స్టార్టప్‌ వెంచర్‌ ఫండ్‌కు సెబీ ఆమోదం

6 Sep, 2018 01:41 IST

న్యూఢిల్లీ: స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసే వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఇండియన్‌ స్టార్టప్‌ ఫ్యాక్టరీ సంస్థ తొలిగా ఐఎస్‌ఎఫ్‌ స్పెషల్‌ ఆపర్చునిటీ ఫండ్‌ పేరుతో ఈ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ను తెస్తోంది.

ఈ రూ.200 కోట్ల ఈ  ఫండ్‌.. స్టార్టప్‌ లు, ఎస్‌ఎమ్‌ఈ, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల్లో ఇన్వెస్ట్‌ చేయనుంది. స్పష్టమైన వృద్ధి అవకాశాలున్న సంస్థల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తామని ఈ ఫండ్‌ వ్యవస్థాపకులు, కపిల్‌ కౌల్‌ పేర్కొన్నారు. శాస్త్రీయ, వినూత్న విధానాల ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. 

Tags