వన్షిక మరియా డబుల్‌ ధమాకా

11 Sep, 2018 10:31 IST

సాక్షి, హైదరాబాద్‌: గోల్డ్‌స్లామ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో వన్షిక మరియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. బోయిన్‌పల్లిలోని కృష్ణస్వామి అడ్వాన్స్‌డ్‌ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో వన్షిక అండర్‌–10, 12 బాలికల సింగిల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన అండర్‌–12 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో వన్షిక 6–1తో జి. హర్ష్‌మితపై గెలుపొందింది.

బాలుర టైటిల్‌పోరులో వి. ధీరజ్‌ రెడ్డి 6–5తో సి. హేమంత్‌ రెడ్డిపై గెలుపొంది విజేతగా నిలిచాడు. అండర్‌–10 బాలికల ఫైనల్లో వన్షిక 6–5తో సాయి అనన్యను ఓడించింది. బాలుర ఫైనల్లో ఎం. శ్రీవంత్‌ రెడ్డి 6–4తో కె. శశాంక్‌ సాయి ప్రసాద్‌పై నెగ్గాడు. అండర్‌–14 విభాగంలో జోయ్, సామ చెవిక చాంపియన్‌లుగా నిలిచారు. బాలుర ఫైనల్లో జోయ్‌ 6–3తో అనిరుధ్‌పై, బాలికల ఫైన ల్లో చెవిక 6–3తో శ్రీ జశ్వితపై గెలుపొందారు.   

 

Tags