breaking news
Eluru
-
పారిజాతగిరిలో పూజలు
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేకువజాము నుంచే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్టి, బాల భోగ నివేదన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు జిల్లా నలుమూలల నుంచి కొండ పైకివచ్చి స్వామివారి ప్రత్యేక అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. కుమార్తెలతో మహిళ అదృశ్యం ఉండి: ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో అదృశ్యం కావ డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పెదపుల్లేరు గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో విభేదాల కారణంగా తల్లి వద్ద ఉంటుంది. ఆమెకు 12, 8 ఏళ్ల వయసున్న కుమార్తెలు వున్నారు. ఈ నెల 18న ఇద్దరు కుమార్తెలతో నిద్రపోయిన ఆమె 19న ఉదయం 5 గంటల సమయంలో తల్లి చూసేసరికి కనిపించలేదు. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్వలో గుర్తుతెలియని మృతదేహం కలిదిండి(కై కలూరు): గుడ్లవల్లేరు – కోరుకొల్లు బీఎండీ చానల్ కాల్వలో కోరుకొల్లు బ్రహ్మంగారి గుడి సమీపంలో గుర్తుతెలియని శవం శనివారం కొట్టుకొచ్చింది. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు, 5 అడుగుల ఎత్తు కలిగిన మగ శవంగా గుర్తించారు. మనిషి సన్నగా కనిపిస్తూ గెడ్డం, జుట్టు, కొనతేలిన మీసాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తోన్నారు. ఉండిలో మరొకటి.. ఉండి: శనివారం ఉండి బొండాడ మేజర్ డ్రెయిన్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పురుషుడి వయసు 40 నుంచి 50 ఏళ్ళు ఉంటుందని, ఆచూకీ కొరకు 9440796648 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు. మంచినీటి చెరువును పరిశీలించిన అధికారులు కాళ్ల: కాళ్ల మండలం కోలనపల్లి మంచినీటి చెరువును అధికారులు శనివారం పరిశీలించారు. చెరువులో చేపలు చనిపోవడంపై గ్రామస్తుల ఆందోళనపై ‘మంచినీటి చెరువులో చేపల మృతి’ అనే సాక్షి కథనానికి స్పందించారు. డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చెరువును పరిశీలించారు. తేలుతున్న చేపలను తీసివేసి, గట్ల చుట్టూ పెరిగిపోయిన చెత్తను తొలగించినట్లు తెలిపారు. చెరువును బ్లీచింగ్‌తో సూపర్ శానిటేషన్ చేయించామని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని టాంటాం వేయించామన్నారు. కాళ్ళ లంక చానల్ నుంచి పంట నీరు నింపాలని అధికారులకు ఆదేశించారు. -
నిమ్మ రైతులను ఆదుకోవాలి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో నిమ్మ ధర రూ.100కు పైగా పలికింది. ఈ ఏడాది నిమ్మ ధర దిగజారి పోవడంతో సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. రాయంకుల సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, కామవరపుకోట మండలం గిట్టుబాటు ధర కల్పించాలి నిమ్మ తోట దిగుబడి రావడానికి పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీంతో అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాను. ఈ ఏడాది నిమ్మ ధర దిగజారి పోవడంతో ఆర్థికంగా అప్పులు పాలయే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలి. – మద్దుకూరి సత్యనారాయణ, ఈస్ట్ యడవల్లి, కామవరపుకోట మండలం -
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
పెనుగొండ: ఉండి నియోజకవర్గంలో దళితులు నివసిస్తున్న ఇళ్లను అక్రమంగా కూల్చివేయడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ విమర్శించారు. శనివారం ఆచంట వేమవరంలోని మాల మహానాడు కార్యాలయంలో పోలీసులు గృహ నిర్బంధ చేశారు. ఆకివీడు మండలం ధర్మవరం అగ్రహారంలో దళితులకు అండగా పోరాటం చేస్తామని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఉద్యమాలను అరెస్ట్‌లతో ఆపలేరన్నారు. దళితులు నివాసాలు రహదారికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిన హామీ ప్రకారం ఇబ్బంది కలుగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే మాలమహానాడు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఏలూరు జిల్లా పావులూరివారి గూడెంకు చెందిన శ్రీనివాస భజన మండలి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,10,790 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. -
మట్టి కొట్టుకుపోయిన రూ.3 కోట్లు
ఉండి: 2024–25కు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ పనుల ఖర్చుల్లో రూ.3.50 కోట్లు అధిక చెల్లింపు చేసినట్లు సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి. శనివారం ఉదయం నుంచి ఉండి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజావేదిక సభలో తనిఖీ బృందాల నివేదికలపై మాత్రం తప్పుదారి పట్టించేలా అధికారులు సమాధానమిచ్చారు. 2024–25 ఏడాదికి 19 గ్రామాల్లో సుమారు రూ.5.44 కోట్లకు పైగా విలువైన 1059 పనులు నిర్వహించారు. పంచాయతీరాజ్ విభాగంలో 22 పనులు రూ.67 లక్షలతో చేపట్టారు. చేపట్టిన పని ఒకటైతే నమోదు చేసిన పని మరొకటి కావడంతో సామాజిక తనిఖీ బృందాలు మండల వ్యాప్తంగా రూ.3.50 కోట్లు అధిక చెల్లింపులు చేసినట్లు నివేదికను రూపొందించాయి. కాలువలు, పంట బోదెల్లో చేపట్టిన పనులు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. వాటిల్లో కేవలం తూడు, గుర్రపుడెక్క తొలగించారని తనిఖీ బృందాలు నివేదిక ఇస్తే.. మట్టి తీశామని ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది అధికారులు వాదించారు. మట్టి పనిచేస్తే ఎందుకు ఫోటోలు ఆన్లైన్ చేయలేదన్నారు. అంతే అంటూ ఎన్ఆర్ఈజీఎస్ పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు సమర్ధించుకున్నారు. పంట కాలువలు, బోదెల్లో వేసవిలో నీరు వుంటుందని మట్టి తీసినా కనిపించదంటూ విచిత్రంగా సమాధానాలు చెప్పారు. పనిచేసే సమయంలో ఫొటోల్లో ఎందుకు తీసిన మట్టి కనిపించలేదని పలువురు వాదించినా చెప్పిందే చెప్పి సమస్యను కప్పిపుచ్చేందుకు పీడీ పయత్నించారు. సమావేశం అనంతరం పీడీ మాట్లాడుతూ పనుల్లో జరిగిన అవతవకలు రూ.1.61 లక్షలు రికవరీ రాశామని తెలిపారు. పలు గ్రామాల్లో వచ్చిన ఆరోపణలపై అధికారుల ఆధ్వర్యంలో రూ.5.67 లక్షల విలువైన పనులపై ఎంక్వయిరీ వేసినట్లు తెలిపారు. తనిఖీ బృందాల నివేదికల ప్రకారం.. వారు గుర్తించిన రూ.3.50 కోట్ల అధిక చెల్లింపుల్లో భాగంగా రూ.3.07 కోట్ల పనులకు సంబంధించి పని సమయంలో తీసిన ఫోటోలు అప్లోడ్ చేయాలని.. అలా చేయని పక్షంలో మొత్తం రూ.3.07 కోట్లు తిరిగి చెల్లించాలని మండల ఎన్ఆర్ఈజీఎస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ సుజాత, విజిలెన్స్ జిల్లా అధికారి పురుషోత్తం, క్వాలిటీ కంట్రోల్ జేఈ శ్రీకాంత్, ఎంపీడీవో ఎంవీవీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మ ధర పతనం
కామవరపుకోట: నిమ్మ ధర దిగజారటంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. గత వారం రోజుల నుంచి నిమ్మకాయ రేట్లు పడిపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం కామవరపుకోట మార్కెట్ యార్డులో రైతుకు కిలో రూ.8 నుంచి రూ.10 రూపాయలకు నిమ్మకాయల రేటు దిగజారిపోయింది. మండలంలో వేల ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో రూ.100 పైబడి నిమ్మ ధర పలికింది. ఇప్పుడు దారుణంగా పడడంతో కూలీల ఖర్చు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో నిమ్మ ధర లభించడంతో చాలామంది రైతులు మరి ముఖ్యంగా కౌలు రైతులు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు అధిక మొత్తంలో కౌలు చెల్లించి మరీ సాగు చేపట్టారు. ఈ ఏడాది మే నెల ప్రారంభం నుండే నిమ్మ ధర ఒక్కసారిగా పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు తిరిగిరాని పరిస్థితి నెలకొందని అప్పులు పాలవుతామని కౌలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేట్లు పడిపోవడం వల్ల కోత కోసే కూలీలకు ఖర్చులు , రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదే రేట్లు నిమ్మకాయకు కొనసాగితే రైతులు అప్పులు పాలు కావాల్సిందేనని, నిమ్మ తోటలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. కొంతమంది వ్యాపారులు దళారులు కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు పంట దిగుబడి, నాణ్యతపై ప్రభావం చూపయని ఇది కూడా ధరల పతనానికి కారణమని మరి కొంతమంది చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యాపారుల సిండికేట్‌ను నియంత్రించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆందోళనలో రైతులు -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
జంగారెడ్డిగూడెం: గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 29న 394.795 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఐదుగురిని అరెస్టు చేయగా, ఇద్దరు తప్పించుకున్నారు. వారిలో కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన పిడుగు శ్రీనివాసరావు అలియాస్ బాబిని స్థానిక జాతీయ ప్రధాన రహదారిపై ఫైర్ స్టేషన్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. బైక్, సెల్‌ఫోన్ సీజ్ చేశామన్నారు. కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. అతనిపై మండపేట రూరల్, తిమ్మాపురం, జగ్గంపేట, రాజమండ్రి ప్రకాష్ నగర్లో 36 దొంగతనం కేసులు, దేవరపల్లి, పెనుమంట్ర, రాజమండ్రి, నెల్లూరు జిల్లా వి.సత్రం పోలీస్‌స్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణా కేసులు ఉన్నాయని తెలిపారు. -
టిడ్కో గృహాలకు మోక్షమెప్పుడో?
● సంక్రాంతికే ఇస్తామన్న మంత్రి పార్థసారథి ● ఆరు నెలలు గడిచినా వాటి ఊసే లేదు నూజివీడు: పట్టణ పరిధిలోని టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఎప్పటికి అందుతాయోనని ఎదురుచూస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని టిడ్కోకు చెల్లించి రెండేళ్లు గడిచినా ఇంతవరకు తమకు గృహాలు అప్పగించకపోగా, ఇచ్చిన రుణాలపై రెండేళ్ల మారటోరియం పూర్తికావడంతో రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. 2014–19 కాలంలో పాలించిన టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాల పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకకానికి జతగా రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులను ఇచ్చి టిడ్కో గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా నూజివీడు పట్టణంలో అప్పట్లో 3070 గృహాలను మంజూరు చేశారు. నిర్మాణం పూర్తయిన ప్లాట్లు 2640 ఉన్నాయి. వీటిల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 864, 365 చదరపు అడుగుల(సింగిల్ బెడ్రూమ్) విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 864, 430 చదరపు అడుగుల (డబుల్ బెడ్ రూమ్) ప్లాట్లు 912 చొప్పున ఉన్నాయి. సంక్రాంతిలోగా ఇస్తామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి గతేడాది జులైలో నూజివీడులో పర్యటించిన సమయంలో పట్టణంలోని టిడ్కో గృహాల ప్లాట్లను సంక్రాంతి కల్లా అందిస్తానని ప్రకటించారు. దీంతో లబ్ధిదారులందరూ తమ ప్లాట్లు చేతికొస్తాయని సంతోషించారు. సంక్రాంతి వచ్చింది..పోయింది తప్ప లబ్ధిదారులకు ప్లాట్లు మాత్రం చేతికి రాలేదు. సంక్రాంతి పోయి ఆరు నెలలు గడిచినా టిడ్కో గృహాల ఊసే లేదు. దీంతో ఇంకెంత కాలం ఎదురుచూడాలోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఇచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నూజివీడులో ఉన్న 2640 పాట్లలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 864 ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి లబ్ధిదారులు బ్యాంకర్ల నుంచి రూ.2.72 లక్షల రుణాన్ని తీసుకొని టిడ్కోకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు వచ్చిన లబ్దిదారులకు సంబంధించిన రుణాన్ని మాఫీ చేశారు. లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి మాత్రమే కట్టించుకొని వారి పేరున ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసింది. వారికి కూడా ప్లాట్లను ఇంత వరకు అప్పగించలేదు. పనులే ప్రారంభం కాలేదు టిడ్కో గృహాల సముదాయ ప్రాంతంలో ఇంతవరకు రోడ్ల నిర్మాణ పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. ప్లాట్లలో ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. విద్యుత్ వైరింగ్, రంగులు వేయడం, మరుగుదొడ్లు, బాత్రూమ్లు తయారు చేయడం, తలుపులు పెట్టడం తదితర పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఎన్నికల ముందు టిడ్కో గృహాలను అధికారంలోకి రాగానే అప్పగిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోకపోవడంపై లబ్దిదారులు అసంతృప్తి వ్యక్తమవుతోంది.టిడ్కో గృహాలు అందజేయాలి పట్టణంలోని టిడ్కో గృహాలను లబ్ధిదారులకు త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఏడాది గడిచినా ప్రభుత్వం అమలు చేయలేదు. లబ్ధిదారులపై రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. లక్షలాది రూపాయలు రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు వడ్డీ భారం పెరిగిపోయే అవకాశాలున్నాయి. జీ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, నూజివీడు -
చీటింగ్ కేసులో నగదు రికవరీ
చింతలపూడి: చీటింగ్ కేసులో నగదు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. చింతలపూడి డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న షేక్ ఖాసింకు చింతలపూడికి చెందిన రాజ్‌కుమార్, ప్రవీణ్ అనే వ్యక్తులు వ్యాపార అవసరాల నిమిత్తం తక్కువ వడ్డీకి డబ్బులు ఇప్పిస్తామని తెలిపారు. దీంతో ఖాసిం వారి మాటలు నమ్మడంతో తొలుత ష్యూరిటీ కింద రూ.50 లక్షలు, కంపెనీ డాక్యుమెంట్స్ తీసుకురావాలని తెలపడంతో ఈ నెల 18న ఖాసిం చింతలపూడి వచ్చారు. అలా వచ్చిన మేనేజర్‌ను రాజ్‌కుమార్, ప్రవీణ్‌లు చింతలపూడిలోని ఎరుకలపేటలోని ఒక ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ డబ్బులు లెక్కపెట్టే నెపంతో ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకుని, వేరే మార్గంలో బయటకు వెళ్లారు. ఎంతకు రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా వారు కనిపించలేదు. తనను మోసం చేశారని గ్రహించిన మేనేజర్ చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ టి.క్రాంతి కుమార్, ఎస్సై కె.సతీష్‌కుమార్‌లు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని వారి నుంచి రూ. 50 లక్షలు రికవరీ చేశారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు సదరు వ్యక్తుల గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవాలని డీఎస్పీ అన్నారు. సరైన ధ్రువీకరణ లేకుండా లావాదేవీలు చేయరాదన్నారు. -
● రహదారి.. చెరువుగా మారి
చెరువులో నుంచి ఏంటి యువకులు నడిచి వెళుతున్నారు అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్టే.. ఇది చింతలపూడి మండలంలోని ముక్కంపాడు గ్రామానికి వెళ్లే రహదారి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులా మారింది. దీంతో శనివారం ఉదయం నుంచి నడుములోతు నీటిలో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. ముక్కంపాడుకు రోడ్డు నిర్మాణం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, వర్షం కురిస్తే రోడ్డు పూర్తిగా జలమయమవుతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. – చింతలపూడి -
టీడీపీ నేతల నీచ సంస్కృతికి నిదర్శనం
ఏలూరు టౌన్: టీడీపీ నేతలు రాష్ట్రంలో మహిళాలోకం ఆగ్రహానికి గురికాకతప్పదనీ.. వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దుర్భాషలాడుతూ, దాడులకు తెగబడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ నేతల దాడి, దౌర్జన్యంపై శనివారం ఏలూరులోని జి ల్లా కార్యాలయంలో మహిళా నేతలు, జెడ్పీటీసీలతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ, సినీరంగంలో రాణిస్తున్న మాజీ మంత్రి రోజా ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ కుటుంబంలోని మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సమర్థిస్తారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజూ ఏదో ఒకచోట బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే మహి ళా హోం మంత్రి కనీసం నోరు మెదపలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, టీడీపీ నేతల నీచ సంస్కృతికి ఇది నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబుకు మహిళలపై చిత్తశుద్ధి ఉంటే నగరి టీడీపీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పేరుతో రాక్షస పాలన సాగుతోందనీ.. ఇటీవల కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ మూ కలు, గుండాల్లా వ్యవహరిస్తూ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమన్నారు. అనుచిత వ్యాఖ్యలు సహించం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకీరెడ్డి మాట్లాడుతూ నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ మహిళా నేతలను తీవ్ర పదజాలంతో దూషిస్తూ మాట్లాడటం హేయమన్నారు. ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వైఎస్సార్సీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. దెందులూరు జెట్పీటీసీ నిట్టా లీలానవకాంతం మాట్లాడుతూ ఎమ్మెల్యే భానుప్రకాష్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే మహిళాలోకం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి ఇంజేటి నీలిమ, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసీ, రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి ఇందిరమ్మ, జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు సాయిల స్వాతి యాదవ్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మంద జయలక్ష్మి, ఏలూరు కార్పొరేటర్ తుమరాడ స్రవంతి, సీనియర్ మహిళా నేత తులసీ వర్మ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి సిగ్గుచేటు వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సరితారెడ్డి -
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ దారుణం
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెం: ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ ను మాజీ ఎమ్మెల్యే తె ల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి బాలరా జు విలేకరులతో మా ట్లాడుతూ ఎంపీ మిథున్‌రెడ్డిని సీఎం చంద్రబాబు కేవలం కక్షపూరిత రాజకీయాలతోనే అరెస్ట్ చేయించారని వి మర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ జైలులో పెట్టాలని చూ స్తున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత మందిని అరెస్ట్ చేసినా వైఎస్సార్సీపీ జెండాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజాకోర్టులో చావు దెబ్బతప్ప దని బాలరాజు అన్నారు. లిక్కర్ కేసులో మిథు న్‌రెడ్డికి సంబంధం ఉన్నట్టు ఎక్కడా ఆధారం లేకపోయినా అరెస్ట్ చేయించారన్నారు. ప్లాస్టిక్‌ను పారదోలాలిఉంగుటూరు : పారిశుద్ధ్యంలో ఏలూరు జిల్లా ను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని, ప్లాస్టిక్‌రహిత జిల్లా లక్ష్యమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. శనివారం మండలంలోని చేబ్రోలులో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ఉర్దూ పాఠశాల, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ చేబ్రోలును తాను దత్తత తీసుకుంటానని, దేశంలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి అందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ చేబ్రోలు జాతీయస్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య గ్రామంగా అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు. డీపీఓ కె.అనురాధ, ఎంపీడీఓ రాజ్‌మనోజ్, తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్, సర్పంచ్ రందే లక్ష్మీసునీత తదితరులు పాల్గొన్నారు. నకిలీ ఎరువులపై నిఘా భీమడోలు: ఖరీఫ్‌లో నకిలీ ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కే సులు నమోదు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గుండుగొలనులోని సాయిలలితాంబికా ఎరువులు, పురుగు మందుల దుకాణాన్ని శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి స్టాకు నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఈ–పాస్ విధానం ద్వారా రైతులకు ఎరువులు విక్రయిస్తున్నట్టు జిల్లా వ్య వసాయాధికారి హాబీబ్ బాషా ఆమెకు వివరించారు. జిల్లాలో ఎరువుల నిల్వలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. రైతులు పురుగు మందులు, ఎరువులు విచక్షణారహితంగా వా డకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ ఏడీఏ పి.ఉషారాజకుమారి, ఏఓ ఎస్పీవీ ఉషారాణి ఉన్నారు. విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈనెల 21న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా నాయకుడు పి.కిషోర్ పిలుపునిచ్చారు. స్థానిక స్ఫూర్తి భవనంలో శనివారం చలో విజయవాడ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యుత్ మీటర్ రీడర్ల సంఘ నాయకులు కిషోర్, పి.ప్రకాష్, శంకర్, అప్పారావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లతో రీడర్లు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వారి విద్యార్హతను బట్టి షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాచ్మెన్, అటెండర్ పోస్టుల్లో నియమించాలని కోరారు. ఎస్క్రో ఖాతాను ప్రారంభించాలని, కనీస వేతనాలు అమలు చేయా లని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధనకు 21న విజయవాడలో విద్యుత్ సౌదా వద్ద మహాధర్నా నిర్వహించనున్నామన్నారు. మీట ర్ రీడర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలు పునిచ్చారు. ఏఐటీయూసీ నాయకులు బి.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో సబ్ ట్రెజరీ ఉద్యోగి
కై కలూరు: రిటైర్డ్ అటెండర్‌కు రావాల్సిన సొ మ్ములకు లంచం డిమాండ్ చేసిన కై కలూరు సబ్ ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ కులుకులూరి హనుమంతరావు అలియాస్ ఆంజనేయులను శనివారం ఏలూరు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కై కలూరుకు చెందిన షేక్ సుభానీ 2016లో రెవెన్యూ అటెండర్‌గా రిటైరు కాగా శాలరీ ఫిక్స్ కాలేదు. ఇటీవల ఏలూరు ప్రధాన కార్యాలయం నుంచి కై కలూరు సబ్ ట్రెజరీకి ఆయన ఫైల్‌ను క్లియర్ చేసి పంపారు. ఏరియర్స్, గ్రాట్యూటీ కలిపి రూ.33 లక్షలు రావాల్సి ఉండగా.. కై కలూరు నుంచి ఫైల్ తిరిగి పంపడానికి సుభానీ మూ డు నెలలుగా హనుమంతురావు చుట్టూ తిరుగుతున్నారు. రూ.66 వేలు లంచం ఇవ్వాలని హనుమంతరావు డిమాండ్ చేయగా సుభానీ బతిమలాడితే రూ.55 వేలకు ఫైనల్ చేశాడు. జూన్ 26న రూ.10 వేలు ఇవ్వగా.. ఈనెల 2న సుభానీ ఖాతాలో పదవీ విరమణ లబ్ధి కొంత జమైంది. ఇంకా రూ.6 లక్షలు రావాల్సి ఉండగా.. ఆ మొత్తం కోసం రూ.20 వేలు లంచం ఇప్పుడు ఇచ్చి మిగిలింది తర్వాత ఇవ్వాలన్నాడు. దీనిపై ఈనెల 17న సుభానీ ఏలూరు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రూ.20 వేలను సుభానీకి ఇచ్చి పంపగా.. ఈ సొమ్మును తీసుకుండుగా హనుమంతరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణ, శ్రీనివాసు, వాసుకృష్ణ, సతీష్ పాల్గొన్నారు. -
కౌలు రైతుకు దక్కని గుర్తింపు
ఏలూరు (మెట్రో): రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రాష్ట్రం సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుంది. అయితే దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి సర్కారు పాలన సాగిస్తోంది. రైతులను అన్నివిధాలా మోసం చేస్తున్న సర్కారు తాజాగా కౌలు రైతులను సైతం నట్టేట ముంచేస్తోంది. అరకొర పొలం కౌలుకు తీసుకుని సాగు చేసుకునే రైతులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా అందించకుండా జాప్యం చేస్తోంది. సీసీఆర్ కార్డులు తప్పనిసరి కౌలు రైతులకు పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించుకునే వెసులుబాటు కలగాలంటే ఈ–పంటలో నమోదు చేసుకోవాలి. విపత్తుల వల్ల నష్టపోతే ప్రభుత్వ సాయం అందాలన్నా ఈ–పంట నమోదు తప్పనిసరి. అయితే ఈ–పంట నమోదులో కౌలు రైతులను నమోదు చేయాలంటే సీసీఆర్ (కౌలు గుర్తింపు కార్డు) తప్పనిసరి. అయితే వీటిని అందించకుండా కూటమి సర్కారు కౌలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కార్డులు అందవు.. రుణాలు దక్కవు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించడంలో క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం, భూ యజమానుల అంగీకారం వంటి కారణాలతో ఈ ప్రక్రియ నామమాత్రంగానే కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినప్పటికీ కౌలు కార్డులు అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కౌలు గుర్తింపు కార్డులు వస్తే పంట సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రుణం పొందేందుకు ఇదే సరైన సమయం కావడంతో కౌలు రైతులు సైతం కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సీజన్ ప్రారంభం కావడంతో పంటలకు పెట్టుబడి కోసం ప్రైవేట్ అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. ఇదే అదనుగా తీసుకుంటున్న దళారులు పెట్టుబడికి సొమ్ములు ఇచ్చి పంటలు చేతికి అందిన తర్వాత కౌలు రైతుల నుంచి అధిక వడ్డీలు పేరు చెప్పి పంటలను తక్కువ ధరలకే కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కానరాని అవగాహన ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే రైతులకు, భూ యజమానులకు అవగాహనా సదస్సులు నిర్వహించాల్సి ఉంది. ఈ సదస్సులు నిర్వహించడంలోనూ కూట మి సర్కారు విఫలమైంది. క్షేత్రస్థాయిలో కౌలు కార్డులు మంజూరుకు రెవెన్యూ సిబ్బంది సైతం అందుబాటులో ఉండాల్సి ఉంది. అయితే వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమన్వయలోపం కారణంగా కౌలు కార్డులు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ‘కౌలు’కునేదెలా..? గుర్తింపు కార్డుల జారీలో తీవ్ర జాప్యం ప్రభుత్వ పథకాలకు కార్డు తప్పనిసరి జిల్లావ్యాప్తంగా 75 వేల కార్డుల జారీ లక్ష్యం సగం కూడా ఇవ్వని అధికారులు గతేడాది 65 వేల మందికి జారీ 2 లక్షల మంది వరకు కౌలు రైతులు జిల్లావ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వం 75 వేల మందికి కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించింది. అయితే కనీసం లక్ష్యాన్ని కూడా పూర్తి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడాలి. – కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కౌలు కార్డులు అందించాలి కౌలు రైతులకు తక్షణమే కౌలు రైతు గుర్తింపు కార్డులు అందించాలి. తద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా పనులు ఊపందుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్ధిక సహాయం అందలేదు. ప్రభుత్వం కౌలు రైతులను కూడా గుర్తించి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. –వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, కౌలు రైతు, పూళ్ల కార్డుల జారీలో అలసత్వం.. ఆంతర్యం ఏమిటో? గతేడాది జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే 65,147 మందికి కౌలు కార్డులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ 38,234 మందికి మాత్రమే ఇచ్చారు. అయితే కౌలు రైతుల గుర్తింపు కార్డుల లక్ష్యం 75 వేలుగా ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం సీజన్ ప్రారంభమై ఇప్పటికే వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికీ కౌలు కార్డులు జారీ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో కూటమి సర్కారుకే తెలియాలి. -
సర్ప సంరక్షణలో క్రాంతి కిరణం
●స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా సేవలు ●పాములపై ప్రజలకు అవగాహన జూలై 1.. జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోకి కోడెనాగు ప్రవేశించింది. సంతోష్ అనే కానిస్టేబుల్ కాళ్ల మధ్యలో నుంచి పాము కార్యాలయంలోనికి రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. విషయాన్ని స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు చదలవాడ క్రాంతికి సమాచారం అందించారు. వెంటనే క్రాంతి అక్కడికి వచ్చి ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో పోలీసు సిబ్బంది అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఫిబ్రవరి 17.. జంగారెడ్డిగూడెంలోని కిడ్స్ కాన్వెంట్లోకి ఏడడుగుల గోధుమ తాచు ప్రవేశించింది. పాఠశాల ఆవరణలోని చెట్టు మొదళ్లలో పాము కనిపించడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ సేవియల్ సొసైటీ వ్యవస్థాపకుడు చదలవాడ క్రాంతికి సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన ఇక్కడకు చేరుకుని చాకచక్యంగా గోధుమ తాచును పట్టుకున్నారు. అనంతరం సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. జంగారెడ్డిగూడెం : పాము కనపడగానే ఎవరికై నా వెన్నులో వణుకు పడుతుంది. దానిని చంపే యాలని చూస్తాం. అయితే ఆ యువకుడు చాక చక్యంగా దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలి వేస్తున్నాడు. పాము నుంచి మనిషికి, మనిషి నుంచి పాముకు రక్షణ కల్పించాలనే ఆలోచనతో స్నేక్ సేవియర్‌గా మారి సేవలందిస్తున్నాడు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి. 15 ఏళ్లుగా పాముల సంరక్షుడిగా ఉన్నాడు. 2016లో స్నేక్ సేవియర్ సొసైటీని స్థాపించి సర్పాల సంరక్షణతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. పేరంపేటకు చెందిన వ్యవసాయ కూలీలైన చదలవాడ రాజారావు, వెంకాయమ్మ కుమారుడు క్రాంతికి చిన్నతనం నుంచి ప్రకృతి, వన్యప్రాణులంటే ఇష్టం. చిన్నతనంలో పొలం పనులకు వెళ్లే సమయంలో పాము పిల్లలతో ఆడుకునేవాడు. తర్వాత కాలంలో పాములపై ఆసక్తి పెంచుకున్నా డు. పాములు పట్టడంలో కేరళలో శిక్షణ ఇస్తారని మిత్రుల ద్వారా తెలుసుకున్నాడు. 2009లో కేరళలోని కొట్టాయంలో పాములు పట్టడం, సంరక్షించడంలో వావా సురేష్ వద్ద 8 నెలల కఠోర శిక్షణ పొందాడు. తర్వాత విశాఖకు చెందిన రొక్కం కిరణ్‌కుమార్ వద్ద మరికొన్ని మెళకువలు నేర్చుకున్నాడు. 2010 నుంచి 2016 వరకు విశాఖలో ప్రజలకు సేవలు అందించాడు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లాకు తిరిగి వచ్చి 2016 డిసెంబర్ 31న స్నేక్ సేవియర్స్ సొసైటీ సంస్థను స్థాపించాడు. అప్పటినుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పాముల సంరక్షణకు కృషి చేస్తున్నాడు. 15 ఏళ్లు.. 19 వేలకు పైగా పాములు క్రాంతి పాములు, వన్య ప్రాణుల సంరక్షణలో 15 ఏళ్లుగా తన వంతు బాధ్యత పోషిస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 19 వేలకుపైగా పాములను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. అలాగే స్నేక్ సేవియర్ సంస్థ ద్వారా పా ముల సంరక్షణ, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50కి పైగా పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాడు. పాములు, వన్య ప్రాణులను రక్షించడం, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడమే స్నేక్ సేవియర్ సొసైటీ ముఖ్య ఉద్దేశమని క్రాంతి అంటున్నాడు. పాములకు హాని కలగకుండా చూడటమే తన లక్ష్యమని చెబుతున్నాడు. స్నేక్ కంట్రోల్ పౌడర్ విక్రయిస్తూ.. కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేసిన క్రాంతి లాభదాయకంగా లేక కౌలు సేద్యం మానివేశాడు. ప్రస్తుతం పొలం పనులకు వెళుతూ పార్ట్ టైమ్‌గా కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. పాములు పట్టుకున్నప్పుడు అభిమానంతో వారిచ్చే సొమ్ము కొంత ఇంటి నిర్వహణకు ఉపయోగపడుతుంది. అలాగే స్నేక్ కంట్రోల్ పౌడర్‌ను కిలో రూ.500కు విక్రయిస్తున్నాడు. ఇలా నెలకు 20 ప్యాకెట్ల వరకు అమ్ముతున్నాడు. ఈ పౌడర్ చల్లితే ఆ ప్రాంతంలోకి పా ములు రావని చెబుతున్నాడు. క్రాంతి తండ్రి రాజారావు ఇటీవల మృతిచెందారు. గోధుమ తాచు పాముతో.. -
బదిలీ చేశారు.. జీతాలు ఆపారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఇటీవల జరిగిన బదిలీల్లో స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీతాలు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలను ఆలస్యం చేస్తోందని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలను సాకుగా చూపి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అందక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పొజిషన్ ఐడీలు కేటాయించడంలో.. సాధారణంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని నిమిత్తం పొజిషన్ ఐడీలు కేటాయించాలి. గత నెల 15వ తేదీ లోపులో అన్ని క్యాడర్ల ఉపాధ్యా యుల బదిలీలను పూర్తి చేశారు. ఇది జరిగి నెల రోజులు దాటినా ఇప్పటికీ ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. దీంతో జూన్‌కు సంబంధించి జూలైలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు అందలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులకు విజ్ఞప్తులు చేసినా చలనం కలుగలేదు. ఇప్పటివరకూ ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంగ్త్ కూడా నిర్ధారించిన దాఖలాలు లేవని సంఘ నాయకులు అంటు న్నారు. ఈ కారణంగా వచ్చే నెల కూడా తమకు జీతాలు అందే సూచనలు కనిపించడం లేదని ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జీతాలందక పాట్లు సాధారణంగా జూన్‌లో ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి కోసం వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, అడ్వాన్సుల రూపంలో మరింత ఖర్చు పెరిగిందని, ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడం ఇబ్బంది కలిగిస్తోందని ఉపా ధ్యాయులు అంటున్నారు. 4,884 మందిపై ప్రభావం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో మొత్తం 4,884 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 76 మందికి, మో డల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,274 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,159 మందికి, లాంగ్వేజ్ పండితులు 42 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 33 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్ /ఒకేషనల్ ఉపాఽ ద్యాయులు 16 మందికి స్థాన చలనం కలిగింది. జీతాలు విడుదల కాకపోవడం వీరిపై పెను ప్రభావం చూపుతోంది. ఉపాధ్యాయులపై ఒత్తిడి పాఠశాల విద్యాశాఖ అధికారులు తాము చేయాల్సిన పనిని సక్రమంగా చేయకుండా ఉపాధ్యాయులను ఒత్తిడిలోకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు విరమించాలి. బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేయకుండా వారిపై యాప్‌ల అప్లోడ్ పేరిట భారం పెంచుతున్నారు. వెరీ అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ అంటూ మెసేజ్‌లు పెట్టడం తప్ప ఉపాధ్యాయుల జీతాలు అర్జెంట్ అనే విషయాన్ని మరచిపోతున్నారు. – తాళ్లూరి రామారావు, ఏపీటీఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు జీతాలు వెంటనే చెల్లించాలి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రాతిపదికగా ఇటీవల నిర్వహించిన బదిలీల్లో స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించే ఏర్పాటుచేయాలి. జీతాలు లేని కారణంగా సుమారు 5 వేల ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. జీతాలు రాక ఈఎంఐలు కట్టడానికి కూడా లేక డిఫాల్ట్ అవుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఆడుకోకుండా ఆదుకోవాలి. – గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొజిషన్ ఐడీలు కేటాయించడంలో అలసత్వం గురువులకు జీతాలు లేక అగచాట్లు 4,884 మంది ఉపాధ్యాయులపై ప్రభావం -
తాగునీటి కోసం నిరసన
పెనుగొండ: తాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ మహిళలు నిరసన బాట పట్టారు. పోడూరు మండలం కవిటంలో తాగునీరు లేక నానా అవస్థలు పడుతన్నామని శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో నరసాపురం రహదారిపై కవిటం బ్రిడ్జి వద్ద నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తాగునీరు రాక ఇబ్బంది పడుతున్నా అధికారులు ని మ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి కాలనీవాసులకు కనీసం ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. దీంతో పిల్లాపాపలతో దాహార్తితో అలమటిస్తున్నామ న్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. పాత పెన్షన్ అమలు చేయాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోందని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ప్రకటనలో తెలిపారు. దేశంలోని సుమారు 16 రాష్ట్రాలు ఇప్పటికే మెమో 57 ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరించాయన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా 2003లో ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలని సుధీర్ డిమాండ్ చేశారు. -
భూసేకరణ వేగవంతం చేయాలి
