ఉత్తరాంధ్ర సమస్యలపై షార్ట్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ పోటీలు

11 Sep, 2018 03:52 IST
పోస్టర్‌ను విడుదల చేస్తున్న వైఎస్‌ జగన్‌

పాదయాత్ర నుంచి సాక్షి బృందం (విశాఖపట్నం) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సమస్యలపై షార్ట్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం నగరంలోని తాటిచెట్లపాలెం వద్ద పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పోటీలకు రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీలో విజేతలకు రూ.15 లక్షల నగదు బహుమతులు ప్రకటించారు. రెండు విభాగాల్లో మొదటి బహుమతిగా రూ.5 లక్షలు, రెండో బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతిగా రూ.50 వేలు ఇవ్వనున్నారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. విజేతలకు నగదు బహుమతులతో పాటు షీల్డులు, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. షార్ట్‌ ఫిల్మ్‌ నిడివి 10 నిమిషాలు, డాక్యుమెంటరీ నిడివి 15 నిమిషాలు ఉండాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ ఎంట్రీలను ఈ నెల 16 నుంచి అక్టోబర్‌ 30 వరకు పంపించాలని సూచించారు.

దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర పేదరికం, వసతుల లేమి, రాజధాని భ్రమలో పాలకులు ఉత్తరాంధ్రను గాలికి వదిలేయడం, గిరిజనుల కష్టాలు.. తదితర సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతోందని ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ వైజాగ్‌ ఐటీ విభాగం పేర్కొంది. ఈ సమస్యలను ఎత్తిచూపడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, ఎంట్రీల రిజిస్ట్రేషన్‌ కోసం www.yrrcpvizafitwinf. com/ uttarandhra, yrrcpviza fit wi nf@fmai. com,+91 7659864170 లో సంప్రదించాలని తెలిపింది. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు మళ్ల విజయప్రసాద్, ఎం.వి.వి.సత్యనారాయణ, తైనాల విజయకుమార్, గుడివాడ అమరనాథ్, కె.కె.రాజు, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Tags