రూ.1 కే హానర్‌ 9ఎన్‌

8 Sep, 2018 12:12 IST

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా దిగ్గజం హానర్ స్మార్ట్‌ఫోన్‌  ప్రేమికులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది.  హానర్‌  భారతీయ  వినియోగదారులకోసం ఫ్లాష్‌ సేల్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 11న  ఈ ప్రత్యేకంగా ఈ విక్రయాన్ని చేపట్టబోతోంది. ఈ సేల్‌లో హానర్‌ 9ఎన్‌  (3 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒక రూపాయికే అందించనుంది.  హానర్‌ 9ఎన్‌  3 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్  అసలు ధర. రూ. 11,999గా ఉంది.

సెప్టెంబర్ 11 న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు హానర్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఇది కేవలం కంపెనీ వెబ్‌సైట్ అలాగే స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.  లిమిటెడ్‌ డివైస్‌లపై అందిస్తున్న ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే  హానర్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో రిజిస్టర్‌ చేసుకొని వ్యకిగత వివరాలను నమోదు చేయాలి.   అలాగే  ఆన్‌లైన్‌  చెల్లింపులకు మాత్రమే అనుమతి.  దీంతోపాటు ఈ ఫ్లాష్‌ సేల్‌ ద్వారా హానర్ 7ఎస్‌, హానర్ 9ఎన్‌, హానర్ ప్లే  ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది.

Tags