గ్రహం అనుగ్రహం

గ్రహం అనుగ్రహం - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీ హేవిళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం, తిథి అమావాస్య ప.3.50 వరకు, తదుపరి మార్గశిర శు.పాడ్యమి
నక్షత్రం విశాఖ రా7.00 వరకు, తదుపరి అనూరాధ,
వర్జ్యం రా.11.10 నుంచి 1.04 వరకు,
దుర్ముహూర్తం ఉ.6.09 నుంచి 7.38 వరకు
అమృతఘడియలు ఉ.9.32 నుంచి 11.15 వరకు.

సూర్యోదయం  : 6.09
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం:  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అరుదైన అవకాశాలు.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా అనుకూలం. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మిథునం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. దూర ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

కర్కాటకం: పనుల్లో  ప్రతిబంధకాలు. రుణయత్నాలు. అనారోగ్యం. బంధువర్గంతో స్వల్ప విభేదాలు. ప్రయాణాలు తుదిక్షణంలో వాయిదా. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి.

సింహం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పనులలో పురోగతి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కన్య: రుణాలు చేస్తారు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

తుల: ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. యత్నకార్యసిద్ధి. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. భూలాభాలు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: ఉద్యోగయత్నాలలో ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ప్రముఖులతో పరిచయాలు. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

కుంభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

మీనం: బంధువర్గంతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు.
– సింహంభట్ల సుబ్బారావు

నమాజ్‌ వేళలు
ఫజర్‌    :    5.07
జొహర్‌    :    12.01
అసర్‌    :    4.04
మగ్రీబ్‌    :    5.40
ఇషా    :    6.55

Back to Top