ఆంధ్ర ప్రదేశ్ » శ్రీకాకుళం

Advertisement
శ్రీకాకుళం వార్తలు
Advertisement
జిల్లా ముఖచిత్రం

శ్రీకాకుళం జిల్లా ఏపీలో ఈశాన్య దిక్కులో చివరి జిల్లా.  శ్రీకాకుళం నగరాన్ని కళింగపట్నం అని కూడా అంటారు. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, కొన్ని మండలాలను పార్వతీపురం మన్యం జిల్లాలో, విజయనగరం జిల్లాలలో చేర్చారు.

ఈ జిల్లా తొలిగా విశాఖపట్నం జిల్లా నుండి ఏర్పడినందున, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చరిత్రే దీనికి ఆధారం. ఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్యస్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ వంటి బౌద్ధారామాలు ఇక్కడ కనుగొన్నారు. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.

గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుడు కాలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించాడు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం శ్రీకాకుళం జిల్లాలోనే ప్రారంభమయింది.

1969లో ఈ జిల్లానుండి సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలి తాలూకాలోని 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పరచిన గజపతి నగరం తాలూకాకు బదలాయించారు. మళ్ళీ 1979 మేలో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పరచినపుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను కొత్తజిల్లాలో విభాగాలుగా చేశారు.

జిల్లా వివరాలు
జిల్లా శ్రీకాకుళం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 10
మొత్తం ఓటర్ల సంఖ్య 2,313,584
పురుషులు 1,155,964
మహిళలు 1,157,456
Advertisement
Advertisement