ఆంధ్ర ప్రదేశ్ » పశ్చిమ గోదావరి

Advertisement
పశ్చిమ గోదావరి వార్తలు
Advertisement
జిల్లా ముఖచిత్రం

పశ్చిమ గోదావరి జిల్లా, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనలో భాగంగా, ఉత్తర భాగంలో గల ప్రాంతాన్ని ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలలో కలిపారు. అవశేష జిల్లాకు కేంద్రం భీమవరం. గుంటుపల్లి (కామవరపుకోట).


బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరి జిల్లాగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు. 


సవరించిన పరిధి ప్రకారం జిల్లా వైశాల్యం 2,178 చ.కి.మీ. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. జిల్లాకు ఉత్తరంగా ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, తూర్పున కోనసీమ జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమంగా ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా సముద్ర తీరం పొడవు 19.కి.మీ. జిల్లాలో సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు. జిల్లాలో కృష్ణా, గోదావరి నదుల కాలవలు ప్రధానమైన నీటి వనరులు. కొల్లేరు సరస్సులో సగభాగం జిల్లాలో ఉంది.


సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాల్లో కనిపించే పండుగ సంబురాలు ఇంకెక్కడా ఉండవు. కోడి పందాలు, కొత్త అల్లుళ్లు, సామూహిక భోజనాలకు పశ్చిమ గోదావరి ఎంతో ప్రసిద్ధి.

జిల్లా వివరాలు
జిల్లా పశ్చిమ గోదావరి
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 15
మొత్తం ఓటర్ల సంఖ్య 3,346,217
పురుషులు 1,633,482
మహిళలు 1,712,523
Advertisement
Advertisement