అవమానభారంతో యువకుడి ఆత్మహత్య

8 Sep, 2018 12:02 IST
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ: చిట్టినగర్‌ వాగు సెంటర్‌లో రవికిరణ్‌ అనే యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఇల్లు నిర్మించానంటూ రవికిరణ్‌ తన తల్లిదండ్రుల నుంచి కొన్ని నెలల నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. కుమారుడు గృహాన్ని నిర్మించాడని భావించి తల్లిదండ్రులు గృహప్రవేశ కార్డులు పంచారు. ఇల్లు నిర్మించానని చెబుతున్న ప్రాంతానికి వెళ్లిన తల్లిదండ్రులకు అక్కడ ఇల్లు కనిపించకపోవడంతో కుమారుడిని నిలదీశారు. తీవ్రంగా మందలించడంతో అవమానానికి గురయ్యానని భావించి రవికిరణ్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బు బెట్టింగ్‌ల్లో పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags