టాలు వెంటాడుతున్నా యట. గొట్టివాడ వరహా నది ద్వారా పైపులైన్‌ వేసి 97 గ్రామాలకు నీళ్లందించే తాగునీటి ప్రాజెక్ట్‌ అది. అక్కడే పచ్చ చొక్కాల వాళ్లు ఇష్టానుసారం ఇసుక తవ్వేస్తున్నారు.. దీంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి.. తాగునీరందించేందుకు ఇబ్బందిగా ఉంది. అడ్డుకుంటే ఇసుక మాఫియా బరితెగించిపోతోందని, అక్రమ కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్‌లలో వేధిస్తున్నారని ఆ చిరుద్యో గులు నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల అండ, పోలీసు బలగాల తోడున్న ఆ ఇసుక మాఫియాను మేమెలా అడ్డుకోగలమని ప్రశ్నించారు. నిజంగా ఇది దారుణమే. కోరలు చాచిన మాఫియాకు చంద్రబాబు డాన్‌ అయితే ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుంది.

అల్లుమియ్యపాలెం గిరిజనం ఈ రోజు నన్ను కలిసి గోడు చెప్పుకున్నారు. ప్రధాన రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు లేక ఇబ్బందిపడుతున్నా మన్నారు. పాదయాత్రగా నర్సీపట్నం వచ్చిన చంద్రబాబును కలిసి రోడ్డు వేయాలని కాళ్లావేళ్లా పడ్డామన్నారు. ఆ తర్వాత ఆయన కొడుకు, పంచాయతీరాజ్‌ మంత్రి లోకేశ్‌ కాళ్లు పట్టుకుని మరీ బతిమిలాడామన్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదన్నా అని చెప్పారు. ఇంతకన్నా అమానుషం ఉంటుందా? కమీషన్లు.. కాసుల వేట నిత్యజీవితమైన ఈ ప్రభుత్వ పెద్దలకు గిరిజన ఘోష ఎలా అర్థమవుతుంది?

వెంకటాపురం దళితవాడ అక్కచెల్లెమ్మల ఆవేదన అంతాఇంతా కాదు. కూలీనాలీ చేసుకునే ఆ నిరుపేదలు నాలుగు డ్వాక్రా సంఘాల్లో సభ్యులు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు, మొత్తం మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మారు. చంద్రబాబు అధికారంలోకి అయితే వచ్చారు. కానీ మాఫీ మాట దేవుడెరుగు.. వడ్డీలకు వడ్డీ పెరిగిపోయి రుణం తడిసిమో పెడైంది. మాటిచ్చిన బాబుగారు మొహం చాటేశారు.. రుణమిచ్చిన బ్యాంకువారు కోర్టు నోటీసులు ఇచ్చారు. అన్నెంపున్నెం ఎరుగని ఆ నిరుపేద అక్కచెల్లెమ్మలు చేయని పాపానికి యలమంచిలి కోర్టు మెట్లెక్కారు. పూటగడవడమే కష్టమైన ఆ కూలీలకు లాయర్లను పెట్టుకుని న్యాయపోరాటం చేయాల్సి రావడం ఎంత బాధాకరం? మోసం చేసింది ఒకరైతే.. శిక్ష మరొకరికా?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కూలీనాలీ చేసుకుని పూటగడుపుకునే అక్కచెల్లెమ్మలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వారు చేసిన నేరమేమిటి? వారికున్న పూరిళ్లను, చిన్నచిన్న ఆస్తులను సైతం జప్తు చేస్తామంటున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇందుకు కారణ మెవరు? కనీసం వారు ఫలానా తప్పు చేశారు అని చెప్పే ధైర్యం మీకుందా? లేదా వారు ఏ తప్పూ చేయలేదని చెప్పగలిగే నిజాయితీ అయినా మీకు ఉందా? మీరు చేసిన మాఫీ మోసం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తున్న ఆ అక్క చెల్లెమ్మలకు ఏమని సమాధానం చెబుతారు? 
-వైఎస్‌ జగన్‌  

మరిన్ని వార్తలు

18-09-2018
Sep 18, 2018, 04:47 IST
హుద్‌హుద్‌ వచ్చినప్పుడు సముద్ర అలలు మనవైపు రాలేదు. వర్షం, విపరీతమైన గాలులు వచ్చాయి.కానీ చంద్రబాబు హుద్‌హుద్‌నూ వదిలిపెట్టలేదు. ఈ తుపాన్‌ను...
18-09-2018
Sep 18, 2018, 04:18 IST
17–09–2018, సోమవారం  ఆనందపురం, విశాఖ జిల్లా   బరితెగించిన నేతలను నియంత్రించకపోతే..ఆటవిక పాలన కాక ఇంకేముంటుంది?! విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం, దైవశిల్పి భగవాన్‌ విశ్వకర్మ...
17-09-2018
Sep 17, 2018, 20:57 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 265వ రోజు...
17-09-2018
Sep 17, 2018, 18:15 IST
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఇక్కడ భూములను దోచేస్తున్నారు.  ప్రభుత్వ, ఇనామ్‌, అసైన్డ్‌ భూములు
17-09-2018
Sep 17, 2018, 08:12 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
17-09-2018
Sep 17, 2018, 06:53 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్‌లో సోమవారం మ« ద్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరగనుందని వైఎస్సార్‌సీపీ...
17-09-2018
Sep 17, 2018, 06:51 IST
విశాఖపట్నం : ప్రజాసంకల్పయాత్ర నుంచి ప్రత్యేక బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ దక్షిణ నియోజవర్గ సమన్వయకర్తగా ప్రముఖ వైద్యుడు,...
17-09-2018
Sep 17, 2018, 06:44 IST
విశాఖపట్నం :అన్నా..మాది శ్రీరాంపురం. పాయకరావుపేట మండలం. సెకెండ్‌ ఇంటర్‌ చదువుతున్నా. చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే ఇష్టం. బాక్సింగ్‌లో  అంతర్జాతీయ...
17-09-2018
Sep 17, 2018, 06:42 IST
సాక్షి,విశాఖపట్నం : గుండె గడపకు పండగొచ్చింది. హృదయం ఉప్పొంగింది. జగనానందభరితమైంది. శ్వేతవర్ణకపోతమై దూసుకొస్తున్న రేపటి ఉషస్సును చూసి నయవంచక పాలకుల...
17-09-2018
Sep 17, 2018, 06:40 IST
విశాఖపట్నం :మాది ఆనందపురం మండలం శొంఠ్యం గ్రామం. నేను గిడిజాలలోని ఓ ప్రయివేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రానిక్‌ డిప్లమో కోర్సులో...
17-09-2018
Sep 17, 2018, 06:38 IST
విశాఖపట్నం : వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009లో 429 జీవో ద్వారా రాష్ట్రంలో 48వేల మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చారు....
17-09-2018
Sep 17, 2018, 06:36 IST
విశాఖపట్నం :వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలమైన మాకు కొమ్మాదిలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద  కె–1, 2,3 కాలనీలు నిర్మించి...
17-09-2018
Sep 17, 2018, 06:30 IST
విశాఖపట్నం :‘జగన్‌ బాబు.. నా వయసు 70.. నా భర్త వయసు 75 ఏళ్లు. మా పిల్లలు ఎవరిదారి వారు...
17-09-2018
Sep 17, 2018, 06:27 IST
విశాఖపట్నం :వైఎస్సార్‌ సీపీలో ఆనందపురం, మధురవాడ, పద్మనాభం తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు ఆదివారం చేరారు.  నగరానికి చెందిన కాపు...
17-09-2018
Sep 17, 2018, 05:02 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ఎర్రటి ఎండ.. ఆ పై జోరు వర్షం.. రెండింటినీ జనం...
17-09-2018
Sep 17, 2018, 04:18 IST
16–09–2018, ఆదివారం  గుమ్మడివానిపాలెం, విశాఖ జిల్లా   భూదోపిడీ వెనుక అసలైన సూత్రధారులు,ప్రధాన లబ్ధిదారులు ప్రభుత్వ పెద్దలే..  ఈ రోజు పాదయాత్ర జరిగిన నియోజకవర్గాలు...
16-09-2018
Sep 16, 2018, 20:23 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 264వ రోజు...
16-09-2018
Sep 16, 2018, 14:13 IST
సాక్షి, విశాఖపట్నం : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా...
16-09-2018
Sep 16, 2018, 08:50 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
16-09-2018
Sep 16, 2018, 07:04 IST
నిరాడంబరతకు, నిజాయితీకి నిదర్శనం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఆయన్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా తరం యువ త...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top