Advertisement
కృష్ణా వార్తలు
Advertisement
జిల్లా ముఖచిత్రం


కృష్ణా జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వలన జిల్లాకు ఈ పేరు వచ్చింది. చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం. 2022లో ఈ జిల్లా రెండుగా మారింది. ఎన్టీఆర్ జిల్లాను విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో కూడా కొన్ని మండలాలను కలిపారు.

చరిత్రలో చాలా కాలం వరకు మచిలీపట్నం ఓడ రేవుగా ఎగుమతి-దిగుమతులు జరిగేవి. తానీషాగా ప్రసిద్ధి చెందిన అబూ హుసేన్ షా మంత్రులయిన అక్కన్న ఇంకా మాదన్న వారి కార్యాలయాన్ని విజయవాడలో స్థాపించారు. వీరిరువురు కనక దుర్గ అమ్మవారిని ఆరాధించేవారు. నేటికీ ఇంద్రకీలాద్రి కొండ దిగువన వీరు ఆరాధించిన గుహలు మనకు దర్శనమిస్తాయి. ఔరంగజేబు సామ్రాజ్యంలో భాగమయిన గోల్కొండను 5 నవాబులకు విభజించి ఆసఫ్ ఝా సుబేదారుగా పాలించాడు. ఆర్కాటు, కడప, కర్నూలు, రాజమండ్రి, చీకకోల్ (శ్రీకాకుళం) నవాబుల కింద పాలించబడ్డాయి. ఈ ప్రాంతం రాజమండ్రి నవాబు పరిపాలనలో వుండేది.

సా.శ.॥1611 లో ఆంగ్లేయులు మచిలీపట్నం కేంద్రంగా తమ కార్యకలాపాలు జరపడం ప్రారంభమైంది. 1641 లో మద్రాసుకు తరలి వెళ్ళే వరకూ ఇది వారికి ముఖ్యపట్నంగా కొనసాగింది. ఆంగ్లేయుల తరువాత డచ్చి, ఫ్రెంచి వారు మచిలీపట్నాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1748 లో నిజాం-ఉల్-ముల్క్ మరణంతో ఈ ప్రాంతం ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి హస్తగతమయింది. 1761 లో నిజాం అలీ ఖాన్ తిరిగి గోల్కొండ నవాబు అయినపుడు మచిలీపట్నం నిజాం పట్నం, కొండవీడులో కొంత భాగం బ్రిటిష్ వారికి కానుకగా ఇచ్చాడు. ఆ తరువాత సర్కారు ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు "మచిలీపట్నం జిల్లా" అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణాజిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. 2022 లో కృష్ణా జిల్లాలో విజయవాడతో కలిసిన ఉత్తరభాగాన్ని ఎన్టీఆర్ జిల్లాగా విడదీశారు. ఉత్తరంలో కొంత భాగాన్ని ఏలూరు జిల్లాలో కలిపారు.

జిల్లా వివరాలు
జిల్లా కృష్ణా
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 16
మొత్తం ఓటర్ల సంఖ్య 3,635,820
పురుషులు 1,773,970
మహిళలు 1,861,617
Advertisement
Advertisement