ఆంధ్ర ప్రదేశ్ » అనంతపురం

Advertisement
అనంతపురం వార్తలు
Advertisement
జిల్లా ముఖచిత్రం

అనంతపురముకు ‘అనంతసాగరం’ అనే పెద్ద ట్యాంక్ నుండి పేరు వచ్చింది, అంటే “అంతులేని మహాసముద్రం” అని అర్థం.  నాటి విజయనగర పాలకులు అనంతసాగరం, బుక్కరాయసముద్రం గ్రామాలను నిర్మించారు. 1882 వ సంవత్సరంలో బళ్లారి జిల్లా నుండి వేరుపడి అనంతపురం జిల్లా ఏర్పడింది.

ఈ జిల్లా ఉత్తరాన కర్నూలు జిల్లా, ఆగ్నేయంలో చిత్తూరు జిల్లా, తూర్పున వైయస్ఆర్ జిల్లా,  పశ్చిమాన, నైరుతిలో కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 40,83,315.

అనంతపురము సమీపంలోని ప్రధాన నగరాలకు NH 44, NH 205లతో అనుసంధానించబడి ఉంది. NH-44 దీనిని బెంగళూరుతో కలుపుతుంది మరియు NH-205 దీనిని రేణిగుంట ద్వారా చెన్నైని కలుపుతుంది. అనంతపురంకు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. అలాగే పుట్టపర్తిలో మరో ఎయిర్‌పోర్ట్‌ ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి జరిగింది.

పర్యాటకంగానూ ఈ జిల్లా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. 550 సంవత్సరాల తిమ్మమ్మ మర్రిమాను అతిపెద్ద మహా వృక్షంగా గిన్నిస్ బుక్‌లో స్థానం పొందింది. 8.50 ఎకరాల్లో విస్తరించిన ఈ వృక్షం కదిరి- రాయచోటి జాతీయ రహదారి మార్గమధ్యంలో ఉంది.

చిత్రవతి ఒడ్డున 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా వల్ల ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తారు. శివరాత్రి నాడు, బాబా పుట్టిన రోజున చాలా మంది సందర్శిస్తారు.

శ్రీకృష్ణదేవరాయలు 15 శతాబ్దంలో హంపి తర్వాత ఇక్కడి పెనుకొండను రెండో రాజధానిగా చేసుకుని పాలించారు. ఇక్కడ ఉన్న ఆలయాలను చూడాలంటే ఒక రోజు సరిపోదు. ఒక్క పెనుకొండలోనే సుమారు 365 ఆలయాలు ఉన్నాయి.

జిల్లా వివరాలు
జిల్లా అనంతపురం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 14
మొత్తం ఓటర్ల సంఖ్య 3,389,629
పురుషులు 1,685,996
మహిళలు 1,703,325
Advertisement
Advertisement