ఏలూరు(మెట్రో) : జిల్లాలో జాతీయ రహదారులకు భూసేకరణ వేగవంతం చేసి నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జాతీయ రహదారులు, ఇండస్ట్రీయల్ పార్కులకు భూసేకరణ, నిర్మాణాలు వేగవంతంపై అధికారులతో జేసీ పి.ధాత్రిరెడ్డితో కలిసి సమీక్షించారు. కై కలూరు బైపాస్ ఎనిమిది కిలోమీటర్ల పనులకు నాలుగు కిలోమీటర్లు పూర్తయ్యాయన్నారు. కోర్టు కేసుల పెండింగులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఎస్ఎఈ పార్కులకు.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ మేరకు నెలాఖరుకు భూసేకరణ పూర్తిచేయా లని కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా భూసేకరణ పనులను అడిగి తెలుసుకున్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బచ్చు స్వరణ్‌రాజ్, ఆర్డీఓ ఎంవీ రమణ, అధికారులు పాల్గొన్నారు. శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలపై.. జిల్లాలో పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో 258 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు మంజూరయ్యాయని, నిర్మాణాలు వేగవంతం చేయా లని కలెక్టర్ ఆదేశించారు. పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలు, ప్రగతిపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి సాధించాలి జిల్లాలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి ప్రగతి చూపాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గృహనిర్మాణ శాఖ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో గృహనిర్మాణ ప్రగతి తీరుపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. నేడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 19న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం–పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం అనే థీమ్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
గిరిజనులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
భీమవరం(ప్రకాశం చౌక్): గిరిజనులను కూటమి ప్రభుత్వం విస్మరించి, వారికి రిజర్వేషన్లు అమలు చేయడంలో అన్యాయం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవనంలో సాలా శ్రీను అధ్యక్షతన శుక్రవారం గిరిజన తెగల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వీరన్న మాట్లాడుతూ భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి గిరిజన మహిళకు రిజర్వేషన్ కాగా దీనిని మార్చి ఓసీ మహిళకు కేటాయించారన్నారు. గిరిజనులకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్, జేసీలకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎస్టీ వర్గాలు రాజకీయ పదవులకు అర్హులు కాదా అని ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ పదవితో పాటు శాసనమండలిలో కూడా గిరిజనులకు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ తీరు ఇలానే ఉంటే గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎస్టీ వర్గాలకు అన్యాయం వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జ్ గూడూరి ఉమాబాల మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అలాగే మహిళలకు 50 రిజర్వేషన్ అమలు చేసిన ఘనత మాజీ సీఎం జగన్‌కే దక్కిందన్నారు. ఈ రిజర్వేషన్లు మార్పులు చేసి కూటమి ప్రభుత్వం ఆయా వర్గాలకు అన్యాయం చేస్తోందన్నారు. ఎస్టీ వర్గాలు రాజకీయంగా చైతన్యం కావాలని వారికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. వైఎస్సార్సీపీ భీమవరం ఇన్చార్జ్ చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ భీమవరం ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్టీ మహిళకు కేటాయించి తదుపరి ఓసీ మహిళకు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమ న్నారు. ఎస్టీ వర్గాలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చులకన భావనకు ఇదే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు మేడిది జాన్సన్ మాట్లాడుతూ గిరిజనులకు అన్యాయం జరిగిందని, తాము అండగా ఉంటామన్నారు. పార్టీ నేత గంటా సుందర్‌కుమార్ మాట్లాడుతూ దళిత జేఏసీ తరఫున పూర్తి బాధ్యత తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భారతి విజయరాజు, ఎస్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కూతాడ పెద్ద సత్యనారాయణ, సాల వెంకటేశ్వరరావు, కారంపూడి అనంత నాగు, ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కూలబడిన అభివృద్ధి
సాక్షి ప్రతినిధి,ఏలూరు: మనబడి నాడు–నేడు పనులకు చంద్రబాబు సర్కారు గ్రహణం పట్టించింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పుల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు నేడు పథకాన్ని తీసుకువచ్చి బడుల రూపురేఖలు మార్చారు. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమం గతేడాది కొలువుదీరిన కూటమి సర్కారుకు మాత్రం రుచించలేదు. పర్యావసానంగా వందల కోట్లతో చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అలాగే కోట్లాది రూపాయలు విలువైన సిమెంట్ బస్తాలు గడ్డలు కట్టి నిరుపయోగంగా మారడం, ఐరన్ తుప్పు పట్టి స్క్రాబ్‌గా మిగిలిపోయింది. ఇలా జిల్లాలో సర్కారు నిర్లక్ష్యం ఖరీ దు రూ.100 కోట్ల పైగానే ఉంది. ఏడాదిగా.. నిరుపయోగంగా.. జిల్లాలో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మనబడి నాడు–నేడు పేరుతో ప్రభుత్వ బడులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. తొలివిడతగా రూ.280.44 కోట్లతో 1,117 స్కూళ్లను అభివృద్ధి చేశారు. పాఠశాలల్లో శ్లాబ్‌లు, ప్రహరీ గోడ నిర్మాణాలు, ఇతర నిర్మాణాలు, టాయిలెట్స్ అభివృద్ధి, మంచినీటి ప్లాంట్, ప్లేగ్రౌండ్ ఆధునికీకరణ, గ్రీన్ చాక్‌బోర్డులు, లైటింగ్, ప్రత్యేకంగా వాల్ పెయింట్స్ ఇలా కార్పొరేట్‌కు ధీటుగా సర్కారీ బడులను అభివృద్ధి చేశారు. మొదటి విడత పనులు విజయవంతంగా పూర్తి చేసుకుని 2022 చివరిలో రెండో విడత పనులకు ఆమోదం తెలిపి 2023లో పనులు ప్రారంభించారు. రెండో విడతలో 889 పాఠశాలల్లో రూ.294.54 కోట్లతో పనులు ప్రారంభించారు. మొత్తం రెండు విడతల్లో జిల్లాలో రూ.554.73 కోట్ల వ్యయంతో స్కూళ్లను అభివృద్ధి చేస్తే శాశ్వత రీతిలో పరిష్కారం ఉంటుందని గత ప్రభుత్వం యోచించింది. అయితే 2024లో ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటికే జిల్లాలో 889 స్కూళ్లలో అత్యధిక శాతం బడుల్లో రెండో విడత పనులు పునాది దశలోనే నిలిచిపోయాయి. ఎన్నికల ముగియడం, కూటమి సర్కారు కొలువు తీరడంతో సర్కారీ స్కూళ్లలో పనులు అసంపూర్ణంగా మా రాయి. రెండో విడతలో రూ.97.50 కోట్లు సిమెంట్, సుమారు రూ.30 కోట్లు ఐరన్, రూ.11.50 కోట్లు ఇసుకకు కేటాయింపులు జరిగాయి. 889 స్కూళ్లలో 30 శాతం పాఠశాలల్లో వందకు పైగా సిమెంట్ బస్తాలను అభివృద్ధి పనుల నిమిత్తం కొనుగోలు కూడా చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో ఆగిన పనులు ఏడాది దాటినా ఈ రోజుకూ ప్రారంభం కాలేదు. మరోవైపు ఏడాదిగా సిమెంట్ బస్తాలు పూర్తిగా గాలికి వదిలేయడంతో గడ్డ కట్టి నిరుపయోగంగా మారాయి. తరగతి గదుల్లోనే సిమెంట్ బస్తాలు జిల్లాలోని కొన్ని బడుల్లో నిరుపయోగంగా ఉన్న తరగతి గదుల్లో లేదంటే స్టాఫ్ రూమ్‌ల్లో సిమెంట్ బ స్తాలు గడ్డలు కట్టి మరీ దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకుండా మెటీరియల్‌ను పూర్తిగా పాడుచేశారు. ఉదాహరణకు పెదవేగి మండలంలోని రామచంద్రాపురం మండలపరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడి పక్క గదిలో సుమారు 100కుపైగా సిమెంట్ బస్తాలు గడ్డ కట్టి ఉన్నాయి. అలాగే పెదవేగి జిల్లాపరిషత్ హైస్కూల్, ఏలూరు రూరల్ మండలంలో మాదేపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్, కై క లూరు, నూజివీడు, చింతలపూడి ఇలా అన్ని నియోజకవర్గాల్లో పలు పాఠశాలల్లో కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన మెటీరియల్ నిరుపయోగంగా కొంత మారగా, మరికొంత పూర్తిగా పాడైపోయింది. మార్గదర్శకాలు రాలేదు జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో మనబడి, మన భవిష్యత్ పథకానికి సంబంఽధించిన సిమెంట్ బస్తాలు గడ్డకట్టినట్లు, ఐరన్ తుప్పుపట్టి పాడైనట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. ప్రభుత్వం నుంచి జిల్లాలో ఎన్ని పాఠశాలల్లో ఎన్ని సిమెంట్ బస్తాలు, ఎన్ని ఐరన్ ఊసలు పాడయ్యాయో సమగ్రంగా నివేదిక పంపాలని సూచించారు. ఈ మేరకు తగిన నివేదిక పంపించాం. అనంతరం ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు ఈ విషయంపై రాలేదు. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. –కె.పంకజ్ కుమార్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నాడు–నేడుకు ‘చంద్ర’గ్రహణం జిల్లాలోని బడుల్లో నిలిచిన రెండో విడత పనులు కేటాయించిన రూ.295 కోట్ల మాటేంటి? రూ.97.50 కోట్లతో సిమెంట్ బస్తాల కొనుగోలు 50 శాతానికిపైగా గడ్డ కట్టిన సిమెంట్ గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నాడు–నేడు పనులు -
రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు చెలరేగిపోతున్నాయని సీపీఐ జాతీ య కార్యవర్గ సభ్యురాలు, పార్టీ ఏలూరు జిల్లా ఇన్చార్జ్ అక్కినేని వనజ విమర్శించారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక అని చెప్పి ఇసుకను మాఫియాకు అప్పజెప్పి వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. విద్యుత్ అదనపు చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేశారని, లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని పిలుపునిచ్చారని, నేడు అదే లోకేష్, చంద్రబాబు స్మార్ట్ మీటర్లు బిగించేలా ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వచ్చేనెల విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. ఆగస్టు 23,24,25 తేదీల్లో ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిందేమీ లేదని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటి చెరువులో చేపలు మృతి
కాళ్ల: మండలంలోని కోలనపల్లి రక్షిత మంచినీటి సరఫరా చెరువులో చేపలు చనిపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత ఐదు రోజులుగా చెరువులో చేపలు చనిపోయి నీటిపై తేలటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నీరు కలుషితంగా మారి చేపలు చనిపోయాయా.. లేక ఆక్సిజన్న్ అందక చనిపోయాయా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇటీవల చెరువుకు నీరు నింపారని, దానివల్లే చేపలు ఇలా చనిపోతున్నాయా? అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన చేపల వల్ల వాసనతో చెరువు చుట్టూ ఉన్న కుటుంబాలతో పాటు రోడ్డుపై వెళ్ళే వారు ముక్కులు మూసుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. చెరువు గట్టు చుట్టూ మొలిచిన పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తుందని, విషసర్పాలకు ఆవాసంగా చెరువుగట్టు మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క గ్రామంలో మంచినీటి కోసం నానా అవస్దలు పడుతుంటే మరో పక్క ఇలా మంచినీటి చెరువులో చేపలు చనిపోవటంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఫణిని వివరణ కోరగా చెరువులో ఉన్న నీటిను వెంటనే పూర్తిస్థాయిలో బయటికి మళ్ళించి, కొత్తనీరు పెట్టాలని పంచాయతీ అధికారులకు సూచించామన్నారు. చెరువు గట్టు చుట్టూ ఉన్న చెత్త, చెదారాలు పూర్తిస్థాయిలో తొలగించాలని కార్యదర్శికి తెలిపామన్నారు. -
200 రోజులకు పెంచాలి
ఉపాధి హామీలో పనిదినాలు 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి. పని ప్రదేశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పనిముట్లు, మెడికల్ కిట్లు, మజ్జిగ, టెంట్, మంచినీరు వంటివి ఏర్పాటు చేయాలి. పనికి తగ్గ వేతనం సక్రమంగా ఇవ్వాలి. పీవీ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అప్పులు చేసి బతకాల్సి వస్తోంది మే నుంచి కూలి డబ్బులు అందలేదు. రోజువారీ కూలి పనులు చేస్తేనే మా కుటుంబ పోషణ గడిచేది. రెండు నెలలుగా ఉపాధి కూలీ డబ్బులు అందకపోవడంతో అప్పులు చేసి బతకాల్సి వస్తోంది. ఒక ప్రక్క వ్యవసాయ పనులు లేవు. మరో పక్క పూర్తి స్థాయిలో ఉపాధి పనులు కల్పించడం లేదు. బుద్దుల గంగాభవానీ, ఉపాధి కూలీ, టి.నర్సాపురం మూడు నెలలుగా డబ్బులు అందలేదు ఇప్పటికీ మూడు నెలలుగా ఉపాధి కూలీ సొమ్ములు అందలేదు. దీంతో పిల్లల చదువులు, కుటుంబ పోషణకు ఇబ్బంది ఏర్పడుతుంది. కుటుంబ జీవనం చాలా ఇబ్బందిగా తయారైంది. ఏడాదికి వంద రోజులు పనులు కల్పిస్తామని హామీ ఇచ్చినా క్షేత్ర స్థాయిలో దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికై నా పాలకులు దయతలచి వేతన బకాయిలను తక్షణం చెల్లించాలి. ఉడతా వెంకటేష్, ఉపాధి కూలీ, బుట్టాయగూడెం కనీస వేతనం ఇవ్వడం లేదు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రోజుకు రూ.307 చెల్లించాలనే నిబంధన ఉన్నా కొల్లేరు ప్రాంతంలోని ఉపాధి కూలీలకు రోజుకు రూ.150 నుంచి రూ.200 మాత్రమే ఉపాధి వేతనాలు చెల్లిస్తున్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రతి 15 రోజులుకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. చిన్నం మాధవ, వనదుర్రు, ముదినేపల్లి మండలం -
ఆటపాక కేంద్రంలో ఆహ్లాదం ఆవిరి
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామం ఆటపాక పక్షుల విహారం కేంద్రం కళావిహీనంగా మారింది. గత ఏడాది ఇదే రోజుల్లో పక్షుల విహార చెరువు నీటితో కళకళలాడింది. అధికారుల ముందస్తు ప్రణాళిక లోపించడంతో ఏటా చెరువు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల కొల్లేరు సమస్యలపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ) సభ్యులకు నీరు లేకుండా సహజ అందాలను కోల్పోయిన పక్షుల కేంద్రాన్ని చూపించారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో సుదూర ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు కేంద్రం సందర్శనకు వచ్చి బోటు షికారు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆటపాక పక్షుల విహార కేంద్రం రాష్ట్రంలోనే వినుతి కెక్కింది. ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో అరుదైన పెలికాన్ పక్షులు ఆటపాకకు రావడం, సంతానోత్పత్తి తర్వాత తిరిగి వెళ్ళడం క్రమం తప్పకుండా జరిగేది. దీంతో ఆటపాక పక్షుల కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలిచేవారు. పక్షుల కేంద్రంలో విహార చెరువు 286 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పక్షుల ఆవాసాలకు 158 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆటపాక పక్షుల కేంద్ర సందర్శననకు పెద్ద ఎత్తున పర్యాటకులు ఏటా విచ్చేస్తున్నారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యం ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువులో నీటిని నింపడం ఏటా అటవీ శాఖకు తలనొప్పిగా మారుతోంది. ఇక్కడ చెరువులో 6 అడుగులు నింపే కెపాసిటి ఉంది. సమీపంలోని పోల్‌రాజ్ డ్రైయిన్‌లో నీటని అటవీ శాఖ చెరువుకు ఏర్పాటు చేసిన తూములు తెరిచి నీటిని నింపుతారు. సాధారణంగా జూలై నెలలో పక్షుల విహార చెరువు పూర్తిగా నీటితో నిండుతుంది. అలాంటిది ఈ ఏడాది జూలై నెల ముగింపు దశకు వస్తున్నా కేవలం అడుగు నీరు మాత్రమే ఉంది. నీరు పూర్తి స్థాయిలో లేకపోవడంతో పక్షులు హాయిగా విహరించే అవకాశం లేదు. ఆటపాక గ్రామంలో పంట కాల్వలో నీరు పుష్పలంగా ఉంది. జాన్‌పేట సమీపం నుంచి బోదె ద్వారా కాల్వ నీటిని నింపుకునే అవకాశం ఉంది. పక్షుల కేంద్రం సమీపంలో ఆక్వా చెరువులలో నిండుగా నీరు ఉండటం, పక్షుల విహార చెరువులో మాత్రం నీరు లేకపోవడం బాధకరమని పలువురు వాపోతున్నారు. బోటు షికారు లేదు ఈ కేంద్రంలో బోటు షికారు ప్రత్యేకం.పెలికాన్, కొన్ని నెలలుగా బోట్లు మూలనపడ్డాయి. సందర్శకుల ప్రవేశం, బోటు షికారు రేట్లను పెంచారని అందుకు తగ్గట్లుగా మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. జూలై సగం గడిచినా నిండని విహార చెరువు నిరాశగా వెనుదిరుగుతున్న పర్యాటకులు వర్షాలు పడకపోవడం వల్లే.. ప్రతీ ఏటా విస్తార వర్షాల కారణంగా పోల్‌రాజ్ డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా వచ్చేది. ఆ సమయంలో పక్షుల దొడ్డి తూము తెరిచి నీటిని నింపుతాం. అలాంటిది పోల్రాజ్లో అనుకున్న నీరు రాలేదు. పక్షుల కేంద్రానికి విచ్చేసే పర్యాటకుల కోసం మరో కొత్త విహార బోటును తీసుకొస్తున్నాం. ఇప్పుటికే రెండు బోట్లు ఉన్నాయి. రహదారుల అభివృద్ది, ప్రత్యామ్నాయ నీటి వనరుల కోసం ప్రతిపాదనలు పంపాం. – ఎం.రంజిత్‌కుమార్, డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, కై కలూరు -
ఉపాధి వేతనాల కోసం ఎదురుచూపులు
ఏలూరు (టూటౌన్): ఉపాధి కూలీలకు నెలలు తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలలుగా వేతనాలు విడుదల కాలేదు. ఒక పక్క పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేకపోయినా కూలి డబ్బుల కోసం ఆశపడి పనిచేస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం పట్ల కూటమి ప్రభుత్వంపై ఉపాధి హామీ కూలీలు మండి పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ 15 రోజులకోసారి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించేవారని దానికి భిన్నంగా ప్రస్తుత కూటమి పాలకులు రెండు నెలలు దాటినా వేతనాలు చెల్లించకపోవడం పట్ల ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా 27 మండలాల పరిధిలో మొత్తం 3.77 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. కూలికి ఏడాదికి వంద రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉండగా జిల్లాలో సగటున ఒక్కో కూలీకి 46 రోజుల పనిదినాలనే కల్పించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు. కూలీలకు పే స్లిప్స్ ఇవ్వడం లేదు. రూ.50 కోట్ల బకాయిలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉపాది హామీ పథకంలో కూలీలకు గత మే 15 నుంచి ఇంతవరకు దాదాపు రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఏలూరు జిల్లాలో కూలీలకు రూ.50 కోట్ల వేతన బకాయిలు పేరుకుపోయాయి. మే, జూన్ నెలలకు సంబంధించి వేతన బకాయిలు మొత్తం రూ.50 కోట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ప్రస్తుత జూలై నెలకు సంబంధించిన బకాయి వేతనాలు మరో రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. పని ప్రదేశాలలో కనీస సౌకర్యాల కరవు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్లో భాగంగా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఇటు ఉపాధి కూలీలు, అటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాలలో నీడ కోసం టెంట్, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పనిముట్లు, మేట్లకు రూ.5 అదనపు పారితోషికం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పట్ల నిరంకుశంగా వ్యవహారిస్తున్నాయని వాటిని ఎదుర్కోవటం కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. రెండు నెలలుగా అందని వైనం ఏలూరు జిల్లాలో రూ.50 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు -
ఇది ప్రభుత్వ వైఫల్యమే
దెందులూరు: కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందకపోవడంతో నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి, కాట్లంపూడి, లింగారావుగూడెం గ్రామాల్లో బీటలు వారిన సాగు పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న సాగునీటిని కేఈ కెనాల్లోకి మళ్లించి కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలని కోరారు. ఇరిగేషన్ అధికారుల ప్రణాళికా లోపంతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోందని, ఇది ప్రభుత్వం, అధికారుల వైఫల్యమేనని విమర్శించారు. మరోవైపు పంట కాలువలు తూడు, గురప్రు డెక్క, నాచు, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయని చెప్పారు. వేసవికాలంలో తగిన విధంగా కాలువల బాగు చేసే పనులు చేపట్టలేదని చెప్పారు. గురప్రు డెక్కను తొలగించకుండా కలుపు మందు చల్లారని, ఈ నీటినే ఏలూరు రూరల్ మండలంలోని ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారని, అత్యంత ప్రమాదకర కలుపు మందులు చల్లడం దారుణమన్నారు. గురప్రు డెక్కను చంపేందుకు కలుపు మందు చల్లి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అన్నం రెడ్డి రంగారావు, సుంకర నరసింహారావు, వి.రామారావు, పి.భాస్కరరావు, టి.రంగారావు, బైరెడ్డి కష్ణారావు పలువురు రైతులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా సయ్యద్ బాజీ
ఉంగుటూరు: వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంగుటూరుకు చెందిన షేక్ సయ్యద్ బాజీని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబను సయ్యద్ బాజీ, మైనారిటీ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాజీ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 2000కు పైగా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి డిమాండ్ చేశారు. గత జనవరి నుంచి అన్ని మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు అప్రూవ్ కాకుండా అలాగే ఉన్నాయని, విద్యాశాఖకు సంబంధించిన దాదాపు 700 బిల్లులు పరిష్కారానికి నోచుకోకుండా పడి ఉన్నాయని, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి అన్నారు. ఉద్యోగుల పీఎఫ్ లోన్లు అప్లికేషన్ పెట్టిన తర్వాత 20 రోజులలోపు సీఎఫ్ఎంఎస్ లోనికి వెళ్ళేలా చూడాలని వారు కోరారు. వ్యక్తిపై దాడి కేసులో ఇద్దరి అరెస్టు ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ ప్రాంతంలో ఇటీవల ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి, నిర్మానుష్యప్రాంతానికి తీసుకువెళ్ళి దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఇద్దరు నిందితులను ఏలూరు రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కై కలూరు మండలం చింతలమూడు గ్రామానికి చెందిన సాదర్ల బ్రహ్మం హైదరాబాద్ నుంచి వస్తూ ఈనెల 13న తెల్లవారుజామున ఊరువెళ్లేందుకు వన్‌టౌన్ ప్రాంతం అజంతా సెంటర్లో వేచి ఉన్నాడు. ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్నారు. పోణంగి రోడ్డులో తమ్మిలేరు కాలువగట్టు ప్రాంతానికి తీసుకువెళ్ళి అతన్ని కొట్టి, రూ.5,500 నగదు, సెల్‌ఫోన్, బ్యాగు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో దాడికి పాల్పడిన ఏలూరు తూర్పువీధికి చెందిన ఆనంద్ నగేష్, జంపా పవన్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రైవేటు పాఠశాల బస్సు దగ్ధం
కుక్కునూరు: మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు దగ్ధమైన ఘటన గురువారం రాత్రి జరిగింది. మండలంలోని ప్రైవేటు పాఠశాల స్కూల్ బస్సులో విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చిన అనంతరం డ్రైవర్ గణపవరంలో బస్సు నిలిపి ఉంచాడు. రాత్రి 7 గంటల తరువాత బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో గ్రామస్తులు స్పందించి మంటలను ఆర్పివేశారు. మంటలు అంటుకోవడానికి షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. ఇదే ప్రమాదం విద్యార్థులు ఉన్నప్పుడు జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలు కాలం చెల్లిన వాహనాలకు రంగులు వేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. బస్సులకు అటెండర్లను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం గత వారం రోజుల క్రితం వరకు బస్సును వారి పేరు మీదకు మార్పు చేయకుండానే స్ప్రింగ్ లీఫ్ అనే తెలంగాణ అడ్రస్ తో ఉన్న బస్సును వినియోగించింది. ఇందుకు రవాణా శాఖ నిర్లక్ష్యమేనని పలువురు వాఖ్యానిస్తున్నారు. -
గంగానమ్మ.. చల్లగా చూడమ్మా
గంగానమ్మా.. చల్లగా చూడమ్మా.. అంటూ పెద్ద ఎత్తున మహిళా భక్తులు, హిజ్రాలు ఆషాఢం సారెతో గురువారం క్షేత్ర పురవీదుల్లో తిరుగాడారు. ముందుగా వారంతా శ్రీవారి పాదుకా మండపం వద్ద రకరకాల స్వీట్లు, పండ్లు, పూలు, చీరలు, పసుపు, కుంకుమ (సారె)ను ఉంచి పూజలు నిర్వహించారు. ఇందులో దేవస్థానం ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ సతీమణి హిజ్రాలకు పూల మాలలు వేసి, ఆశీర్వచనం పొందారు. అనంతరం మహిళలు, హిజ్రాలు సారెను శిరస్సుపై, భుజాలపై పెట్టుకుని క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. గంగానమ్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి సారె సమర్పించారు. – ద్వారకాతిరుమల -
తడవని మడి.. అన్నదాతల్లో అలజడి
జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పది రోజులపాటు వరద పోటెత్తింది. అయినా జిల్లాలో ఖరీఫ్ పంటలకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ ప్రణాళికారాహిత్యం, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వార్షిక మరమ్మతులు నిర్వహించాల్సిన డ్రెయిన్లను పట్టించుకోకపోవడం, కృష్ణా డెల్టాకు కావాల్సిన మేరకు నీటిని విడుదల చేయకపోవడం వెరసి జిల్లాలో సాగు కష్టాలు ఆదిలోనే మొదలయ్యాయి. వారం నుంచి వర్షాభావం, సాగునీరు అందకపోవడంతో రెండు నియోజకవర్గాల్లో నారుమడులు ఎండిపోతున్న పరిస్థితి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో 1,78,893 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగుతున్నట్టు అంచనా. ప్రధానంగా కృష్ణా ఆయకట్టు పరిధిలో పెదపాడు, ఏలూరు రూరల్, దెందులూరు మండలాల్లో మొత్తం 58 వేల ఎకరాలు సాగవుతుంది. దీనిలో ఏలూరు రూరల్ మండల పరిధిలో 15,500 ఎకరాలు, పెదపాడు మండలంలో 35,500 ఎకరాలు, దెందులూరు మండలంలో 7 వేల ఎకరాల వరకు సాగు భూములున్నాయి. ఏలూరు రూరల్ మండలంలో మాదేపల్లి, లింగారావుగూడెం, వెంకటాపురం, జాలిపూడి తదితర గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో వరి సాగు ఉండగా మిగిలింది చేపల చెరువులుగా ఉన్నాయి. పెదపాడు మండలంలో 25 వేల ఎకరాలు సాగు భూమి ఉండగా మిగతా విస్తీర్ణంలో చేపల చెరువులు విస్తరించాయి. దెందులూరు మండలంలోని సోమవరప్పాడు, దెందులూరు, సీతంపేట, కొమిరేపల్లి గ్రామాల్లో కృష్ణా కాల్వ పరిఽధిలో 7 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. వెరసి మూడు మండలాల్లో 37 వేల ఎకరాలు కృష్ణా ఆయకట్టు ద్వారా సాగవ్వాల్సి ఉంది. దెందులూరు మండలంలో 7 వేల ఎకరాలకు గోదావరి నీటిని వివిధ మా ర్గాల ద్వారా వినియోగించుకుంటున్నారు. 30 వేల ఎకరాలకు కృష్ణా నీరే దిక్కు ఏలూరు రూరల్ మండలంలో 10 వేల ఎకరాలకు, పెదపాడు మండలంలో 20 వేల ఎకరాలకు కృష్ణా కెనాల్ ద్వారా వచ్చే సాగునీరే ఆధారం. వర్షాలు విస్తారంగా పడినప్పుడు నారుమడులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అయితే గత కొన్నిరోజులుగా వేసవిని తలపించేలా ఎండలు తీవ్రంగా కాస్తుండటంతో ఈ ప్రాంతంలో పోసిన నారుమడులు పూర్తిగా ఎండిపోతున్నాయి. కృష్ణా కెనాల్ ద్వారా పూర్తిస్థాయిలో నీటి విడుదల లేకపోవడం, ఉన్న నీటిని ఆయా గ్రామాలకు అందించే పంట కాల్వలు నిర్వహణ లోపం కారణంగా పూర్తిగా కూరుకుపోయి ఉండటంతో సాగునీరు దిగువ గ్రామాల్లోని పంట పొలాలకు అందని దుస్థితి. తూడు తక్షణమే తొలగించాలి కృష్ణా కాలువలో ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు, వ్యర్థాలను తక్షణమే తొలగించాలి. ప్రతి ఏటా కాలువ పూడిక తీత పనులు చేపట్టేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో దిగువకు సాగు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా కెనాల్ ఆయకట్టు శివారు ప్రాంత రైతుల సమస్యను పరిష్కరించేలా యుద్ధప్రాతిపదికన కృష్ణా కాలువ పూడికతీత పనులు చేపట్టాలి. – బైరెడ్డి లక్ష్మణరావు, కౌలురైతు, సుంకరవారి తోట, ఏలూరు కాల్వలను ప్రక్షాళన చేయాలి కృష్ణా కాలువను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఆయకట్టు రైతుల పరిస్థితి ముంపునకు ముందు.. సాగుకు వెనుక అనే చందంగా ఉంది. ప్రతి వేసవిలో చేపట్టాల్సిన తాత్కాలిక పూడికతీత పనులు కూడా చేపట్టకపోవడంతో దిగువ ప్రాంతాలకు సాగు నీరు అందని పరిస్థితి తలెత్తింది. ఇకనైనా కాలువ పూడిక తీత పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి. అప్పుడే రైతులకు సాగు నీటి సమస్య తీరుతుంది. – గుత్తికొండ వెంకట కృష్ణారావు, రైతుసంఘం నాయకుడు కాల్వల నిర్వహణ లేకపోవడంతో.. ఏటా వేసవిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఆయా నీటి సంఘాల ద్వారా కాల్వల మరమ్మతుల పనులను చేయడం పరిపాటి. అయితే ఈ ఏడాది ఏలూరు రూరల్ మండల గ్రామాలకు సాగునీరందే మాదేపల్లి, జాలిపూడి పంట కాల్వలతో పాటు పెదపాడు మండలంలోని గ్రామాలకు సాగు, తాగునీరందే పంట కాల్వలను మరమ్మతులు చేపట్టకపోవడం ఈ రెండు మండలాల ప్రజలకు శాపంగా మారింది. దెందులూరు మండలంలోని ఆయకట్టు రైతులకు కృష్ణా కెనాల్ ద్వారా సాగునీరందించే విషయాన్ని ఇప్పటికే అధికారులు మరిచిపోయారు. ఈ మండలంలోని కృష్ణా ఆయకట్టు రైతులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గోదావరి కాల్వ, పోలవరం కాల్వల నీటిని వినియోగించుకోవడం ప్రారంభించారు. సాగు నీరుత్సాహం డెల్టాలో ఖరీఫ్ కష్టాలు నీరందక ఎండుతున్న నారుమడులు రెండు నియోజకవర్గాల్లో సమస్య తీవ్రం నెర్రలిస్తున్న పంట పొలాలు పూడుకుపోతున్న డ్రెయిన్లు -
లారీ ఢీకొని తాపీ కార్మికుడి మృతి
కలిదిండి (కై కలూరు): లారీ ఢీకొని తాపీ కార్మికుడు మృతి చెందిన ఘటన కలిదిండి మండలం గుర్వాయిపాలెం సమీప రామిరెడ్డినగర్ వద్ద గురువారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడుకు చెందిన అవురుగొట్టు సత్యబాబు(45) సైకిల్‌పై వచ్చి గుర్వాయిపాలెంలో తాపీ పని చేసి తిరిగి ఇంటికి వెళుతుండగా కలిదిండి వ్యవసాయ మార్కెట్ నుంచి బియ్యం బస్తాలతో ఆకివీడు రైల్వేస్టేషన్‌కు వెళుతున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సత్యబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మీ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
పశువుల పాల ఉత్పత్తిపై ప్రభావం
జంగారెడ్డిగూడెం: పశువులకు వచ్చే ముద్ద చర్మ వ్యాధి (లుంపీ స్కిన్ డిజీస్) పాల ఉత్పత్తిపై అధిక ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల చర్మంపై ముద్దలు, గడ్డలు ఏర్పడుతాయి. ఈ వ్యాధి వల్ల పశువులు చాలా ఇబ్బందులు పడతాయి. వీటి నివారణకు పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఏటా టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు. వ్యాధి లక్షణాలు ● పశువుల శరీరంపై చిన్న గడ్డలు, ముద్దలు ఏర్పడతాయి. ● అధిక జ్వరం వచ్చి, బలహీనంగా, అలసటగా కనిపిస్తాయి. ● ఆహారం తీసుకోకపోవడం లేదా తక్కువగా తీసుకుంటాయి. ● ఈ వ్యాధి సోకిన పశువులు తక్కువ పాలు ఇస్తాయి. వ్యాధి వ్యాప్తి, నివారణ ముద్ద చర్మ వ్యాధి వైరస్ దోమలు, ఇతర కీటకాల కారణంగా వ్యాపిస్తుంది. వ్యాధి ఉన్న పశువుల నుంచి ఇతర పశువులకు ఈ వ్యాధి వేగంగా వస్తుంది. గోట్ పాక్స్ వైరస్ వ్యాక్సిన్ వలన ఈ వ్యాధి నివారణ సాధ్యమవుతుంది. పశువులకు ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏటా వ్యాక్సిన్‌ను అందిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పశువుల నివాస ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి. ● వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుంచి వేరుగా ఉంచాలి. ● పశువులకు దోమల నుంచి రక్షణ కల్పించాలి. సమయానికి వ్యాక్సిన్ వేయించాలి ● ఏదైనా లక్షణాలు గమనిస్తే వెంటనే స్థానిక వెటర్నరీ వైద్యులను సంప్రదించాలి. పాడి – పంట జాగ్రత్తలతో వ్యాధిని నివారించవచ్చు ముద్ద చర్మ వ్యాధి పశువులకు ప్రమాదకరమైనది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని నివారించవచ్చు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న గోట్ పాక్స్ వైరస్ వ్యాక్సిన్ వినియోగిస్తే, ఈ వ్యాధి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. ప్రతి రైతు పశువైద్యాధికారుల సలహాలు పాటించి తమ పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. – బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి -
యువకుడి ఆత్మహత్య
దెందులూరు: సోమవరప్పాడులో లారీలు నిలుపు ప్రదేశంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన గొన్నాబత్తుల గణేష్ (38)కు పదేళ్ల కిత్రం వివాహం కాగా నాలుగేళ్ల కిత్రం మనస్పర్థల కారణంగా భార్య,భర్తలు విడాకులు తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా వేరే మహిళతో సహజీవనం చేస్తుండగా తరచూ ఆమెతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె దగ్గరికి వెళ్లి గొడవ పడుతుండగా కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై గణేష్ లారీ పై తాడుతో గురువారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మద్యానికి బానిసై.. పెంటపాడు: మద్యానికి బానిసై మతి స్థితిమతం లేని పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెంటపాడు ఏఎస్సై రాజేంద్ర, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం గ్రామానికి చెందిన జోగి వెంకట సత్యనారాయణ(45) గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మతి స్థిమితం కూడా తగ్గిపోయింది. గురువారం ఉదయం నిద్రనుండి లేచి బయటకు వచ్చి మరలా వెంటనే లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టుకొని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుం సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై స్వామి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మానవ అక్రమ రవాణాను నిరోధించాలి పాలకొల్లు సెంట్రల్: మనుషుల అక్రమ రవాణాను నిరోధించాలని సీడీపీవో సీహెచ్ ఇందిర అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ వారిచే మనుషుల అక్రమ రవాణాపై అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ప్రజ్వల కో–ఆర్డినేటర్ శ్రావ్య శృతి మాట్లాడుతూ అక్రమ రావాణాకు, లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా గత 28 ఏళ్లుగా పద్మశ్రీ డా.సునీతకృష్ణన్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల సమన్వయంతో 29,200 మంది అమ్మాయిలను, మహిళలను కాపాడి వారికి పునరావాసం కల్పించారన్నారు. సమస్య ఎదురైనపుడు 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. -
ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు గురువారం సాయంత్రం ఉపశమనం కలిగింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతగా ఉన్నా సాయంత్ర సమయానికి ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కొన్ని గంటల పాటు కురిసి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. అలాగే రోడ్లన్నీ వర్షం నీటితో జలమయంగా మారాయి. ప్రజలు సహకరించాలి ఏలూరు(మెట్రో): అక్రమ వ్యాపార కార్యకలాపాలను నిర్మూలించేందుకు వాణిజ్య పన్నుల శాఖకు ప్రజలు సహకరించాలని ఏలూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ బి.అర్జున్‌రెడ్డి కోరారు. జిల్లా ప్రజల కోసం వాట్సాప్ 8712631283 నంబర్‌ను అందు బాటులోకి తీసుకువచ్చామని, అక్రమ వ్యా పార కార్యకలాపాల వివరాలను ఈ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. జీఎన్టీ రోడ్డు రైల్వేగేటు మూసివేత ఏలూరు (టూటౌన్): ఏలూరు–దెందులూరు రైల్వేస్టేషన్ల మధ్య లెవిల్ క్రాసింగ్ నంబర్ 351 కి.మీ వద్ద అత్యవసర మరమ్మతులు పూర్తికానందున ఈనెల 20న సాయంత్రం 5 గంటల వరకు రైల్వేగేటు మూసివేస్తామని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్.లోకేష్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఏలూరు జీఎన్టీ రోడ్డు నుంచి నిమ్మకాయల మార్కెట్ యార్డుకు వెళ్లే దారిలో ప్రయాణించే వాహనచోదకులు ప్రత్యమ్నాయ రహదారి మీదుగా ప్రయాణించాలని కోరారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏ ర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. ఏపీ సచివాలయం నుంచి గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, అధికారులు హాజరయ్యారు. జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనలో కొన్ని గ్రామాల పనుల్లో స్థానిక అవసరాలను అనుసరించి మార్పులు చేసి ప్రతిపాదనలు రూపొందించామన్నారు. నేడు ఓపీఎస్ కోసం నిరసన ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ద్వారకాతిరుమల: డీ ఎస్సీ 2003 ఉపాధ్యాయులు, 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ విడుదలై సీపీఎస్ పరిధిలోని గ్రూప్ 2 ఉద్యోగులు, కానిస్టేబుళ్లకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏలూరులో నిరసన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని డీఎస్సీ 2003 టీచర్స్ ఫో రమ్ రాష్ట్ర కన్వీనర్ కట్టా శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్లు వి.జగదీష్, ఈ.శంకర్, బాలసుబ్రహ్మణ్యం, రమేష్, గోపాలకృష్ణ తదితరులు ఓ ప్రకటనలో కోరారు. సంపూర్ణ మద్దతు : ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఫ్యాప్టో ఏలూరు జిల్లా చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం. ఆదినారాయణ, ఫ్యాప్టో సభ్య సంఘాలు, ఇతర ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తెలిపారు. అలాగే ఉద్యమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొ ర్రా గోపిమూర్తి హాజరై ప్రత్యక్ష మద్దతు ఇవ్వ నున్నారు. ఏపీ యూటీఎఫ్ మద్దతు ఇస్తున్నట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కే ముస్తాఫా అలీ, ఆర్.రవికుమార్ తెలిపారు. -
పేరుకే ఉచితం.. దోపిడీ అధనం
