వైఎస్‌ జగన్‌ వినాయకచవితి శుభాకాంక్షలు

12 Sep, 2018 12:15 IST
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలతో అభివృద్ధిపరంగా ఇరు రాష్ట్రాలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు విఘ్నాలు తొలగి ఇకమీదట అనేక విజయాలు సిద్ధించాలని ఆయన కోరుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన వెలువడింది.

కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ బుధవారం విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, భరోసాయిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డులో చినగదిలి వద్ద ఈ మధ్యాహ్నం జరిగే ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

Tags