రెడ్‌ మి 6 ఫ్లాష్‌ సేల్‌ నేడే

10 Sep, 2018 11:33 IST


సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి  భారత మార్కెట్లో ఇటీవల లాంచ్‌ చేసిన రెడ్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌ సేల్‌ నేడు ప్రారంభం కానుంది. రెడ్‌ మి  6 సిరీస్‌లో భాగంగా విడుదల  చేసిన రెడ్‌ మి 6  సేల్‌ సోమవారం మధ్యాహ‍్నం 12గంటలకు ప్రారంభం. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కాం  ప్లాట్‌ ఫాంలలో ఈ ఫ్లాష్‌సేల్‌ షురూ  అవుతుంది.

ధరలు : 3జీబీ  ర్యామ్‌, 32 జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ.7,999గా ఉండగా, 3జీబీ, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 9,499గా ఉంది.  కాగా మొదటి రెండు నెలలు మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటాయని  కంపెనీ తెలిపింది.

రెడ్‌మి 6 ఫీచర్లు : 5.45 అంగుళాల ఫుల్‌ స్క్రీన్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 12+5 ఎంపీ డ్యూయల్‌ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ తదితర ఫీచర్లున్నాయి.

Tags