ఇసుకాసురులు ● వరదల పేరుతో స్టాక్ పాయింట్లు ● గోదావరి చెంతనే లారీ ఇసుకకు రూ.9 వేలు వసూలు ● రవాణా ఖర్చులతో ధర మరింత అదనం ● దోపిడీ దారుణమంటున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ సాక్షి, భీమవరం: వరదల పేరిట కూటమి నేతలు దోపిడీకి తెరలేపారు. గోదావరి పక్కనే స్టాక్ పాయింట్‌ను ఏర్పాటుచేసి లారీకి రూ.9 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. రవాణా ఖర్చులతో వినియోగదారులకు చేరే సరికి ఈ ధర మరింత భారంగా మారుతోంది. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యంగా మారింది. వరదల సమయంలో కొరత రాకుండా జిల్లాలో స్టాక్ పాయింట్లు ఏర్పాటుకు ఏప్రిల్‌లో జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఐదు లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయాలన్నది లక్ష్యం. జిల్లా అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల ఓపెన్ రీచ్ నుంచి ఇసుక తరలింపు చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున స్టాక్ పాయింట్ ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించారు. లక్ష్యం మేరకు ఒక్కో స్టాక్ యార్డు వద్ద 70 వేల టన్నుల ఇసుకను నిల్వ చేయాలి. కాగా జిల్లా అంతటా కలిపి కేవలం 1.20 లక్షల టన్నులు మాత్రమే స్టాకు పెట్టడం గమనార్హం. వీటిలో ఆచంట స్టాక్ పాయింట్లో 20,100 టన్నులు పెట్టగా, భీమవరంలో 6,240, నరసాపురంలో 2,450, పాలకొల్లులో 19,555, తాడేపల్లిగూడెంలో 35,180, తణుకులో 7,878, ఉండిలో 28,990 టన్నులు నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఇసుక ర్యాంపు నుంచి స్టాక్ పాయింట్‌కు దూరాన్ని బట్టి ఒక్కో టన్నుకు రూ.306 నుంచి రూ.581 ధరగా నిర్ణయించారు. కాగా ఈ స్టాక్ పాయింట్లలో అమ్మకాలు మొదలు కావాల్సి ఉంది. సిద్ధాంతంలో అనుమతులున్నాయా ? సిద్ధాంతం వశిష్ట గోదావరి వంతెన దిగువన హైవేను ఆనుకుని భారీ మొత్తంలో నిల్వలతో స్టాక్ పాయింట్‌ను ఏర్పాటుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన ముఖ్య నేత ఈ స్టాక్ పాయింట్ నిర్వహణను చూస్తున్నట్టు తెలిసింది. పక్కనే కిలోమీటరు దూరంలో సీఆర్‌జెడ్ పరిధిలోని నడిపూడితో పాటు పక్కనే తూర్పుగోదావరి జిల్లా కడింపాడు ర్యాంపు నుంచి లారీకి రూ.1,500 నుంచి రూ.2 వేల కిరాయిలపై ఇక్కడికి ఇసుకను తరలించినట్టు సమాచారం. ఇక్కడ స్టాక్ పాయింట్ ఏర్పాటుకు రెవెన్యూ, మైన్స్ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసినట్టు అధికారి ఒకరు తెలిపారు. ఉన్నత స్థాయి నుంచి అనుమతులు వచ్చిందీ లేనిది ఇంకా తమ దృష్టికి రాలేదన్నారు. కాగా బుధవారం నుంచి ఇక్కడ అమ్మకాలను ప్రారంభించారు. 21 టన్నుల లారీకి రూ.9 వేలు వసూలు చేస్తున్నట్టు లారీ అసోసియేషన్ నాయ కులు చెబుతున్నారు. గోదావరికి కిలోమీటరు దూ రం నుంచి ఇసుక తెచ్చి స్టాకు పెట్టి అమ్మకాలు చేస్తున్నారని, లారీ ఇసుకకు రూ.3 వేలు కూడా ఖర్చుకాదని చెబుతున్నారు. గతంలో ఇక్కడి కడింపాడు ర్యాంపు నుంచి రూ.5 వేలకు లోడింగ్ చేస్తే ఇప్పుడు స్టాకు పాయింట్ పేరిట అదనంగా రూ.4 వేలు వసూలు చేస్తున్నారని, ఈ భారం వినియోగదారులపై పడుతోందని అంటున్నారు. మూతపడిన ర్యాంపులు ర్యాంపుల్లోకి నీరు చేరి జూలై ప్రారంభంలోనే దాదాపు మూతపడ్డాయి. వరద నీరు తగ్గి మరలా ర్యాంపులు తెరిచేందుకు మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు జిల్లా అవసరాలకు ఈ నిల్వలు ఏ మేరకు సరిపోతా యోనేది వేచిచూడాలి. ఇదిలా ఉండగా వరదల వేళ ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు సొంత అవసరాల పేరిట ఆచంట, పెనుగొండ, పోడూరు, యలమంచిలి తదితర మండలాల్లో కూటమి నేతలు భారీ ఎత్తున ఇసుక నిల్వలు పెట్టారు. వీటిలో ఏ స్టాకు పాయింట్లకు అనుమతులు ఉన్నాయి?, వేటికి లేవో? తెలియని పరిస్థితి. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.82 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 30 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,82,31,619 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 202 గ్రాముల బంగారం, 5.546 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రదైన పాత రూ. 2000, రూ.500 నోట్లు ద్వారా రూ.35,500 లభించినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.88.69 లక్షలు భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మవారి ఆలయంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను గురువారం లెక్కించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. 114 రోజుల కాలానికి మొత్తం ఆదాయం రూ.88,69,425, బంగారం 92.500 గ్రాములు, వెండి 623.500 గ్రాములు, పలు దేశాల విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, దేవదాయశాఖ అధికారి వి.హరిసూర్యప్రకాశ్, శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానం యనమదుర్రు ఈఓ దండు కృష్ణంరాజు, కొణితివాడ గ్రూప్ టెంపుల్స్ ఈఓ కర్రి శ్రీనివాస్, కరూర్ వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. క్షీరారామలింగేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.13 లక్షలు పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి హుండీ ఆదాయం రూ.13,31,554 వచ్చింది. గురువారం దేవదాయ శాఖ తనిఖీ అధికారి వి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హుండీలను లెక్కించారు. మూడు నెలల 28 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు సేవా వలంటీర్స్, భాగ్యలక్ష్మి సేవా సభ్యులు, రెవెన్యూ, పోలీసు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, ఆలయ సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, సీనియర్ అసిస్టెంట్ గాంధీ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వెలవెలబోతున్న ఎర్ర కాల్వ
చింతలపూడి : ఈ ఏడాది మెట్ట ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎర్ర కాల్వ వెలవెలబోతోంది. చింతలపూడి మండలం శెట్టివారిగూడెం వద్ద మేడవరపు చెరువు అలుగు నీరు ప్రవహించేదే ఎర్రకాల్వ. ఇక్కడి నుంచి సుమారు 21 కి.మీటర్లు ప్రవహించి ఎర్రకాల్వ ప్రాజెక్టులో కలుస్తుంది. సుమారు 350 ఎరకాల విస్తీర్ణం కలిగి ఉన్న మేడవరపు చెరువు కింద సుమారు 2 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. ఒకప్పుడు ఎర్రకాల్వ అంటే పొలాలను ముంపునకు గురిచేసే మహమ్మారి అని రైతులంతా భయపడేవారు. 1998లో అప్పటి రాష్ట్ర మంత్రి కోటగిరి విద్యాధరరావు సుమారు రూ.4.11 కోట్ల నిధులు మంజూరు చేయించి కాల్వను 17.5 కి.మీటర్లు అభివద్ధి చేశారు. అప్పటి నుంచి రైతులకు ముంపు బాధ తప్పింది. రానురాను మెట్ట ప్రాంతంలో వర్షాభావ పరిస్ధితుల కారణంగా ఎర్రకాల్వ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మినీ ప్రాజెక్టుగా మార్చాలని డిమాండ్ మేడవరపు చెరువును అభివృద్ధి చేసి మినీ ప్రాజెక్టుగా మార్చాలని ఇక్కడి రైతులు ఎప్పటినుంచో కోరుతున్నారు. వరదల సమయంలో ఎర్రకాల్వ నీరు కిందికి ప్రవహించి ఇక్కడి రైతులకు ఉపయోగపడటం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం చెక్ డ్యామ్‌లు కట్టినా భూగర్భ జలాలు పెరిగి మెట్ట ప్రాంతానికి కొంతవరకు ఉపయోగం ఉంటుందని అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎర్రకాల్వకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరద నీరు వృథాగా కిందకు పోయింది. వచ్చే వేసవిలో నైనా చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అలాగే మేడవరపు చెరువు ఆక్రమణలు తొలగించి చెరువును అభివృద్ధి చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేడవరపు చెరువును అభివృద్ధి చేయాలి ప్రభుత్వం మేడవరపు చెరువు పూడికను తొలగించి అభివృద్ధి చేయాలి. ఎర్రకాల్వ నీరు కిందికి పోకుండా ఎక్కడికక్కడ చెక్‌డ్యాంలు నిర్మించాలి. కాల్వ నీరు రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఎర్ర కాల్వ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. – చేపూరి ఖాదర్‌బాబు, రైతు, వైఎస్సార్ సీపీ నాయకులు, శెట్టివారిగూడెం -
25 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిఽధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా తేనెటీగల పెంపకంపై ఈ నెల 25, 29, 31 తేదీల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీకే సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి తెలిపారు. అంతరించిపోతున్న తేనెటీగలను రక్షించుకోడానికి, కుటీర పరిశ్రమ ద్వారా లాభాలను పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక ఎకరాకు ప్రారంభంలో రూ.20 నుంచి రూ.25 వేల పెట్టుబడితో మొదలు పెట్టి రెండు మూడు రెట్లు ఆదాయం తేనెద్వారా. పుప్పొడి, ఇతర ఉత్పత్తులు మైనం, విషం ద్వారా పొందవచ్చునన్నారు. ఆసక్తి కలిగిన వారు ఎనిమిది ఫేమ్‌లు కలిగిన పెట్టె కోసం రూ.5500, ఐదు ఫేమ్‌లు ఉన్న పెట్టెల కోసం రూ.4500 ధరతో కేవీకేలో సిద్ధంగా ఉంచామన్నారు. వివరాల కోసం 73826 33692, 94905 05926 నంబర్లలో సంప్రదించాలన్నారు. 20న బాస్కెట్‌బాల్ బాలికల జట్టు ఎంపిక ఏలూరు రూరల్: ఈ నెల 20వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జూనియర్ స్థాయి బాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె కృష్ణారెడ్డి, కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు కస్తూరిభా బాలికల పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణిలు 2007 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఎంపికై న జట్టు ఆగస్టు 14 నుంచి 17 వరకూ పిఠాపురంలో జరిగే అంతర జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటుందని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారిణులు ఒరిజినల్ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు అసోసియేషన్ ట్రెజరర్ కె మురళీకృష్ణ 94411 71933 నంబర్లో సంప్రదించాలని సూచించారు. 2.8 కిలోల గంజాయి స్వాధీనం భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని గునుపూడి రైల్వే అండర్ పాస్ వద్ద మంచినీటి సర్వీసు రిజర్వాయరు సమీపంలో రూ.60 వేలు విలువైన 2.862 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో గంజాయి కలిగి ఉన్న నిందితులు నాయక్ కరుణాకర్, నీలపు దుర్గాప్రసాద్, గాడిన ప్రభుకుమార్, జెండా నాగరాజును మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ ఎం.నాగరాజు పర్యవేక్షణలో ఎస్సై కృష్ణాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో మృతదేహం లభ్యం
గుంటూరు వాసిగా గుర్తింపు ఉంగుటూరు: ఉంగుటూరులోని ఏలూరు కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు గుంటూరుకు చెందిన గుంజి దుర్గనారాయణ (42)గా పోలీసులు గుర్తించారు. మద్యం సేవిస్తూ మతి స్థిమితం లేనట్లుగా తిరుగుతుంటాడని, ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని, అతడి కాలికి పోలియో ఉందని చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. నాలుగురోజులు క్రితం గూడెం ప్రాంతంలో కాలువలో పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అతని జేబులో ఉన్న వివరాల ప్రకారం సమాచారాన్ని బంధువులకు తెలియజేసినట్లు ఎస్సై చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తాడేపల్లిగూడెం మ్యాచురీలో భద్రపరిచారు. పాము కాటుకు వ్యక్తి మృతి యలమంచిలి: మండలంలోని పెదలంక గ్రామానికి చెందిన గెద్దాడ నాగేశ్వరరావు (57) పాముకాటుకు గురై మరణించినట్లు హెడ్ కానిస్టేబుల్ ఈతకోట సత్యనారాయణ తెలిపారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే నాగేశ్వరరావు గురువారం పశువులకు గడ్డి కోస్తుండగా పాముకాటు వేసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుమారుడు నాగ శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు పాలకొల్లు సెంట్రల్: ఉల్లంపర్రు గ్రామంలోని సత్యసాయి కాలనీకి చెందిన యువతి అదృశ్యంపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆమె సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఎస్సై బి సురేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో బాలింత మృతి
పాలకొల్లు సెంట్రల్: మోటార్‌సైకిల్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలింత దుర్మరణం పాలైంది. వివరాల ప్రకారం అప్పనచెర్వు రామచంద్రరావు పేటకు చెందిన ఎం నందిని మూడు నెలల బాలింత (25). శిశువును ఇంటి వద్దే ఉంచి భర్త రత్నరాజు, పెద్ద కుమారుడితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం మోటార్‌సైకిల్‌పై పాలకొల్లులో ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పెనుమదం రోడ్డులో ఎస్ఆర్ఆర్ పేట ప్రాంతానికి వచ్చే సరికి ఓ కారు వీరి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందిని మృతి చెందగా రత్నరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. బాబు పక్కనే ఉన్న తుప్పల్లో పడడంతో స్వల్పగాయాలతో సురక్షితంగా ఉన్నాడు. రత్నరాజు ఫిర్యాదు మేరకు పోడూరు ఎస్సై కె సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందిని మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఉంచారు. -
ఆక్వాకు వాతావరణ గండం
కై కలూరు: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది ఉమ్మడి జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆ ప్రభావం చేపల, రొయ్యల పరిశ్రమపై పడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చి వర్షాలు కురుస్తుండంతో ఆక్వా రైతులు సంతోషించారు. ఇది ఎంతో కాలం నిలవలేదు. జూలై నెలలో ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆక్వా సాగుకు దినదిన గండంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఆక్వాసాగు విస్తీర్ణం 2.90 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఇందులో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఏలూరు, కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఆకివీడు, నరసాపురం నియోజకవర్గాల్లో ఆక్వా సాగు ఎక్కువుగా చేస్తున్నారు. రొయ్యల, చేపల పెరుగుదల 28, 30 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర బాగుంటుంది. మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుతున్నాయి. బుధవారం కై కలూరులో 36 డిగ్రీలు, భీమవరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటిలో ప్రాణవాయువు కరిగే శక్తి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల చెరువుల్లో నీటి లెవల్స్ 3 అంతస్తులుగా వేరుపడతాయి. దీనివల్ల చెరువు పైపొరల్లో డీవో ఎక్కువగా, అడుగు పొరల్లో డీవో తక్కువుగా వుంటూ చేపలు, రొయ్యలకు ఇబ్బంది కలిగిస్తుంది. చెరువు నీటిలో అవసరమైన, హానికరమైన శైవలాలు కూడా ఏర్పడతాయి. అధిక శైవలాల వల్ల నీటి పీహెచ్ పెరిగిపోతుంది. నీటి ఉష్ణోగ్రత పీహెచ్ అధికంగా ఉన్నప్పుడు అమ్మోనియా స్థాయి పెరిగి రొయ్యలు, చేపలకు ఒత్తిడి కలిగించి వ్యాధులకు దారితీస్తుంది. ఎక్కువగా చిరు చేపలు, రొయ్యలు అధిక నీటి గుణాల తారతమ్యాలను తట్టుకోలేవు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రైతులు విలవిల -
పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి పట్టదా?
ఏలూరు(టూటౌన్): కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు– కై కలూరు రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎండిన వరి నారు మట్టి గడ్డలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు నీరు అందించి పంటలు కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు రూరల్ ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పోర్స్ మోహరించినా రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక నారుమళ్ళు, నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నా ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రణాళిక లేకుండా కనీస ముందు చూపు లేకుండా ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని ఎద్దేవా చేశారు. ఏలూరు రూరల్ మండలంలో పదివేల ఎకరాలు పైగా సాగునీరు అందడం లేదని చెప్పారు. ప్రజాప్రతినిధులు మిమ్మల్ని నారుమళ్ళు ఎవరు వేయమన్నారు అంటూ రైతులు, కౌలు రైతులపై బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. మాదేపల్లి చానల్ కాలువ గురప్రు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిందని చెప్పారు. గురప్రు డెక్క తొలగించకుండా, కలుపు మందు చల్లడం వలన ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు పదివేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారని చెప్పారు. ఇప్పటికై నా కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలని లేని పక్షంలో రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు–కై కలూరు రహదారి దిగ్బంధం -
కలిసిరాని పొగాకు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పొగాకు సాగు ఈ ఏడాది కలిసి రాలేదు. ఈ ఏడాది సగటున కిలో పొగాకుకు సగటున రూ.280 ధర లభించింది. పంట పెట్టుబడులు, బ్యారన్, కౌలు ధరలు పెరగడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం 1, 2, కొయ్యలగూడెం, తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలోని 73,758.52 ఎకరాల్లో పొగాకు పండించారు. వేలం కేంద్రాల వారీగా నమోదైన రైతులు, బ్యారన్ల సంఖ్య, మార్కెట్ డిమాండ్‌ను ప్రామాణికంగా తీసుకుని వేలం కేంద్రాల వారీగా సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలోనే పొగాకు బోర్డు 65,771.37 ఎకరాలను సాగు విస్తీర్ణంగా నిర్దేశించి.. 61.20 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. అయితే.. 12,875 మంది రైతులు 14,978.84 బ్యారన్లను రిజిస్టర్ చేశారు. దీనికిగాను 80.72 మిలియన్ కేజీల దిగుబడి వచ్చింది. నిర్దేశించిన లక్ష్యం కంటే 7,987 ఎకరాల్లో అనధికారికంగా సాగు చేయడంతో 19.52 మిలియన్ కిలోల అదనపు దిగుబడి వచ్చింది. అధిక సాగుతో రైతులకు కష్టాలు ఈ ఏడాది మార్చిలో వేలం కేంద్రాలను తెరిచి పొగాకు కొనుగోళ్లు మొదలుపెట్టారు. అధిక విస్తీర్ణంలో సాగు చేయడంతో దిగుబడులు పెరిగి డిమాండ్ తగ్గింది. ఫలితంగా రైతులు పండించిన పొగాకు అమ్ముడుపోక కష్టాలు మొదలయ్యాయి. గతేడాది అత్యధికంగా కిలో రూ.411 ధర పలకగా.. సీజన్ మొత్తం సరాసరి ధర రూ.323గా నమోదైంది. అయితే ఈ ఏడాది సరాసరి ధర సగటున ఇప్పటివరకు రూ.280గా ఉంది. కేజీకి రూ.50 మించి రూ.70కి పైగా తక్కువతో సీజన్ ప్రారంభమైంది. 80 మిలియన్ కేజీల ఉత్పత్తికిగాను ఇప్పటివరకు 30 మిలియన్ కేజీల కొనుగోళ్లు పూర్తయ్యాయి. ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు ధర దక్కక నష్టాల పాలవుతున్నారు. గతేడాది మంచి ధరలు ఉండటంతో పెరిగిన సాగు విస్తీర్ణం 7,987 ఎకరాల్లో అనధికారిక సాగు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 69 వేల ఎకరాల్లో పొగాకు సాగు భారీగా పతనమైన ధరలతో రైతులు కుదేలు -
న్యాయ సేవలపై అవగాహన కల్పించాలి
ఏలూరు (టూటౌన్): న్యాయ సేవలపై అవగాహన కల్పించడంలో ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బుధవారం బైక్ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై ప్రజలను అవగాహన కలిగిస్తున్నామని, బుధవారం కోర్టు ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మధ్యవర్తిత్వం వల్ల సత్వర ప్రయోజనం సమకూరుతుందని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థల ఉచిత న్యాయ సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాస మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులికృష్ణ, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.రఘునాథ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, ప్రభుత్వ న్యాయవాది బి.జె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్‌స్టేషన్ ఎదుట గిరిజనుల ఆందోళనబుట్టాయగూడెం: అకారణంగా ఒక గిరిజనుడిని కొట్టడం వల్ల స్పృహ కోల్పోయాడని ఆగ్రహిస్తూ గిరిజనులు బుధవారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట బైటాయించి ఆందోళనకు దిగారు. గిరిజనులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరన్నపాలెంకు చెందిన మహేంద్ర, ఓ యువతి ప్రేమించుకుని కొద్దిరోజుల క్రితం ఇళ్లు విడిచి వెళ్లిపోయారన్నారు. అయితే పోలీసులు మహేంద్ర ఆచూకీ చెప్పాలంటూ అతడి తండ్రి లక్ష్మణుడును విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తీసుకు వచ్చారన్నారు. మహేంద్ర ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ లక్ష్మణుడును పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి స్టేషన్ బయట వదిలేశారని ఆరోపించారు. ఆ సమయంలో లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడన్నారు. లక్ష్మణుడును కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్‌స్టేషన్ ఎదుట రాత్రి గిరిజనులు ఆందోళనకు దిగారు. చివరకు సీఐ హామీతో ఆందోళన విరమించారు.18న డీఎస్సీ–2003 ఉపాధ్యాయుల నిరసన భీమవరం: డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు మెమో–57 అమలుచేస్తూ ఓపీఎస్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 18న ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎస్సీ –2003 ఉపాధ్యాయుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సూర్యప్రకాష్, బుధవారం ఒక ప్రకటన లో కోరారు. కేంద్రం ప్రకటించిన మెమోను అమలుచేయాలని కోరారు. -
మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం
దెందులూరు: మాదక ద్రవ్యాలను వినియోగిస్తే విద్యార్థుల భవిష్యత్తు శూన్యమవుతుందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఈగల్ టీం ఐజీ రవికృష్ణ అన్నారు. బుధవారం ఏలూరు ఆశ్రమం వైద్యశాలలో ఐజీలు అశోక్ కుమార్, రవికృష్ణ, జిల్లా ఎస్పీ కే.ప్రతాప్ కిషోర్ సమన్వయంతో మాదకద్రవ్యాల వినియోగం అనర్ధాలపై మెగా అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల అనర్థాలను వివరించారు. ఏలూరు ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని ఆశ్రం హాస్పిటల్లో నిర్వహించడం విద్యార్థులకు అవగాహన కలిగించడం మంచి కార్యక్రమమన్నారు. ఈగల్ ఎస్పీ నగేష్ మాట్లాడుతూ ఉన్నత విద్యభ్యసించేవారు ఎక్కువగా మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ రతీదేవి, ఆశ్రం హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాసరావు, సీఈఓ హనుమంతరావు, డీఎస్పీ డీ.శ్రావణ్ కుమార్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ధనరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
వర్జీనియా రైతును ఆదుకోవాలి
వర్జీనియా పొగాకు రైతులను ఆదుకోవాలి. కౌలు ధరలు, ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో రైతులకు నష్టం వస్తోంది. గత ఏడాది మాదిరిగా రూ.300 పైబడి సరాసరి ధర వస్తే వర్జీనియా రైతు గట్టెక్కుతాడు. లేకుంటే అప్పుల తిప్పలు తప్పవు. – ఘంటశాల గాంధీ, రైతు సంఘం నాయకుడు లో–గ్రేడ్‌కు మంచి ధర రావాలి లో–గ్రేడ్, మీడియం గ్రేడ్‌కు మంచి ధర ఇవ్వాలి. లో–గ్రేడ్‌ను కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతు నష్టపోతున్నాడు. సరాసరి ధర మంచిగా లేకపోతే వర్జీనియా రైతు నష్టాల్లో కూరుకుపోతాడు. అప్పుల నుంచి బయటపడాలంటే గత ఏడాది సమీపానికై నా ధరలు ఉండాలి. – వామిశెట్టి హరిబాబు, రైతు సంఘం నాయకుడు ● -
ఆర్థిక అసమానతలు తొలగించడమే పీ4 లక్ష్యం
ఏలూరు(మెట్రో): సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే పీ4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పీ4 కార్యక్రమం ఉద్దేశాలను తెలిపి, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో 10 శాతంగా ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20 మంది నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూత నివ్వడమే పీ4 లక్ష్యమన్నారు. జిల్లాలో 95 వేల మంది బంగారు కుటుంబాలను గుర్తించామని, వారిలో ఇంతవరకు 5,181 కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారన్నారు. బంగారు కుటుంబాలలో సమస్యలు తెలుసుకుని, ఆయా కుటుంబాలలోని పిల్లలకు విద్య, వారి జీవనోపాధికి అవసరమైన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆ కుటుంబం అభివృద్ధి వైపు అడుగులు వేసేలా మార్గదర్శి చేయూత అందిస్తారన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పీ4 కార్యక్రమంలో సర్వే నిర్వహించి 99,905 బంగారు కుటుంబాలను గుర్తించామని, ఇంతవరకు 5181 కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. పీ–4 మార్గదర్శకుల గుర్తింపుపై అవగాహన పీ4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల గుర్తింపు, బంగారు కుటుంబాల అనుసంధానం అంశంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పీ4 సర్వే విజన్ టీం సభ్యులతో శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 547 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. సర్వేలు జరపాలని అలాగే గ్రామ సభలు నిర్వహించి, పూర్తి వివరాలు యాప్‌లో అప్లోడ్ చేసి పూర్తి స్థాయి నివేదికలు జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. -
నీరందక రైతుల కన్నీరు
దెందులూరు: సాగునీరు అందక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని, కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఎండిపోతున్న వరి నారుమడిలో బీటలు వారిన వరి మట్టిగడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతులు జిల్లెల్లమూడి ప్రసాదరావు, చిన్ని పోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ అప్పులు తీసుకువచ్చి నారుమళ్లు, నాట్లు వేసిన వరిచేలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏలూరు రూరల్ మండలం కృష్ణా డెల్టా పరిధిలోని వెంకటాపురం, మాదేపల్లి, జాలిపూడి, చాటపర్రు, పోణంగి, కొమడవోలు, కాట్లంపూడి తదితర గ్రామాలలో వేలాది ఎకరాల కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందడం లేదన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేశామని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా శివారు ప్రాంత భూములకు ఎందుకు సాగునీరు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కృష్ణా మెయిన్ కెనాల్ నుంచి జాలిపూడి, మాదేపల్లి వైపు వెళ్లే ప్రధాన పంట కాలువ గురప్రు డెక్క,తూడు, తుక్కు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిందని కనీసం కాలువలు బాగు చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పంట కాలువలు బాగు చేస్తామని హడావుడి చేశారే తప్ప బాగు చేసింది ఏమీ లేదన్నారు. ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడి చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. స్పందన రాకపోతే 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఏలూరు కై కలూరు రోడ్డును దిగ్బంధించాలని నిర్ణయించారు. ఏలూరు– కై కలూరు రోడ్డును దిగ్బంధిస్తామని హెచ్చరిక -
గిట్టుబాటు ధర కోసం పోరాటం
జంగారెడ్డిగూడెం: వర్జీనియా రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కోసం పోరాటం చేద్దామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారని వైఎస్సార్సీపీ నాయకుడు ఘంటశాల గాంధీ అన్నారు. మంగళవారం వర్జీనియా పొగాకు సంఘం రైతు నాయకుడు, వైఎస్సార్సీపీ నేత గాంధీ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ వర్జీనియా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గాంధీ మాట్లాడుతూ వర్జీనియా పొగాకుకు మంచి ధర ఇప్పించేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. స్పందించిన జగన్మోహన్రెడ్డి వీలును బట్టి మరోసారి వర్జీనియా వేలం కేంద్రాలను సందర్శిస్తానని తెలిపారన్నారు. గిట్టుబాటు ధర కోసం పోరాటం చేద్దామని జగన్ పేర్కొన్నారన్నారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో బండారు సూరిబాబు, బుద్దాల సత్యనారాయణ, బండారు రత్నవల్లి ఉన్నారు. -
కష్టాల ఊబిలో కోకో రైతు
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: కంపెనీలు సిండికేట్‌గా మారడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కోకో రైతులు పూర్తిగా నష్టపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో ధర రూ.800 పలుకుతున్నా, కంపెనీల సిండికేట్ వల్ల మన రాష్ట్రంలో రూ.450కు మించలేదు. రైతుల నుంచి పూర్తిస్థాయిలో కోకో పంటను కొనుగోలు చేయకుండానే సీజన్ ముగిసిందని జూన్ నెలాఖరు నుంచి కొనుగోళ్లు నిలిపివేశాయి. దీంతో రైతుల వద్ద 800 టన్నులకు పైగా కోకో నిల్వలు మిగిలి ఉన్నాయి. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 60 శాతానికి పైగా ధర పతనం రాష్ట్రంలో మాండలీజ్, క్యాంకో, జిందాల్, డీపీ చాక్లెట్, లోటస్తోపాటు మరికొన్ని కంపెనీలు కోకో కొనుగోలు చేస్తున్నాయి. మాండలీజ్ కంపెనీ మాత్రమే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది. మిగిలిన కంపెనీలు దళారుల ద్వారా కొనుగోలు చేయిస్తాయి. కోకోకు ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు సీజన్‌గా పరిగణిస్తారు. ఏప్రిల్, మే నెలల్లో ధరలు అధికంగా ఉంటాయి. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో కిలో రూ.1,050 పలికింది. ఈ ఏడాది 60 శాతానికి పైగా ధర పతనమైంది. ఏప్రిల్, మే నెలల్లో రూ.450కి అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. రైతు సంఘాలు, ప్రతిపక్షాల పోరాటాలతో ప్రభుత్వం కంటితుడుపు చర్యల్లో భాగంగా కిలోకు రూ.50 అదనంగా ఇస్తామని చెప్పింది. దానిని మే 23 నుంచి జూన్ 30వ తేదీ వరకు అమలు చేసి, ఏలూరు జిల్లాలో 1,638 టన్నులకు సంబంధించిన 2,200 మంది రైతులకు మాత్రమే కిలోకు అదనంగా రూ.50 చెల్లించారు. వాస్తవానికి ఏలూరు జిల్లాలోనే ఏటా 12వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా కోకో సాగు చేస్తారు. ఈ జిల్లాలో గతేడాది 36,290 ఎకరాల్లో కోకోను సాగు చేశారు. గత రెండు, మూడేళ్లుగా కోకో ధరలు గణనీయంగా పెరగడంతో రూ.40 వేల నుంచి రూ.50 వేలు పలికే కౌలు ధరలు, ఒక్కసారిగా రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలకు చేరాయి. దీంతో పెట్టుబడి అధికమైంది. కానీ, ధర పతనమైంది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. న్యూస్రీల్రైతుల వద్ద 800 టన్నులకు పైగా కోకో నిల్వలు ప్రస్తుతం రైతుల వద్ద 800 టన్నులకు పైగా కోకో నిల్వలు ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం సీజన్ ముగిసిందని, డిమాండ్ లేదని, కోకో నట్స్‌లో బటర్ శాతం తక్కువగా ఉందని.. ఇలా రకరకాల సాకులతో దళారులు కిలో రూ.350 నుంచి రూ.400కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి మార్చి నుంచి కోకో పంటకు అంతర్జాతీయంగా కిలో ధర రూ.800–రూ.850 మధ్య కొనసాగుతోంది. మన రాష్ట్రంలో మాత్రం రూ.450కి మించి ధర పలకలేదు. కంపెనీల సిండికేట్‌తో రైతులకు భారీ నష్టం సీజన్ ముగిసిందంటూ కొనుగోళ్ల నిలిపివేత రైతుల వద్ద 800 టన్నులకు పైగా కోకో నిల్వలు గతేడాది కిలో రూ.1,050 ఉన్న కోకో ధర ఈ సీజన్లో సగటున కిలో రూ.450 మాత్రమే నష్టాల్లో మునిగిపోయాం కోకో రైతులందరం నష్టాల్లో మునిగిపోయాం. గతేడాది కిలోకు రూ.1,050 వరకు ఇచ్చారు. నేడు రూ.400 మాత్రమే ఇస్తున్నారు. రైతులు చాలా పెట్టుబడి పెట్టారు. వ్యాపారులందరూ సిండికేట్ అయిపోయి రైతులను ముంచేశారు. బయటి వ్యాపారులను రానీయకుండా, వారు కొనుగోలు చేయకుండా రైతులను నష్టాలపాలు చేశారు. – వంకినేని లక్ష్మీనారాయణ, వంగూరు, లక్ష్మీపురం, ఏలూరు జిల్లా గిట్టుబాటు ధర కల్పించాలి నాకున్న కొద్దిపాటి కొబ్బరితోటలో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నా. గతేడాది కిలో రూ.800–రూ.1,200 మధ్య ధర పలికింది. ఇప్పుడు కిలో ధర రూ.400కి దిగజారింది. పెట్టుబడి వ్యయం పెరిగి, ఆదాయం తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నా. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు కిలో రూ.900 గిట్టుబాటు ధర కల్పించి, వెంటనే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – తూత బాలాజీ కుమార్, తడికలపూడి, కామవరపుకోట మండలం -
రూ.359కి చేరిన వర్జీనియా ధర
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు ధర క్రమేపీ పెరుగుతోంది. మంగళవారం నాటికి కేజీ ఒక్కింటికి అత్యధికంగా రూ.359కు చేరింది. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రం, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో ఈ ధర రూ.359కు చేరింది. వేలం ప్రారంభ సమయంలో కేవలం కేజీ ధర రూ.290 పలికింది. ఈ ధర చాలా రోజులు స్థిరంగానే కొనసాగింది. కొద్ది రోజులుగా పెరుగుతూ 359కు చేరింది. కేజీ అత్యల్ప ధర రూ.200 ఉండగా, సరాసరి కేజీ ధర రూ.277కు చేరింది. గత ఏడాది వేలం ప్రక్రియ ముగిసే సరికి సరాసరి కేజీ ధర రూ.323 లభించింది. ఈ ఏడాది కూడా సరాసరి ధర అంతే ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా జయకర్
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్ గరికపూడి ఇమ్మానుయేల్ జయకర్‌ను వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. తనపై విశ్వాసంతో రాష్ట్రస్థాయి పదవిని కేటాయించటంలో కృషి చేసిన ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపును ప్రజలంతా వ్యతిరేకించాలని వామపక్ష, ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ మంగళవారం ఉదయం ఏలూరు సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో వామపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. ఈ నెల 13న విజయవాడ దాసరి భవన్లో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమ కార్యాచరణను కృష్ణ చైతన్య వివరించారు. గత కొంతకాలంగా విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, ఇతర అదనపు చార్జీల పేరుతో అధిక భారాన్ని మోపుతూ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై మోపిన అధిక భారాలను రద్దు చేయాలని, వసూలు చేసిన అదనపు బిల్లులను తిరిగి చెల్లించాలని, విద్యుత్తు స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు బిగింపును విరమించుకోకపోతే మరో బషీర్‌బాగ్ లాంటి విద్యుత్ ఉద్యమాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామకృష్ణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బద్దా వెంకట్రావు, ఎంసిపిఐ(యు) జిల్లా నాయకులు ఎస్.నాగరాజు, బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణమాచార్యులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి హేమశంకర్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు
తణుకు అర్బన్: రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు పెరిగిపోవడం బాధాకరమని బీసీ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రాధాన్యతతో పాటు భద్రత లేకుండా పోతున్న ఘటనలు బాధాకరమన్నారు. తణుకు సురాజ్య భవన్లో మంగళవారం బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహిళా రాజకీయ రిజర్వేషన్లు, బీసీ మహిళా సబ్ కోటాపై రాష్ట్ర మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న మహిళకు కనీసం ఒక ఎస్సైని బదిలీ చేయించే అధికారం కూడా లేకుండా రాజకీయంగా తమ పరిధిలోనే ఉంచుకోవడం అన్యాయమన్నారు. దేశ వ్యాప్తంగా భవిష్యత్తులో జనగణనకు కార్యాచరణ సిద్ధమైందని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ తెలిపారు. బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, జిల్లా మహిళాధ్యక్షురాలు కొలగాని కృష్ణవేణి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో జాతీయ ఉపాధ్యక్షుడు కాగిత సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజాచారి, జాతీయ మహిళాధ్యక్షురాలు వై.లక్ష్మీశైలజ, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పీవీ రమణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు అన్నం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మటపత్తి సూర్యచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లుక్కా వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బాలిక కుటుంబానికి అండగా ఉంటాం
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో పదేళ్ల బాలికపై మానవమృగం అత్యాచారానికి పాల్పడడంపై వైఎస్సార్సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా జరుగుతున్న అఘాయిత్యాలకు పాల్పడడం హేయమని, అలాంటి వారికి కఠిన శిక్షలు పడేలా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఏలూరులో బాలిక కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. పోలీస్ అధికారులు నిస్పక్షపాతంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతీ రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి దారుణ సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయని, ఇలాంటి నీచుల పట్ల ప్రభుత్వ అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ తుమరాడ స్రవంతి, జిల్లా కార్యదర్శి తులసీ, పార్వతి, కొత్తపల్లి రాణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు (జీఎంఆర్), నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్, తదితరులు ఉన్నారు. -
మీ మెడకే చుట్టుకుంటుంది
కోకో దిగుమతులు ఆపాలి విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేసి, కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం డిమాండ్ చేసింది. 8లో uమాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం రూరల్: చెడు సంస్కృతిని మొదలుపెడితే అది మీ మెడకే చుట్టుకుంటుందనే విషయాన్ని గుర్తించాలని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మాధవరంలో వైఎస్సార్సీపీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ హారిక కారుపై దాడి చేసి, దుర్భాషలాడి టీడీపీ రౌడీలు విధ్వంసం సృష్టించారని, ప్రస్తుతం బాబూ ష్యూరిటీ– గూండాయిజం గ్యారంటీ అనే చందంగా ప్రభుత్వ పాలన మారిందని విమర్శించారు. ఒకప్పుడు పవన్ చంద్రబాబు, లోకేష్‌ను విమర్శించారని, నేడు ఒకే గూటికి చేరారన్నారు. పవన్ పొలిటికల్‌గా అట్టర్ ప్లాప్ అని ఎద్దేవా చేశారు. 10వ తరగతి పరీక్షలు వాల్యుయేషన్ జవాబుదారీతనం లేకుండాపోయిందన్నారు. చైనా బ్యాచ్ గుప్పెట్లో విద్యా వ్యవస్థఉందన్నారు. రాష్ట్రానికి సీఎంగా ఉండి ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేలా చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి, పవన్ కళ్యాణ్‌కు గ్యాప్ వచ్చినట్టు ఉందన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే ఊరుకోబోమంటూ చిర్రుబుర్రులాడుతున్నాడని, ఊరుకోకపోతే పేడ పిసుక్కుంటావా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రానంత వరకే వ్యక్తిగతం అని, వచ్చిన తర్వాత అందరూ ప్రశ్నిస్తారన్నారు. జగన్ 2.0లో హాలీవుడ్ స్థాయిలో సినిమా చూపిస్తామని హెచ్చరించారు. -
