అపర సంజీవనికి ఆపద

108 Ambulance Vehicles Shortage In YSR Kadapa - Sakshi

2005లో ప్రారంభించినా... ఇప్పటికీ బాలారిష్టాలే

వాహనాలను వెంటాడుతున్న ఆక్సిజన్‌ కొరత

ప్రజలకు సకాలంలో సేవలందించలేకపోతున్న 108

మంత్రికి మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యం

ఆపదలో చిక్కుకున్న వారిని ఆపద్బాంధవుడిల ఆదుకునే 108ని ప్రస్తుతం అత్యవసర పరిస్థితివెంటాడుతోంది. సంస్థలు మారుతున్నా..వాహనాల్లో సేవలు అందించే ఉద్యోగులజీవితాలు మాత్రం మారడం లేదు. 2005లోదివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా  పురుడు పోసుకున్న 108 వాహనాలుప్రమాదం జరిగినచోట ప్రత్యక్షమవుతూ ప్రజలకుసేవలందించేవి.2014లో అధికారంలోకి వచ్చినబాబు సర్కార్‌ 108 పట్ల నిర్లక్ష్యం చూపుతోంది.ఒకవైపు పాలకుల శీతకన్ను, మరోవైపు ప్రభుత్వఅలసత్వం వెరసి అపర సంజీవనికి ఆపద కాలాన్నితెచ్చి పెట్టాయి. బీపీ,షుగర్‌ పరీక్షించేందుకుయంత్రాలు సహకరించని పరిస్థితి నెలకొంది.

సాక్షి, కడప: జిల్లాలో 108కు సంబంధించి 29 వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనాన్ని ఒక్కో రకమైన సమస్య వెంటాడుతోంది. పులివెందుల నియోజకవర్గం అంతటికీ ఉన్నది ఒక్క వాహనమైతే దానికి సవాలక్ష సమస్యలు.  కిటికీలు పగిలిపోవడంతో వర్షం వచ్చినపుడల్లా నీరు లోపలికి వస్తోంది. వాహనాల్లో ఆక్సిజన్‌ కొరతతోపాటు డెలివరీ కిట్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. మైదుకూరులో సాంకేతిక సమస్యలు ఉన్నాయి..అత్యవసర పరిస్థితుల్లో అందించే మందులు కూడా కరువే! బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఉన్న వాహనం చాలా పాతది కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.హెడ్‌లైట్లు పనిచేయకపోవడంతో రాత్రి పూట ఎక్కడ ఉంటే అక్కడే నిలబెట్టేస్తున్నారు. జమ్మలమడుగులో బీపీ, షుగర్‌ పరీక్షలు చేసే యంత్రాలు   పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏసీ కూడా పనిచేయడం లేదు.

ఆక్సిజన్‌ కొరత వెంటాడుతోంది.ఎక్కువ జనాభా కలిగిన కడపలో రెండు వాహనాలు మాత్రమే ఉన్నాయి. మరొకటి  అవసరం ఉంది. ప్రొద్దుటూరులో  అత్యవసర పరిస్థితి ఏర్పడినపుడు ఇబ్బందికరంగా ఉంది. రాయచోటిలో కూడా నాలుగు వాహనాలు ఉంటే అన్నింటికి  ఆక్సిజన్‌ సరఫరా కాకఇబ్బందులు ఎదురవుతున్నాయి.డీజిల్‌ సమస్య కూడా వెంటాడుతోంది. ఒంటిమిట్టలో 108 వాహనం చాలా పాతది కావడంతో టైర్లు అరిగిపోయాయి.  ఆక్సిజన్‌ కొరతతోపాటు షుగర్, బీపీ పరీక్షలు కూడా చేయలేని స్థితి నెలకొంది. బద్వేలులో వాహనం మొదట్లో ఇచ్చింది కావడం, తర్వాతి కాలంలో మరమ్మతులకు గురి కావడంతో  ఉపయోగించడం లేదు. కేవలం 15 కిలోమీటర్ల పరిధిలో అయితే వెళ్లడానికి ముందుకొస్తున్నారు. బ్రేకులు, ఇతర సమస్యల నేపథ్యంలో దూర ప్రాంతాలకు దూరం చేశారు.  వైద్య పరికరాలు కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. రైల్వేకోడూరులో రెండు వాహనాలున్నా సిబ్బంది కొరత ఉంది.  

మూలకు చేరిన వాహనాలు
 జిల్లాలో 108 వాహనాలకు సంబంధించి 29 ఉండగా, అందులో మూడు మూలకు చేరాయి.చెన్నూరు వాహనాన్ని షెడ్డుకు పరిమితం చేశారు. కమలాపురానికి సంబంధించి 108 వాహనాన్ని మరమ్మత్తులకోసం తీసుకొచ్చి ఆరు నెలలు దాటినా ఇప్పటికీ అతీగతీ లేదు. అక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా 108కు ఫోన్‌ చేయడానికి జనాలు వెనుకంజ వేస్తున్నారు. ఏది ఏమైనా 108 వాహనాలు సవాలక్ష సమస్యలతో ఒక్కొక్కటిగా షెడ్డుకు చేరుతున్నాయి. జిల్లాలో 50 మండలాలు ఉండగా, 108 వాహనాలను విభజించు, పాలించు తరహాలో వాడుకుంటున్నారు.  కేవలం 26 మాత్రమే ఉండడంతో అన్నిచోట్లకు తిరిగేలా చూసుకుంటున్నారు.పూర్తిస్థాయిలో అందించాలని పలువురు కోరుతున్నారు.  

వేతన జీవుల వెతలు
జిల్లాలో 108 వాహనాల్లో పనిచేస్తున్న పైలెట్లతోపాటు ఈఎంటీల కొరత వెంటాడుతోంది. జిల్లా వ్యాప్తంగా 134 మంది ఉంటే అందులో 68 మంది పైలెట్లు, 66 మంది ఈఎంటీలు పనిచేస్తున్నారు. వీరే కాకుండా మరికొంతమంది సిబ్బంది ఉండాల్సి ఉంది. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో ఉన్న వారిపై  అదనపు భారం పడుతోంది. కొన్నిచోట్ల 12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. జీతాలు ఆలస్యంగా అందుతున్నట్లు   సిబ్బంది వాపోతున్నారు.  

మంత్రికి మొరపెట్టుకున్నా..
జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న వాహనాల్లో అన్నీ అరకొరగానే కనిపిస్తున్నాయి. పెద్దముడియం, జమ్మలమడుగు, మైలవరానికి సంబంధించి ఒక్క వాహనం మాత్రమే ఉంది. మరొకటి కావాలి మహాప్రభో అంటూ గతంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి అక్కడి ప్రజలు మొర పెట్టుకున్నా ఇంతవరకు కొత్త వాహనాన్ని కేటాయించలేదు. సాక్షాత్తు మంత్రికి చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. మంత్రి ఇలాఖాలోనే అపర సంజీవినికి మోక్షం లభించకపోవడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top