16న షాబాద్‌లో డాక్టర్‌ ఖాదర్‌ ప్రసంగం

11 Sep, 2018 05:21 IST
డాక్టర్‌ ఖాదర్‌ వలి

అటవీ కృషి నిపుణులు, ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డాక్టర్‌ ఖాదర్‌ వలి ఈ నెల 16(ఆదివారం)న రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్‌ ఆవరణలో జరిగే సదస్సులో ప్రసంగిస్తారు. ఉ. 9.30 గం. నుంచి మ. 1 గం. వరకు సదస్సు జరుగుతుందని ధ్యానహిత సొసైటీ డైరెక్టర్‌ డా. ఎన్‌. శైలజ తెలిపారు. అటవీ చైతన్య ద్రావణంతో మెట్ట భూముల్లో కొర్రలు, అరికలు వంటి సిరిధాన్యాలను వర్షాధారంగా రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో సాగు చేసుకునే పద్ధతులు.. సిరిధాన్యాలను రోజువారీ ప్రధానాహారంగా తింటూ షుగర్, ఊబకాయం, రక్తహీనత, కేన్సర్‌ తదితర ఏ జబ్బులనైనా పూర్తిగా తగ్గించుకునే పద్ధతులను డా. ఖాదర్‌ వివరిస్తారు. అనంతరం ప్రశ్నలకు బదులిస్తారు. 16వ తేదీ సా. 6 గం.లకు డా. ఖాదర్‌ ధ్యానహిత స్కూల్‌ ఆవరణలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. రైతులు, మహిళలు, పురుషులు, యువతీయువకులు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. డా. ఖాదర్‌ తయారు చేసిన అటవీ చైతన్య ద్రావణాన్ని 300 మంది రైతులకు ఈ సందర్భంగా ఉచితంగా పంపిణీ చేస్తారని డా. శైలజ వివరించారు.

మిక్సీతో సిరిధాన్యాల బియ్యం తయారీపై శిక్షణ
కొర్రలు తదితర సిరిధాన్యాలను నూర్చిన తర్వాత మిక్సీతో సులువుగా పొట్టు తీసే పద్ధతిపై 16వ తేదీ సా. 3–5 గం.ల మధ్య రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్‌ ఆవరణలో డా. ఖాదర్, బాలన్‌ కృష్ణ రైతులు, మహిళా రైతులు, గృహిణులకు ఆచరణాత్మక శిక్షణ ఇస్తారు. ప్రవేశం ఉచితం.  వివరాలకు.. 86398 96343, 94406 65151.

Tags