గతేడాది కోటానే కేటాయించాలి
జంగారెడ్డిగూడెం: ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో గత ఏడాది ఇచ్చిన కోటానే ఈ ఏడాది కేటాయించాలని వర్జీనియా రైతు సంఘం నాయకులు కోరారు. మంగళవారం జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు చైర్మన్ పి.యశ్వంత్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వేలం ప్రక్రియను ఆయన పరిశీలించారు. చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వర్జీనియా రైతు సంఘం నాయకులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ఇచ్చిన అధీకృత కోటాలో సగం పొగాకు అమ్మకాలు పూర్తయ్యాయని, వీటిలో క్లస్టర్ షెడ్యూల్ ప్రకారం చాలా మంది రైతుల కోటాలు పూర్తయ్యాయన్నారు. కోట పూర్తయిన రైతులకు అదనపు కోటా కల్పించి అదనంగా పండిన పంటను అమ్మకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. గత సంవత్సరం ఇచ్చిన కోటా 58.25 మి.కిలోలు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో పొగాకు రైతు సంఘం నాయకులు పరిమి రాంబాబు, సత్రం వెంకట్రావు, వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు గడువు పొడిగింపు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీని పొడిగించినట్లు డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, స్థానిక సంస్థల, మున్సిపల్, ఏపీ మోడల్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అర్హులన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి తొలుత ఈ నెల 15వ తేదీ వరకూ గడువు ఇవ్వగా, గడువును ఈ నెల 17 వరకు పొడిగించారని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు అర్హులు కారని, సంబంధిత సంవత్సరంలో కనీసం నాలుగు నెలలు విధులు నిర్వహించిన వారు ఇతర అర్హతలన్నీ పూర్తిగా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నైట్ వాచ్మెన్ల జీతాలు చెల్లించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ పాఠశాలలలో రాత్రిపూట కాపలాదారుగా పనిచేస్తున్న నైట్ వాచ్మెన్ జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నైట్ వాచ్మెన్ జీతాలు చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిబాబు మాట్లాడుతూ నైట్ వాచ్మెన్ల గౌరవ వేతనం నెలల తరబడి చెల్లించడం లేదని విమర్శించారు. దీంతో వారి కుటుంబాల జీవనం చిన్నాభిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతం తక్కువ పని ఎక్కువ చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించాలని, నైట్ వాచ్మెన్లుగా పనిచేస్తున్న వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం నెలకు రూ.10 వేలు చెల్లించాలని, పని సమయంలో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అదనపు సంచాలకుడికి అందజేశారు. ఇంటర్ విద్య పెన్షనర్ల ఆందోళన ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని ఇంటర్ విద్య పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్స్ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నుద్దేశించి అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.శ్యాంబాబు, కె.భవన్నారాయణ మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి ఐఆర్‌ను ప్రకటించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. -
గురువుల మెడపై బోధనేతర కత్తి
నిడమర్రు: పాఠశాల తెరిచి నెల రోజులు పూర్తవుతున్నా కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలతో నేటికీ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు తరగతి గదికి హాజరుకాలేని పరిస్థితి. ఇప్పటికీ బోధనేతర పనులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు బిజీబిజీగా గడుపుతున్నారు. రోజు రోజుకీ వాట్సాప్‌లో అర్జెంట్ మెసేజ్‌లు, ఆన్లైన్ వర్క్‌లు, వెబ్ఎక్స్ మీటింగ్‌లతోపాటు నెలరోజులుగా యోగాంధ్ర, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వంటి కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి నిర్ణయాలను జీర్ణించుకోలేని నెల్లూరు జిల్లాలోని కోటితీర్థంకు చెందిన ఎంపీపీ పాఠశాల హెచ్ఎం ఎం.మధుసూదనరావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. ఉపాధ్యాయుల మెడపై ఇలా భోతనేతర పనుల కత్తి వేలాడుతుండడంతో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు లోపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో 1వ తరగతిలో విద్యార్థుల నమోదు గణనీయంగా పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 117 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉందని గణాంకాలు చెబుతుండడం గమనార్హం. నెలంతా బోధనేతర కార్యక్రమాలే.. ● జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచినా ఎస్జీటీలకు, ఎంటీఎస్, వృత్తి విద్యా టీచర్స్ బదిలీల కౌన్సిలింగ్ నిర్వహణతో పదిహేను రోజులు గడిచిపోయాయి. ● అనంతరం గిన్నిస్ రికార్డు కోసం జూన్ 21న చేపట్టిన యోగాంధ్ర కోసం పాఠశాలల్లో ముందస్తుగానే ఆయా కార్యక్రమాలు చేపట్టింది. వీటిల్లో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు. ● ఆ తరువాత ఈనెల 10వ తేదీన తలపెట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (మోగా పీటీఎం)కు సంబంధించి పది రోజుల ముందగానే వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ● హమ్మయ్య.. అది కూడా ముగిసిందనుకుంటే ఈనెల 14 నుంచి స్కూల్ లీడర్ షిప్, ఎఫ్ఎల్ఎన్ వంటి శిక్షణ కార్యక్రమాలు ఈ నెలాఖరు వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తరగతి గదులకు దూరమవుతున్నారు. దీంతో తరగతులు సక్రమంగా జరగక పాఠాలు అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మొరాయిస్తున్న యాప్‌లతో ఆందోళన మరో వైపు మొరాయిస్తున్న యాప్‌లతో సైతం ఉపాధ్యాయులు విసిగిపోతున్నారు. పాఠశాల విద్యాశాఖలో ఉన్న అన్ని యాప్‌లను ఒకే వేదికపైకి తీసుకు వచ్చి లీప్ (లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) యాప్‌ను రూపొందించారు. దాంట్లోనే ఐఎంఎంఎస్, స్టూడెంట్ కిట్స్, మెగాపీటీఎం వంటివాటిని అనుసంధానం చేశారు. దీంతో సర్వర్ డౌన్ సమస్యలతో నేటికీ అన్లైన్లో టీచర్ ఫోటో హాజరు నమోదుకు ఉదయం, సాయంత్రం వేళల్లో 5 నుంచి 15 నిమిషాలు పడుతున్నట్లు ఉపాధ్యాయులు చెపుతున్నారు. ఇదిలా ఉంటే నేటి నుంచి విద్యార్ధి మిత్ర కిట్లు విద్యార్థులకు అందినట్లు తల్లింద్రడులతో బయోమెట్రిక్ వెయించాలని చెబుతున్నారు. కానీ ఏ పాఠశాలలో కూడా దీనికి సంబంధించిన డివైజ్ మిషన్స్ అదుబాటులో లేని పరిస్థితి. పెద్ద స్కూళ్లలో క్లాస్ టీచర్‌కు ఒక వారం రోజులు ఇదే పనిలో ఉండాల్సిందే అని చెబుతున్నారు. సన్నబియ్యం బస్తా చుట్టూ తిరగాల్సిందే ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజన పథకంకు సంబంధిచి పాఠశాలలకు సన్నబియ్యం అందించారు. ప్రతి నెలా పాఠశాలకు అందిన అన్ని బస్తాలపై క్యూఆర్ కోడ్లను ఉపాధ్యాయులు స్కానింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలి. తర్వాత వంటకు ముందు ఆ బస్తా ఓపెన్ చేసిన ప్రతిసారి క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేసి ఆ బస్తాలో ఉన్న బియ్యం క్యాలిటీ పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన పరిస్థితి. లేదంటే బియ్యం స్టాక్ గోఔన్ నుంచి ఉపాధ్యాయులకు ఫోన్లు వస్తున్నాయి. డీఈవో వద్ద ఫ్యాప్టో నేతల ఆవేదన ఇటీవల పెరుగుతున్న బోధనేతర పనులు, శిక్షణలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మంగళవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక (ఫ్యాప్టో) నేతలు జిల్లా విద్యాశాధికారి నారాయణను కలసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఒత్తిడిలో హెలిస్టిక్ ప్రోగ్రస్ కార్డులు పూర్తి చేయలేదనడం సరికాదన్నారు. ఎస్ఎల్డీటీ శిక్షణలు జిల్లా కేంద్రాల్లో కాకుండా అగిరిపల్లి, నల్లజర్లలో రెసిడెన్సియల్ విధానంలో ఏర్పాటు సరైన నిర్ణయం కాదని ఫ్యాక్టో నేతలు డీఈవోకు వివరించారు. నెలరోజులుగా యోగాంధ్ర, మెగా పీటీఎంలతో సరి ప్రస్తుతం లీడర్షిప్, ఎఫ్ఎల్ఎన్ శిక్షణలతో బిజీ ప్రతీ రోజు గంట సమయం ఆన్లైన్, యాప్‌ల భారం తరగతి గదికి దూరమవుతున్నామంటూ ఉపాధ్యాయుల ఆవేదన బోధనేతర పనుల ఒత్తిడిపై ఉమ్మడి పోరాటం పాఠశాలలు తెరిచి రెండో నెలలో ప్రవేశించినా ఉపాధ్యాయులు సంతృప్తిగా పాఠాలు బోధించిన దాఖలాలు లేవు. యెగా డే, మెగా పేరెంట్స్ మీటింగ్‌కు సంబంధించి ఆన్లైన్ నమోదు, శిక్షణలతో ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. బోధనేతర పనులు తగ్గించే వరకూ అన్ని యూనియన్లు ఉమ్మడి పోరాటంకు సిద్ధం కావాలి. – పుప్పాల ప్రకాశరావు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీయూ ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం తగదు పాఠశాల ప్రారంభం నెలల్లో జరుగుతన్న శిక్షణలకు అర్థగట్ల జెడ్పీస్కూల్ హెచ్ఎం ఎస్వీఆర్ మూర్తిరాజు బలయ్యారు. ఆన్లైన్ పనులు, శిక్షణల పేరుతో ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం అడడుతున్నారు. ఇలా శిక్షణల పేరుతో టీచర్లను మానసిక ఒత్తిడికి గురి చేయడం తగదు. – బోర్రా గోపీ మూర్తి, టీచర్స్ ఎంఎల్సీ -
నూతన విద్యావిధానాలపై పోరాడాలి
కుక్కునూరు: నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఐక్యంగా పోరాటం చేయాలని పీడీఎస్‌యూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని లచ్చిగూడెం గ్రామంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోయం కార్తీక్, తుర్రం నవీన్ మాట్లాడుతూ జీఓ నెంబర్ 117ను రద్దు చేస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం జీఓ నెంబర్ 19, 21లతో మరింత నష్టకరమైన తొమ్మిది రకాల బడుల విధానాన్ని ప్రవేశపెట్టడం దారుణమని అన్నారు. జీఓ నెంబర్ 117తో 12 వేల ఏకోపాధ్యాయ బడులు ఏర్పడగా వాటికి మరిన్ని జోడించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఉపాధ్యాయుడితో విద్యా బోధన అసాధ్యం అన్నారు. మూడు, నాలుగు తరగతులను ఉన్నత పాఠశాలకు బదిలీ చేయడం అనాలోచితం, అశాసీ్త్రయమని విమర్శించారు. ప్రపంచ బ్యాంక్ ద్రవ్యనిధి ఆదేశాల మేరకు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను 30 శాతం మేర తగ్గించేందుకు కుట్ర జరుగుతుందన్నారు, ప్రపంచ బ్యాంక్ రుణాలపై ఆధారపడిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 2020 జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చాయని, దీనిపై అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. సమావేశంలో పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేయాలి
ద్వారకాతిరుమల: విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేసి, కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించేలా ఫార్ములా రూపొందించాలని, అందుకు రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో, కోకో రైతుల ప్రాంతీయ సదస్సును మంగళవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకుడు రుద్రరాజు సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోకో రైతుల సమస్యలపై చర్చించి, పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోకో పంటను మరింతగా ప్రోత్సహిస్తామని, ప్రస్తుతం ఉన్న 75 వేల ఎకరాలకు అదనంగా మరో లక్ష ఎకరాల్లో కోకో పంట సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని ప్రకటించిందన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోకో గింజలను మార్కెట్లో అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో లక్ష ఎకరాలు పెంచితే ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోతే కోకో రైతులు మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య, కోనేరు సతీష్ బాబు మాట్లాడుతూ కోకో రైతులంతా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి భవిష్యత్తులో తమ కోకో గింజలను మార్కెటింగ్ చేసుకునేలా కోకో రైతులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత సీఐటీయూ నాయకులు ఆర్.లింగరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు మాట్లాడుతూ ప్రపంచీకరణ విధానాల వల్ల విదేశీ ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్స్‌తో వాణిజ్య, వ్యాపార పంటల రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సదస్సులో ఎస్.నాగబాబు, పి.ప్రసాద్, వి.వెంకటేశ్వరరావు, తూంపాటి అజయ్ కుమార్, ఎం.మురళీ, నల్లూరి బాపనయ్య, పలు ప్రాంతాలకు చెందిన కోకో రైతులు పాల్గొన్నారు. కోకో రైతుల సదస్సు డిమాండ్ -
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆషాఢం ఆఫర్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ ఏసీ బస్సుల ప్రయాణికులకు ఆషాఢం ఆఫర్ అందిస్తున్నట్టు ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఆర్టీసీ డిపోల నుంచి బయలుదేరే అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు వెళ్లేటప్పుడు 10 శాతం, తిరిగి వచ్చేటప్పుడు 10 శాతం ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య భీమడోలు: గుండుగొలనులో ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సిరికోటి నర్మద అలియాస్ మౌనిక (20) ఈనెల 13వ తేదీ ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సరికి ఆమె విగత జీవిగా పడి ఉంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని అనుమానిస్తున్నారు. నర్మద అమ్మమ్మ కురమా మాణిక్యం ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిట్స్‌తో కాలువలో పడి.. భీమవరం: ఫిట్స్‌తో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. భీమవరం టూటౌన్ ఎస్సై కె రామారావు తెలిపిన వివరాలివి. పట్టణంలోని సత్యవతి నగర్‌కు చెందిన గుమ్మాడి రామచంద్రరావు(32) ఈనెల 13వ తేదీన ఫిట్స్‌తో కాలువలో పడిపోయాడు. అతడిని బంధువులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. రామచంద్రరావు తల్లి రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చేపల పెంపకంపై శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్), బాదంపూడి: ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్థణ శిక్షణ కేంద్రంలో చేపల పెంపకంపై శిక్షణ పొందుటకు ఈనెల 25వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి.నర్సయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకార వేతనాలు లేకుండా 20 సీట్లు ఉన్నాయన్నారు. 5వ తరగతి ఆపైన చదువుకుని చేపల పెంపకంపై ఆసక్తి కలిగిన 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు అర్హులన్నారు. దరఖాస్తుదారులకు ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు బాదంపూడిలోని మత్స్య శాఖ సహాయ సంచాలకుల వారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అదేరోజు సాయంత్రం కార్యాలయం నోటీసు బోర్డులో ఎంపికై న వారి జాబితా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. శిక్షణా కాలం ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు మూడు నెలలపాటు ఉంటుందన్నారు. వివరాలకు మత్స్య సహాయ సంచలకులు, బాదంపూడి 95733 37484 లేదా మత్స్య అభివృద్ధి అధికారి, బాదంపూడి–1 72869 93033, బాదంపూడి–2 94923 37469 నంబర్లలో సంప్రదించాలని జిల్లా మత్స్య శాఖాధికారి నర్సయ్య తెలియజేశారు. నీటితీరువా పన్నులు చెల్లించండిఏలూరు (మెట్రో): జిల్లాలో నీటితీరువా పన్నులను ‘మన మిత్ర’ యాప్ ద్వారా చెల్లించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ‘మన మిత్ర’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని నీటితీరువా పన్నులను చెల్లించాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే సెల్ 95523 00009లో సంప్రదించాలన్నారు. -
ట్రిపుల్ ఐటీల్లోని గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచాలి
నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో 2018లో నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలను పెంచాలని ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరుఫున మంగళవారం ఆర్జీయూకేటీ రిజిస్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌కు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో జాయిన్ అయిన గెస్ట్ ఫ్యాకల్టీకి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదన్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే గవర్నింగ్ కౌన్సిల్ ఎజండాలో ఈ అంశాన్ని పెట్టి ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీత, భవ్య, రామకృష్ణ, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి
నూజివీడు: పీయూసీలో చేరిన విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ బాగా చదువుకొని ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని నూజివీడు ట్రిపుల్ఐటీ ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అన్నారు. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు చెందిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డైరెక్టర్ మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలోని విద్యావిధానం పట్ల అవగాహన పెంచుకొని తరగతిలో మెంటార్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని చదువుకోవాలన్నారు. ఈనెల 21 నుంచి అకడమిక్ షెడ్యూల్ ప్రకారం తరగతులు జరుగుతాయని, 28 నుంచి స్టడీ అవర్స్ ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులంతా స్నేహభావంతో మెలగాలని, అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, ర్యాగింగ్ జోలికి వెళ్లినా విద్యార్థులను పంపించేస్తామని హెచ్చరించారు. డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, ఏఓ లక్ష్మణరావు, డీన్ స్టూడెంటు వెల్ఫేర్ బాలురు రాజేష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ బాలికలు దుర్గాభవాని, చీఫ్ వార్డెన్ సురేష్ బాబు పలు సూచనలు చేశారు. అసోసియేట్ డీన్స్ భరత్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్ల బాలికపై 80 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో పదేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిన్నారికి మాయమాటలు చెబుతూ వారం రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. బాధిత బాలిక అనారోగ్యంగా ఉండటంతో తల్లి ఆరా తీయగా ఈ దారుణం బయటపడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన తెర్రి సత్యనారాయణ (80) భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. సమీప ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక అమ్మమ్మ ఇల్లు వృద్ధుడి ఇంటికి సమీపంలోనే ఉంది. దీంతో బాలిక పాఠశాలకు వెళుతూ తన అమ్మమ్మ ఇంటికి వచ్చే క్రమంలో వృద్ధుడు ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ నిందితుడు సత్యనారాయణపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. -
మధ్యవర్తిత్వం.. పరిష్కార మార్గం
కై కలూరు: సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘మధ్యవర్తిత్వం–దేశం కోసం’ అనే కార్యక్రమంలో భాగంగా జాతీ య న్యాయ సేవాధికార సంస్థ, సుప్రీంకోర్టు మీడి యేషన్ అండ్ కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీల ఆధ్వ ర్యంలో ఆయా కోర్టుల్లో ప్రత్యేక సెంటర్లను ఏర్పా టు చేస్తున్నారు. ఈనెల 1 నుంచి 90 రోజుల పాటు మధ్యవర్తిత్వంపై కక్షిదారులకు అవగాహన కలిగిస్తారు. ఇప్పటికే జడ్జిలు, మీడియేటర్స్‌గా పనిచేసే ఆసక్తి కలిగిన న్యాయవాదులకు ఐదు రోజుల శిక్షణ ఇచ్చారు. విడతలుగా శిక్షణ కొనసాగుతోంది. మీడియేషన్ ఫర్ ది నేషన్ అనేది దేశంలో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం అనే లక్ష్యంతో రూపొందించారు. రాష్ట్ర, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు క్రియాశీలకంగా వ్యహరించనున్నాయి. పెండింగ్ కేసులు తగ్గించేలా.. కోర్టులో పెండింగ్ కేసులు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాజీ పడదగిన కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. ఆయా కోర్టుల్లో కొందరు న్యాయవాదులతో కలిసి మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. కోర్టులో కేసులు నడుస్తున్నా రాజీ కోరితే మీడియేషన్ సెంటర్‌కు కక్షిదారులను పంపుతారు. ఇప్పటికే శిక్షణా న్యాయవాదులకు ఓల్కన్ప్రో (వలంటరీ కాన్ఫిడెస్సియల్, ప్రోసిజర్)పై శిక్షణ ఇచ్చారు. కక్షదారులతో మీడియేటర్లు చక్కటి వాతావరణంలో మాట్లాడి కేసు పరిష్కరానికి కృషి చేస్తారు. కేసులో ఒక్కసారి ఆర్డర్ పొందిన తర్వాత తిరిగి ఇతర కోర్టులో కేసు వేసే అవకాశం ఉండదు. మధ్యవర్తిత్వంతో పరిష్కారమైన వ్యాజ్యాల్లో న్యా యస్థానానికి చెల్లించిన రుసుం సెక్షన్ 66(ఎ) చట్టం కింద తిరిగి చెల్లిస్తారు. మధ్వవర్తిత్వంతో ప్రయోజనాలు మధ్వవర్తిత్వంతో త్వరిత ప్రయోజనం సమకూరుతుంది. ఖర్చులు ఉండవు. కేసుల్లో సామరస్వపూర్వక పరిష్కారం లభిస్తుంది. కేసుల పరిష్కార నివారణ మార్గాలను సెంటర్లో పొందవచ్చు. మధ్వవర్తిత్వ ప్రక్రియ రహస్యంగా ఉంచుతారు. ఎలాంటి ఆంక్షలు ఉండవు. కక్షిదారులే నిర్ణయకర్తలుగా ఉంటారు. ఇక మధ్యవర్తి నిష్పక్షపాత తటస్థ వ్యక్తిగా ఉంటాడు. ఇరుపక్షాల మధ్య సంభాషణ నిర్వహిస్తాడు. కక్షిదారుల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి మార్గాన్ని కల్పిస్తాడు. అంగీకారానికి రావడానికి ఉన్న అవరోధాలను, ప్రయోజనాలను గుర్తిస్తాడు. అంగీకార పరిష్కార నియమాలను తయారు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడు. కోర్టుల్లో మీడియేషన్ సెంటర్ ఏర్పాటు 90 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చక్కటి అవకాశం మధ్యవర్తిత్వం చక్కటి అవకాశం. మీడియేషన్ సెంటర్లో సామరస్యపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం. కక్షిదారులతో మాట్లాడే విధానంపై శిక్షణ తీసుకున్నాను. కోర్టులో ఏర్పాటు చేస్తున్న సెంటర్లో సమస్యను పరిష్కరించుకుంటే కక్షిదారులు ఇద్దరు గెలిచినట్లుగానే భావించాలి. రాజీపడదగిన కేసుల కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – దేవరపల్లి శివప్రసాద్, శిక్షణ పొందిన న్యాయవాది, కై కలూరు -
నగరపాలక సంస్థ ఉద్యోగుల ధర్నా
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ కార్మి కులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ఉద్యోగులు, కార్మికులు ధర్నా చేశారు. ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఎ.అప్పలరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, పి.కిషోర్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్‌గా గుర్తించిన కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. పెండింగ్ సరెండర్ లీవ్, డీఏలను విడుదల చే యాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి మంగళవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారం ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ స్మార్ట్‌మీటర్ల నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోకపోతే బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. సోమవారం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్మార్ట్‌మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయొద్దని నినదించారు. నాడు ప్రతిపక్ష నేతగా నారా లోకేష్ స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకించారని.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినే కొనసాగించేలా చూస్తుండటం దారుణమన్నారు. సీపీఎం నగర కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, వైఎస్ కనకారావు, ఎం.ఇస్సాక్, పి.ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. వరద తగ్గుముఖం పోలవరం రూరల్ : వారం రోజులుగా పెరుగుతున్న గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే జలాలు తగ్గుతుండటంతో వరద ప్రవాహం క్రమేపీ తగ్గింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 29.550 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్ వే నుంచి 3,78,800 క్యూసెక్కుల వరదనీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం ఘణనీయంగా తగ్గుతోంది. 22.60 అడుగులకు చేరుకుంది. ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో విద్యాశాఖ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రిసెల్వికి ఫిర్యాదు చేశామని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని తెలిపా రు. ఈ మేరకు వివరాలను పత్రికలకు విడు దల చేశారు. రెండో శనివారం తరగతులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పీడీఎస్‌యూ నగర అధ్యక్షుడు వై.యశ్వంత్ ఆధ్వర్యంలో నా యకులు వెళ్లి అడ్డుకోగా తమకు అధికారులు అనుమతిచ్చారని ప్రైవేట్ విద్యాసంస్థల యా జమాన్యాలు తెలిపాయని పేకాన్నరు. నరసాపురం లేసుకు ఓడీఓపీ అవార్డు భీమవరం (ప్రకాశంచౌక్) : న్యూఢిల్లీలో కేంద్ర ప్రభు త్వ వాణిజ్య పన్నులు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ‘నరసాపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్’కు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేతులమీదుగా కలెక్టర్ సీహెచ్ నాగరాణి అవార్డు అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం లేసు అల్లికలకు గతేడాది జీఐ గుర్తింపు రావడం, ఇప్పుడు వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపులతో వే లాది మంది నేత కార్మికులు, కళాకారులకు ప్రో త్సాహం ఇవ్వగలమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో లేసు ఉత్పత్తులు గుర్తింపు పొందడంతో పాటు ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం లేసు తయారీదారుల కృషి ఫలితం అన్నారు. -
గోదావరి కడలిపాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి మహోగ్రరూపం దాల్చి కడలిపాలవుతోంది. ఒకటి, రెండు టీఎంసీలు కాదు ఏటా సగటున 1,900 టీఎంసీల గో దావరి జలాలు పోలవరం నుంచి ధవళేశ్వరం మీ దుగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా రెండు వరదల సీజన్లలోని వెయ్యి టీఎంసీలు వృథాగా పోతున్నాయనేది అధికారిక అంచనా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగడంతో పాటు 2020 నుంచి ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకున్నారు. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి వరద తీవ్ర త దాదాపుగా తగ్గుముఖం పట్టింది. ఈనెల 2 నుంచి.. ఈ నెలలో గోదావరి వరద తీవ్రతతో 420.26 టీ ఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. ఈనెల 2వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టుకు వరద తాకిడి ప్రారంభమైంది. 10వ తేదీ వరకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు, 11 నుంచి 13 వరకు రోజుకు సగటున 7.50 లక్షల క్యూసెక్కుల నీరు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి గోదావరిలో చేరింది. దీంతో గోదావరితో పాటు ఉపనది అయిన శబరి పొంగి పొర్లుతుండటంతో ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు ముంపు మండలాలు, పశ్చిమగోదావరిలోని యలమంచిలి, లంక గ్రామాల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి. ఈ వరదల సీజన్ లో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరడంతో వేలేరుపాడు మండలంలోని ఎద్దులవాగు వంతెన, కుక్కునూరులోని గుండేటివాగులోని లోలెవల్ వంతెనలు నీటమునిగాయి. దీంతో వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మండలాల్లో సుమారు 270 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సోమవారం గోదా వరి ఉధృతి గణనీయంగా తగ్గింది. భద్రాచలం వద్ద 22.60 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 3,78,800 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఇంకోవైపు నీటమునిగిన ఎద్దులవాగు, గుండేటివాగు లోలెవల్ వంతెనలు మంగళవారానికి యథాస్థితికి చేరే అవకాశం ఉంది. వందల టీఎంసీలు.. 2020 నుంచి పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు వేగవంతంగా నడిచాయి. 2020 నుంచి 25.72 మీటర్ల మేర 30 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం 51 మీటర్లు పూర్తయితే 197 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి ఉంటుంది. పునరావాసం పూర్తికాకపోవడం, ఆర్అండ్ఆర్ ప్యాకే జీ చెల్లింపులు జరపకపోవడంతో వరద నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. దీంతో వరద నీరు వస్తే 48 గేట్లు ఎత్తేసి ఎంత నీరు వస్తే అంత దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఏటా వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ప్రత్యేకంగా జూలై, ఆగస్టు నెలల్లోనే 1,500 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఈనెల 2వ తేదీ నుంచి సోమవారం వరకు 420.26 టీఎంసీల నీరు సముద్రంలోకి చేరింది. మరో వారం పాటు పోలవరం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు చేరిన వరద నీరు ఏటా వందల టీఎంసీల జలాలు సముద్రంలోకి.. ఏటా జూలై, ఆగస్టులో వరదలు సగటున వెయ్యి టీఎంసీలు వృథా 120 రోజుల వర్షాకాల వ్యవధిలో 1,900 టీఎంసీలు సముద్రం పాలవుతున్నట్టు అంచనా ఈ నెలలో ఇప్పటివరకు 420.26 టీఎంసీలు కడలిపాలు ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు నిల్వ -
హెచ్ఎం మూర్తి రాజు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు పాలకోడేరు: పాలకొల్లు మండలం అరట్లకట్ల హైస్కూల్ గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుడు ఎస్వీఆర్ మూర్తిరాజు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఫ్యాప్టో చైర్మన్ పీఎస్ విజయరామరాజు (యూటీఎఫ్) డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో సోమవారం మూర్తిరాజు మృతిచెందారని తెలిపారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇవ్వడంలో అధికారులు, ప్రభుత్వ వైఖరి మారని కారణంగానే హెచ్ఎం మూర్తిరాజు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకోడేరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు దూర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ మోడ్ శిక్షణలను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతుంటారని, అలాంటి వారిని రెసిడెన్షియల్ శిక్షణలకు దూరంగా ఉంచాలన్నా పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఒంటెద్దు పో కడలతో ప్రభుత్వం, అధికారులు పంతాలూ పట్టింపులకు పోతున్న ధోరణిలో ఉండటం వల్లే ఇలాంటి మరణాలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధోరణిని ఫ్యాప్టో పశ్చిమగోదావరి కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు ఆన్లైన్ వర్క్‌కు సంబంధించిన బాధ్యతలు పెడుతూ ప్రతి విషయాన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయమనడం, వాటిలో ఉండే చి న్నపాటి లోపాలకు అధికారులు ఉపాధ్యాయులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తద్వా రా ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారని విమర్శించారు. సమావేశంలో ఫ్యాప్టో కోచైర్మన్ పి.సాయివర్మ (ఎస్టీయూ), ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ ప్రకాష్ (ఏపీటీఎఫ్), ఫ్యాప్టో డిప్యూటీ జనరల్ సెక్రటరీ (ఏపీటీఎఫ్–1938) పాల్గొన్నారు. ఆరోగ్యం బాగోకపోయినా.. తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆరోగ్యం బాగోకపోయినా ట్రైనింగ్‌లు అంటూ జిల్లాస్థాయి అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, ఇది సరికాదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం, ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అఽధికారుల తీరును ఖండించారు. సోమవారం వారు తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ హెచ్ఎం మూర్తిరాజు శిక్షణ కేంద్రంలోనే మరణించడం బాధాకరమైన విషయమన్నారు. హెచ్ఎం ఎస్వీఆర్ మూర్తిరాజు తాను అనారోగ్యంతో ఉన్నానని, ట్రైనింగ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేసినా, తన తరపున తన అసిస్టెంట్‌ను పంపిస్తానని కోరినా జిల్లా అధికారులు మినహాయింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఒత్తిడితో ప్రధానోపాధ్యాయులకు ట్రైనింగ్‌లు ని ర్వహించడం సరికాదని విమర్శించారు. -
రైతు నెత్తిన బీమా పిడుగు
నూజివీడు : రైతులు పంటల బీమాకు దూర మయ్యే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు మంగళం పాడిన సర్కారు.. తాజాగా బీమా ప్రీమియాన్ని పెంచి పెనుభారం మోపింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రీమియాన్ని బాగా పెంచేసింది. గతేడాది ఎకరా వరికి రూ.420 బీమా ప్రీమియం ఉండగా, ఈ ఏడాది రూ.840 చేసింది. ఈ మేరకు పంట నష్టం వాటిల్లితే బీమా పరిహారం కింద రూ.42 వేలు చెల్లించనున్నారు. అలాగే మినుము పంటకు గతేడాది రబీ సీజన్లో ఎకరాకు రూ.60 ప్రీమి యం ఉండగా దానిని ఐదు రెట్లు పెంచేసి రూ.300 చేసింది. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు రైతులకు ఉచిత పంటల బీమాను అందించారు. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం భరించడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం చెల్లించారు. అలాగే ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.13,500 అందించి వెన్నుదన్నుగా నిలిచారు. కూటమి ప్రభుత్వంలో ప్రీమియం భారం మోపడంతో పాటు పెట్టుబడి సాయానికి తొలి ఏడాది ఎగనామం పెట్టారు. ఇప్పటికే ఖరీఫ్ పనులు మొదలుకాగా.. అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయాన్ని అందించలేదు. కౌలు రైతుల పరిస్థితి దారుణం ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. భూ యజమానికి కౌలు చె ల్లించడంతోపాటు సాగు ఖర్చులు కూడా భరించాలి. ఆ మేరకు ధాన్యం ధరలు పెరగకపోవడంతో కౌలు రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీమా ప్రీమియాన్ని రెట్టింపు చేయడంతో వారు బీమా జోలికి వెళ్లే పరిస్థితులు లేవు.కంపెనీల బాగు కోసమే.. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూ రెన్స్ కంపెనీల బాగు కో సమే పనిచేస్తోంది తప్ప రైతుల ప్రయోజనాల గు రించి ఎప్పుడూ ఆలోచించడం లేదు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తారని అనుకోవడం అవివేకం. – నిమ్మగడ్డ నరసింహ, ఏపీ రైతు సంఘం నాయకులు, నూజివీడు ప్రభుత్వమే చెల్లించాలి పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. భారీగా పెంచడంతో బీమా ప్రీమియాన్ని రైతులు చెల్లించే పరిస్థితులు లేవు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉన్నందున వారిపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బాణావతు రాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, నూజివీడు ● ప్రీమియాన్ని పెంచేసిన కూటమి ప్రభుత్వం పంటల బీమాకు దూరం కానున్న రైతులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు -
బెల్టుషాపులను ప్రోత్సహించడం సిగ్గుచేటు
భీమవరం(ప్రకాశం చౌక్): బెల్టు షాపులను ప్రభుత్వమే ప్రోత్సహించడం సిగ్గుచేటని, గీత వృత్తిని కా పాడాలంటూ పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి డిమాండ్ చేశారు. సోమవారం భీమవరంలో కలెక్టరేట్ వద్ద కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘కలెక్టర్ గారికి చెప్పుకుందాం రండి’ పేరుతో ధర్నా చేపట్టారు. గీత కార్మికులు మోకులతో వినూత్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో జేసీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుందని, ప్రభుత్వ విధానాలు, ఎకై ్సజ్ పాలసీల వలన కల్లుగీత కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నరసింహమూర్తి మాట్లాడుతూ కల్తీ మద్యాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని, బెల్ట్‌షాపులు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఎకై ్సజ్ అధికారుల సహకారంతో నడుస్తున్నాయని ఆరోపించారు. గీత కార్మి కుల కుటుంబాలకు రక్షణ కల్పించేలా గీత వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బొక్కా చంటి, సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి, నాయకులు, పెద్ద సంఖ్యలో గీత కార్మికులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన యలమంచిలి: హెచ్ఎం మూర్తిరాజు మరణం బాధాకరమని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పోలిశెట్టి క్రాంతికుమార్ అన్నారు. మూర్తిరాజు మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం మండలంలోని ఏనుగువానిపాలెం హైస్కూల్ వద్ద ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పలు పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ అధికారులు శిక్ష ణల పేరుతో ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురిచేసి వారి ప్రాణాలతో చెలగాటం ఆ డుతున్నారని విమర్శించారు. దీనికి కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి, మండల శాఖ అధ్యక్షుడు గుత్తిందీవి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పంతం రామమూర్తి నాయుడు, గౌరవాధ్యక్షు డు వి.జగ్గారావు, కార్యదర్శులు బి.శైలజ, ము ద్దల బాపిరాజు, మల్లుల శ్రీధర్ పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు అర్జీల వెల్లువ
