ఆంధ్ర ప్రదేశ్ » విజయనగరం

Advertisement
విజయనగరం వార్తలు
Advertisement
జిల్లా ముఖచిత్రం

విజయనగరం జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. జిల్లా కేంద్రం విజయనగరం. 2022 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, విజయనగరం లోకసభ నియోజకవర్గ పరిధి ప్రాతిపదికగా జిల్లా చేయుటకు, పార్వతీపురం రెవెన్యూ డివిజనులోని 11 మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చి, శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజనులోని 4 మండలాలు జిల్లాలో కలిపారు.

బొబ్బిలి కోట, విజయనగరం కోట, విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయం జామి వృక్షం,రామతీర్థంలో ప్రాచీన శ్రీరామ దేవాలయం, బౌద్ధక్షేత్రం అవశేషాలు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.

క్రీ.పూ. 4వ శతాబ్దం నాటికే గోదావరి, మహానదుల మధ్య భాగాన్ని అంటే కటక్ నుంచి పిఠాపురం వరకూ ఉన్న ప్రాంతాన్ని కళింగదేశం అన్నారు. కళింగ దేశంలో ఏనుగులు ఎక్కువని అందుకే ఇక్కడి రాజులకి "గజపతులు" అని పేరు వచ్చిందని అర్ధశాస్త్రంలో ఉంది. విదేశీ చరిత్రకారులు ప్లీనీ, మెగస్తనీస్, హుయన్ చాంగ్ లు కళింగ దేశ నాగరికత గురించి రాశారు. కళింగ భూములు ఎంతో సారవంతమయినవని, బెల్లంకొండ నుంచి పాలకొండ వరకూ ఎన్నో కొండలున్నాయని ప్లీనీ రాశాడు. అక్కడి ప్రజలు మోటు వారయినా న్యాయం తప్పని వారని హుయాన్ చాంగ్ రాశాడు.

2022 లో సవరించిన జిల్లా పరిధి ప్రకారం, జిల్లా విస్తీర్ణం 4122 చ.కి.మీ. జిల్లాకు ఉత్తరాన పార్వతీపురం మన్యం జిల్లా, తూర్పున శ్రీకాకుళం జిల్లా, దక్షిణాన విశాఖపట్నం జిల్లా, బంగాళాఖాతం, పశ్చిమాన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఒడిషా దక్షిణాది వారికి ఇప్పటికీ విజయనగరమే ప్రధాన మార్కెట్‌.

జిల్లా వివరాలు
జిల్లా విజయనగరం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 9
మొత్తం ఓటర్ల సంఖ్య 1,878,276
పురుషులు 924,883
మహిళలు 953,262
Advertisement
Advertisement