ప్రేమ వ్యవహారం : దళితవాడలో ఇద్దరి సజీవదహనం

6 Sep, 2018 19:55 IST
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కాకినాడ : శంకరవరంలోని దళితవాడలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు అన్నదమ్ములు దాక్కున్న ఇంటికి నిప్పటించి సజీవదహనం చేశారు.  తీవ్ర గాయాలతో బాధితులు మృత్యువాత పడ్డారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు బత్తిన నూకరాజు, ప్రసాద్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, గతంలో జరిగిన ప్రేమ వివాహం ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. మృతుడు నూకరాజు ప్రేమ వివాహం చేసుకోగా.. ఈ విషయమై సుధాకర్‌ అనే వ్యక్తికి నూకరాజుకు ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు ప్రసాద్‌తో కలిసి నూకరాజు సుధాకర్‌పై కత్తితో దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. అన్నదమ్ములపై కక్ష పెంచుకున్న సుధాకర్‌ గురువారం వారి ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఘటనలో ప్రసాద్‌, నూకరాజులు ఇంటితో పాటు కాలిబూడిదయ్యారని పోలీసులు పేర్కొన్నారు. దాదాపు ఆరుగురు వ్యక్తులకు ఘటనలో ప్రమేయముందని తెలిసింది. నిందితుల కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

Tags