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)కు అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 389 అర్జీలను ప్రజలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాల్లాడుతూ అర్జీలను నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా తగదని అధికారులకు సూచించారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, జెడ్పీ సీఈఓ శ్రీహరి తదితరులు ఉన్నారు. అర్జీల్లో కొన్ని.. ● పెదవేగి మండలం బాపిరాజుగూడెంకు చెందిన చొదిమెళ్ల సుహాసిని తన పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని వినతిపత్రం అందించారు. ● ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన దొంగ నరసింహ వీరాంజనేయులు రేషన్ కార్డులో తొలగించిన తన పేరు తిరిగి నమోదు చేయాలని అర్జీ అందించారు. ● ఏలూరు మండలం కొమడవోలుకు చెందిన బంటుపల్లి చంటమ్మ తనకు ఇంటి నిర్మాణానికి రుణం కావాలని అభ్యర్థించారు. ● ఏలూరులోని హనుమాన్‌నగర్‌కు చెందిన గొల్లపల్లి వెంకటరమణ తమ భూమిని చేపల చెరువుకు లీజుకు ఇవ్వగా లీజు దారుడు లీజు చెల్లించకపోవడంతో పాటు తమ కుటుంబంపై దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ● ముసునూరు మండలం గోపవరానికి చెందిన గురజాల వెంకటేశ్వరరావు తనకు వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. -
న్యాయం చేయండి మహాప్రభో
ఉండి: భూ అక్రమార్కులకు ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారిందంటూ రంగబాబు అనే వ్యక్తి కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కొనసాగుతోంది. చినగొల్లపాలెంలో తమ ఆస్తికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని, తమ ఆస్తిని అక్రమార్కులకు కట్టబెట్టేలా అక్రమ రిజిస్ట్రేషన్ చేసేందుకు రంగం సిద్ధమైపోయిందని తెలిపారు. అక్రమ డాక్యుమెంట్ తయారు కావడంతో పాటు స్టాంప్ డ్యూటీ కూడా అక్రమార్కులు చెల్లించేశారని చెప్పారు. ఈ క్రమంలో వారం రోజులుగా ఆయన కార్యాలయం వద్ద కారులోనే నివాసం ఉంటూ కాలువలోనే స్నానం చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. శని, ఆదివారాలు సెలవు రోజులైనా ఆయన తన ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు అఽధికారులు, రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అక్రమార్కులు వస్తారనే సమాచారం ఉండటంతో కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తక్షణమే ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి ఉండి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు చేయకపోతే తాను తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. సోమ లేదా మంగళవారం నుంచి నిరసన దీక్ష చేపట్టాలనుకుంటున్నానని తెలిపారు. ఉండి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న రంగబాబు నిరసన తన ఆస్తి ఆక్రమ రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం చేశారని ఆరోపణ -
పశువుల ప్రాణాలకే ముప్పు
బుట్టాయగూడెం: వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సంభవించే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ అధికారులు సూచిస్తున్నారు. పశువులు, గొర్రెలు ఇతరత్రా జీవాలకు వచ్చే వ్యాధులను గుర్తించిన వెంటనే సకాలంలో అందుబాటులో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించి సరైన చికిత్స చేయించాలని సూచిస్తున్నారు. అలాగే ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. బ్లూటంగ్– ఫూట్రాట్ లక్షణాలు గొర్రెలు, మేకల్లో బ్లూటంగ్ వ్యాధులు సోకితే ఎక్కువగా జ్వరం, మూతివావు, పెదవులు దద్దర్లు, నోటిలోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటడం, ఒంట్లో నీరు చేరడం, పారుకోవడం, మేత మేయకపోవడం, అలాగే ఈసుకుపోవడం (అబార్షన్లు) వంటి లక్షణాల వలన 30 శాతం వరకూ మరణాలు సంభవిస్తాయి. వీటి నివారణకు సాయంత్రం సమయంలో గొర్రెల మందలో వేపాకు పొగ పెట్టుకుంటూ అప్పుడప్పుడూ బ్లూటాక్స్/టిక్కిల్ మందులు పిచికారీ చేస్తూ పోడు ప్రాంతాల్లో మేతకు తీసుకువెళ్లాలి కాళ్లపుండ్లు వ్యాధి సోకితే జీవాలకు కాళ్లపుండ్లు వ్యాధి సోకితే కాలి గిట్టల మధ్య చీము చేరి చెడువాసన వస్తుంది. అలాగే గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు జీవాలను బురద ప్రాంతంలో మేపకూడదు. పొడి ప్రాంతంలోనే మేత వేసే విధంగా చూడాలి. గొంతువాపు వ్యాధి పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు వ్యాధి ప్రమాదకరం. ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో సూక్ష్మజీవుల వల్ల ఈ వ్యాధి పశువులకు సంక్రమిస్తుంది. తొలకరి వర్షాలు పడిన సమయంలో కలుషితమైన నీటి ద్వారా, మేత ద్వారా పశువులకు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధుల బారిన పడతాయి. గొంతువాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగిలిన పశువులతో కలిపి ఉంచితే ఈ వ్యాధి మిగిలిన వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది. ఒకేపాకలో మిగతా వాటితో ఉంచకుండా వేరుగా ఉంచాలి. అలాగే వర్షాకాలంలో పశువులు వర్షాలకు తడవకుండా చూడాలి. నివారణ చర్యలు జూన్, జులై, ఆగష్టు నెలలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారం అందించాలి. వ్యాధిసోకిన పశువులను మిగిలినవాటి నుంచి వేరు చేయాలి. వాటి స్థావరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి. చిటిక వ్యాధి ఇది గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. ఎంటరోటాక్సీమియా అనే బ్యాక్టీరియా వల్ల తొలకరి వర్షాలు కురిసే సమయంలో ఈ వ్యాధి గొర్రెలకు సోకుతుంది. ఏడాది వయస్సు గల గొర్రెల్లో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిసోకిన గొర్రెలు నీరసించి కొద్దిసేపటికే గిలగిలా కొట్టుకుని గాలిలో ఎగిరి కిందపడి మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలను ఉదయం, మధ్యాహ్న వేళల్లో గొర్రెల్లో కనిపిస్తాయి. గొర్రెలకు ఈ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. జాగ్రత్తలు అవసరం వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులపై రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందుగానే టీకాలు వేయించుకోవడం ఉత్తమం. వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే పశుప్రాణాలకు ముప్పు. పశువులకు సోకే వ్యాధులను గుర్తిస్తే దగ్గరలో ఉన్న పశువుల ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి. సకాలంలో వైద్యం అందేలా కృషి చేయాలి. – డాక్టర్. మల్లంపల్లి సాయిబుచ్చారావు, సహాయ సంచాలకులు ప్రాంతీయ పశుసంవర్థకశాఖ, జీలుగుమిల్లి వర్షాకాలంలో పశువులకు సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ముందుగానే టీకాలు వేయించాలంటున్న పశువైద్యులు -
నారు కీలకం.. సాగు లాభదాయకం
గణపవరం: వరి సాగులో ఖర్చులు తగ్గించుకొని, అధిగ దిగుబడి సాధించి వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడానికి ఆరోగ్యవంతమైన నారు కీలకం. ఆరోగ్యకరమైన నారుకోసం నారుమడి తయారీ నుంచి ఎంతో జాగ్రత్త అవసరం. ప్రస్తుతం రైతులు సార్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు. నారుమడుల తయారీ, విత్తనాలు చల్లుకోవడం, నారు సస్యరక్షణ పనుల్లో బిజీగా ఉన్నారు. కొన్ని చోట్ల నాట్లుకూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నారుమడి తయారీ, సస్యరక్షణ చర్యల్లో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. నారుమడి తయారీలో పాటించాల్సిన జాగ్రత్తలు నారుమడి వేయడానికి ఎంచుకున్న నేల పొలానికన్నా మెరకలో ఉండి, సారవంతమైనదిగా ఉండాలి. పొలాన్ని బాగా దుక్కిదున్ని కలుపు లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకూ బాగా చివికిన సేంద్రియ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అందువల్ల వేరువ్యవస్థ వత్తుగా, బలంగా తయారై, నారు పీకేటప్పుడు తెగిపోకుండా ఉంటుంది. అంతేకాక మొక్కకు అన్నిరకాల పోషకాలు పుష్కలంగా అంది, మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడుసార్లు దమ్ముచేసి, చదునుచేసి, నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తడం ఎకరా పొలంలో నాట్లు వేయడానికి 5 సెంట్ల నారుమడి సరిపోతుంది. 5 కిలోల విత్తనాలను ఒక లీటరు నీటిలో ఒక గ్రాము కార్బన్డిజం కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, మొలకలు కట్టిన తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. నారు ఆకు పూర్తిగా విచ్చుకునే వరకూ ఆరుతడులు ఇచ్చుకోవాలి. తర్వాత పలుచగా నీరు పెట్టాలి. మెట్ట నారుమడికి 3 గ్రాముల కార్భన్‌డిజం కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టిన తర్వాత చల్లుకోవాలి. పోషక యాజమాన్యం ఎకరా నారుమడికి 6 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేటు, 1.5 కిలోల మ్యూరేట్ ఆప్ పొటాష్ దమ్ములో వేయాలి. రెండు కిలోల యూరియాను విత్తనాలు చల్లేముందు, ఒక కిలో యూరియా విత్తిన 10 రోజుల తర్వాత వేసుకోవాలి. దీనివలన నారు ధ్రుఢంగా పెరుగుతుంది. నారుమడిలో ఇనుపధాతు లోపం కనిపిస్తే లేత చిగురాకులపై ఇటుకరంగు మచ్చలు ఏర్పడి, నారు నిర్జీవంగా మారి ఎదుగుదల ఉండదు. దీని నివారణకు లీటరు నీటిలో 20 గ్రాముల అన్నబేధి, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణం పిచికారీ చేసుకోవాలి. కలుపు నివారణ నారుమడిలో కలుపు మొక్కలు కనిపిస్తే సాధారణంగా చిన్న కమతాల నారుమడుల్లో కలుపును రైతులు లేదా కూలీలచేత తీయించి వేస్తారు. పెద్ద కమతాల రైతులు మాత్రం కలుపు నివారణకు రసాయనాలు ఉపయోగించవచ్చు. నారుమడిలో ఊద, ఇతర కలుపుజాతి మొక్కలు ఉంటే నివారణకు ఎకరా నారుమడికి 400 మి.లీ సైహలో ఫాస్ బ్యూటైల్ 10 శాతం మందును 200 మి.లీ. నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందు స్ప్రే చేసిన వారంరోజుల్లో ఊద, గడ్డిజాతి మొక్కలు మాత్రమే నశిస్తాయి. నారుకు ఎలాంటి నష్టం ఉండదు. కలుపు మందు వాడకంలో జాగ్రత్తలు కలుపుమందు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే నారుకు నష్టం కలుగుతుంది. సిఫార్సు చేసిన మందును, సిపార్సు చేసిన మోతాదులో వాడాలి. లేకపోతే నారుకు నష్టం కలుగుతుంది. మందు పిచికారీ చేసిన తర్వాత రెండు రోజుల వరకూ నీరు పెట్టకూడదు. భూమి పొడిగా ఉన్నప్పుడు, ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రసాయన మందులు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు రావు. సార్వా సాగుకు రైతులు సన్నద్ధం నారు సస్యరక్షణ పనుల్లో బిజీ బిజీ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి విత్తిన పది రోజులకు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు ఎకరా నారుమడికి 160 గ్రాముల చొప్పున వేసుకోవాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్లోరిఫైరిఫాస్ 2.0 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి విత్తిన 10 రోజులకు, 17 రోజులకు పిచికారీ చేసుకోవాలి. నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడిలో 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి చల్లుకోవాలి. – ఆర్ఎస్ ప్రసాద్, ఏవో, గణపవరం -
భార్యపై భర్త హత్యాయత్నం
పాలకొల్లు సెంట్రల్: అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యపై భర్త కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని అర్థకట్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యాళ్లబండి వెంకటేశ్వర్లు భార్య వెంకటరమణ కొంతకాలంగా కుటుంబ కలహాలతో గొడవపడుతున్నారు. శనివారం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. అర్ధరాత్రి సమయంలో భార్య వెంకటరమణ నిద్రిస్తుండగా భర్త వెంకటేశ్వర్లు వచ్చి తలుపు కొట్టాడు. లేచి తలుపు తీయగా ఆమె మెడపై వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే వచ్చి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ శ్రీవేద పర్యవేక్షించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాలకొల్లు రూరల్ ఎస్సై బి సురేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
చింతలపూడి: ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొని 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన చింతలపూడి మండలం, వెలగలపల్లి ఊరచెరువు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి ఆర్టీసీ డిపో సత్తుపల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా వెలగలపల్లి ఊరచెరువు సమీపంలో డ్రైవర్ రోడ్డుపై ఉన్న భారీ గోతులను తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 12 మందికి స్వల్ప గాయాలు కాగా వారిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని వేరే బస్సులో తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. ప్రాణ నష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా రోడ్డుపై పెద్ద, పెద్ద గోతులు ఉండటం వల్లనే స్టీరింగ్ కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొట్టినట్లు బస్సు డ్రైవర్ నరశింహారావు తెలిపాడు. రహదారులకు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేయకపోవడం కారణంగా నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 12 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు -
కారు ఢీకొని ఆటో బోల్తా
సారా బట్టీల ధ్వంసం కుక్కునూరు: మండలంలోని సీతారామనగరం గ్రామ శివారులో సారా తయారీ కేంద్రాలపై ఆదివారం కుక్కునూరు సీఐ ఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని సారా బట్టీలను ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. దాడుల్లో స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్య భీమవరం: భీమవరం ఒకటో పట్టణ పరిధిలోని టిడ్కో గృహ సముదాయంలో వివాహిత యు.శశిపూర్ణిమ (31) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. శశిపూర్ణిమకు ఆరేళ్ల కిందట వివాహం కాగా ఓ పాప ఉందన్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, మరో వ్యక్తికి స్వల్ప గాయాలు ద్వారకాతిరుమల: మండలంలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీకొట్టడంతో ఒక ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల మండలం బుట్టాయిగూడెం కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వంగలపూడి ప్రభాకరరావు, మహదేవపురంనకు చెందిన కట్టా సాయిని కప్పలకుంట వద్ద ఆటోలో ఎక్కించుకుని నల్లజర్ల మండలం అయ్యవరంనకు వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఓ కారు అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రభాకరరావుకు తీవ్ర గాయాలు కాగా, సాయికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పెద్దింట్లమ్మకు బోనాలుసమర్పించిన హిజ్రాలు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లిని తెలంగాణకు చెందిన హిజ్రాలు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు, సారెను సమర్పించారు. మేళాతళాలతో నృత్యాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు పెద్దింట్లమ్మ అమ్మవారికి వివిధ రూపాల్లో రూ.98,126 ఆదాయం వచ్చిందని తెలిపారు. మావుళ్లమ్మకు సారె భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలో వేంచేసియున్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి ఆదివారం భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. రెస్ట్ హౌస్ రోడ్ కి చెందిన మిండీ ఈశ్వరరావు నాగ సుధ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి సారెగా 50 రకాల పండ్లు, స్వీట్లు సమర్పించారు. అమ్మవారి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. జై వనరూపిణి బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వాహనాలలో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
పారిజాతగిరిలో కల్యాణోత్సవం
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం శ్రవణా నక్షత్ర సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కల్యాణోత్సవం ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, జంగారెడ్డిగూడెం, భీమడోలు, భీమవరం నుంచి వచ్చిన పలువురు దంపతులు కల్యాణ తంతులో ఉభయదారులుగా వ్యవహరించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన హరే శ్రీనివాస భజన మండలచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఏర్పాట్లను కార్యనిర్వాహణాధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతి రాజు, సభ్యులు పాల్గొన్నారు. అత్యాచారయత్నంపై కేసు నమోదు ఉండి: వ్యక్తిపై అత్యాచారయత్నం కేసు నమోదైంది. వివరాల ప్రకారం ఉండి గోరింతటలో 19 ఏళ్ల యువతి తన తల్లితో నివాసముంటుంది. పాములపర్రు గ్రామానికి చెందిన వర్రే రాజేష్ హోటల్లో వంట చేసేందుకు మనిషి కావాలని అడిగేందుకు ఈ నెల 12న ఉదయం 7 గంటలకు యువతి వద్ద ఆమె తల్లి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆదివారం ఆమె తల్లి ఇంట్లో లేని సమయంలో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడగా కేకలు వేయడంతో రాజేష్ పారిపోయాడు. దీనిపై యువతి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చోరీ ఫోన్ల రికవరీలో జాప్యం
భీమవరం : మీ ఫోన్ పొగొట్టుకున్నారా? అయితే మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలు పంపితే చాలు పోగొట్టుకున్న మీ మొబైల్‌ను రికవరీ చేసి మీకు అందిస్తామని పోలీసు శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఖరీదైన ఫోన్లు పొగొట్టుకున్న బాధితులు ఎంతో ఆశతో సెల్ ట్రాకింగ్‌కు ఫిర్యాదు చేస్తున్నా.. మీ ఫోన్ రికవరీ చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం భాష ఇబ్బంది. ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అపహరణకు గురైన ఫోన్ ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్నట్లు ఫోన్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు గుర్తించినా.. అక్కడి పోలీసులతో మాట్లాడడానికి భాష ఇబ్బందిగా మారింది. దీంతో ఎక్కువ ఫోన్లను రికవరీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. సెల్ ట్రాకింగ్ సిస్టమ్‌లో ఇతర భాషలపై అనుభవం ఉన్న సిబ్బంది లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇతర భాషలు తెలిసిన పోలీసు సిబ్బందిని నియమిస్తే ఎక్కువ ఫోన్లు రికవరీ చేసే అవకాశముంటుందని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో 4,990 ఫిర్యాదులు ప్రధాన బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, కూడళ్ల వద్ద నిత్యం సెల్‌ఫోన్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు అపహరణకు గురవుతున్నా పోలీసులకు ఫిర్యాదు చేసేది కొద్దిమంది మాత్రమే. ఖరీదైన ఫోన్లు, కొత్త ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు మాత్రం తన ఫోన్ కోసం ఫిర్యాదు చేస్తున్నారు. రికవరీ చేసింది 1,612 మాత్రమే జిల్లా వ్యాప్తంగా సెల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పది విడతల్లో సుమారు రూ.2.40 కోట్ల విలువైన 1,612 సెల్ఫోన్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. పట్టుబడ్డ ఫోన్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినియోగిస్తున్న వాటిని పోలీసులు రికవరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సెల్ ఫోన్లు దొంగించే ముఠా సభ్యులు ఇక్కడ దొంగిలించిన ఫోన్లు కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. అక్కడ వాటిని కొంతమంది నేరుగా విక్రయిస్తుండగా మరికొంతమంది సెల్ ఫోన్ల విడిభాగాలుగా విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
పునరావాస కార్యక్రమాల పరిశీలన
వేలేరుపాడు: కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన వరద బాధిత కుటుంబాలకు దాచారంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలోను, తాడువాయి, ములగలంపల్లిలలో ఏర్పాటుచేసిన వరద పునరావాస శిబిరాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలను అధికారులు దగ్గరుండి పరిశీలించారు. ఆదివారం ఉదయం రేపాకగొమ్ము గ్రామంలోని కొన్ని కుటుంబాలను తాడువాయి, ములగలంపల్లిలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాలకు తరలించే పనులను ఆర్డీఓ పర్యవేక్షించారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ఏర్పాటుచేసిన శిబిరాలలో ప్రజలకు భోజన తయారీని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం.వి. రమణ దగ్గరుండి పరిశీలించి, ప్రజలకు వడ్డించారు. వర్షాలు, వరదలకు ఇళ్ళు దెబ్బతిన్న కుటుంబాలకు టార్పాలిన్లు అందిస్తున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలలో పొరపాట్లు జరగకుండా ఆర్డీఓ పర్యవేక్షిస్తున్నారు. చల్లావారిగూడెంలో ఏర్పాటు చేసిన వరద పునరావాస కేంద్రం వద్ద తాగునీటికి కొరతా లేకుండా మూడు బోర్లను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాటు చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు తహసిల్దార్లు రమేష్ కుమార్, జి.సత్యనారాయణ, రెవిన్యూ, పౌర సరఫరాల శాఖ సిబ్బంది పునరావాస కార్యక్రమాలలో పాల్గొన్నారు. -
జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి హేయం
నూజివీడు : గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆదివారం పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఉన్న బీసీ మహిళా ప్రజా ప్రతినిధి పట్ల టీడీపీ ప్రవర్తన దారుణమన్నారు. ప్రపంచమంతా అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ ఉన్నామో ఎటువైపు పయనిస్తున్నామో అర్థం కావటం లేదన్నారు. ఇలాంటి అరాచకాన్ని అరికట్టాలని, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పైనే దాడులు చేస్తే, సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి హేయం భీమడోలు: కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హరిక, ఆమె భర్త రాములపై టీడీపీ గుండాలు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకట రమణ అన్నారు. బీసీ మహిళ నేతపై టీడీపీ గుండాల దాడి ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలకు కాపలాదారులుగా మారడం అత్యంత దురదృష్టకరమన్నారు. మహిళలపై దాడి చేసే హీన సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహించడం దురదృష్టకరమని, భవిష్యత్తు ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. అధికారుల అలసత్వం వల్లే జీతాలు ఆలస్యం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల బదిలీలు జరిగి నెలరోజులు కావస్తున్నప్పటికీ సీఎస్ఈ అధికారులు కేడర్ బలం నిర్ధారించి పొజిషన్ ఐడీలు కేటాయించడంలో అలసత్వం వహించడం వల్లనే బదిలీ పొందిన ఉపాధ్యాయులు ఇంత వరకూ జూన్ నెల జీతాలు పొందలేక పోయారని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ళూరి రామారావు, బీ.రెడ్డిదొర ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు రాక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించటం వలన, రకరకాల ట్రైనింగ్‌ల వలన బోధన సమయం హరించుకుపోతోందని, ట్రైనింగ్‌లను కేవలం ఒక్క రోజు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలస్యంగా విద్యార్థినులకు భోజనంపై ఆగ్రహం నూజివీడు: పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ల బాధ్యత రాహిత్యం కారణంగా విద్యార్థినులు ఆదివారం ఆకలితో అలమటించారు. మధ్యాహ్నం 12.30 గంటల కల్లా భోజనం పెట్టాల్సి ఉండగా రెండు గంటల వరకు పెట్టలేదు. ప్రిన్సిపాల్ బాధ్యతలను వైస్ ప్రిన్సిపాల్ కు అప్పగించి వెళ్లగా, వైస్ ప్రిన్సిపాల్ మరొక టీచర్ కు బాధ్యతలను అప్పగించారు. 600 మంది విద్యార్థినులు ఉండగా ఆదివారం కావడంతో పిల్లలను కలుసుకునేందుకు వచ్చిన తల్లిదండ్రులను లోపలికి అనుమతించలేదు. రెండు గంటలవుతున్నా భోజనం పెట్టకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తల్లిదండ్రులు గొడవ చేయడంతో చివరికి రెండు గంటల తరువాత భోజనం పెట్టారు. కొందరు తల్లిదండ్రులు తహసీల్దార్‌కు సమాచారం అందించడంతో ఆయన వీఆర్వోలను గురుకుల పాఠశాల వద్దకు పంపించారు. కిడ్నీ అమ్మకానికి వచ్చిన వ్యక్తిని అడ్డుకున్న పోలీసులు తాటిచెట్లపాలెం (విశాఖ): ఆర్థిక సమస్యల కారణంగా కిడ్నీని అమ్ముకోవడానికి ఏలూరు నుంచి నగరానికి వచ్చిన ఒక వ్యక్తి ప్రయత్నాన్ని ఫోర్త్ టౌన్ పోలీసులు అడ్డుకుని, విచారణ జరిపారు. గత నెల 30న అక్కయ్యపాలెం హైవే సమీపంలో ఉన్న ఒక హోటల్లో ఇద్దరు వ్యక్తులు కిడ్నీ అమ్మకం గురించి మాట్లాడుకుంటున్నారని హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పందించి, ఆ ఇద్దరినీ స్టేషన్‌కు తరలించి విచారించారు. వారిద్దరూ ఏలూరుకు చెందిన రంగబాబు, యేసురాజుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కిడ్నీని అమ్ముకోవాలని రంగబాబు తన స్నేహితుడైన యేసురాజుకు చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు మరింత లోతుగా విచారించగా, వీరు కిడ్నీ అమ్మకం కోసం ఎవరినీ సంప్రదించలేదని, ఎలాంటి దళారులను కలుసుకోలేదని తేలింది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని నిర్ధారించుకున్న పోలీసులు వారిని సొంత ఊరికి పంపించారు. ఈ విషయమై విచారణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
డ్రోన్ల మంజూరుకు ని‘బంధనాలు’
ఏలూరు(మెట్రో): అన్నదాతలను అన్నింటా ఆదుకుంటామని గొప్పలు చెప్పి గద్దెనెక్కిన కూటమి సర్కారు అన్ని విషయాల్లోనూ మొండిచేయి చూపుతోంది. రైతులకు సాంకేతిక సాయం అందించే డ్రోన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు సమకూరుస్తామని చెబుతున్నా వాస్తవానికి కార్యరూపం దాల్చడం లేదు. వ్యవసాయ పనులకు ఉపయోగించే డ్రోన్ల మంజూరులో సవాలక్ష నిబంధనలు విధించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడాలని, ముందుగా రైతులు బృందంగా బ్యాంకులో రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలనే నిబంధనలు విధించింది. అంతే కాకుండా బ్యాంకులు మిగిలిన సొమ్మును రుణంగా ఇస్తాయని, అనంతరం సదరు రైతు సంఘానికి డ్రోన్‌ను అందించే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. డ్రోన్ ఉపయోగంలోకి వచ్చిన తర్వాత రాయితీ సొమ్ములు రైతు సంఘం ఖాతాకు జమ చేస్తామని అంటోంది. ముందే సొమ్ములు ఉంటే రైతులే కొనుగోలు చేసుకుంటారనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా డ్రోన్లు అందించడంలో నిబంధనల సాకు చూపి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి సాగులో రైతులకు కూలీల కొరత ఇబ్బంది పెడుతోంది. పంటలకు మందులు, ఎరువుల పిచికారీకి డ్రోన్లు ఉపయోగపడతాయి. డ్రోన్లను సమకూర్చడం ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చని రైతులు అంటున్నారు. అలాగే సమయం, డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు. 16 మాత్రమే పలు దశల్లో.. జిల్లావ్యాప్తంగా 40 డ్రోన్లు కేటాయించగా.. 40 రైతు బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీరిలో 31 సంఘాలు గ్రూపు ఖాతాలు ప్రారంభిస్తే 18 గ్రూపులకు మాత్రమే బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి. 16 గ్రూపులు డ్రోన్ల కొనుగోలు, ఇతర దశల్లో ఉన్నాయి. కనీసం సగం గ్రూపులకు కూడా ఇప్పటికీ బ్యాంకులు మంజూరు పత్రాలను అందించలేదు. నిబంధనలు సడలించాలి ఆధునిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయంలో మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రతి గ్రామానికీ డ్రోన్ సౌకర్యాన్ని కల్పిస్తే కూలీల కొరతను రైతులు అధిగమించవచ్చు. డ్రోన్ల పంపిణీలో నిబంధనలు సడలిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. – పంజగల నరసింహారావు, రైతు కొండలరావుపాలెం రైతులకు అందని సాంకేతిక సాయం జిల్లాలో సగం కూడా పంపిణీ కాని డ్రోన్లు ఆంక్షలపై రైతుల పెదవివిరుపు -
ఉధృతంగానే గోదావరి
ముంపులో కనకాయలంక కాజ్వే యలమంచిలి: యలమంచిలి మండలంలో గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో కనకాయలంక కాజ్వే ఆదివారం నీట మునిగింది. దీంతో కనకాయలంక ప్రజలు అడుగున్నర లోతు వరదనీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. వరదనీరు ఇంకా పెరిగితే పెరిగితే పడవలు ఏర్పాటు చేస్తామని వీఆర్వో ఘనలక్ష్మీ తెలిపారు. అయితే భద్రాచలం వద్ద వరద ఆదివారం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సోమవారం ఉదయం వరకు కాజ్‌వేపై వరదనీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. వరద ఉధృతిలో ఉన్న కనకాయలంక కాజ్‌వేను నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, తహసీల్దార్ గ్రంధి నాగ వెంకట పవన్‌కుమార్‌లు పరిశీలించి, స్థానిక అధికారులకు సహాయ చర్యలపై సూచనలిచ్చారు. వేలేరుపాడు మండలం ఎద్దెలవాగు వంతెన వద్ద నాటు పడవపై ప్రయాణిస్తున్న గిరిజనులు వేలేరుపాడు/ పోలవరం రూరల్/ పెనుగొండ/యలమంచిలి : భద్రాచలం వద్ద గోదావరి శాంతించినా దిగువన వరద పోటు కొనసాగుతోంది. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో ఎద్దెలవాగు వంతెన ఇంకా నీటమునిగే ఉంది. దీంతో వేలేరుపాడు మండలంలో 18 గిరిజన గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆదివారం ఉదయం భద్రాచలం వద్ద 33.50 అడుగులు ఉన్న నీటిమట్టం రాత్రి 8 గంటలకు 30.20 అడుగులకు తగ్గింది. అయినా వేలేరుపాడు మండలంలో దిగువనున్న కొయిదా, కాచారం, టేకుపల్లి, పేరంటపల్లి, కట్కూరు, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, బుర్రెడ్డిగూడెం, సిద్ధారం, కుంకుడు కొయ్యలపాకలు, మరో ఏడు గిరిజన గ్రామాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. దీంతో అధికారులు ఎద్దెలవాగు వంతెన వద్ద నాటు పడవ ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద 30.20 అడుగులకు పోలవరం మండలంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఆదివారం రాత్రికి స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 7.19 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం 30.20 అడుగులకు చేరుకుంది. క్రమేపీ వరద ప్రవాహం తగ్గుతోంది. ఆదివారం ఉదయానికి స్పిల్‌వే నుంచి 7.63 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తుండగా.. రాత్రికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తగ్గుతుండటంతో వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద 36.60 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రికి 30.20 అడుగులకు చేరింది. సిద్ధాంతంలో ఉధృతంగా.. పెనుగొండ మండలంలో గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఏటిగట్టు పొడవున లంక భూములను తాకుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. సిద్ధాంతం మధ్యస్థ లంకకు నీటి మట్టం చేరుకోవడంతో పడవల రాకపోకలపై నియంత్రణ విధించారు. గోదావరిలో వెళ్లవద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిద్ధాంతంలో పడవలను ఒడ్డుకు చేర్చారు. కేదారీఘాటలోని పుష్కర రేవులో ప్రతిష్టించిన లింగం గోదావరి వరద నీటిలో మునిగింది. ఘాట్‌లో మూడు పుష్కర రేవుల్లోకి వరద నీరు ఉధృతంగా రావడంతో పై మెట్ల వరకూ నీటి మట్టం చేరుకుంది. ఆచంట మండలంలో కోడేరులో పుష్కర ఘాట్ వరకూ వరద నీరు చేరింది. మరింత ఉధృతి వస్తే తప్ప ఆచంట మండలంలోని లంక గ్రామాలకు ఎలాంటి ముప్పులేదని అధికారులు తెలిపారు. మరింత ఉధృతి పెరిగితే సురక్షిత ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలని సూచించారు. భద్రాచలం వద్ద శాంతించినా ఉమ్మడి జిల్లాలో తగ్గని వరద పోటు పోలవరం ప్రాజెక్టు నుంచి 7.19 లక్షల క్యూసెక్కులు విడుదల సిద్ధాంతం ఒడ్డున పడవల రాకపోకలు నిలిపివేత ముంపులో కనకాయలంక కాజ్వే -
కూటమి మోసాలపై ప్రజల్లోకి..
ఏలూరు టౌన్ : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని.. అధికారం చేపట్టి ఏడాది గడిచినా సూపర్ 6 హామీలు అమలు చేయటంలో ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంధ్రనాథ్ విమర్శించారు. వైఎస్సార్సీపీ ఏలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఏలూరు పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి నిర్వహించారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ నాయకత్వంలో చేపట్టిన సమావేశానికి ఏలూరులోని పార్టీ నేతలు, శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశీలకుడు రవీంధ్రనాథ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తూ 99 శాతం అమలు చేసి, ప్రజలకు సంక్షేమ పాలన అందించారని గుర్తు చేశారు. నేడు కూటమి పాలనలో సూపర్ 6 పథకాలతో పాటు మరో 146కి పైగా హామీలు ఏమయ్యాయో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే సూపర్ 6 హామీలను అమలు చేస్తామంటూ ప్రజలను నమ్మించి, నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. మనమంతా వైఎస్సార్సీపీ కుటుంబమని.. సమష్టిగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని, ప్రజలకు మంచి జరిగేలా చేద్దామని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం ఎక్కడ?: కారుమూరి సునీల్ వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచిత్ర పాలన సాగుతుందని, సీఎం చంద్రబాబు ఇటీవల తల్లికి వందనం పథకం తన కొడుకు లోకేష్ ఆలోచనలోంచి వచ్చిందంటూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తామంటూ వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ ఉన్నారో తెలియదని, ఆయన మాటలకు కూటమిలో పవర్ లేదన్నారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఎవరో చేసిన పనులను తానే చేసినట్లు చెప్పుకోవటంలో టీడీపీ నేతలు సిద్దహస్తులన్నారు. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అమలు చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు శ్రమించారని గుర్తు చేశారు. ప్రజలకు వెన్నపోటు: విజయరాజు చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి పాలనలో చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఆయన చేసిన మోసాన్ని ప్రజలకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. డైవర్షన్, రెడ్‌బుక్ పాలిటిక్స్ మాత్రమే ఉన్నాయని, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం కూటమికి లేదన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీ అన్నారని, ఏడాది గడిపేశారని పోస్టుల భర్తీ ఎప్పటి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. పేదలకు భరోసా జగన్: మామిళ్లపల్లి ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ.. నాడు కూటమి నేతలకు రాష్ట్ర బడ్జెట్ గురించి తెలియకుండానే హామీలు ఇవ్వడం ప్రజలను మోసం చేసేందుకేనా అంటూ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. నవరత్నాల పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, ఆయన హయంలో పేద కుటుంబాలకు భరోసా కల్పించారని చెప్పారు. సమావేశానికి ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఎంఆర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, కార్పొరేటర్లు తుమరాడ స్రవంతి, కిలాడి జ్యోతి, ఇనపనూరి కేదారేశ్వరి, తంగెళ్ళ రాము, ఇమ్మానుయేల్ జయకర్, నిర్మలజ్యోతి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షులు పల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకపల్లి గణేష్, గేదెల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 హామీల అమలుకు ఉద్యమం ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో వక్తలు -
17న ట్రిపుల్ఐటీ రెండో విడత కౌన్సెలింగ్
నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ఐటీల్లో మిగిలిన సీట్లకు ఈనెల 17న రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన విద్యార్థులకు సమాచారం పంపించామన్నారు. ట్రిపుల్ఐటీకి ఎంపికైన విద్యార్థులు ఇడుపులపాయకు నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైక విద్యార్థులు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలన్నారు. ఎన్సీసీ, క్రీడా కోటాకు సంబంధించిన ఎంపిక జాబితా సంబంధిత అధికారుల నుంచి రావాల్సి ఉందని తెలిపారు. నేటి నుంచి ట్రిపుల్ఐటీల్లో పీయూసీ తరగతులునూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సోమవారం నుంచి పీయూసీ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. నూజివీడుతో కలిపి మొత్తం పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు 3,300 మంది అవుతున్నారు. పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు ఇంత మంది ఒకే క్యాంపస్‌లో ఉండటం ఇదే తొలిసారి. దీంతో మున్ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని ట్రిపుల్ఐటీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుండడం గమనార్హం. -
అధికారులూ.. వరదలపై అప్రమత్తం
ఏలూరు(మెట్రో): జిల్లాలో వరద తగ్గే వరకూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కుక్కునూ రు, వేలేరుపాడు మండలాల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరదల కారణంగా ఒక్కరికీ ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా చూడాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలన్నారు. నిండు గర్భిణులను సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని, పునరావాస కేంద్రాల్లో జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, తాగునీరు, వంట సామగ్రి, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహించే కల్వర్టులు, కాజ్‌వేలు, రహదారులను ముందస్తుగా మూసివేయాలన్నారు. వరదల కారణంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. -
ఏ క్షణాన కూలుతుందో..
