ఆంధ్ర ప్రదేశ్ » కర్నూలు

Advertisement
కర్నూలు వార్తలు
Advertisement
జిల్లా ముఖచిత్రం

కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. జిల్లా కేంద్రం కర్నూలు. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో కలిపారు. తొలి ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు ముఖ్యపట్టణంగా ఉంది.

బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు.  కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజుఅచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.

1565 లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687 లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. గియాసుద్దీన్ జయించిన ఈ ప్రాంతానికి ఔరంగజేబు మొఘల్ సేనానుల్లో ఒకడైన దావూద్ ఖాన్‌కు జాగీరుగా యిచ్చారు. 1733 లో అతని మరణానంతరం పాలన చేపట్టిన హిమాయత్ ఖాన్ మొదటి కర్నూలు నవాబుగా పాలకవంశాన్ని ప్రారంభించారు. ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741 లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది.

1947 లో భారత దేశ స్వాతంత్ర్యానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953 లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956 లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.

జిల్లా వివరాలు
జిల్లా కర్నూలు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 14
మొత్తం ఓటర్ల సంఖ్య 3,391,293
పురుషులు 1,672,622
మహిళలు 1,718,097
Advertisement
Advertisement