‘ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్‌’

6 Sep, 2018 19:56 IST

‘ఎప్పుడైనా, ఎవరైనా,  ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు. పైగా సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్‌. నిక్‌ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. అతడికి కొత్త ప్రేమ దొరికింది. జీవితాంతం అతడు సంతోషంగా ఉంటే.. నాకన్నా ఆనందించే వాళ్లు ఎవరూ ఉండరు’  అంటూ తన స్పందన తెలియజేశారు నిక్‌ జోనస్‌ మాజీ ప్రేయసి ఒలీవియా కల్పో. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా గత నెల(ఆగస్టు) 18న ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే ప్రియాంక కంటే ముందు నిక్‌ మరో ఇద్దరు భామలతో డేటింగ్‌ చేశాడు. వారిలో మాజీ మిస్‌ యూనివర్స్‌ ఒలీవియా కల్పో కూడా ఒకరు. 2012లో విశ్వ సుందరిగా ఎంపికైన తర్వాత ఒలీవియా బాగా ఫేమస్‌ అయ్యారు. ఈ క్రమంలోనే 2013లో నిక్‌- ఒలీవియాల ప్రేమకథ మొదలైంది. రెండేళ్ల అనంతరం వీరు విడిపోయారు. కాగా ఒలీవియా ప్రస్తుతం డానీ అమెండోలా అనే ఫుట్‌బాల్‌ ప్లేయర్‌తో ప్రేమలో ఉన్నారు.

Tags