ఆకివీడు: స్థానిక వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ) సమీపంలో ఉన్న భవనం కూలడానికి సిద్ధంగా ఉన్నా ఆ భవనంలోనే విద్యా సంస్థను నడుపుతున్నారు. అందులో వార్డు సచివాలయ కార్యాలయం ఉంది. అన్ని అంతస్తుల్లోనూ పెచ్చులూడిపోయాయి. పిల్లర్లలో వేసిన కాంక్రీట్ పూర్తిగా దెబ్బతింది. బీములో కూడా ఇదే పరిస్థితి. భవనం అండర్ గ్రౌండ్ భాగంలో వర్షపు నీరు నిలిచిపోతోంది. వర్షాకాలం వస్తే చెరువును తలపిస్తుందని విద్యార్థులు, సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని సచివాలయ సిబ్బంది ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులు భవనంలోని ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు. భవనంలో విద్యాభ్యాసం కొనసాగించడం ప్రాణాలమీదకు తెచ్చుకోవడమేనని అంటున్నారు. -
వాసవీ మాతకు సారె సమర్పణ
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక ఏలూరు రోడ్డులో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ పంచాయతన క్షేత్రంలోని వాసవీ అమ్మవారికి శనివారం 250 కేజీల ఆషాఢం సారె అందజేశారు. వివిధ రకాల పండ్లు, స్వీట్లు, పూలతో పాటు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి సారెగా సమర్పించారు. ఈ సందర్భంగా విశేష పూజలు జరిగాయి. 500 మంది మహిళలు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు మారం వెంకటేశ్వరరావు, కొర్లేపర రాము, నున్నా సుందరరావు, బోగవిల్లి రమేష్, ఆలపాటి చిన్న, సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వనితా క్లబ్, వాసవీ క్లబ్, ప్రపంచ ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం
మైనింగ్ మాఫియాకు కై కలూరు నియోజకవర్గం కేజీఎఫ్ గనిగా మారింది. కూటమి పాలనలో మట్టి, ఇసుకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. 8లో uకిన్నెరసాని వాగులోకి వరద కుక్కునూరు: గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువవ్వడంతో అఽధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు ముంపు గ్రామాలను, దాచారం ఆర్అండ్ఆర్ కాలనీలోని పునరావాస కేంద్రాలను సందర్శించారు. గోదావరి వరద వేలేరు సమీపంలోని కిన్నెరసాని వాగులోకి చొచ్చువచ్చింది. వాగుకు సమీపంలోని జామాయిల్ తోటల్లోకి వరద నీరు చేరింది. -
మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: మైనింగ్ మాఫియాకు కై కలూరు నియోజకవర్గం కేజీఎఫ్ గనిగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే మట్టి, ఇసకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో పగటిపూట కాకుండా సాయంత్రం నుంచి తెల్లవార్లు టిప్పర్లతో ఇతర జిల్లాలకు తరలించేస్తున్నారు. నేషనల్ హైవే పనులు పేరు చెప్పి సీనరేజ్ చెల్లించకుండా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. శ్రీనా బంధువులైనా టిప్పర్లతో మైనింగ్ చేస్తూ బయట విక్రయిస్తే కేసులు పెట్టండిశ్రీ అని మీడియా ముందు పోలీసులకు చెప్పడం ఉత్తుత్తి మాటలని తేలిపోయాయి. హైవే పనులు చెప్పి అక్రమార్జన నియోజకవర్గంలో పెదపాలపర్రు నుంచి ఉప్పుటేరు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు రూ.275 కోట్లతో చేస్తున్నారు. ఈ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. అధికారంలోకి రాగానే హైవే పనులకు మట్టిని తరలించే వాళ్ళను కాదని, కూటమి నేతలు కొందరు టిప్పర్లతో ఇసుకను రవాణా చేస్తున్నారు. టిప్పర్లపై తీవ్ర విమర్శలు రావడంతో మార్చి 22న ఎమ్మెల్యే కామినేని నెల రోజుల్లో 5,000 టిప్పర్ల తరలింపునకు హైవేకు అవకాశం కల్పించాలన్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి హైవేకు కాకుండా బయటకు వెళ్తే సీజ్ చేయాలని ఆర్డీవో, సీఐలకు అదేశించారు. తిరిగి ఏప్రిల్ 27న హైవే పనులకు 10,000 టిప్పర్లు అవసరం ఉందని, కై కలూరు, మండవల్లి మండలాల్లో మాత్రమే అనుమతించాలని చెప్పారు. చివరకు పోలీసులు ఏర్పాటు చేసిన సరిహద్దుల్లో చెక్ పోస్టులు సైతం తీసేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అమెరికా వెళ్ళారు. ఇదే అదునుగా రాత్రి వేళ టిప్పర్లను ఇతర జిల్లాలకు కూటమి నేతలు తరలిస్తున్నారు. టిప్పర్లతో రోడ్లు ధ్వంసం టిప్పర్ల దెబ్బకు నియోజకవర్గంలో పలు రహదారులు ధ్వంసమయ్యాయి. వాస్తవానికి ఆర్అండ్బీ రహదారులు 25 నుంచి 30 టన్నులను భరించగలవు. టిప్పర్లు ఏకంగా 40 టన్నుల పైగా అధికలోడుతో వెళ్తున్నాయి. దూరాన్ని బట్టి ఒక్కో టిప్పరును రూ.10,000 నుంచి రూ.11,000 విక్రయిస్తున్నారు. ఇటీవల కై కలూరు – కలిదిండి రోడ్డును నిర్మించారు. ఈ రహదారి టిప్పర్ల కారణగా దెబ్బతింది. ప్రధానంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామమైన వరహాపట్నం రింగ్ వద్ద మరింత దారుణంగా మారింది. రాచపట్నం, గోపవరం, వేమవరప్పాడు, వెంకటాపురం, గోపాలపురం పెదగొన్నూరు, వణుదుర్రు, దేవపూడి, బొమ్మినంపాడు, శీతనపల్లి, చిగురుకోట, భైరవపట్నం, గన్నవరం వంటి ప్రాంతాల్లో మైనింగ్ కారణంగా రోడ్లు పాడవుతున్నాయి. అధిక లోడు వాహనాల కారణంగా పాడైన రోడ్డుకు రూ.20 లక్షల వరకు పరిహారం చెల్లించాలనే నిబంధన అమలు కావడం లేదు. నేషనల్ హైవే డీఈఈ సత్యనారాయణను వివరణగా కోరగా ప్రస్తుతానికి హైవే పనులకు టిప్పర్లు తిరగడం లేదన్నారు. కై కలూరు నియోజకవర్గంలో నిబంధనలు పాటించని మైనింగ్ నిర్వాహకులు ఎమ్మెల్యే కామినేని స్వగ్రామం వరహాపట్నం రోడ్డుకూ గుంతలు సీనరేజ్ చెల్లించకుండా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి నిబంధనలు గాలికి.. ఆదాయం జేబులోకి.. మైనింగ్ చేయాలంటే సవాలక్ష నిబంధనలు విధించారు. మైనింగ్ మాఫియాకు మాత్రం ఇవేవీ పట్టదు. ప్రభుత్వానికి వచ్చే రూ.కోట్ల అదాయాన్ని మాట్టి మాఫియా తమ జేబుల్లో నింపుకుంటుంది. మైనింగ్ విషయంలో టిప్పర్లకు, ట్రాక్టర్లకు ఒకే నిబంధన ఉంటుంది. ఇక్కడ ట్రాక్టర్లకు ఏకంగా అధికారులే మినహాయింపు ఇస్తున్నారు. ఇప్పటికే ఆక్వా చెరువుల కారణంగా అధిక ఉత్పత్తులతో వెళ్తున్న చేపల లోడులతో ఈ ప్రాంతంలో రహదారులు పాడయ్యాయి. ఇప్పుడు మట్టి టిప్పర్లతో మరింతగా ధ్వంసమవుతున్నాయి. ఇప్పటికై న జిల్లా అధికారులు మట్టి అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆషాఢంలోనూ తగ్గని భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: ఆషాఢ మాసం అయినప్పటికీ శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గలేదు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య కై కలూరు: జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలిదిండి మండలం మూలలంకలో శనివారం జరిగింది. కలిదిండి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మామిడిశెట్టి రాము(45) భార్య రెండేళ్ళ క్రితం బతుకుదెరువు నిమిత్తం కువైట్ వెళ్ళింది. వీరికి పాప, బాబు సంతానం. పాప వసతిగృహంలో చదువుతోంది. బాబు తండ్రి వద్దే ఉంటున్నాడు. రాము చేపల చెరువులపై పనులు చేస్తాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదుపై ఎస్సై వి.వేంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేకలను కబళిస్తున్న వింత వ్యాధి ఆగిరిపల్లి: మండలంలోని వడ్లమాను గ్రామంలో గత మూడు రోజుల నుంచి వింత వ్యాధితో మరణించడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామానికి చెందిన సాదం స్వామికి 50 మేకలుండగా.. గురువారం ఒక మేక నురగ కక్కుతూ మృతి చెందింది. ఆ వ్యక్తి మందులు వేసినా శుక్రవారం మరో నాలుగు మేకలు మరణించాయి. శనివారం నాలుగు మేకలు పొట్ట ఉబ్బి నురగ కక్కుతూ చనిపోయాయి. ఎంపీటీసీ రాణి మేకల సత్యనారాయణ ఆగిరిపల్లి పశువైద్యాధికారి హనుమంతరావుకు సమాచారం అందించారు. ఆయన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మేకలను పరీక్షించి వైద్యం అందజేశారు. ఇదే విషయమై పశు వైద్యాధికారి హనుమంతరావుని సంప్రదించగా శ్రీకాప్రియన్ క్లోరో న్యుమోనియ్ఙోఅనే బ్యాక్టీరియా వల్ల మేకలు మరణించవచ్చని తెలిపారు. శాంపిల్స్ ఏలూరు ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. వైద్యం అందించిన ఇంకా పది మేకల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు స్వామి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. -
ఆషాఢం
సంప్రదాయ సమ్మేళనం ● జిల్లాలో ఆధ్యాత్మిక శోభ ● అమ్మవార్లకు సారెలు, విశేష అలంకరణలు ● ఇళ్లలో తెలగ పిండి, మునగాకు వంటకాలు ● ఆడపడుచుల చేతికి గోరింటాకు లేపనాలు ● చక్కర్లు కొడుతున్న కొత్త జంటలు ● దుకాణాల్లో ఆఫర్ల మేళాలు సాక్షి, భీమవరం: సంస్కృతి, సంప్రదాయాల పుట్టిల్లు తెలుగు నేల. ప్రకృతితో మమేకం చేస్తూ ఇక్కడి ప్రతి నెలకి ఏదోక విశిష్టత ఉంటుంది. అందులోనూ నాలుగో నైలెన ఆషాఢ మాసం మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. వాతావరణాన్ని చల్లబరుస్తూ తొలకరి వర్షాలు, పొంగి ప్రవహించే కాలువలు, వరి నాట్లుతో పచ్చ తివాచీని పరుచుకునే పంట పొలాలు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, ప్రత్యేక వంటకాలు, ఆచారాలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ నెలను ఆషాఢ మాసంగా పిలుస్తారు. మిగిలిన నెలలతో పోలిస్తే శూన్య మాసంగా భావించి శుభకార్యాలు తలపెట్టనప్పటికి దేవతారాధనకు ఇదే సరైన సమయంగా పెద్దలు చెబుతారు. ఆషాఢంలోని తొలి ఏకాదశి రోజునే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్లేది. హిందువుల తొల పండుగ కూడా ఇదే. గురు పౌర్ణమి, స్కంధ షష్ఠి తదితర పర్వదినాలు జరుపుకుంటారు. జిల్లాలోని గ్రామ దేవతలకు ఆషాఢం సారెలు, మొక్కుబడులు సమర్పించుకోవడం అనాదిగా వస్తోంది. భీమవరం మావూళ్లమ్మ, రాయకుదురు మావూళ్లమ్మ, మహాలక్షి, ఏలూరుపాడులోని ముసలమ్మ, ఎల్లమ్మ, మోగల్లులోని పెన్నేరమ్మ, మారమ్మ, గంగాదేవి అమ్మవార్లు, జిల్లాలో పేరొందిన గ్రామ దేవతల ఆలయాల్లో ఆషాఢ మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. శాఖాంభరిగా, ప్రత్యేక అలంకరణల్లో అమ్మవార్లు భక్తులకు దర్శనిమిస్తున్నారు. నవ దంపతుల చక్కర్లు కొత్తగా పెళ్లైన జంట ఆషాఢంలో అత్తవారింటి గడప దాటకూడదని సంప్రదాయం. ఈనెల్లో దంపతులు కలిస్తే తొమ్మిది నెలల తర్వాత మండు వేసవిలో కాన్పు వచ్చే అవకాశం ఉంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆ రోజుల్లో ఇది తల్లీబిడ్డకు మంచిది కాదు. తొలకరి జల్లులతో సార్వా పనులు మొదలయ్యేది ఇప్పుడే. కొత్త పెళ్లికొడుకు పొలం పనులకు పోకుండా భార్య కొంగు పట్టుకుని తిరిగితే తిండి గింజలకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నది ఒక కారణం. అనుభవ జ్ఞానంతోనే పూర్వీ కులు ఆషాఢం వేళ కొత్తజంట అత్తింటి గడప దాటకూడదనే ఆచారం తెచ్చారంటారు. అయినా ఇంటిలోని వారికి ఏవో సాకులు చెప్పి నవ దంపతులు చక్కర్లు కొట్టడం, ఏమీ తెలీనట్టుగా అత్తమామలు లోలోపల మురిసిపోవడం ప్రతి ఇంటా జరిగే తంతే. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో పార్కులు, పేరుపాలెం బీచ్, ఇతర పర్యాటక కేంద్రాలు కొత్త జంటలతో కళకళతాడుతున్నాయి. గోరింట పూస్తుంది ఆరేళ్ల పాపాయి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు అరచేతులు, కాళ్లకు పారాణిగా గోరింటాకు పెట్టుకునేందుకు ఉత్సాహపడతారు. పల్లెల్లోని అమ్మ మ్మలు, నానమ్మలు గోరింటాకును రుబ్బించి పట్టణాల్లోని తమ కుమార్తెలు, కోడళ్లు, మనవరాళ్లకు పంపిస్తుంటారు. ఈ సీజన్లో గోరింటాకు పెట్టుకోవడం వెనుక శాసీ్త్రయ కారణంగా ఉంది. వర్షాల వలన ఇంట్లో పనులు చేసుకునే మహిళల కాళ్లు, చేతులు పగుళ్లు తీస్తుంటాయి. గోరింటాకు పగుళ్లు రాకుండా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబు తున్నారు. ఇలా ఆషాఢ ఆచారాలు ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య కారకాలుగా ఉన్నాయి. అన్నింటా ఆఫర్ల మేళా ఆషాఢం వేళ అన్నింటా ఆఫర్ల మేళానే. జిల్లాలో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, నూజివీడు తదితర పట్టణాల్లోని క్లాత్, రెడీమేడ్, జ్యూయలరీ, కాస్మోటిక్స్ షోరూంలతో పాటు మండల కేంద్రాల్లోని చిన్న దుకాణాల్లో సైతం ప్రస్తుతం ఆషాఢం ఆఫర్లు నడుస్తున్నాయి. మహిళల్ని ఆకర్షించి అమ్మకాలు ఆషాఢం సేల్ అంటూ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంటకాలూ ప్రత్యేకమే వర్షాలతో శరీరం చల్ల బడి నజ్జు చేయడం, ప్రతికూల వాతావరణంతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వీటికి నివారణగా తెలగపిండి–మునగాకు, పప్పు–వాగ కాయలు ఈ ఆషాఢ మాసంలో వండుకోవడం జిల్లా అంతటా కనిపిస్తుంది. గ్రామల్లో నివసించే వారు పట్ట ణాల్లోని తమ వాళ్లకు ప్రత్యేకంగా వండి పంపిస్తుంటారు. వీటిలోని పోష కాలు శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆషాఢంలో ఒక్కసారైన ఈ కూరలు తినాలనేది ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈ సీజన్లో వచ్చే నేరేడుపండ్లు, తాటికాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అరుదైన కాలం ఆషాఢం ఆషాఢ మాసం అన్ని నెలల్లోనూ అరుదైనది. సూర్యుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. వీటిని తట్టుకునేలా మనుషులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వచ్చే మార్పుల ప్రభావం వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. పండితులు చాతుర్మాస దీక్షలు చేపడతారు. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం పెనవేసుకున్నా మాసం ఆషాఢం. – రామశాస్త్రి, పండితులు, ఆకివీడు -
కోకో బోర్డు ఏర్పాటు చేయాలి
పెదవేగి: రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని వంగూరులో కోకో రైతు సదస్సు నిర్వహించా రు. సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి పానుగంటి అచ్యుతరామయ్య అధ్యక్షత వహించారు. సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాల ను ఆమోదించారు. అనంతరం కె.శ్రీనివాస్ మా ట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో కోకో సాగును ప్రోత్సహిస్తామని చెబుతున్నా.. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోకో గింజలను మార్కెట్లో విక్రయించడానికి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో లక్ష ఎకరాలు పెంచితే ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోతే కోకో రైతులకు మరిన్ని అవస్థలు తప్పవన్నారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని, విదేశీ కోకో గింజలు దిగుమతులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర వ చ్చేలా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి అమలు చేయాలని కోరారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుదిబండి వీరారెడ్డి మాట్లాడుతూ కోకో రైతులంతా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి భవి ష్యత్తులో కోకో గింజలను తామే మార్కెటింగ్ చేసుకునేలా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆలపాటి వాసు, పానుగంటి నరేష్, కొండపల్లి స త్యనారాయణ, గోపిశెట్టి శ్రీనివాస్, సింహాద్రి సతీ ష్, ఏపూరి శ్రీనివాసరావు, కొట్టే సురేష్, మామిళ్లపల్లి వెంకట్రావు, పానుగంటి సుధాకర్ పాల్గొన్నారు. -
వైద్యుడు లేకపోవడంపై గ్రామస్తుల నిలదీత
ద్వారకాతిరుమల: మండలంలోని వేంపాడులో 104 వైద్య సిబ్బందిని గ్రామస్తులు శనివారం నిలదీశా రు. వైద్యుడు లేకుండా సేవలు ఎలా అందిస్తారని మండిపడ్డారు. గ్రామంలో ప్రజలకు ప్రతినెలా 104 సేవలను అందిస్తున్నారు. అయితే గత నెల మా దిరిగా ఈ నెల కూడా వైద్యుడు లేకుండా వైద్య సిబ్బంది మాత్రమే గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. వైద్యుడు లేకుండా మీ రిచ్చే మందులను ఏ నమ్మకంతో వాడమంటారంటూ బాధితులు ప్రశ్నించారు. డాక్టర్ ఏమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యురాలు ట్రైనింగ్ నిమి త్తం ఏలూరు వెళ్లారని సిబ్బంది బదులిచ్చారు. అ యితే గత నెల ఎందుకు రాలేదని అడగ్గా, అప్పుడు డాక్టర్ వ్యక్తిగత సెలవు పెట్టారని సమాధానమిచ్చారు. డాక్టర్ లేకపోతే మరో రోజు రావచ్చుగా అ న్న ప్రశ్నకు.. మరో రోజు రావడం కుదరదని, డా క్టర్ పీహెచ్సీలో డ్యూటీ చేయాలి కదా అని సిబ్బంది సమాధానం ఇచ్చారు. డాక్టర్ వచ్చేనెల తప్పనిసరిగా వస్తారులే.. అయినా మేం మందులు ఇస్తున్నాంగా, గొడవ చేయకండి అని అన్నారు. డాక్టర్ సెలవు పెడితే మరో డాక్టర్‌ను పంపించాలి గాని, ఇలా సిబ్బందితో సేవలు అందించడం ఏంటని గ్రామస్తులు మండిపడ్డారు. -
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
హెల్ప్‌లైన్ సెంటర్లు ఇవే.. విద్యార్థులకు సహకరించేందుకు సాంకేతిక విద్యాశాఖ అధికారికంగా కొన్ని హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఏలూరు జిల్లాలో అధికారిక హెల్ప్‌లైన్ సెంటర్ ఒక్కటీ కూడా ఇవ్వలేదు. ఏలూరు జిల్లా విద్యార్థులు అధికారిక హెల్ప్‌లైన్ సెంటర్ సేవలు పొందాలంటే తణుకులోని ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్ళాలి. విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ డిగ్రీ కళాశాల, స్టెల్లా కాలేజ్ ఎదురుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్ళవచ్చు. కాకినాడలోని ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ కాకినాడల్లో ఏర్పాటు చేసిన అధికారిక హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్ళవచ్చు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నేటి నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. ర్యాంకులు సాధించడం ఒక ఎత్తయితే అనుకున్న కళాశాలల్లో సీట్లు సాధించడం మరొక ఆప్షన్ల ఎంపికలో తొందరపడితే భవిష్యత్‌పై ప్రభావం పడుతుందంటున్నారు. అందువల్ల ఆచితూచి ఆప్షన్లు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మంచి ర్యాంకులు సాధించిన వారు సీఎస్‌ఈకే మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కొత్తగా ఒక ట్రెండ్ నడుస్తోంది. ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆయా ప్రాంతాల్లోని ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులకు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. తమ కళాశాలకు తొలి ప్రాధాన్యతగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా ఇంటర్నెట్ సెంటర్‌కు వచ్చే విద్యార్థులతో ఒప్పించి ఆప్షన్ పెట్టిస్తే ఒక్కో విద్యార్థికి రూ.5 వేల కమిషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో పాటు వివిధ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు కూడా ఆయా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇలాంటి ఆఫర్లనే ఇస్తున్నారని తెలిసింది. ఆయా లెక్చరర్ల ద్వారా తమ కళాశాలలో విద్యార్థులను చేర్చితే లెక్చరర్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ఇస్తున్నారంటున్నారు. దళారులను నమ్మొద్దు అయితే ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు, మరికొందరి మాటలు నమ్మితే విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందంటున్నారు. బాగా నమ్మకస్తులైన వారి సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కొంతమంది కేవలం తాము చెప్పిన కళాశాలకే ఆప్షన్ పెట్టి మరే ఆప్షన్ అవసరంలేదని నమ్మిస్తున్నారని తెలుస్తోంది. అలా చేస్తే సాంకేతిక కారణాల వల్ల సీటు రాకపోతే రెండో కౌన్సెలింగ్ వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో తమకు ఆశించిన కళాశాలలో సీటు కోల్పోయే ప్రమాదముంటుందని చెబుతున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలో పాస్‌వర్డ్‌ను ఎవరికీ చెప్పవద్దని సూచిస్తున్నారు. ఇటీవల వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు నేరుగా తమకు సమీపంలోని కళాశాలలకే వెళుతున్నారని, అక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చే క్రమంలో పాస్వర్డ్ వారికి చెప్పాల్సి వస్తోందని, ఆ సందర్భం వస్తే విద్యార్థులే వారి పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తామని సంబంధిత వ్యక్తులకు ఖరాఖండిగా చెప్పాలని సూచిస్తున్నారు. వారికి వచ్చే ఓటీపీని కూడా ఇతరులతో పంచుకోవద్దని చెబుతున్నారు. ఇలా చేస్తే విద్యార్థుల ఎదుట వారు చెప్పిన క్రమంలోనే ఆప్షన్లు ఇచ్చినా వారు వెళ్ళిన తరువాత వారే ఆప్షన్లు మార్చే అవకాశముందంటున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు ఇలా.. ఇంజనీరింగ్ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఏలూరు జిల్లాలో మొత్తం 6 ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల, హేలాపురి ఇంజనీరింగ్ కళాశాల ఏలూరు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. ఆగిరిపల్లిలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల, నూజివీడులో సారధి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ఈ ఏడాది విద్యార్థులకు ఆయా బ్రాంచుల్లో మొత్తం 4920 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 14 ఇంజినీరింగ్ కళాశాలలుండగా దాదాపు 14,600 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 6, పశ్చిమ గోదావరిలో 14 ఇంజినీరింగ్ కాలేజీలు ఆచితూచి ఆప్షన్లు పెట్టుకోవాలంటున్న నిపుణులు -
ఉధృతంగా గోదావరి
‘కళ్ల కలక’లం వర్షాకాలం కావడంతో జిల్లాలో కళ్ల కలకతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 8లో uఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025పోలవరంలో క్రమేపీ పెరుగుతూ.. పోలవరం రూరల్: గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదుల నీరు చేరడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.430 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 7,43,222 క్యూసెక్కుల నీరు దిగువకు చేరు తోంది. అయితే భద్రాచలం వద్ద శనివారం ఉద యం 11 గంటలకు 41.30 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమేపీ స్వల్పంగా తగ్గుతూ రాత్రికి 41 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద వరద స్వల్పంగా తగ్గుతూ నిలకడగా ప్రవహిస్తోంది. దిగువన వరద స్వల్పంగా పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద పోటెత్తుతోంది. పూర్తి జలకళతో గోదావరి, శబరి నదులు ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుంది. ముంపు మండలాలైన ఏజెన్సీ గ్రామాలను అతలాకుతలం చేస్తూ పోలవరం నుంచి ధవళేశ్వరం మీదుగా లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 7,43,222 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరోవైపు మండలాల్లోని మూడు గ్రామాలకు చెందిన ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలించారు. ముంపు మండలాల్లో హైఅలర్ట్ గోదావరికి వరద ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ముంపు మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరికి పది రోజులుగా భారీగా వరద నీరు చేరు తుంది. ఈనెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు శుక్రవారం 5,02,478 క్యూసెక్కులు, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 7,43,222 క్యూసెక్కులు నీరు పోలవరానికి చేరింది. భద్రాచలం వద్ద 41.30 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. మరోవైపు ఆదివారం, సోమవారం గోదావరి నిలకడగా కొనసాగే అవకాశం ఉందని, ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో తీవ్రత కొంత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 2 నుంచి శనివారం వరకు 30.52 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరానికి చేరుకుంది. పోలవరం నుండి దిగువకు విడుదల చేశారు. ముంపు గ్రామాల్లో భయం.. భయం పోలవరం ముంపు గ్రామాల్లో వరద భయం వెంటాడుతోంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మూడు గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కుక్కునూరు మండలంలోని గొమ్ముగూడెం, లచ్చిగూడెం గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు దాచారంలోని ఆర్అండ్ఆర్ కాలనీకి తరలించారు. వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ముగూడెంకు చెందిన సుమారు 100కు పైగా కుటుంబాలు పునరావాస కాలనీకి తరలివెళ్లాయి. అలాగే రాష్ట్రం విపత్తుల నివారణ దళం సభ్యులు (ఎన్డీఆర్ఎఫ్) రెండు మండలాలకు చేరుకున్నారు. ఒక్కో మండలంలో 35 మంది బృందంతో అత్యవసర సేవలందించడానికి వీలుగా సిద్ధం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రంలో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు వేలేరుపాడు, కోయిదా, ప్రధాన రహదారిపై ఉన్న ఎద్దులవాగు వంతెన గోదావరి వరద పొంగిపొర్లడంతో వంతెన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు శివారులో వేలేరు వద్ద కిన్నెరసాని వాగుకు వరద నీరు చేరడంతో సమీపంలోని పొలాల్లోకి వరద నీరు పోటెత్తింది. అలాగే కుక్కునూరు మండలంలో గుండేటివాగు లోలెవల్ వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. న్యూస్‌రీల్ 7.43 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల వేలేరుపాడు, కుక్కునూరులో పునరావాస కేంద్రాలు నిలకడగా శబరి, గోదావరి రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం నీటమునిగిన ఎద్దులవాగు, గుండేటివాగు వంతెనలు వేలేరుపాడులో 18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు -
జెడ్పీ చైర్పర్సన్ కారుపై దాడి అమానుషం
కై కలూరు: కూటమి పాలనలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ముదినేపల్లి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కో మటి విష్ణువర్థన్ అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ గుడివాడలో జరిగే పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు అద్దాలను పగలగొట్టి కూటమి గూండాలు బీభత్సం చేయడం అత్యంత బాధాకరమన్నారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దాడులు దేనికి సంకేతం? దెందులూరు: కృష్ణా జిల్లాపరిషత్ చైర్పర్సన్ హారికపై దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు అన్నారు. శనివారం సాక్షితో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజానీకంతో పా టు జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందనే విషయాన్ని ఈ దాడి నిరూపించిందన్నారు. వెంటనే న్యాయస్థానాలు ఈ ఘ టనను సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ప్రభు త్వం సీరియస్‌గా స్పందించి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు. -
తప్పిన ముప్పు
దెందులూరు: జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సీతంపేట పాల డెయిరీ వద్ద అత్యంత వేగంతో లారీని వెనుక నుంచి వైజాగ్ నుంచి చైన్నె వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ, హైవే సేఫ్టీ పోలీస్ సిబ్బంది బాధితులను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వేరే బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించారు. 54 మంది ప్రయాణికులు సురక్షితం ముగ్గురికి స్వల్ప గాయాలు -
‘కళ్ల కలక’లం
దెందులూరు: శరీరంలో ఏ భాగానికి అనారోగ్యం వచ్చిన తట్టుకోవచ్చు కానీ కళ్లకు చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేం. వర్షాకాలం కావడంతో జిల్లాలో కళ్ల కలకతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వైరస్ వల్ల సోకే ఈ అంటువ్యాధి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు కళ్ళు ఎరుపుగా మారి వెలుతురు చూడలేకపోవడం. కంటి నుంచి నీరు కారటం, దురద, మంట, పుసులు కట్టడం, కన్ను నొప్పి. వ్యాధి వ్యాప్తి కళ్ల కలక ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు వ్యాధి లేని మరో వ్యక్తి తాకి కళ్లను ముట్టుకోవడం వల్ల ఇది వ్యాపిస్తుంది. నివారణ చర్యలు గోరువెచ్చని నీటితో కళ్లను తరచూ శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన తువాలుతో కళ్లను తుడవాలి. కళ్లద్దాలు ధరించాలి. వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. కళ్లలో మందులు వేయడానికి ముందు తరువాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి. చేయకూడనివి కళ్ల కలక ఉన్న వ్యక్తి వాడిన టవల్స్, దిండ్లు, దుప్పట్లు వేరొకరు వాడకూడదు. కళ్ళు ఎరగ్రా ఉంటే పాఠశాలకు పంపించకూడదు. కళ్ళలో ఆకుపసరు వంటివి వేయకూడదు. మూడు నుంచి నాలుగు రోజుల్లో పరిస్థితి మెరుగు పడకపోతే కంటి వైద్యుడిని సంప్రదించాలి. కళ్ల కలక విస్తరింపకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అవగాహన సమావేశాలు కళ్ల కలక లక్షణాలు, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దెందులూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నా. కళ్ల కలక విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సుందర్ బాబు, సూపరింటెండెంట్ దెందులూరు సీహెచ్‌సీ సులువుగా వ్యాపిస్తుందంటున్న వైద్యులు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం -
తీర్పులు వేగంగా వెలువరించాలి
ఏలూరు (టూటౌన్): కేసుల తీర్పులు త్వరితగతిన వెలువరించాలని, అలాగే తీర్పుల్లో నాణ్యత లోపించకూడదని న్యాయమూర్తులకు ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.సురేష్‌రెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన జ్యూడీషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సివిల్ కేసులు, విచారణలో ఉన్న ఖైదీల కేసులను త్వరితగతిన తీర్పులను వెలువరించడానికి ప్రయత్నించాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఉమ్మడి జిల్లాలో పెండింగు కేసులు వివరాలు, భవన సము దాయాల పరిస్థితులపై వివరించారు. జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. అందుబాటులో ఎరువులు ఏలూరు(మెట్రో): జిల్లాలో పుష్కలంగా ఎరువులు ఉన్నాయని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎరువులను తరలిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. 50 శాతం సొసైటీల ద్వారా, 50 శాతం ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా తరలించినా, వారి లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. 86 సొసైటీల ద్వారా 10 డీసీఎంఎస్‌ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. నేడు ప్రజా సంఘాల సదస్సు ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాల మోపడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రూఅప్, సర్దుబాటు చార్జీలు తదితర రూపాలలో అధిక బిల్లుల భారాలను ప్రజలు మోస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి కూలీలపై వివక్ష తగదు ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని పాలకవర్గాలు కుట్ర చేస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఏలూరులో ఉపాధి హామీ కూలీలు, పేదలతో కలిసి ని రసన తెలిపారు. ఉపాధి కూలీలకు వేతన బకా యిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేద న్నారు. పొమ్మన లేక పొగబెట్టే తీరుగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని, ఉపాధి కూలీలపై వివక్ష తగదని అన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎం. జీవరత్నం, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బదిలీ ఉపాధ్యాయులకు జీతాలెప్పుడు? ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇటీవల బదిలీ చేసిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు క్రియేట్ చే సి వెంటనే జీతాలు చెల్లించాలని ఫ్యాప్టో నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పవర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఫ్యాప్టో జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి తక్షణమే ఐఆర్‌ను ప్రకటించాలని, బకా యి ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్/జీపీఎస్‌లను రద్దు చేస్తూ ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశా రు. పీఎఫ్ లోన్లు, ఏపీ జీఎల్ఐ లోన్లకు దర ఖాస్తు చేసుకున్న వారి అమౌంట్లను క్రెడిట్ చేయాలని, సరెండర్ లీవులు ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకున్న వారికి వెంటనే ఆ మొత్తాన్ని ఖాతా ల్లో జమచేయాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులో పనిచేస్తున్న ఎల్పీలు, పీఈటీలకు వెంటనే జీతాలు చెల్లించాలని, 1 నుంచి 10వ తరగతి వరకూ నడుస్తున్న పాఠశాలల్లో వేర్వేరు యూడైస్లు క్రియేట్ చేసి ఎవరి పరిధిలో వారు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు పంపిణీ కాలేదన్నారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ పాల్గొన్నారు. -
ఆదుకోవాలంటూ రోడ్డు ప్రమాద బాధితుల ధర్నా
ఆగిరిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడంతో ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులతో పాటు గ్రామస్తులు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మండలంలోని నెక్కలం గొల్లగూడెంకి చెందిన పటాపంచల గంగరాజు (35) శుక్రవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై ఆగిరిపల్లి వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. గంగరాజును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. గంగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ టీడీపీ నాయకులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ కు వచ్చారు. అక్కడ చర్చలు ఫలించకపోవడంతో శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నెక్కలం గొల్లగూడెంలో ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని ధర్నా నిర్వహిస్తున్నా మంత్రి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా నిర్వహిస్తున్న ప్రభుత్వం గానీ, పార్టీ నాయకులు గాని పట్టించుకోలేదని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు వైపులా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నూజివీడు డీఎస్పీ గ్రామానికి చెందిన పెద్దలతో చర్చలు జరిపి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
రైళ్లలో ప్రత్యేక తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోకి గంజాయి, మత్తుపదార్థాలు రవాణా కాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిఘా ఏర్పాటు చేశామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఈగల్ ఐజీ రవికృష్ణ ఆదేశాల మేరకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో ఏలూరులో పోలీస్, రైల్వే పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి రైలులో తనిఖీలు చేశారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు రవాణా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే 1972కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. విద్యుత్ రెవెన్యూ అధికారిగా బాధ్యతల స్వీకరణ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈపీడీసీల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని ఏలూరు డివిజన్ విద్యుత్ అసిస్టెంట్ రెవెన్యూ అధికారిగా టీ.వెంకాయమ్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం డివిజన్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకాయమ్మకు ఇటీవల సంస్థ సీఎండీ ఏఏఓగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఉన్నత విద్యామండలి తీరు దారుణం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రోజుకో మాట పూటకో విధానంలా ఉన్నత విద్యామండలి తీరు ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి కె.లెనిన్ అన్నారు. శుక్రవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ డ్యూయల్ డిగ్రీ విధానం అమలు పరుస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చి తిరిగి రివ్యూ చేసి సింగిల్ మేజర్ విధానం కొనసాగిస్తామని పేర్కొనడం హాస్యస్పదమన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టేక్ హెూల్డర్స్తో సంప్రదించకుండా ఇష్టానుసారంగా నెలకో నిర్ణయం చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని దుయ్యబట్టారు. గత నిర్ణయానికి అనుగుణంగా డిగ్రీలో డ్యూయల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా ఇంటర్న్‌షిప్ భారాన్ని తగ్గించి, మైనర్ సబ్జెక్టులకు క్రెడిట్ పాయింట్స్ పెంచాలని కోరారు. విద్యార్థి చదువుకు తగ్గట్టుగా ఇంటర్న్‌షిప్ ఇవ్వాలని, ఇంటర్న్‌షిప్ చేస్తున్న సందర్భంలో విద్యార్థులకు తగిన స్టైఫండ్ ఇచ్చే విధంగా సంబంధిత పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలవడి మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించకపోవడం దుర్మార్గమన్నారు. ఆఫ్‌లైన్ పద్ధతిలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బీజీబీఎస్ పాలకవర్గ ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
నరసాపురం: బీజీబీఎస్ మహిళా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్, పాలకవర్గంపై ఆగడాలపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న నలుగురు మహిళా అధ్యాపకులు గత 15 రోజులుగా కళాశాల వద్ద ఆందోళన చేస్తున్నసంగతి తెలిసిందే. తమను అకారణంగా విధులు నుంచి తొలగించి పాలకవర్గం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం అధ్యాపకులకు మద్దతుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు మాట్లాడుతూ కళాశాల ఆస్తులు అమ్మకానికి పెట్టడం, మహిళా అధ్యాపకులపై లైగింక వేధింపులకు పాల్పడం దారుణమన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ, సీపీఎం నేత కవురు పెద్దిరాజు, కోట్ల రామ్‌కుమార్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల విలీనంపై మిన్నంటిన నిరసన
సర్పంచ్ ప్రియాంక నిరహార దీక్షను అడ్డుకున్న పోలీసులుపెనుమంట్ర: పెనుమంట్ర దళితవాడలోని ఎలిమెంటరీ పాఠశాలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక, ప్రసన్న కుమార్ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా దీక్ష చేయడానికి ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అనుమతులు లేవంటూ ఉదయమే పోలీసులు తొలగించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రియాంక దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేలపైనే బైఠాయించారు. వీరికి మద్దుతుగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా నేలపైనే బైఠాయించి అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మండల విద్యాశాఖ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన విషయాన్ని తెలుసుకున్న ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర, పోడూరు జెడ్పీటీసీ సభ్యులు కర్రి గౌరీ సుభాషిని, గుంటూరు పెద్దిరాజులతో పాటు పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సర్పంచ్ ప్రియాంకకు మద్దతుగా నిలిచారు. తహసీల్దార్ వై.రవికుమార్, ఎస్సై స్వామి నాయకులతో గంటకు పైగా చర్చించిన అనంతరం విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కొద్ది రోజుల్లోనే న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్ ప్రియాంకతో పాటు తల్లిదండ్రులు నిరసన విరమించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు వాసంశెట్టి కిరణ్, ఈది అనిత ప్రవీణ్, మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు తమనంపూడి వీర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు, సర్పంచ్ గూడూరు దేవేంద్రుడు, నాయకులు కొవ్వూరి వేణుమాధవ్ రెడ్డి, కర్రి రామలింగేశ్వరరెడ్డి, సత్తి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): మున్సిపాల్టీ, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఇంజినీరింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నా ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఏ.అప్పలరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ, కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈనెల 15న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పి.కిషోర్, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, నాయకులు బుగత జగన్నాథరావు, పోలా భాస్కరరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు బి.నారాయణ రావు, ఎస్.శ్రీనివాస రావు, డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
●అదుపు తప్పితే అంతే
పొట్టకూటి కోసం కొందరు కూలీలు ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. వాహనాల పైన, వెనుక కూర్చుని ప్రయాణిస్తున్నారు. అదుపు తప్పితే ఎంతటి ప్రమాదానికి గురి కావాల్సి వస్తుందనే కనీస విషయాన్ని పట్టించుకోవడం లేదు. నిత్యం రహదారులపై ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు సాగించే వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. శుక్రవారం ద్వారకాతిరుమల వైపు నుంచి భీమడోలు వైపుగా వెళుతున్న ఒక లోడు లారీపై కూలీలు ఇలా ప్రయాణిస్తూ కనిపించారు. – ద్వారకాతిరుమల -
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
తణుకు అర్బన్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ విమర్శించారు. తణుకు సీపీఎం భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడ బిడ్డ నిధి, ఉచిత బస్సు హామీల అమలుకోసం మహిళలు వేచిచూస్తున్నారని అన్నారు. విద్యుత్ బిల్లులు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి నేడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ఇంధన సర్దుబాటు చార్జీలుగా వేయడం దుర్మార్గమని అన్నారు. మరో రూ.842 కోట్ల విద్యుత్ భారాన్ని బిల్లుల్లో కలిపేందుకు ప్రతిపాదన చేస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టమని అప్పట్లో మంత్రి లోకేష్ అన్నారని నేడు యథేచ్ఛగా బిగిస్తున్నారని అన్నారు. నేటికీ ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారని స్పష్టం చేశారు. తమ సైకిల్ యాత్రలో ప్రజలు ఈ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జిల్లా విస్త్రృతస్థాయి సమావేశాలు తణుకులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ పుస్తకాలను ఆవిష్కరించారు. -
లైంగిక వేధింపులపై చర్యలు ఎప్పుడు ?
