రక్తాలు కారేలా కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు!

11 Sep, 2018 17:24 IST

సాక్షి, తూర్పు గోదావరి : కాట్రేనికోన మండలంలోని చెయ్యేరులో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఇనుప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు.  దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 

అంగన్‌వాడీ ఆయా పోస్ట్‌ కోసం తలెత్తిన వివాదంలో భాగంగానే టీడీపీలోని రెండు వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇనుపరాడ్లతో తెలుగు తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలై.. తీవ్ర రక్తస్రావం అయింది. ఈ ఘటనలో గాయపడిన వారిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు.

Tags