ఆంధ్ర ప్రదేశ్ » నెల్లూరు

Advertisement
నెల్లూరు వార్తలు
Advertisement
జిల్లా ముఖచిత్రం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నెల్లూరు నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. భారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులలో ఒకడైన తిక్కన సోమయాజీ ఈ ప్రాంతంలో నివసించాడు.

విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. వరికి అప్పటి వాడుకలో గల తమిళ భాషలో నెల్ అంటారు కాబట్టి "నెల్ వూరు" అనే పేరు వచ్చింది. ఇది కాలక్రమంలో నెల్లూరుగా రూపాంతరం చెందింది.

పల్లవ రాజుల చిహ్నం సింహం కనుక, విక్రమసింహుని కాలంలో సింహపురి రాజధానిగా వున్నందున ఈ ఊరిని విక్రమ సింహపురి అనికూడా అంటారు. రెండు పేర్లు శాసనాలలో ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి.

ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం లోని మూలాపేట ప్రాంతము అత్యంత పురాతన ప్రశస్తి కలిగి ఉంది.

జిల్లా వివరాలు
జిల్లా నెల్లూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 10
మొత్తం ఓటర్ల సంఖ్య 2,399,249
పురుషులు 1,172,795
మహిళలు 1,226,203
Advertisement
Advertisement