దెందులూరు: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి తొత్తడి వేదకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దెందులూరులో విలేకరులతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీకి మద్యం సేవించి వస్తున్నప్పటికీ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క జిల్లాలో ఉన్న హోం మంత్రి సైతం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వేధింపులకు పాల్పడిన ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలన్నారు. తూతూ మంత్రంగా సస్పెండ్ చేస్తే 10 రోజుల తర్వాత మళ్లీ కళాశాలకు వస్తారని.. బాధితులకు భద్రత ఏం ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గణేష్ ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా లంకలపల్లి వెంకట గణేష్‌ను నియమించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావటం పట్ల గణేష్ ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. హమాలీల కూలి రేట్లు పెంచాలి ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరంలో మర్చంట్ అండ్ చాంబర్ పరిధిలో హమాలీ కార్మికులకు కూలీ రేట్ల పెంపుదలలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏలూరు వైఎంహెచ్ఏ హాలు నుంచి విజ్ఞాపన యాత్రను శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయం వద్దకు పదర్శన చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల విషయంలో సానుకూలంగా ఉండాలన్నారు. ఐఎఫ్టీయు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల కాల పరిమితి ముగిసినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని, అది సరి కాదన్నారు. ఎస్ఎస్సీ మార్కుల లిస్టు ఇంటికే ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్, ఎస్ఎస్సీ కోర్సులకు ఇటీవల నిర్వహించిన పరీక్షలకు సంబంధించి పాస్ సర్టిఫికెట్లు అభ్యర్థుల ఇంటికే వస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ప్రవేశాల సమయంలో ఇచ్చిన చిరునామాలకు స్పీడ్ పోస్ట్ ద్వారా పాస్ సర్టిఫికెట్లతో పాటు మైగ్రేషన్ కం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లను పంపినట్టు తెలిపారు. ప్రైవేట్ జూనియర్ కళాశాల వద్ద ఉద్రిక్తత భీమవరం: భీమవరం పట్టణంలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల వద్ద ర్యాగింగ్ అంటూ కలకలం రేగింది. బైపాస్ రోడ్డులోని ఈ జూనియర్ కళాశాలలో ఈ నెల 5న జూనియర్, సీనియర్ విద్యార్థుల వద్ద టాయిలెట్ల వద్ద వివాదం ఏర్పడింది. వివాదానికి కారణమైన ఏడుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలిసింది. బాధిత విద్యార్థుల్లో ఒక విద్యార్ధి తండ్రి శుక్రవారం కళాశాలకు చేరుకుని వివాదం వివరాలు తమకెందుకు చెప్పలేదంటూ కళాశాల ప్రిన్సిపల్‌ను నిలదీశారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. దీనిపై ఇంటర్మీడియట్ జిల్లా అధికారి జి.ప్రభాకరరావును వివరణ కోరంగా వివాదం తన దృష్టికి రాలేదని, వివరాలు తీసుకుంటానన్నారు. -
ముంచెత్తుతున్న వరద
గోతుల యాతన తీరేదెన్నడు? ఏలూరులో రోడ్లన్నీ గోతులమయం. ఏదో గోతిలో పడి వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. వర్షం పడితే ఏది గొయ్యో, ఏది గొప్పో తెలియడం లేదు. 8లో uశనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద సీజన్ వచ్చేసింది. శుక్రవారం ఒకేరోజు 6.35 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరానికి పోటెత్తింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అప్రమత్తమయ్యారు. ఎద్దులవాగు వంతెన పైకి నీరు చేరి శుక్రవారం అర్ధరాత్రికి నీటమునిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. మరో మూడు రోజులు పాటు వరద ఉధృతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి ఉపనది శబరి వరద నీటితో పోటెత్తుతోంది. గత వారం రోజులుగా రోజూ సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం మీదుగా సముద్రంలో వరద నీరు కలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆకస్మాత్తుగా వరద తీవ్రత రెట్టించింది. ఏటా జూలై, ఆగస్టు నెలలో గోదావరికి వరదలు పోటెత్తడంతో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని లంక గ్రామాలున్న యలమంచిలి, ఆచంట మండలాల్లో వరద తీవ్రత ఉంటుంది. ప్రధానంగా ముంపు మండలాల్లో రాకపోకలు నిలిచిపోయి.. వందలాది ఇళ్ళు జలదిగ్భందంలో చిక్కుకుంటాయి. ఈ పరిణామాల మధ్య ఈ ఏడాది కూడా గోదావరి వరద తీవ్రత శుక్రవారం ఆకస్మాత్తుగా పెరగడంతో ఏజెన్సీ మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారుఉ. రాత్రి 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద 37.60 అడుగులకు నీటిమట్టం చేరింది. 6,98,510 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి 8 గంటల సమయానికి పోలవరం నుంచి దిగువకు 6,35,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద తీవ్రత శనివారం మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని, 7.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉందని అధికారుల అంచనా. మహారాష్ట్ర, తెలంగాణాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వరద తీవ్రత మొదలైంది. న్యూస్‌రీల్ పోలవరం నుంచి 6.35 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఏజెన్సీలో నీటమునిగిన ఎద్దులవాగు వంతెన 18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు మరో మూడు రోజులు ఉధృతి కొనసాగే అవకాశం ఏజెన్సీలో అప్రమత్తం జలదిగ్బంధంలో ఎద్దులవాగు వంతెన వేలేరుపాడు–కొయిదా మార్గంలోని ఎద్దులవాగు వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం రాత్రికి పూర్తిగా నీటమునిగింది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండల కేంద్రానికి జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. కుక్కునూరు– దాచారం రహదారిలో గుండేటివాగు ఉధృతంగా ప్రవహించి వంతెన నీటమునిగింది. దీంతో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే కుక్కునూరు మండలంలో దాచారం, గొమ్ముగూడెం పంచాయితీ నలువైపులా నీరు చేరి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గొమ్ముగూడేనికి చెందిన 15 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించారు. ముంపు ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో పర్యటన వేలేరుపాడు/కుక్కునూరు/పోలవరం రూరల్ : ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఐటీడీఏ పీవో రాములనాయక్ పర్యటించారు. కుక్కునూరు మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన లచ్చిగూడెం, గొమ్ముగూడెంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిరావాలని గ్రామస్తులకు చెప్పారు. వరద పెరిగే వరకు ఉండకుండా ముందుగా పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 30.110 మీటర్లకు చేరింది. స్పిల్ వే 48 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ
దెందులూరు: వ్యవసాయ రంగంలో యాంత్రికరణ వేగంగా వృద్ధి చెందుతుంది. ఇటీవల డ్రోన్ల ద్వారా పంట చేలకు ఎరువులను వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో డిప్లమో ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ (దిశి) కార్యక్రమం ద్వారా జిల్లాలో రైతులకు, ఎరువుల వర్తకులకు శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంటల యాజమాన్య పద్ధతులు, డ్రోన్ల వినియోగం, ఎరువులను సకాలంలో వాడకం గురించి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా పంట పెట్టుబడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ హబీబ్ భాష వ్యవసాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతిభ చూపుతున్న అభ్యర్థులు దిశి శిక్షణ భాగంగా 2023– 24 సంవత్సరానికి గ్రూపులకు సంబంధించిన కొన్ని రోజులు వనరులు సమకూర్చి వ్యాపారస్తులకు కంపెనీ క్షేత్ర పరిశీలకులకు శిక్షణ అందిస్తున్నారు. వారిలో తొమ్మిదో తరగతి ఉత్తీర్ణత అయిన వారికి డైరెక్టర్ ఆత్మ ద్వారా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. గ్రూపులకు సంబంధించి పరీక్షకు హాజరైన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ముగ్గురు డిస్టింక్షన్లో నిలిచారు. రైతులు, వ్యాపారులు శాసీ్త్రయ పరిజ్ఞానంతో పాటు వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక శిక్షణ దిశి శిక్షణలో ఒక బ్యాచ్‌కి 48 క్లాసులు ఉంటాయి. 40 థియరీ క్లాసులు, 8 ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి బ్యాచ్‌కు ఒక ఫెసిలిటేటర్‌ను కేటాయించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. – హబీబ్ బాషా, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
ఆలయ మరమ్మతులకు అంచనాలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కొన్ని నిర్మాణాలు, మరమ్మతులు కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆలయానికి విచ్చేసి, పరిసరాలకు పరిశీలించారు. 2027 గోదావరి పుష్కరాలకు మరమ్మతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయంలో స్వామివారి చుట్టూ ఉన్న ప్రాకార మండపం లోపలి భాగంలో బేడా మండపం లీకేజీలు అవుతున్నాయి. అలాగే పార్వతి దేవి, లక్ష్మీదేవి గర్భాలయాల్లో కూడా వర్షం నీరు కారిపోతుంది. జనార్ధనస్వామి ఆలయం గర్భగుడిలో టైల్స్ ముక్కలుగా ఊడిపడిపోతున్నాయి. జనార్ధనస్వామి ఉపాలయం పక్కన ఉన్న బేడా మండపానికి సంబంధించి సుమారు మూడు స్తంభాలు ప్రమాదకరంగా ఒరిగిపోయి ఉన్నాయి. ముఖ్యంగా 120 అడుగుల ఎత్తయిన గాలిగోపురం లోపల శిథిలావస్థకు చేరుకుంటుంది. ఆయా సమస్యలను శ్రీనివాసరావు పరిశీలించారు. కార్యాలయ నిర్మాణంపై తర్జనభర్జన ప్రస్తుతం ఆలయ కార్యాలయం ఉన్న ప్రాంతంలో మరో మండపం నిర్మాణానికి అంచనాలు తయారు చేస్తున్నారు. ఆలయానికి నైరుతి మూలలో గత కొంతకాలం క్రితం ఖాళీ చేసిన ఎస్పీఆర్ఆర్ క్లబ్ స్థలం ఆలయానికి చెందినదే కావడంతో అప్పట్లో ఆ స్థలం ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో కార్యాలయం నిర్మాణం చేయడమా లేఖ అన్నదాన భవనంగా ఉంచడమా? అనే దానిపై చర్చ లు సాగుతున్నాయి. కార్యక్రమంలో దేవదాయ శాఖ భీమవరం అధికారి సూర్యప్రకాశరావు, వర్దినీడి వెంకటేశ్వరరావు, ఈఓ ముచ్చర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రసాదం తీసుకోని డీఈ ఆలయం ప్రాకారం బేడా మండపంలో లీకేజీలను తనిఖీ చేస్తూ అంచనాలు వేస్తున్న సమయంలో పక్కన ఉన్న కనకదుర్గమ్మ వారికి తయారు చేసిన దద్దోజనం ప్రసాదాన్ని అక్కడ పురోహితులు పంచిపెడుతున్నారు. అటుగా వస్తున్న డీఈతో పాటు మిగిలిన అధికారులను సైతం అయ్యా ప్రసాదం ఇదిగోండని పెట్టగా చేతులు బాగోలేదు వద్దుల్లేండి అని వెళ్లిపోవడంతో భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కక్షిదారుల మధ్య సామరస్య వాతావరణంలో కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు పరిష్కరించడమే మధ్యవర్తిత్వ లక్షణం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం అంశంపై వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ తదితర ప్రాంతాలలో 1కే వాక్ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. మధ్యవర్తిత్వం చేసేందుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 80 మంది న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, సోషల్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, ఈ కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కక్షిదారులు, న్యాయవాదులు సంప్రదించి మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారాన్ని కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులి కృష్ణ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.ఎస్.వి.కృష్ణ సాయి తేజ, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల పర్వం
వివాదాలకు కేంద్రంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి కొయ్యలగూడెం: కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం మొదలుకొని పాస్ బుక్‌లు చేయడానికి రూ.వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. తాజాగా కొయ్యలగూడెం మండలం పరింపూడి రెవెన్యూ భూమికి సంబంధించి సుమారు తొమ్మిది ఎకరాల భూమి మ్యుటేషన్, సబ్ డివిజన్ చేసేందుకు సదరు కాంట్రాక్టు ఉద్యోగి వ్యవహారం నడిపాడు. ఇందుకు రూ.2 లక్షలు ఒప్పందం కుదుర్చుకొని ఒక రైతు నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. తదుపరి భూమి విలువ ఎక్కువగా ఉందని అదనంగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వాల్సిందిగా కార్యాలయ ఉద్యోగులతో కలిసి రైతుపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో ఒక గ్రామానికి చెందిన దళిత రైతులకు సంబంధించి ఆన్లైన్లో తప్పుడు పేర్లు, తప్పుడు ఖాతా నెంబర్లు, రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడి విచారణను ఎదుర్కొన్నాడు. ఇటీవల కొయ్యలగూడెంలోని నడిబొడ్డున జాతీయ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న స్థలానికి సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అధికారులు సైతం ధ్రువీకరించారు. జిల్లా వ్యాప్తంగా అటు రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతోపాటు ఇటు రెవెన్యూ యంత్రాంగాన్నే కుదిపేసిన సుమారు రూ.40 కోట్ల విలువైన భూమికి సంబంధించిన వ్యవహారంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారీ స్థాయిలో దండుకున్నట్లు తెలిసింది. కాంట్రాక్ట్ ఉద్యోగి తీరుపై ఉన్నతాధికారులు విచారణ చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. కార్యాలయ ఉద్యోగులకు ప్రజల నుంచి వసూళ్లు రాబట్టడంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ రూ.లక్షలు చేతులు మారడానికి దళారీగా వ్యవహరిస్తున్నాడు. వివాదాస్పద స్థలాలు కొనుగోలు చేసి డాక్యుమెంట్లు సృష్టించి వాటిని సొమ్ము చేసుకుంటూ రూ.కోట్లు అర్జించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతని వ్యవహారంపై రెవెన్యూ శాఖ మొత్తం గుర్రుగా ఉన్న అతనితో చేయించుకున్న అక్రమాలు ఎక్కడ బయటపడతాయేమోనని మౌనంగా ఉంటున్నారు. -
రాష్ట్రస్థాయి లేజర్ రన్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ
తణుకు అర్బన్: స్థానిక చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి లేజర్ రన్ (రన్నింగ్ –షూటింగ్ )పోటీల్లో తణుకు మండలం మండపాక గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్. నాగ సత్య గణేష్ అండర్ 17 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్ఎం కె.ఫణిశ్రీ తెలిపారు. గణేష్ ఈ నెల 12, 13 తేదీల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి లేజర్ రన్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థి గణేష్‌తో పాటు శిక్షణనిచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను పలువురు అభినందించారు. చేబ్రోలు సర్పంచ్‌కు అరుదైన గుర్తింపు ఉంగుటూరు: మండలంలోని చేబ్రోలు సర్పంచ్ రందే లక్ష్మీసునీతకు అరుదైన గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో నిర్వహించే సర్పంచ్ సంవాద్‌లో ప్రథమ స్థానం లభించింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్పంచ్ సంవాద్ అనే వేదికను ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా ప్రతి నెలా దేశంలో ఉండే సర్పంచ్‌లు గ్రామాలు ఎలా అభివృద్ధి చేస్తున్నారు? ఇంకా ఎలా చేయాలి? అనే అంశాలపై వారి అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే చేబ్రోలు సర్పంచ్ సునీత వర్మీ కంపోస్టు తయారు చేయడం, పరిశుభ్రత విషయం, తడిచెత్త పొడిచెత్త విడదీయటం, మంచినీటి వనరులు కాపాడుకునే విషయంపై 80 సెకన్లు నిడివితో ఉన్న వీడియో పంపారు. ఈ నేపథ్యంలో ఆమె జూన్ నెలకు సంబంధించి ప్రథమ స్థానంలో నిలిచారు. లక్ష్మీసునీతకు ప్రోత్సాహకంగా రూ.35 వేలు అందిస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీ సునీత శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అవార్డు రావడం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. గోదావరికి పంచ హారతుల సమర్పణ పెనుగొండ: ఆషాఢ పౌర్ణమి సందర్భంగా వశిష్టాగోదావరికి శుక్రవారం సిద్ధాంతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంచ హారతులు ఇచ్చారు. పూజా కార్యక్రమాలు అనంతరం కలగ భద్రుడు బ్రహ్మత్వంలో గోదావరి హారతులునిచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మపరిరక్షణ సభ్యులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు దెందులూరు: మండలంలోని మేధినరావుపాలెం గ్రామానికి చెందిన గారపాటి నాగేంద్ర అదృశ్యమయ్యాడంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నాగేంద్ర గురువారం కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే శుక్రవారం పోలవరం కాలులో అతని సెల్‌ఫోన్, చెప్పులు కనిపించాయంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. -
డ్రోన్ల వినియోగంపై శిక్షణ
వ్యవసాయ రంగంలో ఇటీవల డ్రోన్ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా డ్రోన్ల వినియోగంపై శిక్షణకు శ్రీకారం చుట్టారు. 8లో uఅలక్ష్యానికి తావు లేదు ఏలూరు(మెట్రో): గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికపై తరలించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారు లను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సాయంత్రం సంబంధింత అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి ప్రమాద హెచ్చరిక ముంపు ప్రాంతాలైన కుక్కునూరు మండలం లచ్చిగూడెం, గొమ్ముగూడెం ప్రజలను తక్షణమే దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించాలన్నారు. రెండో ప్రమాద హెచ్చరిక ప్రభావితమయ్యే ముంపు గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. గర్భిణులు, వయోవృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని సమీప సీహెచ్‌సీలకు తరలించాలన్నారు. అవసరమైన టార్పాలిన్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లను, రోప్ పార్టీలు అందుబాటులో ఉంచాలన్నారు. పునరా వాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో 1800 233 1077 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 833 390 5022, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీసు 83092 69056, కుక్కునూరు తహసీల్దారు కార్యాలయం 83092 46369, వేలేరుపాడు తహసీల్దారు కార్యాలయంలో 83286 96546 నెంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఈపీడీసీఎల్ ఎస్ఈ పీ.సాల్మన్ రాజు తెలిపారు. ఏలూరులో 9440902926 నెంబర్‌తో, జంగారెడ్డిగూడెంలో 9491030712 నెంబర్‌తో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. -
బెధరగొడుతున్నాయ్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూరగాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతూ.. వర్షాలు పడగానే తగ్గుతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కాగా ఇప్పుడు అన్నిరకాల కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా కూరగాయల ధరలు కిలోకు రూ.5 నుంచి రూ.15 వరకు పెరిగాయి. టమాటా గత నెలలో కిలో రూ.16 నుంచి రూ.18 ఉండగా ప్రస్తుతం రూ.36కు చేరింది. పచ్చిమిర్చి కిలో గత గురువారం రూ.40 ఉండగా ఇప్పుడు రూ.60కు, పందిరి బీర కాయలు రూ.40 నుంచి రూ.50కు, వంకాయలు (కాంతులు) రూ.38 నుంచి రూ.50కు చేరాయి. ఒక్క రోజులో దొండకాయలు కిలో రూ.6, గోరుచిక్కుడు రూ.8 చొప్పున పెరిగాయి. గత సోమవారం కీరా దోస కిలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.50 పలుకుతోంది. ఇలా అన్నిరకాల కూరగాయల ధరలు పెరిగాయి. రైతు బజారుల్లోనే 400 క్వింటాళ్లు ఏలూరులో సుమారు 90 వేల కుటుంబాల్లో 3.10 లక్షల జనాభా ఉన్నారు. నగరంలో రెండు రైతు బజార్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి వన్‌టౌన్‌లో ఎన్ఎస్ కూరగాయల మార్కెట్, పలు ప్రాంతాల్లో చిన్నపాటి కూరగాయల దుకాణాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంటింటా తిరుగుతూ కూరగాయలు అమ్మే వ్యాపారులు 30 మంది వరకు ఉన్నాయి. నగరంలోని వన్‌టౌన్, టూటౌన్ ప్రాంతాల్లోని రైతు బజార్ల ద్వారా రోజుకు సుమారు 400 క్వింటాళ్ల కూరగాయలు, దుంపలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు విక్రయాలు జరుగుతున్నాయి. ఇతర దుకాణాలు, ఇంటింటా తిరిగి విక్రయించే వారి ద్వారా మరో 800 క్వింటాళ్ల విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. ఈ లెక్కన నగరవాసులపై పెరిగిన కూరగాయల ధరల భారం రోజుకు సుమారు రూ.6 లక్షల వరకు ఉంటోంది. పట్టించుకోని అధికారులు కూరగాయల ధరలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే రైతు బజార్లతో కొద్దిమేర ధరలు తక్కువగా ఉన్నా.. ధరల పెరుగుదల అసాధారణంగా ఉందని అంటున్నారు. గతంలో కూరగాయల ధరలు పెరిగితే రైతు బజార్లలో సబ్సిడీపై అందించేవారు. టమాటా, ఉల్లిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేవారు. కొనలేకపోతున్నాం మూడు రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలోకు రూ.10 వరకు ఎక్కువగా చెబుతున్నారు. టమాటా గతనెలలో కిలో రూ.16 ఉంటే ఇప్పుడు రూ.36 అమ్ముతున్నారు. దొండ, బెండకాయల ధరలు పెరిగాయి. ముఖ్యంగా పచ్చి మిరప నెల క్రితం కిలో రూ.18 నుంచి రూ.24 మధ్య ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.60కు పైగా అమ్ముతున్నారు. – గొల్లవిల్లి ఆదిలక్ష్మి, గృహిణి, ఏలూరు చర్యలు తీసుకోవాలి మా ఇంటి అవసరాలకు వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తీసుకుంటాం. ఇప్పుడు పెరిగిన ధరల కారణంగా మరో రూ.200 అధికంగా ఖర్చవుతోంది. ఇది సామాన్యులకు భారం. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కూరగాయల ధరలను తగ్గించే ఏర్పాట్లు చేయాలి. లేదా పేదల కోసం ప్రత్యేక కౌంటర్లలో కూరగాయలు విక్రయించే ఏర్పాట్లు అయినా చేయాలి. – ముమ్మిన గిరిజ, గృహిణి, ఏలూరు వెజిట్రబుల్స్ ఆకాశాన్నంటుతున్న ధరలు కిలోకు రూ.15 వరకు పెరుగుదల ధరల నియంత్రణపై చర్యలు శూన్యం -
‘ఉపాధి’ బకాయిలు విడుదల చేయాలి
ఏలూరు (టూటౌన్): ఉపాధి కూలీల వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ ఆరోపించారు. స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో గురువారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. పనులు చేసి రెండు నుంచి మూడు నెలలు కావస్తున్నా నేటికీ కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. దీంతో కూలీల జీవనం కష్టంగా మారిందన్నారు. కూలీల వేతనాలను కాంట్రాక్టర్లకు అప్పగించే పని కూటమి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మంత్రి పవన్ కల్యాణ్ పేదల పక్షాన లేదా కాంట్రాక్టర్లు పక్షాన అనేది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కూలీలకు వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా, మండల స్థాయి అధికారులు జాబ్ కార్డులు కోసం కూలీల నుండి డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగ కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి ఆకివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీగా ఆకివీడుకు చెందిన పడాల శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగింది. ఆకివీడు నగర పంచాయతీ విప్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. గోదావరి వరదపై అప్రమత్తం ఏలూరు(మెట్రో): గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బలహీనంగా ఉన్న కాలువలు, నదీ పరీవాహక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు అధిక వర్షాలు, వరదల దృష్ట్యా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పునరావాస కార్యక్రమాల నిర్వహణకు మండల ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వేలేరుపాడు మండలానికి డీఆర్డిఏ పీడీ ఆర్.విజయరాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర, కుక్కునూరు మండలానికి జెడ్పీ సీఈఓ శ్రీహరి, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి అన్సారీలను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. విద్యతోనే కలల సాకారం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కలలను సాకారం చేసు కునేందుకు విద్య ఒక్కటే ఉత్తమ మార్గమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా స్థానిక కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నూరుశాతం నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో గతేడాది టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయుల సమకూర్చిన నగదు బహుమతులను అందజేశారు. ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, ఆర్ఐఓ కె.యోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరువన్నామలై రైలుకు వీరవాసరంలో హాల్ట్ రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): నర్సాపూర్–తిరువన్నామలై ప్రత్యేక రైలుకు వీరవాసరం స్టేషన్లో రెండు నిమిషాలు హాల్టింగ్ సదుపాయం కల్పించినట్టు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్ నుంచి వెళ్లే రైలు (07219) వీరవాసరం స్టేషన్‌కు మధ్యాహ్నం 1.23 గంటలకు చేరుకుని, 1.25 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. తిరువన్నామలై నుంచి వచ్చే రైలు (07220) రాత్రి 11.28 గంటలకు వీరవాసరం స్టేషన్‌కు చేరుకుని, తిరిగి 11.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. -
మధ్యవర్తిత్వంపై అవగాహన
జీవితాలతో చెలగాటం అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాదా లను అదుపు చేసే వాహనాలు, సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 8లో uఏలూరు (టూటౌన్): కక్షిదారులు మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి సూచించారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం అనే అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై అవగాహన కల్పించేలా వారం పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ‘వన్–కే’ వాక్ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. న్యాయ మూర్తులు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, పోలీస్ సిబ్బంది, ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లు, సిబ్బంది పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పాఠశాల విలీనానికి నిరసనగా ఆమరణ దీక్ష
పెనుమంట్ర: పెనుమంట్ర దళితవాడలోని ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక గురువారం విలేకరులకు తెలిపారు. 80 ఏళ్ల నాటి పాఠశాలను గత ప్రభుత్వంలో నాడు– నేడు నిధులతో అభివృద్ధి చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా గత హెచ్ఎం, ఎంఈఓ కలిసి విద్యాకమిటీ సభ్యులను పక్కదారి పట్టించి ఇష్టానుసారం పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాను దీక్షకు దిగనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తహసీల్దార్, పోలీస్ అధికారులు కూడా వినతి పత్రాల అందించానన్నారు. ఈ పాఠశాలలో 32 మంది విద్యార్థులు చదువుకునే వారన్నారు. అలాగే గురువారం వైఎస్సార్ నగర్లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగ్గా తాము వెళ్లేలోపు ప్రజాప్రతినిధులు కానివారితో కొబ్బరికాయలు కొట్టించి అధికారులు తమను అవమానపరిచారని ప్రియాంక వాపోయారు. సమావేశంలో పెనుమంట్ర–1 ఎంపీటీసీ చింతపల్లి మంగాదేవి, ఉప సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పర్యటన
ఏలూరు(మెట్రో): స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసే కార్యక్రమానికి కేంద్ర అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ బృందాలు శుక్రవారం నుంచి పర్యటించనున్నా యని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం జిల్లా అధికారులతో కేంద్ర బృంద సభ్యుల స్టేట్ నోడల్ కో–ఆర్డినేటర్ ఎస్.సందీప్, జిల్లా కో–ఆర్డినేటర్ పి.సత్తిబాబు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రోజుకి రెండు గ్రామాల చొప్పున 36 గ్రామాల్లో బృందం పర్యటించనుంది. సర్వేలో భాగంగా ప్రజాభిప్రాయాల సేకరణ, మరుగుదొడ్ల వినియోగం, పంచాయతీ, పాఠశాల, అంగన్వాడీ, సచివాలయాలు, మార్కెట్ యార్డ్స్, డ్రైనేజ్ వ్యవస్థ, చెత్త సేకరణ డంపింగ్ యార్డ్స్ తరలింపు, ప్లాస్టిక్ నిషేధం, వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథ్‌బాబు, డీపీఓ కె.అనురాధ ఉన్నారు. -
బెల్టు షాపులు రద్దు చేయాలి
తణుకు అర్బన్: గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి డిమాండ్ చేశారు. స్థానిక అమరవీరుల భవనంలో గురువారం తణుకు డివిజన్ గీత కార్మికుల సహకార సొసైటీల అధ్యక్షుడు కట్టా వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ గీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. గ్రా మాల్లో తాటి, ఈత చెట్లను దౌర్జన్యంగా నరికి వేస్తున్నారని, ఆపాలని కోరారు. వృత్తిలో భా గంగా దివ్యాంగులైన, మరణించిన వారి కు టుంబాలకు గతంలో పరిహారం ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ విధానం రద్దు చేయడం తగదన్నారు. ఈనెల 14న కలెక్టర్‌కు గీత కార్మికుల సమస్యలను చెప్పుకుందాం తరలిరండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కల్లుగీత సహకార సొసైటీల అధ్యక్షుడు కాసాని శ్రీనివాసు, తొంట ముత్యాలు పాల్గొన్నారు. -
బాబు ష్యూరిటీ.. దగా గ్యారెంటీ
గణపవరం: చంద్రబాబు మోసపూరిత ఎన్నికల మేనిఫెస్టోను వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల ముందుంచాలని, అధికార దాహంతో వారిచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రజలను ఏరకంగా ఏమార్చారో ప్రజలకు వివరించాలన్నారు. తాము మోసపోయినట్టు ప్రజలు గ్రహించారని, ఏడాది కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. తొలి ఏడాదంతా ఖజానా ఖాళీ అంటూ హామీలను పక్కపెట్టేశారని విమర్శించారు. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలుచేసినా కనీసం 50 శాతం మందికి కూడా అందలేదని మండిపడ్డారు. జగన్‌పై కుట్రలు : కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం పూర్తిగా కోల్పోయిందని అందుకే మాజీ సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది తరలివస్తున్నారని వాసుబాబు అన్నారు. ప్రజాబలాన్ని ఎదుర్కోలేని ప్రభుత్వం తప్పుడు కేసులు, అడ్డమైన నిబంధనలతో జగన్‌ను ప్రజల్లోకి రాకుండా చేసే కుట్రలకు తెరతీసిందన్నారు. చంద్రబాబు కేవలం మీడియా మేనేజ్మెంట్, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారంతో కాలం గడుపుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ శ్రేణులపై ఉందన్నారు. 2014 ఎన్నికల్లో 650 హామీలిచ్చి కనీసం 65 హామీలు కూడా నెరవేర్చలేదని, మళ్లీ 2024లో 140 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. అయినా రూ.1.70 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, ఈ నిధులను ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. మోసం బాబుకు వెన్నతో పెట్టిన విద్య ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, సూపర్‌సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకూ సూపర్ వన్ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారన్నారు. ఈ సందర్భంగా రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు దండు రాము, ధనుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, కనుమాల రామయ్య, జెడ్పీటీసీ సభ్యులు దేవారపు సోమలక్ష్మి, కోడే కాశీ, కె.జయలక్ష్మి, తుమ్మగుంట రంగాభవాని, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు దండు రాము, సంకుసత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి సత్యశ్రీనివాస్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నడింపల్లి సోమరాజు, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కన్వీనర్ ముళ్లగిరి జాన్సన్, రాష్ట్ర యూత్ కార్యదర్శి మద్దుల రాజా, పార్టీ జిల్లా కన్వీనర్లు కందులపాటి శ్రీను, పొత్తూరి శ్రీనివాసరాజు, రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యదర్శి వెజ్జు వెంకటేశ్వరావు, నాయకులు కమ్మిల భాస్కరరాజు, పుప్పాల గోపి, ఎలిశెట్టి బాబ్జి, తుమ్మగుంటా రంగా, రామకుర్తి నాగేశ్వరరావు, రొంగల శ్రీను, రామిశెట్టి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు సమయం వీరరాఘవులు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు మందా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూటమి వంచనపై నిలదీద్దాం ప్రజల్లో నమ్మకం కోల్పోయిన ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే వాసుబాబు -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కై కలూరు: భార్య వివాహేతర సంబంధానికి సహాకరిస్తోందనే కోపంతో ఎదురింటి మహిళను కత్తితో నరికి చంపిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కై కలూరు సీఐ కార్యాలయంలో కేసు వివరాలను ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్ వెల్లడించారు. కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న నంగెడ్డ వరలక్ష్మీదేవీ(39)ని ఎదురింటిలో నివాసం ఉంటున్న కట్టా రామాంజనేయులు(33) బయటకు పిలిచి కత్తితో నరికి పరారయ్యాడు. రామాంజనేయులు భార్య కృష్ణవేణి ఇదే గ్రామానికి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావుతో చనువుగా ఉంటోంది. ఈ విషయాన్ని పలువురు గ్రామస్తులు భర్త రామాంజనేయులుకు చెప్పారు. మృతురాలు వరలక్ష్మీదేవీ నాగమల్లేశ్వరరావు వద్ద పనిచేస్తుండడంతో రామాంజనేయులు భార్య వివాహేతర సంబంధానికి వరలక్ష్మీదేవి సహాకరిస్తోందని గట్టిగా నమ్మాడు. దీంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఆమెను నరికి చంపి పరారయ్యాడు. కై కలూరు మండలం ఉప్పుటేరు వద్ద నిందితుడు రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో కలిదిండి, కై కలూరు రూరల్, ముదినేపల్లి ఎస్సైలు వేంకటేశ్వరరావు, రాంబాబు, వీరభద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
కంటైనర్ బోల్తా.. 14 ఆవులు మృతి
దెందులూరు: జాతీయరహదారిపై ఆవులను తరలిస్తున్న కంటైనర్ వాహనం బోల్తా పడి 14 ఆవులు మృతిచెందగా 6 తీవ్రంగా, 15 ఆవులు స్పల్పంగా గాయపడ్డాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు వద్ద చోటుచేసుకుంది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు ఆవులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ, సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే మండల పశువైద్యాధికారి డాక్టర్ హరికి సమాచారం అందించగా ఆయన వైద్య సిబ్బందితో వచ్చి గాయపడిన ఆవులను సమీపంలోని గేదెల ఫారం వద్దకు తరలించి వైద్య సేవలందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి జంగారెడ్డిగూడెం: చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన బల్లే వెంకట నరసింహారావు చర్మంపై తెల్లటి మచ్చలు వచ్చి మంట, దురదతో గత రెండేళ్లుగా బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వాంతులు చేసుకోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నరసింహారావుని కొయ్యలగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైనవైద్యం కోసం రాజమండ్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి బల్లే గురవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 2 కిలోల గంజాయి స్వాధీనం జంగారెడ్డిగూడెం: పట్టణంలో గురువారం జరిపిన దాడుల్లో జెడ్పీ హైస్కూల్ ఎదురుగా గంజాయి కలిగి ఉన్న షేక్ బాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎంవీ సుభా ష్, ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్‌ను గంజాయి రహితంగా చేసే కార్యక్రమంలో భాగంగా గట్టి నిఘా పెట్టి ఈ దాడులు చేసినట్లు చెప్పారు. -
అక్రమాలకు అడ్డా.. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
ఉండి: భూ అక్రమార్కులకు పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారిందంటూ రంగబాబు అనే వ్యక్తి గురువారం కార్యాలయం ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చినగొల్లపాలెంలో తమ ఆస్తికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. భూ అక్రమాలకు సంబంధించి తనతో పాటు మరికొందరు గత కొద్దికాలం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావడంతో సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల నుంచి రిజిస్ట్రేషన్ల కొరకు ఉండికి తరలివస్తున్నట్టు తెలిపారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్న అధికారులు భూ ఆక్రమణ దారులకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం చేయకపోతే భార్యాబిడ్డలతో ఉండి రిజిస్ట్రార్ ఆఫీసు ముందు ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించారు. తమకు సంబంధించిన 32 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ఓ మంత్రి సమీప ఉద్యోగి, రిజిస్ట్రేషన్ శాఖలో ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నట్లు తనకు అనుమానంగా ఉందని చెప్పారు. దీనిపై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్చార్జి టి.శరాబందురాజు ఖండించారు. ఇలా చేయడం ఎవరివల్లా కాదన్నారు. ఆరోపణలు చేస్తున్న రంగబాబు ఆస్తి కోర్టు పరిధిలో, అదీ నిషేధిత భూముల జాబితాలోనూ ఉందని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్ళారు గానీ, ఎవ్వరికీ భయపడికాదని స్పష్టం చేశారు. కలకలం రేపిన బాధితుని ఆందోళన -
పరుపుల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో శివారు వంగాయగూడెంలోని పరుపుల పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వంగాయగూడెం కేన్సర్ హాస్పిటల్ సమీపంలోని సుస్మిత ఫర్నిచర్ కుషనింగ్ పరిశ్రమలో ఉదయం 9.30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరూ రాకముందే ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో ఫోమ్‌ను తయారు చేస్తారు. ఈ రసాయనాల మిక్సింగ్‌కు వినియోగించే ట్యాంకర్‌ను మైనస్ డిగ్రీల్లో చల్లబరుస్తారు. కెమికల్ మిక్సింగ్ ట్యాంకర్‌కు సంబంధించిన ఏసీలను ఆన్ చేసిన వాచ్మెన్లు ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాప్తి చెందటంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. -
జీవితాలతో చెలగాటం
ఏలూరు టౌన్: అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడైనా భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని అదుపు చేసేందుకు అవసరమైన అగ్నిపమాక వాహనాలు, సిబ్బంది లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు, కార్మికుల ప్రాణాల భద్రత గాల్లో దీపమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు నగరంలోనే గత మూడు నెలల్లో మూడు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. పైగా ఒకే తరహా వస్తువుల తయారీ ఇండస్ట్రీల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. యాజమాన్యల నిర్లక్ష్యం.. అగ్నిమాపక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో వరుసగా అగ్నిప్రమాదాలు ఏలూరు జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకూ సుమారుగా 598 అగ్నిప్రమాదాలు సంభవించగా ఏలూరు శివారు ప్రాంతాల్లో వరుసగా మూడు నెలల్లో మూడు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ మూడు అగ్నిప్రమాదాలు పరుపులు, ఫర్నిచర్ తయారీ పరిశ్రమల్లో కావటం గమనార్హం. అదృష్టవశాత్తు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో కార్మికులు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఏలూరు శివారులోని గణేష్ సోఫా అండ్ ఫర్నిచర్స్ పరిశ్రమలో జూన్ 5న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం వేళలో ప్రమాదం జరగడం, కార్మికులు ముందుగానే గుర్తించి బయటకు పారిపోవటంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే తరహాలో ఏలూరు సోమవరప్పాడులోని సోఫా, పరుపుల తయారీ కంపెనీలోనూ అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా గురువారం వంగాయగూడెం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో సుష్మిత ఫర్నిచర్, కుషనింగ్ తయారీ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయాల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదాల నివారణ సాధ్యమేనా? ఏలూరు జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖకు కేవలం రెండే ఫైరింజన్లు ఉన్నాయి. ఒక ఫైరింజన్ మరమ్మతుల్లో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫైరింజన్ సామర్థ్యంపై ఆధారపడితే తీవ్ర పరిణామాలు తప్పవని అంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో లేరంటున్నారు. దీనితోడు పరిశ్రమల్లో పాటించాల్సిన భద్రతా చర్యలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా వంగాయగూడెం సుస్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం సంభవించడంతో.. అసలు పరిశ్రమకు ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్, అత్యవసర ద్వారం లేదని, ఫైర్‌సేఫ్టీ చర్యలపై అధికారుల పర్యవేక్షణపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ పరిశ్రమలు, ఇండస్ట్రీలు, ఆయా వస్తువుల ఉత్పత్తి సంస్థల్లో ఫైర్‌సేఫ్టీపై నిఘా, పర్యవేక్షణ, తనిఖీలు లేవంటున్నారు. మూడు నెలల్లో 3 భారీ అగ్నిప్రమాదాలు రెండు ఫైరింజన్లతో నెట్టుకొస్తున్న అగ్నిమాపక శాఖ కొరవడిన అధికారుల పర్యవేక్షణ ప్రజలు భద్రత ప్రశ్నార్థకంగా మారిన వైనం -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం విద్యార్థులతో కలిసి ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దీనివల్ల డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు సైతం హాల్ టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కోశాధికారి, ఎం.క్రాంతికుమార్, సునీల్, ప్రదీప్, విద్యార్థులు పాల్గొన్నారు. -
