రేషన్‌ కార్డుకు తిప్పుతూనే ఉన్నారు

12 Sep, 2018 06:50 IST

విశాఖపట్నం : మాది శివాజీపాలెం. 16వ వార్డు. 2016లో మాకు వివాహమైంది. అప్పటి నుంచి రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేస్తున్నాం. కానీ నేటికి మంజూరు చేయలేదు. మొదట్లో మా తల్లిదండ్రుల రేషన్‌ కార్డుల్లోంచి మా పేర్లను తొలగించుకోమన్నారు. తరువాత సాధికార సర్వేలో సవరణలు చేయమన్నారు. నెలకో పద్ధతి పెట్టి రెండేళ్లుగా తిప్పుతూనే ఉన్నారు. రేషన్‌ కార్డు లేకపోవడంతో కనీసం కార్పొరేషన్‌ లోన్‌ కూడా ఇవ్వడం లేదు. మేము ఉన్నత విద్యావంతులమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఎలా బతకాలన్నా...       – కె.గీతమౌళి దంపతులు

Tags