మరో చారిత్రక కనిష్టానికి రూపాయి

12 Sep, 2018 09:14 IST

సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి  పతనం కొనసాగుతోంది. బుధవారం ఆరంభంలోనే రికార్డ్‌ స్థాయిని  టచ్‌ చేసింది.  ఇన్వెస్టర్ల అంచనా వేసినట్టుగా 73 మార్క్‌కు చేరువలో ఉంది. డాలరు మారకంలో రుపీ 72.86 స్థాయిని తాకింది.   అనంతరం మరింత  క్షీణించి 72.91 వద్ద మరో చారిత్రక కనిష్ట స్థాయికి దిగజారింది.

మరోవైపు రూపీ పతనం దేశీక ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.  కీలక సూచీ  సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా క్షీణించి,  నిఫ్టీ కూడా 151 పాయింట్లు క్షీణించి 11,288వద్ద ముగిసింది.  దీంతో బుధవారం కూడా మార్కెట్ల నెగిటివ్‌ ఓపెనింగ్‌ అవకాశం ఉందని ఎనలిస్టుల అంచనా.

Tags