భార్య దారుణ హత్య
కై కలూరు: ఆస్తిని పెద్ద కొడుక్కి రాసివ్వమని అడిగిన భార్యను అంతమొందించాడో భర్త. ఈ ఘటన ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు (50), జయలక్ష్మి (47) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడికి ఇటీవల పెళ్లయింది. ఇద్దరు కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పెద్దిరాజుకు గ్రామంలో 40 సెంట్ల భూమి ఉంది. దీనిని అమ్మకానికి సిద్ధం చేస్తున్నాడు. పెద్ద కొడుక్కి వివాహం జరగడంతో దంపతులు ఇల్లు కట్టుకుంటారని, స్థలం పెద్ద కొడుక్కి రాయాలని జయలక్ష్మి భర్తను కోరింది. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తన కంటే బిడ్డలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పెద్దిరాజు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిద్రపోతున్న జయలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె ఘటనాస్థలిలోనే ప్రాణం విడిచింది. అనంతరం పెద్దిరాజు భయపడి పురుగు మందు తాగి, చాకుతో పీక కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాణాలతో ఉన్న పెద్దిరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తిని పెద్ద కుమారుడికిరాసివ్వమని అడగడమే కారణం అనంతరం ఆత్మహత్యకు యత్నించిన భర్త -
పారిజాతగిరి హుండీ లెక్కింపు
జంగారెడ్డిగూడెం : పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవదాయశాఖ ఏలూరు జిల్లా ఇన్స్పెక్టర్ వి.సురేష్‌కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 105 రోజులకు గాను రూ.11,35,112 ఆదాయం వచ్చినట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో విజయవాడ, ఏలూరు, రిటైర్డ్ ఉద్యోగులు, కామయ్యపాలెం, పుట్లగట్లగూడెం సేవాసంఘం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి తోమాల సేవ, తీర్థప్రసాద గోష్టి, తదితర పూజలు నిర్వహించారు. స్వామి వారిని నరసాపురం, పాలకొల్లు, తణుకు భక్తులు దర్శించుకున్నారు. 20న చెస్ టోర్నమెంట్ భీమవరం: ఇంటర్నేషనల్ చెస్ డేను పురస్కరించుకుని అనసూయ చెస్ అకాడమీ, వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన గ్రంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మాదాసు కిషోర్ చెప్పారు. గురువారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని తాలూకా ఆఫీసు సెంటర్లోని జీవీఆర్ కళ్యాణ మండపంలో టోర్నమెంట్ జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచితంగా మాస్టర్ చెస్ బోర్డులు, విజేతలకు రూ.20 వేల నగదు బహుమతులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు తోట భోగయ్య విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కొయ్యలగూడెం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కొయ్యలగూడెం సుందరయ్యనగర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేదే రాజేశ్వరి (24) బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఉరి వేసుకుని మృతి చెందినట్లు రాజేశ్వరి బంధువులు పేర్కొన్నారు. ఆమెకు భర్త ధనుష్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ కింద పడి వ్యక్తి మృతి తాడేపల్లిగూడెం రూరల్: లారీ వెనుక చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చినతాడేపల్లిలో గురువారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టెంపాలెం గ్రామానికి చెందిన నీలం రవితేజ (35) తాడేపల్లిగూడెంలోని ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. గురువారం మోటారు సైకిల్‌పై తాడేపల్లిగూడెం వస్తుండగా చినతాడేపల్లి వచ్చేసరికి ముందు వెళ్తున్న ఎరువుల లోడు లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడి రవితేజ దుర్మరణం చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
భీమడోలు: ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి అంబేడ్కర్ గురుకుల కళాశాలలో గురువారం సాయంత్రం ఇంటర్ విద్యార్థిని లేళ్ల మానస (16) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భీమడోలు పంచాయతీ శివారు అర్జావారిగూడేనికి చెందిన ఈ బాలిక కళాశాల బాత్రూమ్లో చున్నీతో ఉరి వేసుకున్న స్థితిలో ఉండగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ‘మా కుమార్తె మానస కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. పొలసానిపల్లి గురుకుల కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ఆహ్వానం వస్తే వచ్చాం. మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాతోనే ఉంది. బాగా మాట్లాడింది. కళాశాలకు వచ్చి వారం రోజులే అయ్యింది.. ఊరికి రమ్మంటే దసరా సెలవులకు వస్తానని చెప్పింది. ఇంతలోనే మరణ వార్తను వినాల్సి వచ్చింది. మా కుమార్తె ఉరి వేసుకునేంత పిరికిది కాదు’ అని తల్లిదండ్రులు లేళ్ల మరియమ్మ, రాజు తెలిపారు. తహసీల్దార్ బి.రమాదేవి, సీఐ యుజే విల్సన్, ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్నారు. బాలిక మృతికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణ చేపట్టాలని, కుటుంబానికి నష్టపరిహారం అందించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
పాఠశాలలు, రేషన్ షాపుల తనిఖీ
641 కిలోల గంజాయి ధ్వంసం జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. 4లో uఏలూరు (టూటౌన్): జిల్లాలో పలు పాఠశాలలు, రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లను బుధవారం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏలూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లో పర్యటించారు. తొలుత ఏలూరు జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో వంటశాల స్టోర్ రూమ్ పరిశీలించారు. కొన్ని గుడ్లు కేవలం 31 గ్రాముల ఉండడం గమనించి సప్లయర్‌ను సంప్రదించి తక్కువ బరువు ఉన్న గుడ్లను వెంటనే మార్చాలని, ఇకనుంచి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని చెప్పారు. భీమడోలు మండలం గుండుగోలనులో రేషన్ షాపు, మండల పరిషత్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాతూరు ఎమ్ఎల్ఎస్ పాయింట్ పరిశీలించారు. ద్వారకా తిరుమల మండలంలో బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. వంటశాల, స్టోర్ రూం తనిఖీలు నిర్వహించారు. 682 మంది విద్యార్థులకుగాను కేవలం నలుగురు వంటవాళ్లు మాత్రమే ఉన్నారని పాఠశాల ప్రిన్సిపల్ చైర్మన్ దష్టికి తీసుకురాగా ఈ విషయంపై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
నన్ను చంపాలని చూస్తున్నారు
దెందులూరు: కొల్లేరు వాసులకు ఒక్క రూపాయి బాకీ ఉన్నానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. బుధవారం ఏలూరు జిల్లా కొండలరావుపాలెంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అబ్బయ్యచౌదరిని ఇబ్బంది పెడితే దెందులూరులో రాజకీయంగా పెత్తనం చేయవచ్చని భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అబ్బయ్యచౌదరి ఇంటికి వెళ్లండి.. ముట్టడించండి, వంటావార్పు చేయండని ఎమ్మెల్యే చింతమనేని పిలుపునిచ్చారని మండిపడ్డారు. తనను బెదిరించి హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను ఉన్నత ఉద్యోగాన్ని వదిలి మంచి చేసేందుకే రాజకీయాల్లో వచ్చానని అన్నారు. ఐదేళ్లు శాసనసభ్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశానని.. ఏ ఒక్కరి దగ్గర రూపాయి కూడా తీసుకునే ఆలోచన తమకు లేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా సేవ చేసే కుటుంబంగా ప్రజలతో కొఠారు కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. తన హయాంలో టీడీపీ కార్యకర్తలకు సైతం మంచి చేశానన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కుటుంబంతో కూడా సమయం గడపకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నానన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాతైనా తాను చేసిన మంచి కనిపిస్తుందన్నారు. అలాంటి తన ఇంటిపై రాళ్లు వేసి, వంటావార్పులు పెట్టించి ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెరువులు, పొలాలు ఆక్రమిస్తున్నారని, పెట్రోల్ బంకులు, ఇల్లు ధ్వంసం చేస్తున్నారన్నారు. రౌడీషీటర్లను పంపి భయపెట్టాలని చూశారని.. 144 సెక్షన్ ఉన్నా, పోలీసులు ఆపుతున్నా దెందులూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు తన ఇంటికి వచ్చి అండగా నిలిచారని అబ్బయ్యచౌదరి అన్నారు. కొల్లేరులో వికృత రాజకీయ క్రీడ కొల్లేరు ప్రాంతంలో వికృత రాజకీయ క్రీడ జరుగుతుందని అబ్బయ్యచౌదరి అన్నారు. తన తండ్రి రామచంద్రరావు సహకారంతోనే చింతమనేని ఎంపీపీ అయ్యారని గుర్తు చేశారు. కొల్లేరు వాసులను బెదిరించి, తమపై ఉసిగొల్పుతున్నారని.. మీకు గాని, మీ గ్రామానికి గాని బాకీ ఉన్నానని నిర్ధారించేందుకు తాను కమిటీ వేస్తానని, మీరు కూడా ఒక కమిటీ వేసి నిజనిర్ధారణకు రావాలని ఏలూరు కోటదిబ్బ వద్ద నిరసన తెలుపుతున్న వారిని ప్రశ్నించారు. కలెక్టర్, ఎస్పీ కూడా కమిటీలో భాగస్వాములై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని, జానంపేట ప్రసాద్‌బాబు, అప్పన్న ప్రసాద్, తేరా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీకి ఫిర్యాదు : నియోజకవర్గంలో పరిణామాలతో పాటు రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలపై కొఠారు అబ్బయ్యచౌదరి ఏలూరులో ఏఎస్పీ నక్కా సూర్య చంద్రరావుకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందచేశారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి -
వరద గోదావరి
మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం చేపల గుడ్ల ఉత్పత్తి పెంచేందుకు చేసిన ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఏటా జూలై 10న చేప రైతుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 4లో uగురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరద గోదావరి మళ్లీ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తీవ్రత మరింత పెరుగుతుందని దానికనుగుణంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీరు 15 కల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహంతో ముంపు మండలాల్లో అలజడి మొదలైంది. గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచి వరద హడావుడి ప్రారంభమై ఆగస్టు వరకు రెండు సార్లు ముంపు మండలాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వరద ఉధృతి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి ఉపనది శబరి పోటెత్తుతుంది. ఈ క్రమంలో ఈనెల 2న 1.06 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేశారు. 5వ తేదీ నాటికి 2.09 లక్షల క్యూసెక్కులు, 9 నాటికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద పోటెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 కల్లా 9,32,288 క్యూసెక్కుల నీరు పోలవరానికి చేరుతుందని, అదే విధంగా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేనపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువకు విడుదలవుతున్న నీటిని పోలవరం నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేస్తున్నారు. న్యూస్రీల్ముంపు మండలాల్లో భయం.. భయంపోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో 9.32 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ దశలో రహదారులపైకి నీరు చేరుతుంది. 11.44 లక్షల క్యూసెక్కులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికకు రహదారులు నీటముగి రాకపోకలు నిలిచిపోయి పదుల సంఖ్యలో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. 14.26 లక్షల క్యూసెక్కులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికతో రెండు మండలాల్లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్తాయి. ఈ క్రమంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశించారు. ఇప్పటివరకు కుక్కునూరు మండలం గొమ్ముగూడానికి చెందిన 15 కుటుంబాలను మాత్రమే దాచారంలోని పోలవరం పునరావాస కాలనీకి తరలించారు. కొనసాగనున్న ఉధృతి బుధవారం మధ్యాహ్నానికి భద్రాచలంలో 22.40 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో గురువారానికి 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1986లో 75.60 అడుగుల మేర నీటి మట్టం ఉండటంతో 27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. ఇంతవరకు అత్యధికంగా వచ్చిన వరద ఇదే. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అత్యధిక గ్రామాలు భారీగా నష్టపోయాయి. ఆ తరువాత 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 21.78 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరానికి ఒకేసారి విడుదలైంది. ఈ క్రమంలో ముంపు మండలాలతో పాటు పశ్చిమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో జూలై 6న, 2023లో జూలై 20న 2024 జూలై 19న వరదలు ప్రారంభమై సుమారు వారం రోజులు పాటు ఇన్‌ఫ్లో కొనసాగింది. ముంపు మండలాల్లో అప్రమత్తం ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పోటెత్తుతున్న గోదావరి, శబరి 8 రోజుల వ్యవధిలో పోలవరం నుంచి 13.88 లక్షల క్యూసెక్కులు విడుదల మరో వారం కొనసాగనున్న గోదావరి ఉధృతి గోదావరి ఉధృతి ఇలా (పోలవరం నుంచి నీటి విడుదల) తేదీ విడుదలైన నీరు (క్యూసెక్కుల్లో) జూలై 5 2,09,733 6 2,023,309 7 1,95,294 8 2,02,463 జూలై 9 2,27,066 -
కదం తొక్కిన కార్మికులు
ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మె ఏలూరులో బుధవారం విజయవంతంగా జరిగింది. వివిధ రంగాల కార్మికులతో పాటు బ్యాంకులు, బీమా, పోస్టల్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు తదితర రంగాలకు చెందిన వారు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. పవర్ పేట రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన రమా మహల్ సెంటర్ మీదుగా ఆర్ఆర్ పేట పార్క్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, పని గంటల పెంపును రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ధరలను అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ పేట పార్కు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. సభకు డీఎన్వీడి ప్రసాద్, బి.వెంకటరావు, ఆర్.శ్రీనివాస డాంగేలు అధ్యక్షత వహించారు. -
టీడీపీ మూకల అరాచకం
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పల్లెర్లమూడిలో మంగళవారం రాత్రి నిర్వహించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమంలో టీడీపీ మూకలు అడుగడుగునా రెచ్చగొట్టి గొడవలకు విశ్వప్రయత్నాలు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగగా చివరకు వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేశారు. ఇంత జరిగినా పట్టించుకోని పోలీసులు బుధవారం మాత్రం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను ఉదయం నుంచి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. వైఎస్ జయంతి సందర్భంగా పల్లెర్లమూడిలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును ఆహ్వానించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాట్నాలగూడెంలో కేక్ కట్‌చేసి అక్కడి నుంచి పల్లెర్లమూడి వెళ్లారు. పల్లెర్లమూడిలోకి ర్యాలీ ప్రవేశించిన దగ్గర నుంచి రాటాలు అనే అతను ట్రాక్టర్‌తో ర్యాలీ చేస్తున్న వారిని గుద్దించాలని మీదకు పోనిచ్చాడు. పక్కన వాళ్లు లాగడంతో బతికి బయటపడ్డారు. పల్లెర్లమూడిలోని దళితవాడకు వెళ్లి అక్కడ వైఎస్ విగ్రహానికి ప్రతాప్ అప్పారావు పూలమాల వేసి కేక్ కట్ చేసిన అనంతరం శివాలయం సెంటర్‌కు ర్యాలీగా రాగా అక్కడ డీజే బండికి బైక్‌లు అడ్డం పెట్టడంతో పాటు మహిళలను అడ్డం కూర్చోబెట్టి కులంపేరుతో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను దూషించారు. ర్యాలీని అడ్డుకొని అరాచకంగా వ్యవహరించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఘర్షణ వాతావరణం పెరగకుండా అడ్డుకున్నారు. టీడీపీ మూకలు గ్రామంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేశారు. దాడిలో గాయపడ్డ నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేశారు. గ్రామంలోని టీడీపీ ఫ్లెక్సీలను చించారంటూ బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను పోలీసులు తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. దీనిపై జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మండలంలోని, పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కవ్వింపునకు పాల్పడిందే టీడీపీ వాళ్లే.. కవ్వింపు చర్యలకు దిగి రెచ్చగొట్టింది టీడీపీ వాళ్లేనని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు రూరల్ సీఐకు తెలిపారు. పోలిమెట్ల శివను స్టేషన్‌కు తీసుకురావడంతో ఆయన స్టేషన్‌కు వచ్చారు. బైక్ ర్యాలీ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తుంటే రాటాలు అనే అతను ట్రాక్టర్‌తో గుద్దించడానికి ప్రయత్నించాడని చెప్పారు. వైఎస్సార్ జయంతి ర్యాలీకి ట్రాక్టర్ అడ్డుపెట్టి కవ్వింపు చర్యలు పల్లెర్లమూడిలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీల చించివేత -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలంలోని శోభనాపురం గ్రామంలో టీడీపీని వీడి రెండు కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. నూజివీడు నియోజకవర్గ తెలుగు యువత సభ్యుడు పెనుముచ్చు మహేష్, కాకి భాగ్యరాజు కుటుంబ సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీ నాయకులు బోయపాటి శ్రీనివాసరావు, రావి విష్ణువర్ధన్రావుల సమక్షంలో కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో దళిత నాయకులంటే చిన్న చూపని, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని త్వరలోనే తెలుగుదేశం పార్టీకి దళితుల సత్తా ఏంటో చూపిస్తామని, నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి శాయిశక్తుల కృషి చేస్తామని పెనుముచ్చు మహేష్, కాకి భాగ్యరాజు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దాసరి రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు నక్కనబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగుల నిరసన ఏలూరు (టూటౌన్): సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బుధవారం నాడు బ్యాంకు ఉద్యోగులు సామూహిక ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్‌ఆర్‌పేట యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యా లయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు, ఏలూరు చుట్టు పక్కల బ్యాంకు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షుడు దుగ్గిరాల శ్రీనివాస్ మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనం పేరుతో బ్యాంకింగ్ సెక్టార్‌ను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. కార్మిక వర్గం ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు లక్ష్మణరావు, ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు రామకోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై నిరసన చింతలపూడి: చింతలపూడి మండలం శెట్టివారిగూడెం–వెంకటాపురం గ్రామానికి అనుసంధానంగా ఉన్న రోడ్డును తక్షణం నిర్మించాలని కోరుతూ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై బుధవారం గ్రామస్తులు టెంట్ వేసి నిరసనకు దిగారు. గతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ హైవే నిర్మాణం సమయంలో రోడ్డు ధ్వంసం అవ్వడంతో ప్రత్యా మ్నాయంగా తమ గ్రామాల మధ్య రోడ్డు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టక పోవడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నిరసన చేపట్టామని గ్రామస్తులు తెలిపారు. మాట ఇచ్చి వారికి సంబంధం లేనట్టుగా ప్రవర్తించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ధ్వంసం చేయడంతో సుమారు 600 ఎకరాలకు దారి లేకుండా పోయిందని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ సంఘటనా స్ధలానికి చేరుకుని కాంట్రాక్టర్, గ్రామస్తులతో చర్చలు జరిపారు. అక్షరాస్యత పెంచేందుకు కృషి చేయాలి ఏలూరు(మెట్రో): వయోజనుల్లో అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి ఉల్లాస్ – అక్షరాంధ్ర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
ఏలూరు (టూటౌన్): వసతి గృహాంలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అమీనాపేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వసతి గృహం కిటికీలకు దోమల మెష్ లేకపోవడం వల్ల దోమల బెడద ఉంటుందని విద్యార్థులు తెలిపారని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. వసతి గృహానికి రాని విద్యార్థుల వివరాలు సేకరించి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, తిరిగి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి
నూజివీడు: కోతలు పూర్తయిన నేపథ్యంలో మామిడి తోటల్లో రైతులు కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.రాధారాణి పేర్కొన్నారు. మండలంలోని కొత్తరావిచర్లలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బుధవారం మామిడి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా రాధారాణి మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల చెట్ల గాలి వెలుతురు ప్రసరణ బాగా జరిగి పూత, కాపు సరిగ్గా వస్తాయని, తెగుళ్లు, పురుగుల బెడద తగ్గుతుందన్నారు. చెదురుమదురుగా ఉన్న కొమ్మలను ఏటవాలుగా కత్తిరించి కత్తిరించిన చోట బ్లైటాక్స్ను పూయాలన్నారు. తోటల్లో దుక్కులు చేపట్టి చెట్టుకు చుట్టూ పాదులు చేసి పదేళ్ల వయస్సు పైబడిన చెట్లకు యూరియా 2 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 4 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.5కేజీలు, బోరాన్ 100గ్రాములు, జింక్ సల్ఫేట్ 100గ్రాములు చొప్పున ఒక్కొక్క చెట్టుకు వేయాలన్నారు. ఆమె వెంట ఉద్యానశాఖ అధికారి ఆర్.హేమ, సర్పంచి కాపా శ్రీనివాసరావు ఉన్నారు. -
మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం
అవగాహన కల్పిస్తాం ప్రేరేపిత ప్రయోగం విజయవంతం ద్వారా డాక్టర్ హీరాలాల్ చౌదరీ నీలి విప్లవానికి పితామహుడిగా మారారు. ఆయన 1994లో వరల్ట్ ఆక్వాకల్చర్ అవార్డు అందుకున్నారు. ప్రతి ఏటా మత్స్యశాఖ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కై కలూరు ప్రభుత్వ ఆక్వా ల్యాబ్‌లో రైతులకు గురువారం అవగాహన కలిగిస్తాం. – సీహెచ్ గణపతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కై కలూరుకై కలూరు: చేపల గుడ్లు(స్పాన్) ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చేసిన ప్రయోగ ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఆక్వారంగం అగ్రభాగాన నిలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కటక్ సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనన్స్టిట్యూట్ (ఐసీఏఆర్)లో 1957 జూలై 10న డాక్టర్ హీరాలాల్ చౌదరీ, డాక్టర్ అలికున్హి శాస్త్రవేత్తలు కలిసి భారతదేశ మేజర్ కార్ప్స్పై విజయవంతమైన ప్రేరిత పెంపక ప్రయోగాన్ని(ఇన్డ్యూసిడ్ బ్రీడింగ్) చేపట్టారు. సాధారణ చేపల్లో ఉదాహరణకు ఐదు లక్షల స్పాన్ ఉత్పత్తి చేస్తే ప్రేరిత ప్రయోగం వల్ల ఆ సంఖ్య 10 నుంచి 20 లక్షలకు చేరింది. అప్పటి నుంచి నీలి విప్లవం తారా స్థాయికి పాకింది. బ్రీడింగ్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా జాతీయ చేపల రైతుల దినోత్సవం జూలై 10న జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రైతులకు గురువారం అవగాహన కార్యక్రమాలన నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఆక్వా సాగు ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా రంగం నుంచి వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లు ఉంది. దాదాపు ఆక్వా రైతులు 75 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ జిల్లాల నుంచి 3.5 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక రాష్టం విషయానికి వస్తే 974 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ఆక్వా సాగు 2.26 హెక్టార్లులలో కొనసాగుతుంది. దిగుబడులు 10 లక్షల టన్నులుగా ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే రొయ్యలు 3.27 లక్షల టన్నులుగా నమోదైంది. దేశంలోనే సింహభాగం ఉత్పత్తులకు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు మణిహారంగా మారాయి. నీలి విప్లవంతో రికార్డులు ఆక్వా సాగులో 1955 పూర్వం చేపల సాగు చేయాలంటే నదులు, సముద్రాలలో చేప పిల్లలను సేకరించాల్సి వచ్చేది. దీన్ని వైల్ట్ కలక్షన్ అంటారు. డాక్టర్ హీరాలాల్ చౌదరీ భారతీయ మేజర్ కార్ప్స్ (కట్లా, రోహు, మ్రిగల్)పై హార్మోన్ ప్రేరేపిత ప్రయోగం చేశారు. దీంతో కోట్లలో చేప స్పాన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత అన్యదేశ కార్ప్స్(కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్), టిలాపియా, పంగాసియస్ వంటి ఇతర చేపలు, మంచినీటి రొయ్యలైన మాక్రోబ్రాకియం, రోజెంబర్గి(స్కాంపీ) కూడా అభివృద్ధి చెందాయి. ఒక్క ప్రయోగం భారతీయ మత్స్య పరిశ్రమను సమూలంగా మార్చివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సరీలు, పెంపక చెరువులు నాణ్యమైన చేప విత్తనాల సరఫరాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇవి రాష్ట్రానికి మాత్రమే కాక, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా చేప విత్తనాలను సరఫరా చేస్తున్నాయి.కొల్లేరులో చేపల పట్టబడులు చేస్తున్న దృశ్యం (ఫైల్) నేడు జాతీయ చేపల రైతు దినోత్సవం ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఆక్వా అంటేనే కొల్లేరు ఆక్వా పరిశ్రమకు కొల్లేరు లంక గ్రామాలు పెట్టింది పేరుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 9 మండలాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. చిత్తడి నేలల కారణంగా చేపల, రొయ్యల పెరుగుదల అధికంగా ఉంటుంది. ఇక చేప పిల్లలను ఉత్పత్తి చేసే ప్రభుత్వ హేచరీ ఏలూరు జిల్లా బాదంపూడిలో ఉంది. చేప నారును సాగు చేసే మత్స్యశాఖనకు చెందిన సీడ్ ఫాంలు ఏలూరు, కొవ్వలిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతి రోజూ 240 లారీలు ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో ఆక్వాకు సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్లు 106, ఐస్ ప్లాంట్లు 258, ఏడాదికి 60,000 మినియన్ల ఉత్పత్తి చేసే రొయ్యల హేచరీస్, ప్రతి రోజూ 9,750 టన్నుల ఉత్పత్తి చేసే మేతల ఫ్యాక్టరీలు 429, ఆక్వాషాపులు 1104, ఆక్వా ల్యాబ్‌లు 237 ఉన్నాయి. -
పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు
ఏలూరు టౌన్: జిల్లాలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తున్నామనీ, సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య భరోసాకు ఉచిత మెగా హెల్త్ చెకప్ ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ఏలూరు పత్తేబాదలోని కామినేని హాస్పిటల్లో ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పని చేస్తోన్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, హోంగార్డులకు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందించేలా చర్యలు చేపట్టారు. బీపీ, షుగర్, ఈసీజీ, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, విటమిన్ డీ, బీ12, సీబీపీ, వంటి ముఖ్యమైన పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 30 వరకూ ప్రతి రోజూ 100మంది చొప్పున 1969 మంది సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ డాక్టర్ కొడాలి రామ్ ప్రసీన్, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కుమారుడిపై తల్లి ఫిర్యాదు
ముదినేపల్లి రూరల్: మద్యం మత్తులో తనపై దాడి చేస్తున్నాడంటూ కుమారుడిపై తల్లి స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వాడవల్లికి చెందిన నిమ్మగడ్డ నాగేశ్వరరావు, మేరమ్మ దంపతులకు నలుగురు కుమారులున్నారు. తండ్రి నాగేశ్వరరావు అనారోగ్యంతో మంచంపై ఉన్నాడు. చివరి కుమారుడైన విజయకుమార్ భార్యను వదిలేసి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విజయకుమార్ మద్యం మత్తులో కత్తిపీటతో తనపై దాడి చేసినట్లు మేరమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ అధికారుల బదిలీలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన పదోన్నతుల్లో నిడదవోలు విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి జేఓగా నియమితులైన సీహెచ్ శ్రీనివాసరావును పరిపాలనా సౌలభ్యం కోసం రామచంద్రాపురం విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే రామచంద్రాపురం విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి ఇటీవల పదోన్నతిపై వెళ్ళిన ఎంవీఎస్ఎస్వీ ప్రసాద్‌ను నిడదవోలు విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ ఇరగవరం : మండలంలోని ఇరగవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌ను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్కూలు ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకంలో తయారు చేసే వంటశాలకు వెళ్లి వండిన వంటకాలను, స్టాక్ రూములో ఉన్న స్టాకును పరిశీలించారు. గురువారం నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీట్ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ ఎం.సుందర్ రాజు ఉన్నారు. విద్యాసంస్థల బస్సులపై 18 కేసులు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లావ్యాప్తంగా బుధవారం వాహన తనిఖీ అధికారులతో విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేయించినట్టు ఏలూరు ఇన్చార్జ్ రవాణా శాఖాధికారి ఎస్బీ శేఖర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం వివిధ విద్యా సంస్థలకు చెందిన 63 బస్సులను తనిఖీ చేసినట్టు తెలిపారు. వాటిలో పన్నులు చెల్లించని, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ లేని, పలు నిబంధలను అతిక్రమించిన 18 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో ప్రారంభమైన కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్వహించే బస్సులన్నీ నిబంధనలకు లోబడి తిప్పాలని, అన్ని బస్సులు పూర్తి ఫిట్నెస్తో, ఇన్సూరెన్స్‌తో, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లతో మాత్రమే తిప్పాలని సూచించారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
చింతలపూడి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సతీష్‌కుమార్ బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపాలెం గ్రామానికి చెందిన తులిమెల్లి త్రినాథ్ (24) చింతలపూడి వైష్ణవి మెడికల్ షాప్‌లో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 5న రాత్రి మెడికల్ షాప్ కట్టి ద్విచక్రవాహనంపై స్వగ్రామం లింగపాలెం బయలుదేరాడు. చింతలపూడి బైపాస్ రోడ్డు వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి గుంతలో పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించి మెరుగైన చికిత్సకోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ త్రినాథ్ చనిపోవడంతో మృతుని తండ్రి తులిమెల్లి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భార్య, పిల్లలు కనిపించడం లేదని భర్త ఫిర్యాదు భీమవరం: తన భార్య బెల్లం రమ్య, తన పిల్లలు కన్పించడం లేదంటూ భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన బొల్లం సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రామరావు చెప్పారు. వివరాల ప్రకారం ఈ నెల 5న సుబ్బారావు పనికివెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య, పిల్లలు కన్పించలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన ప్రయోజనం లేకపోవడంతో సుబ్బారావు పోలీసులను ఆశ్రయించాడు. -
641 కిలోల గంజాయి ధ్వంసం
భీమవరం : జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్ల పరిధిలో 64 కేసుల్లో సుమారు 641 కిలోల గంజాయిని బుధవారం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామపరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వద్ద ధ్వంసం చేసినట్లు తెలిపారు. ధ్వంసం చేసిన గంజాయిని ముందుగా ఈనెల 8న భీమవరం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని రిసెప్షన్ హాల్లో మధ్యవర్తుల సమక్షంలో కేసుల వారీగా తూకం వేసి పరిశీలించి దానిని ప్రత్యేక కవర్లు, సంచులలో పెట్టి సీలు వేసి పోలీసు బందోబస్త్ మధ్య గుంటూరు తరలించినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వ్యాపారాలతో అభివృద్ధి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలను ఔత్సాహిక వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి ఆర్టీసీ కృషి చేస్తోందని ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం అన్నారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఔత్సాహిక వ్యాపారులతో ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని కలిదిండి, భీమవరం, ఆకివీడు ప్రాంతాల్లోని ఆర్టీసీ ఖాళీ స్థలాలను 15 సంవత్సరాలకు లీజుకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించామన్నారు. ఈ టెండర్లకు సంబంధించిన వివరాలు, లీజుకు ఉండే నియమ నిబంధనలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజ్ బీ. వాణి, డీఈ బీవీ రావు, ఏఈ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ పాఠశాల వివాదంపై ఆర్జేడీ విచారణ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మాకా) ఉర్దూ పాఠశాల, తూర్పువీధి ఉర్దూ పాఠశాలల్లో జరుగుతున్న వివాదాలపై పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి బుధవారం విచారణ నిర్వహించారు. తొలుత ఆ రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలోనూ రెండు మాధ్యమాల్లో విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి ఉందని, ఈ రెండు పాఠశాలల్లో సైతం అదే విధానం అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే మాధ్యమంలోనే ఉపాధ్యాయులు బోధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నుంచి రెండు మాధ్యమాల్లో బోధిస్తామని లేఖలు రాయించుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని ఈ విచారణలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి భీమవరం: ఉండి మండలం చెరుకువాడ వద్ద గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం బుధవారం చెప్పారు. ఈ నెల 1న గుర్తు తెలియని 50 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. -
ఆధ్యాత్మిక చింతనలో అతివలు
ద్వారకాతిరుమల: మానసిక ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన. ఆ దిశగా అడుగులు వేస్తూ తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దేవుని సేవలో తరిస్తున్నారు వందలాది మంది మహిళలు. బృందాలుగా ఏర్పడి, దేవాలయాల్లో భగవద్గీత పారాయణలు చేస్తున్నారు. అందులో భాగంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ శిష్య బృందం భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం చేశారు. ఇందులో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన 500 మంది మహిళలు పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కామవరపుకోట మండలం జలపవారిగూడెంకు చెందిన కామిశెట్టి రాంబాబు, ఉషారాణి దంపతుల ఆధ్వర్యంలో సామాన్య భక్తులు సైతం భాగస్వాములయ్యారు. దూరాన్ని లెక్కచేయకుండా.. ఏలూరు జిల్లాకు చెందిన మహిళలతో పాటు బెంగళూరు, హైదరాబాద్, ఖమ్మం, వైర, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, పాల్వంచ, అలాగే విశాఖపట్నం, నూజివీడు, తిరువూరు, విసన్నపేట, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహిళా భక్తులకు శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి ఆదేశాల మేరకు స్వామి వారి ఉచిత దర్శనంతో పాటు, అన్నప్రసాదాన్ని అందజేశారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓలు పి.నటరాజారావు, రమణరాజు, సూపరింటెండెంట్లు కోటగిరి కిషోర్, గోవాడ సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు. శ్రీవారి క్షేత్రంలో భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేస్తున్న మహిళలు 500 మందితో జరిగిన కార్యక్రమాలు సంతృప్తినిచ్చింది ఆన్లైన్లో భగవద్గీత పారాయణం నేర్చుకున్నాను. తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో, అది కూడా తొలి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం, గానామృతం చేయడం సంతృప్తినిచ్చింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు దేవస్థానం అధికారులు పూర్తి సహకారాన్ని అందించారు. – కామిశెట్టి ఉషారాణి, కామవరపుకోట మండలం జలపవారిగూడెం ప్రశాంతత లభిస్తుంది ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే హైదరాబాద్ నుంచి వచ్చాను. తొలి పండుగ నాడు అధిక సమయం శ్రీవారి సన్నిధిలో గడపడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. – కొమ్మూరి గాయత్రి, హైదరాబాద్. ఏడు వందల శ్లోకాలు కంఠస్థం భగవద్గీత పారాయణను ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నాను. గోల్డ్‌మెడల్ కూడా వచ్చింది. శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో 700 శ్లోకాలు కంఠస్థం చేసిన సుమారు 200 మంది గోల్డ్మెడలిస్టులం పాల్గొన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా పారాయణం, గానామృతం చేశాం. – సెనగపల్లి పూర్ణిమ, విజయవాడ -
వరద 'గోదావరి'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరద గోదావరి మళ్లీ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తీవ్రత మరింత పెరుగుతుందని దానికనుగుణంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీరు 15 కల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహంతో ముంపు మండలాల్లో అలజడి మొదలైంది. గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచి వరద హడావుడి ప్రారంభమై ఆగస్టు వరకు రెండు సార్లు ముంపు మండలాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వరద ఉధృతి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి ఉపనది శబరి పోటెత్తుతుంది. ఈ క్రమంలో ఈనెల 2న 1.06 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేశారు. 5వ తేదీ నాటికి 2.09 లక్షల క్యూసెక్కులు, 9 నాటికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద పోటెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 కల్లా 9,32,288 క్యూసెక్కుల నీరు పోలవరానికి చేరుతుందని, అదే విధంగా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేనపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువకు విడుదలవుతున్న నీటిని పోలవరం నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేస్తున్నారు. ముంపు మండలాల్లో భయం.. భయం పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో 9.32 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికకు రహదారులపైకి నీరు చేరడం, 11.44 లక్షల క్యూసెక్కులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికకు రహదారులు నీటముగి రాకపోకలు నిలిచిపోయి పదుల సంఖ్యలో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. 14.26 లక్షల క్యూసెక్కులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికతో రెండు మండలాల్లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్తాయి. ఈ క్రమంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశించారు. కొనసాగనున్న ఉధృతి బుధవారం మధ్యాహా్ననికి భద్రాచలంలో 22.40 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో గురువారానికి 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1986లో 75.60 అడుగుల మేర నీటి మట్టం ఉండటంతో 27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. ఇంతవరకు అత్యధికంగా వచ్చిన వరద ఇదే. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అత్యధిక గ్రామాలు భారీగా నష్టపోయాయి. ఆ తరువాత 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 21.78 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరానికి ఒకేసారి విడుదలైంది. ఈ క్రమంలో ముంపు మండలాలతో పాటు పశ్చిమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో జూలై 6న, 2023లో జూలై 20న 2024 జూలై 19న వరదలు ప్రారంభమై సుమారు వారం రోజులు పాటు ఇన్‌ఫ్లో కొనసాగింది. -
సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ, సమ్మె అగ్రిమెంట్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ కే.వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యా శాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు పని భారం తగ్గించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఈపీఎఫ్ వర్తింప చేసి, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ లీవులు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు.